దీపావళికి రెండు రోజుల ముందు ఒక దారుణ ఘటన చోటుచోసుకుంది. అక్టోబర్ 22 తేదిన విధులు ముగించుకుని ఇంటికి వెళ్తూ...బస్సుకోసం ఎదురు చూస్తున్న వ్యక్తిపై కొందరూ వ్యక్తుల దారుణమైన దాడికి పాల్పడ్డారు. ఏకంగా పేగులు బయటకొచ్చేలా 12 సార్లు కత్తితో పొడిచి హతమార్చారు. ఆ తర్వాత అతని వద్ద నుంచి వాలెట్, ఫోన్ లాక్కుని పారిపోయారు. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సదరు వ్యక్తిని ఆస్పత్రిక తరలించగా, అతను చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పేర్కొన్నారు.
బాధితుడుని హర్షగా పోలీసులు గుర్తించారు. ఐతే హర్హ కుటుంబికులకు అతను మృతి చెందినట్లు మరసటి రోజు వరకు తెలియరాలేదన్నారు. హర్షే తన కుటుంబానికి జీవనాధారం అని, అతను అందరికి సహాయకారిగా ఉంటాడని చుట్టుపక్కల వారు చెబుతున్నారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న బాధితుడి కుటుంబం తమకు న్యాయం చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు. ఐతే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఈ ఘటన జరిగిన ప్రాంతంలో సీసీఫుటేజ్‌లు లేకపోవడంతో వారిని అరెస్టు చేయలేకపోయినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment