కాలిఫోర్నియాలో 10 మందికి కత్తిపోట్లు | At least 10 injured some stabbed at California rally | Sakshi
Sakshi News home page

కాలిఫోర్నియాలో 10 మందికి కత్తిపోట్లు

Published Tue, Jun 28 2016 10:16 AM | Last Updated on Mon, Sep 4 2017 3:38 AM

కాలిఫోర్నియాలో 10 మందికి  కత్తిపోట్లు

కాలిఫోర్నియాలో 10 మందికి కత్తిపోట్లు

శాక్రమెంటో: కాలిఫోర్నియాలో ఓ పార్టీకి చెందిన వారు మరో పార్టీకి చెందిన వారిపై కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘర్షణలో  10 మంది గాయపడగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కాలిఫోర్నియా పెట్రోలింగ్ అధికారి జార్జి గ్రెనడా వివరాలను మీడియాకు వెల్లడించారు. దాదాపు 30 మంది ట్రెడిషనలిస్ట్ పార్టీకి చెందిన వారు ర్యాలీ నిర్వహిస్తుండగా, వీరికి మరో పార్టీకి చెందిన 400 మంది ఎదురయ్యారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

ఈ క్రమంలో కొందరు ముసుగు ధరించిన యువకులు కత్తులు, కర్తలతో హల్‌చల్ చేస్తూ దొరికిన వారిని దొరికినట్లు పొడిచారు. దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారని.. ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని చెప్పారు. కాగా ఈ ఘటనలో ఒక మహిళ సహా తొమ్మిది మంది తీవ్రంగా గాయపడినట్లు సాక్రామెంటో అగ్నిమాపక శాఖ అధికారి క్రిస్ హార్వే చెప్పారు. వీరంతా 19 ఏళ్ల నుంచి 58 ఏళ్ల వయసు మధ్య వారని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement