knifes
-
ఇంట్లోకి చొరబడి..కత్తితో పొడిచి
నాగోలు: ప్రేమించిన యువతి మాట్లాడటం మానేసిందని... తన ఫోన్ నంబర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టిందని ఓ యువకుడు ప్రేమోన్మాదిగా మారాడు. ఆమెపై కక్షపెంచుకొని దాడి చేసేందుకు కత్తితో ఇంట్లోకి చొరపడ్డాడు. అడ్డువచ్చిన ఆమె తమ్ముడిని తొలుత పొడవడంతో అతను తీవ్ర గాయాలపాలై మృతి చెందగా అతని సోదరి స్వల్ప గాయాలపాలైంది. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. టెన్త్ నుంచే ప్రేమలో... ఎల్బీనగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... షాద్‌నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలానికి చెందిన సురేందర్‌గౌడ్, ఇందిరకు ఓ కూతురు, కొడుకులు పృథ్వీ (చింటూ) (23), రోహిత్ సంతానం. వారిలో యువతి, పృథ్వీ రెండేళ్ల క్రితం హైదరాబాద్ ఎల్బీనగర్లోని ఆర్టీసీ కాలనీలో నివాసం ఉంటున్నారు. పృథ్వీ బీటెక్ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉండగా యువతి రామంతాపూర్‌లోని ప్రభుత్వ హోమియోపతి కళాశాలలో నాలుగో సంవత్సరం చదువుతోంది. షాద్‌నగర్ ప్రాంతంలోని షారుక్నగర్ మండలం నేరళ్ల చెరువుకు చెందిన శివకుమార్ (26) యువతికి పదవ తరగతి నుంచి క్లాస్‌మెట్. ఇద్దరూ అప్పటి నుంచి ప్రేమలో ఉన్నారు. హోమియోపతి కోర్సు చదువుతున్న యువతిని తరుచూ కలిసేందుకు వీలుగా శివకుమార్ రామంతాపూర్‌లోనే నివాసం ఉంటూ ఆర్టీస్ట్‌గా పనిచేస్తున్నాడు. మనస్పర్థలతో దూరం పెట్టిన యువతి.. సదరు యువతి, శివకుమార్ మధ్య ఇటీవల చిన్నపాటి గొడవలు చోటుచేసుకోవడంతో ఆమె అతన్ని దూరంపెట్టింది. అతనితో మాట్లాడటం మానేసింది. అతని ఫోన్ నంబర్‌ను సైతం బ్లాక్ లిస్టులో పెట్టింది. ఈ విషయమై ఆమెతో మాట్లాడేందుకు శివకుమార్ ప్రయ్నత్నిస్తున్నా కుదరలేదు. దీంతో కోపోద్రిక్తుడైన శివకుమార్ ఆదివారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై యువతి రూమ్ వద్దకు కత్తితో వచ్చాడు. తనను మోసం చేశావంటూ కేకలు వేస్తూ లోపలకు చొరబడి యువతిపై కత్తితో దాడి చేసే ప్రయత్నం చేశాడు. అక్కడే ఉన్న పృథ్వీ శివకుమార్‌ను అడ్డుకొనే ప్రయత్నం చేయగా అతనిపై కత్తితో దాడి చేశాడు. కత్తిపోటు బలంగా దిగడంతో పృథ్వీకి తీవ్ర రక్తస్రావం అయింది. దీంతో అతను ఇంటి నుంచి బయటకు కొంత దూరం నడుచుకుంటూ వచ్చి రోడ్డుపై పడిపోయాడు. మరోవైపు శివకుమార్ యువతిని గదిలో బంధించి లోపల నుంచి గడియ పెట్టాడు. నిందితుడిని పట్టుకున్న మహిళలు... గదిలోంచి పెద్దగా కేకలు వినపడటం, పృథ్వీ నెత్తురోడుతూ బయటకు వచ్చి పడిపోవడంతో ఇరుగుపొరుగు మహిళలు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకొని కర్రలతో గది తలుపు పగలగొట్టి లోపలకు ప్రవేశించారు. శివకుమార్‌ను చితకబాది పోలీసులకు అప్పచెప్పారు. రోడ్డుపై పడిపోయిన పృథ్వీతోపాటు స్వల్పంగా గాయపడిన యువతిని స్థానికులు చికిత్స నిమిత్తం కామినేని హాస్పిటల్‌కు... అక్కడి నుంచి ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ పృథ్వీ మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడికి ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ, ఏసీపీ జానకిరెడ్డి, లింగోజిగూడ కార్పొరేటర్ దరల్లి రాజశేఖర్‌రెడ్డి, ఇతర నేతలు ఘటనాస్థ్ధలాన్ని పరిశీలించారు. -
ఆ కత్తి.. ఒక కూడలి !
రామ్‌పూర్ (యూపీ): 1980 నాటి బాలీవుడ్ సినిమాల్లో రామ్‌పూర్ కత్తి అంటే ప్రేక్షకులకి ఒక పిడిబాకే. ఆ కత్తితో చేసే విన్యాసాలు హడల్ పుట్టించేవి. ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పూర్ ఒకప్పుడు కత్తులకు, కటార్లకు బాగా ఫేమస్. అత్యంత నాణ్యమైన కత్తులు లభించేవి. ఫోల్డబుల్ కత్తులు ఎవరికైనా కావాలంటే రామ్‌పూర్ వెళ్లవలసిందే. ఎప్పుడైతే చైనా మార్కెట్ భారత్‌ను ముంచేసి తక్కువ ధరకే చాకులు లభ్యమయ్యాయో ఈ రామ్‌పూర్ చాకుల్ని జనం కొనడం మానేశారు. అయినప్పటికీ దానికుండే క్రేజ్ దానికి ఉంది. అందుకే రామ్‌పూర్ అధికారులు నైనిటాల్ నుంచి రామ్‌పూర్‌కు వచ్చే మార్గంలో ఒక కూడలిలో ఈ కత్తిని ఏర్పాటు చేశారు. దానికి రామ్‌పూర్ చాకు చౌక్ అని పెట్టారు. దాదాపుగా 20 అడుగుల ఎత్తైన రామ్‌పూర్ కత్తి ఇప్పుడు ఠీవీగా కనిపిస్తూ పర్యాటకుల్ని ఆకర్షిస్తోంది. ఒకప్పుడు ఈ కత్తి పేరు చెబితే హడలిపోయేవారే ఇప్పుడు దానినొక కళాకృతి కింద చూడడం విశేషం. -
పిల్లలు చూస్తుండగానే భార్య గొంతు కోసి...
సాక్షి , హైదరాబాద్: భార్యను అర్ధరాత్రి కన్నకొడుకు , కూతురు చూస్తుండగానే గొంతు కోసి దారుణంగా హతమార్చిన సంఘటన ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా, రామగుండం ఎన్టీపీసీ ప్రాంతానికి చెందిన కంది చంద్రయ్య కుమార్త పుస్తకాల దివ్య భారతి(32)కి అంబర్ పేట ప్రాంతానికి చెందిన దీపక్ కుమార్‌తో 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లి తర్వాత వీరు కుర్మానగర్లో కాపురం పెట్టారు. వీరికి ఇద్దరు సంతానం అనంత్ కుమార్(11), దీక్షిత(7) ఉన్నారు. కాగా దీపక్ కుమార్‌కు ఇంతకు ముందే పెళ్లి జరిగింది. ఆడపిల్ల పుట్టిందని భార్యను వదిలేసిన విషయాన్ని గోప్యంగా ఉంచి దివ్య భారతిని రెండో పెళ్లి చేసుకున్నాడు. గత కొంత కాలంగా అతను అదనపు కట్నం తేవాలని భార్యను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నాడు. భర్త తోపాటు అత్త, ఆడపడచు, ఆడపడచు భర్త సైతం వేధింపులకు గురి చేసేవారు. దీంతో బాధితురాలు ఉప్పల్, మేడిపల్లి పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసింది. పోలీసుల కౌన్సెలింగ్, పెద్దల అంగీకారంతో ఇద్దరు రాజీ కుదుర్చుకున్నారు. మళ్లీ వేధింపులు తీవ్రం కావడంతో దివ్యభారతి ఉప్పల్ పోలీసులను ఆశ్రయించింది. దీపక్‌ను పిలిపించిన పోలీసులు హెచ్చరించి పంపారు. ఇటీవల మళ్లీ గొడవ జరగడంతో గత కొన్నాళ్లుగా దీపక్ ఇంటికి రావడం లేదు. శుక్రవారం అర్ధరాత్రి ఇంటికి వచ్చిన దీపక్ భార్యతో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య మాటామాట పెరగడంతో భార్యను ఇటుకతో తలపై బాదాడు. దీంతో ఆమె కుప్పకూలగానే కూరగాయల కోసే కత్తితో పిల్లలు చూస్తుండగానే గొంతు కోసి పారిపోయాడు. దీంతో భయాందోళకులోనైన పిల్లలు చుట్టు పక్కల వారికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి చూసేసరికి దివ్య భారతి మృతి చెందింది. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృత దేహాన్ని స్వాదీనం చేసుకుని పోస్టు మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: పెళ్లికి ముందే భార్యకు వివాహేతర సంబంధం!.. రెండుసార్లు హత్యాయత్నం.. చివరికి) -
ఏమైంది ఈ నగరానికి.. రోడ్లపై హల్చల్ చేస్తున్న విద్యార్థులు
సాక్షి, చెన్నై: విద్యార్థులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. గ్రూపు వివాదాలతో తన్నుకుంటున్నారు. చెన్నైలో సోమవారం ఓ కళాశాల వద్ద ఏకంగా కత్తులతో విద్యార్థులు వీరంగం సృష్టించడం ప్రజల్ని ఆందోళనలో పడేసింది. ఇటీవలి కాలంగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు బహిరంగ ప్రదేశాల్లో వ్యవహరిస్తున్న తీరు చర్చకుదారి తీసిన విషయం తెలిసిందే. విద్యార్థులకు ఏ మాత్రం తీసి పోమని చాటే విధంగా విద్యార్థినులు సైతం తన్నకుంటున్నారు. ఈ పరిణామాల్ని పరిగణనలోకి తీసుకున్న విద్యాశాఖ విద్యార్థులకు ప్రత్యేక కౌన్సెలింగ్ పాఠాలపై దృష్టి పెట్టారు. అయినా, తాము ఏ మాత్రం తగ్గమన్నట్టుగా వ్యహరించే విద్యార్థులు ఎక్కువగానే ఉన్నారు. చెన్నైలోని పచ్చయప్ప కళాశాల విద్యార్థుల గ్రూపు విభేదాలు సోమవారం రోడ్డెక్కాయి. కీల్పాకం సమీపంలో విద్యార్థులు కత్తులతో వీరంగం సృష్టించారు. పరస్పరం దాడులకు దిగడంతో ఆ పరిసర ప్రాంత వాసులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఆరుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. ఎనిమిది కత్తులను స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నారు. అలాగే, సైదా పేట సమీపంలో మరో విద్యారి్థి గ్రూపు బస్సులో వీరంగం సృష్టించింది. కండెక్టర్పై దాడికి యత్నించడంతో రవాణా కార్మికుల్లో ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో కాసేపు బస్సులు ఆగాయి. ఆ విద్యార్థుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇక, కృష్ణగిరి జిల్లా కావేరి పట్నంలోఅయితే, పదో తరగతి విద్యార్థిపై సహచర విద్యార్థులు కత్తులతో దాడి చేయడం కలకలం రేపింది. చదవండి: వివస్త్రను చేసి.. కళ్లల్లో, నోట్లో హిట్ కొట్టి... -
దారుణం: సినిమా పిచ్చితో రౌడీలుగా గుర్తింపు పొందాలని..
తిరువళ్లూరు(తమిళనాడు): రౌడీలుగా గుర్తింపు పొందాలన్న ఉద్దేశంతో నలుగురు యువకులు కలిసి రోడ్డుపై వెళుతున్న ఇద్దరిని అడ్డగించి కత్తులతో విచక్షణరహితంగా నరికి హల్చల్ సృష్టించారు. ఈ సంఘటన బుధవారం రాత్రి తిరువళ్లూరు సమీపంలో కలకలం రేపింది. తిరువళ్లూరు జిల్లా తిరువేళాంగాడు యూనియన్ రాజ్‌పద్మనాభపురం గ్రామానికి చెందిన వినోద్(36), విజయకుమార్(41). ఇద్దరూ ఊత్తుకోటలోని ప్రయివేటు కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్లు. వీరు విధులు ముగించుకుని బుధవారం రాత్రి బైక్‌లో ఇంటికి బయలుదేరారు. తిరువళ్లూరు సమీపంలోని కలియనూర్ వద్ద వెళుతుండగా నలుగురు యువకులు వారిని అడ్డగించి బైకులు లాక్కుని వారిపై కత్తులతో దాడి చేసి కలియనూర్ గ్రామానికి వెళ్లి కత్తులతో హల్చల్ చేసారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రాణాప్రాయస్థితిలో పడి వున్న బాధితులను చెన్నై ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసుల విచారణలో కలియనూర్ గ్రామానికి చెందిన సూర్య(21), ఏకాటూరు గ్రామానికి చెందిన సునాల్(24), పాక్కుపేట గ్రామానికి చెందిన సతీష్(19), కడంబత్తూరు చెందిన భాగవత్(25)గా గుర్తించారు. విచారణలో తమకు సినిమా పిచ్చి ఎక్కువగా వుండడంతో సినిమాల్లో రౌడీలుగా రాణించాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. చదవండి: కి‘లేడీ’ల హల్చల్: వృద్ధులను కత్తితో బెదిరించి భారీ దోపిడీ కూకట్‌పల్లిలో కాల్పుల కలకలం..చంపేసి.. దోచేశారు -
భారీ సంఖ్యలో పట్టుబడిన కోడికత్తులు
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా : సంక్రాంతి పండుగ రానున్న నేపథ్యంలో కోళ్ల పందాలలను నివారించే దిశగా పోలీసులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా కోడి కత్తుల తయారీ కేంద్రాలపై మంగళవారం పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో తాళ్లరేవు మండలం కోరంగి పరిధిలో సోమరాజు అనే వ్యక్తి వద్ద సుమారు రూ. 12 లక్షలు విలువ చేసే 3800 కత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ కరణం కుమార్ హెచ్చరించారు. -
దత్తన్న ఇంట్లో కత్తి కలకలం
ముషీరాబాద్: హిమాచల్‌ప్రదేశ్ నూతన గవర్నర్‌గా నియమితులైన బీజేపీ నేత, కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ నివాసంలో ఒక కత్తి కలకలం రేపింది. గవర్నర్‌గా నియమితులైన దత్తాత్రేయను అభినందించేందుకు నేతలు, కార్యకర్తలు అనేకమంది ఆయన ఇంటికి వస్తున్నారు. బుధవారం ఫిజియోథెరపీ ముగించుకుని దత్తాత్రేయ హాల్లోకి వచ్చిన వెంటనే ఆయనను కలిసేందుకు తోసుకుంటూ ముందుకు వచ్చారు. ఆ సమయంలో ఓ వ్యక్తి జేబు నుంచి కత్తి (స్టేషనరీలో పేపర్ కట్టింగ్, వైర్ల కట్టింగ్ చేయడానికి ఉపయోగించేది) కిందపడింది. మాజీ డీజీపీ హెచ్‌జే దొర దత్తాత్రేయను కలవడానికి వచ్చిన సమయంలోనే ఇది చోటుచేసుకుంది. పోలీ సులు ఘటనస్థలానికి చేరుకుని కత్తిని స్వాధీనం చేసుకున్నారు. -
మెట్రో అలర్ట్
సాక్షి,సిటీబ్యూరో: మారణాయుధాలు, ప్రాణాంతక వస్తువులు ఇటీవల ఉప్పల్, మలక్‌పేట్, ఎల్బీనగర్ సహా పలు మెట్రో స్టేషన్లలో భద్రతా తనిఖీల్లో బయటపడడంతో మెట్రో అధికారులు అలర్ట్ అయ్యారు. శత్రుదుర్భేద్యంగా ఉన్న ఈ స్టేషన్లలో ఇటీవల పర్సులో ఇమిడిపోయే కత్తి.. చిన్నారుల ఆటబొమ్మలా కనిపించినా ప్రాణాలు తీసే తుపాకీ.. కుర్రకారును మత్తుతో చిత్తుచేసే హుక్కా గన్.. జనం ప్రాణాలను పొట్టనబెట్టుకునే రసాయనాలు.. అగ్ని ప్రమాదాలకు కారణమయ్యే లిక్విడ్స్.. డ్రగ్స్ వంటివి గుర్తించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు స్టేషన్లలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. మారణాయుధాలు, మత్తు పదార్థాలను గుర్తించేలా స్టేషన్లలో విధులు నిర్వహించే సిబ్బందికి శిక్షణనివ్వనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా మొబైల్ వాహనాన్ని అందుబాటులోకి తెచ్చారు. ‘మొబైల్ ట్రైనర్ వ్యాన్’గా పిలిచే దీన్ని ఆదివారం బేగంపేట్‌లోని హెచ్ఎంఆర్ కార్యాలయం వద్ద హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ వాహనాన్ని నేరుగా ఆయా స్టేషన్ల వద్దకు తీసుకెళ్లడంతో పాటు భద్రతా విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ఎక్కడికక్కడే అవగాహన కల్పించే వెసులుబాటు ఉంది. దేశంలో ఇలాంటి ప్రయోగం నగర మెట్రో ప్రాజెక్టులోనే చేపట్టినట్లు ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. ఈ వ్యాన్ ద్వారా భద్రతా సిబ్బందికి హెచ్ఎంఆర్ఎల్ భద్రతా విభాగండీసీపీ బాలకృష్ణ నేతృత్వంలో శిక్షణనివ్వాలని ఆదేశించారు. ఈ వాహనంలో టీవీసెట్స్, సీసీటీవీ కెమెరా, ఫైర్ ఎక్విప్మెంట్, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్లున్నాయి. ఇక స్టేషన్లలో భద్రతా విధులు నిర్వహిస్తున్న 900 మంది సిబ్బందికి ఆడియో–వీడియో చిత్రాలు, పీపీటీ ప్రజెంటేషన్లు, పోస్టర్లు, బోర్డ్స్, హ్యాండ్‌బుక్‌ల ద్వారా భద్రతా సమాచారాన్ని, తీసుకోవల్సిన జాగ్రత్తలను వివరిస్తారు. శిక్షణ ప్రక్రియను సైతం నేషనల్ కమాండ్ సెంటర్ నుంచి పర్యవేక్షించనున్నారు. ఈ వాహనంలోని హార్డ్‌డిస్క్ అధునాతన జీపీఆర్ఎస్ సాంకేతికత ఆధారంగా పనిచేయనుంది. దీంతో ఈ వాహనం ఎక్కడ ఉంది.. ఏయే అంశాలపై సిబ్బందికి అవగాహన కల్పిస్తుందన్న అంశాన్ని కూడా తెలుసుకోవచ్చు. ఇటీవలికాలంలో లెదర్ పర్సుల్లో ఉన్న కత్తులు, ప్రమాదాలకు ఆస్కారం కల్పించే రసాయనాలు, నిషేధిత డ్రగ్స్‌ను మెట్రో స్టేషన్లలో పలువురు ప్రయాణికుల వద్ద కనుగొనడంతో ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇక మెటల్ డిటెక్టర్లు, డీఎఫ్ఎండీ స్క్రూటినీ తదితరాలను పకడ్బందీగా నిర్వహించాలని హెచ్ఎంఆర్ ఎండీ ఆదేశించారు. ఇటీవల మెట్రో స్టేషన్ల వద్ద నిర్వహించిన భద్రతా తనిఖీల్లో పట్టుబడిన మారణాయుధాలపై విస్తృత ప్రచారం, అవగాహన కల్పించాలని హెచ్ఎంఆర్ భద్రతా సిబ్బందిని ఎన్వీఎస్రెడ్డి ఆదేశించారు. ప్రయాణికులతో స్నేహపూర్వక సంబంధాలు నెరుపుతూనే భద్రతను మరింతగా పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఆర్ అధికారులు డీవీఎస్‌రాజు, లక్ష్మణ్, ఆనంద్ మోహన్, విష్ణువర్ధన్‌రెడ్డి, బీఎన్ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. నెలాఖరున హైటెక్ సిటీకి మెట్రో రైళ్లు అమీర్‌పేట్–హైటెక్‌సిటీ(10 కి.మీ) మార్గంలో మెట్రో రైళ్ల వాణిజ్య కార్యకలాపాలను ఈ నెలాఖరులో ప్రారంభించేందుకు హెచ్ఎంఆర్ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఈ మార్గంలో మెట్రో రైళ్లకు 18 రకాల భద్రతా పరీక్షలను విజయవంతంగా నిర్వహించారు. హైటెక్ సిటీకి మెట్రోరైళ్లు కూత పెట్టనుండడంతో ఐటీ, బీపీఓ, కేపీఓ తదితర రంగాల్లో పనిచేస్తున్న వేలాదిమంది ఉద్యోగులు ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకోకుండానే గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. -
తాగిన మత్తులో... కోసుకున్నాడు
కర్ణాటక, దొడ్డబళ్లాపురం : తాగిన మైకంలో మర్మాంగాన్ని కోసుకుని వ్యక్తి మృతి చెందిన సంఘటన సోలదేనహళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. తిరుమళపుర గ్రామం నివాసి నంజప్ప (48 ) శనివారం రాత్రి మద్యం తాగి వచ్చి ఇంట్లోని కూరగాయలు కోసే కత్తితో మర్మాంగాన్ని కోసుకున్నాడు. అనంతరం కేకలు వేయడంతో స్థానికులు అంబులెన్స్‌కి ఫోన్ చేసి ఆస్పత్రికి తరలించారు. అయితే తీవ్ర రక్తస్రావం కావడంతో మార్గం మధ్యలోనే మృతి చెందాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరని తెలిసింది. పోలదేనహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
కన్నతండ్రిని కత్తులతో నరికిన కొడుకులు
సాక్షి, కర్నూలు(డోన్): తల్లిని కొట్టారన్న కోపంతో తండ్రిని కుమారులే హతమార్చారు. ఈ సంఘటన సోమవారం రాత్రి డోన్ పట్టణంలోని గుత్తి రోడ్డులో గల అమ్మా హోటల్ ఎదుట చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని చిగురుమాను పేట ప్రాంతానికి చెందిన కృపానందం (45)కు పలువురు మహిళలతో వివాహేతర సంబంధాలు ఉండేవి. అలాగే భార్యను తరచూ వేధించేవాడు. ఈ క్రమంలోనే సోమవారం సాయంత్రం భార్యను కొట్టాడు. ఇందుకు అతని కుమారులైన రౌడీషీటర్లు చిన్నకాంతు, పెద్దకాంతు, నాగన్న ఆగ్రహించారు. అమ్మా హోటల్ ఎదుట ఉన్న కృపానందంను చుర కత్తులతో విచక్షణారహితంగా నరికారు. తీవ్రంగా గాయపడిన అతన్ని ఆటోడ్రైవర్లు చికిత్స కోసం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు ప్రభుత్వాసుపత్రికి చేరుకొని ఘటన గురించి కృపానందంను అడిగి తెలుసుకొన్నారు. తన భార్యను కొట్టినందుకు కుమారులే కత్తులతో దాడిచేశారని అతను ఫిర్యాదు చేశాడు. ప్రాథమిక చికిత్స అనంతరం అతన్ని మెరుగైన వైద్యచికిత్స కోసం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలో చనిపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. హత్యకు గురైన కృపానందం -
యువకుడిపై కత్తులతో దాడి
కొమ్మాది(భీమిలి) : భీమిలి రూరల్ మండలం చేపలుప్పాడ పంచాయతీ చిన ఉప్పాడలో ముగ్గురు వ్యక్తులు ఒక యువకుడిపై గురువారం రాత్రి కత్తులతో దాడి చేశారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం... ఇదే ప్రాంతానికి చెందిన చెన్నా హరి ప్రసాద్ (25) ఇంట్లో గురువారం ఇంటి అమ్మవారి పండుగ చేశారు. రాత్రి వరకు బంధువులు, స్నేహితులతో సరదాగా గడిపారు. రాత్రి 10 గంటలు దాటిన తర్వాత ఎవరూ లేని సమయంలో చిన ఉప్పాడ రచ్చబండ సమీపంలో హరిప్రసాద్‌పై ముగ్గురు వ్యక్తులు కత్తులతో దాడి చేసి పరారయ్యారు. అక్కడ పడి ఉన్న హరిప్రసాద్‌ను స్థానికులు గుర్తించి హుటాహుటిన కేజీహెచ్‌కు తరలించారు. శుక్రవారం ఏసీపీ నాగేశ్వరరావు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. తనపై తమ ప్రాంతానికి చెందిన చార్లెస్, రాంబాబు, నరేష్ అనే ముగ్గురు దాడి చేసినట్టు హరిప్రసాద్ పోలీసులకు తెలిపినట్టు తెలుస్తోంది. ఈ దాడి జరిగిన సంఘటనపై స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. హరిప్రసాద్ చెప్పినట్టు వారు ఎందుకు దాడిచేశారు, కారణాలు ఏమిటన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
రైలులో కత్తులతో యువకుల హల్చల్..
సాక్షి, తిరువొత్తియూరు: విద్యుత్ రైలులో పట్టా కత్తులతో ఘర్షణకు దిగిన ముగ్గురు కళాశాల విద్యార్థులను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వివరాలు.. చెన్నై మూర్మార్కెట్ రైల్వేస్టేషన్ నుంచి గురువారం మధ్యాహ్నం గుమ్మడిపూండికి విద్యుత్ రైలు బయలుదేరింది. ఆ సమయంలో ఇంజిన్ నుంచి 3వ పెట్టెలో ఉన్న కొందరు యువకులు గొడవపడ్డారు. అక్కడే ఉన్న రైల్వే భద్రతా పోలీసు గమనించాడు. అతను రైలు ఎక్కే లోపే కదలి వెళ్లింది. పోలీసు కంట్రోల్ రూంకు దీనిపై సమాచారం అందించాడు. దీంతో మూర్మార్కెట్ సీఐ అళగర్స్వామి, బేసిన్‌బ్రిడ్జ్ రైల్వే స్టేషన్లో డ్యూటీలో ఉన్న రైల్వే భద్రతా దళ పోలీసులకు సమాచారం అందించారు. రైలు అక్కడికి చేరుకోగానే అక్కడే ఉన్న పోలీసులను చూసిన ఆ యువకులు తమ వద్ద ఉన్న ఓ బ్యాగ్‌ను కింద పడవేశారు. పోలీసులు ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అంతలోనే మరో యువకుడు తప్పించుకున్నాడు. బ్యాగ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని తనిఖీ చేయగా అందులో నాలుగు పట్టా కత్తులు లభించాయి. అందులో టపాకాయలు, అగ్గిపెట్టెలున్నాయి. అనంతరం వారి గుర్తింపు కార్డులను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో వారు పచ్చయప్ప కళాశాలలో చదువుతున్న కవియరసు(19), మరుదు పాండియన్(19), సోమసుందరం (19) అని తెలిసింది. పట్టుబడిన విద్యార్థులు పారిపోయిన విద్యార్థులు గుమ్మడిపూండి, అత్తిపట్టు, తిరువొత్తియూరు ప్రాంతానికి చెందిన వారని తెలిసింది. పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. -
