
లండన్: బ్రిటన్ ఎంపీ డేవిడ్ అమీస్ దారుణ హత్యకు గురయ్యారు. కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ఎంపీ డేవిడ్ అమీస్ (69) శుక్రవారం స్థానిక లీ-ఆన్-సీలోని ఓ చర్చిలో నిర్వహించిన ‘మీట్ యువర్ లోకల్ ఎంపీ’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమం కొనసాగుతుండగానే ఓ వ్యక్తి ఆయనపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. తీవ్ర గాయాల పాలైన ఆయనను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాగా, డేవిడ్ హత్యను బ్రిటన్ పోలీసులు ఉగ్రవాద చర్యగా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment