రూ. 500 కోసం స్నేహితుల మధ్య ఘర్షణ | Clash between friends for 500 | Sakshi
Sakshi News home page

రూ. 500 కోసం స్నేహితుల మధ్య ఘర్షణ

Mar 28 2018 12:27 PM | Updated on Mar 28 2018 12:27 PM

Clash between friends for 500 - Sakshi

ఘర్షణలో గాయపడిన సాయి

హైదరాబాద్‌ : ఐదు వందల రూపాయల కోసం స్నేహితులు ఘర్షణ పడి, చివరికి కత్తి పోట్లకు దారితీసిన సంఘటన ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. వివరాలు..మల్కాజిగిరి సర్కిల్ రామాంజనేయనగర్లో నివాసం ఉండే సాయి(24), వేణు(20) ఇద్దరూ స్నేహితులు. సాయి కారు డ్రైవర్ కాగా వేణు ప్రైవేటు జాబ్ చేస్తున్నాడు.  అయితే వేణు వద్ద సాయి 500 రూపాయలు గతంలో అప్పుగా తీసుకున్నాడు.

తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వాలని వేణు, సాయిని పలుమార్లు అడిగాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో ఈ విషయమై ఇద్దరి మధ్యా ఘర్షణ చోటుచేసుకుంది. ఈ నెల 26వ తేదీ సోమవారం రాత్రి డబ్బుల విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కోపోద్రిక్తుడైన వేణు, సాయిని తీవ్రంగా గాయపరిచాడు. సాయి కడుపు, గొంతు భాగంలో వేణు కత్తితో గాయపరిచాడు.  ప్రస్తుతం సాయి జీడిమెట్లలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement