సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని నడి బొడ్డున అమానుష ఘటన చోటు చేసుకుంది. 62ఏళ్ల వృద్దురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డంతో పాటు, ఆమెను గొంతుకోసం హత్యోందంతం కలకలం రేపింది. నిందితుడు మహిళను 20 సార్లు పొడిచి చంపాడని పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు.
వివరాలను పరిశీలిస్తే... బిహార్‌లోని బెగుసరాయ్‌కి చెందిన మహిళ ఢిల్లీలో తన మనవడితో కలిసి నివసిస్తోంది. మనవడు ఓ ప్రైవేట్ సంస్థలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుండగా, ఆమె స్థానికంగా కూరగాయల విక్రయిస్తూ జీవనం సాగిస్తోంది. మనవడు ఇంట్లో లేని సమయం చూసి ఇంట్లో జొరబడ్డ నిందితుడు ఆమెపై ఎటాక్ చేశాడు. లైంగిక దాడికి తెగబడ్డాడు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో కత్తితో 20 సార్లు పొడిచి పారిపోయాడు. దీంతో వృద్దురాలు అక్కడికక్కడే మృతి చెందింది. గొంతు, కడుపులో పదునైన గాయాలున్నాయనీ, పోలీసు అధికారి ప్రియాంక కశ్యప్ చెప్పారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించామన్నారు. విచారణ సమయంలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడనీ, కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ మద్యం మత్తులో ఆ అఘాయిత్యానికి పాల్పడినట్టు భావిస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment