dozen stab
-
ఘోరం: పేగులు బయటకొచ్చేలా పొడిచి....
దీపావళికి రెండు రోజుల ముందు ఒక దారుణ ఘటన చోటుచోసుకుంది. అక్టోబర్ 22 తేదిన విధులు ముగించుకుని ఇంటికి వెళ్తూ...బస్సుకోసం ఎదురు చూస్తున్న వ్యక్తిపై కొందరూ వ్యక్తుల దారుణమైన దాడికి పాల్పడ్డారు. ఏకంగా పేగులు బయటకొచ్చేలా 12 సార్లు కత్తితో పొడిచి హతమార్చారు. ఆ తర్వాత అతని వద్ద నుంచి వాలెట్, ఫోన్ లాక్కుని పారిపోయారు. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సదరు వ్యక్తిని ఆస్పత్రిక తరలించగా, అతను చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పేర్కొన్నారు. బాధితుడుని హర్షగా పోలీసులు గుర్తించారు. ఐతే హర్హ కుటుంబికులకు అతను మృతి చెందినట్లు మరసటి రోజు వరకు తెలియరాలేదన్నారు. హర్షే తన కుటుంబానికి జీవనాధారం అని, అతను అందరికి సహాయకారిగా ఉంటాడని చుట్టుపక్కల వారు చెబుతున్నారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న బాధితుడి కుటుంబం తమకు న్యాయం చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు. ఐతే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఈ ఘటన జరిగిన ప్రాంతంలో సీసీఫుటేజ్‌లు లేకపోవడంతో వారిని అరెస్టు చేయలేకపోయినట్లు పోలీసులు తెలిపారు. (చదవండి: డీవీడి రైటర్లో రూ. 40 లక్షలు ఖరీదు చేసే బంగారం) -
గర్భవతిని పొడిచిపొడిచి చంపారు
ఒమన్: ఒమన్‌లో ఓ భారతీయ మహిళా నర్సు దారుణ హత్యకు గురైంది. తన సొంత అపార్ట్ మెంట్లో కత్తిపోట్లకు గురై ప్రాణాలు విడిచి ఆమె విగత జీవిగా పడి ఉంది. మరో విషాదమేమంటే ఆమె గర్భవతి కూడా. ఒమన్ పత్రిక తెలిపిన వివరాల ప్రకారం గర్భవతి అయిన చిక్కు రాబర్ట్ అనే కేరళకు చెందిన మహిళను దాదాపు పన్నెండు సార్లు పొడిచి చంపేశారు. కేరళకు చెందిన ఆమె, తన భర్తతో కలిసి దోఫార్ ప్రావిన్స్ లోని సలాలాహ్ నగరంలోగల బదర్ అల్ సమా ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. వీరికి గత నాలుగు నెలలకిందటే వివాహం అయింది. బుధవారం సాయంత్రం పదిగంటల ప్రాంతంలో విధుల నుంచి తిరిగి ఇంటికి వచ్చిన ఆమె అనంతరం కత్తిపోట్లకు గురైంది. విధులకు హాజరుకానీ తన భార్య కోసం ఇంటికి వెళ్లిన భర్తకు ఆమె విగతజీవిగా కనిపించడంతో అతడు పోలీసులకు సమాచారం అందించడం ద్వారా ఈ విషయం తెలిసింది. వారి ఇంటిపక్కన ఉండే పాకిస్థాన్ వ్యక్తిని పోలీసులు అనుమానిస్తూ అదుపులోకి తీసుకున్నారు. అతడు దొంగతనం చేసేందుకు ప్రయత్నించగా ఆమె అడ్డుకోవడంతో ఈ హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి స్థాయిలో వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.