రూ. 500 కోసం స్నేహితుల మధ్య ఘర్షణ
హైదరాబాద్ : ఐదు వందల రూపాయల కోసం స్నేహితులు ఘర్షణ పడి, చివరికి కత్తి పోట్లకు దారితీసిన సంఘటన ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. వివరాలు..మల్కాజిగిరి సర్కిల్ రామాంజనేయనగర్లో నివాసం ఉండే సాయి(24), వేణు(20) ఇద్దరూ స్నేహితులు. సాయి కారు డ్రైవర్ కాగా వేణు ప్రైవేటు జాబ్ చేస్తున్నాడు. అయితే వేణు వద్ద సాయి 500 రూపాయలు గతంలో అప్పుగా తీసుకున్నాడు. తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వాలని వేణు, సాయిని పలుమార్లు అడిగాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో ఈ విషయమై ఇద్దరి మధ్యా ఘర్షణ చోటుచేసుకుంది. ఈ నెల 26వ తేదీ సోమవారం రాత్రి డబ్బుల విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కోపోద్రిక్తుడైన వేణు, సాయిని తీవ్రంగా గాయపరిచాడు. సాయి కడుపు, గొంతు భాగంలో వేణు కత్తితో గాయపరిచాడు. ప్రస్తుతం సాయి జీడిమెట్లలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కత్తులతో ఫోజులిచ్చి కటకటాల్లోకి!
సాక్షి, సిటీబ్యూరో: చట్ట విరుద్దమని తెలిసో తెలియకో వివిధ మార్గాల్లో డాగర్లుగా పిలిచే పదునైన కత్తులను సేకరించారు. వాటితో బర్త్‌డే పార్టీల్లో వాటితో ఫోజులిచ్చారు... ఈ చిత్రాలను సోషల్ మీడియాల్లో పోస్ట్ చేశారు... ఈ విషయం నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ వద్దకు చేరడంతో ముగ్గురు యువకులూ ప్రస్తుతం కటకటాల్లోకి వెళ్లారు. ఒకరిని పంజగుట్ట, ఇద్దరిని బోయిన్పల్లి పరిధిల్లో పట్టుకున్నట్లు డీసీపీ పి.రాధాకిషన్‌రావు శుక్రవారం వెల్లడించారు. సనత్‌నగర్ ప్రాంతానికి చెందిన రాహుల్ ప్రకాష్ ఓ ఫైనాన్స్ సంస్థలో పని చేస్తుంటాడు. గతేడాది నవంబర్‌లో ఈ–కామర్స్ సైట్ స్నాప్‌డీల్ ద్వారా రూ.999 వెచ్చించి ఓ డాగర్ ఖరీదు చేశాడు. అలాగే కన్స్ట్రక్షన్ రంగంలో పని చేసే న్యూ బోయిన్పల్లి వాసి సాయి యాదవ్, ఓ హోటల్లో పని చేస్తున్న అల్వాల్‌కు చెందిన అర్జున్ దాస్ స్నేహితులు. అర్జున్ దాస్ కొన్నాళ్ళ క్రితం సికింద్రాబాద్‌లో ఓ గుర్తుతెలియని వ్యక్తి నుంచి డాగర్ ఖరీదు చేసి తన వద్ద ఉంచుకున్నాడు. దీనిని ఇటీవల సాయి యాదవ్ తీసుకున్నాడు. ఈ ముగ్గురి వ్యవహారం ఇంత వరకు గుట్టుగానే ఉన్నా... ఇటీవల జరిగిన వేర్వేరు పుట్టిన రోజు పార్టీల్లో పాల్గొన్న రాహుల్, సాయి కత్తులతో ఫోటోలు దిగడంతో పాటు ఫేస్బుక్, వాట్సాప్‌ల్లో పోస్ట్ చేసుకున్నారు. ఇవి సోషల్‌మీడియా ద్వారా వైరల్ అయ్యాయి. రాయదుర్గం ఉదంతంతో.. రాయదుర్గం పోలీసుస్టేషన్ పరిధిలో ఈ నెల మొదటి వారంలో ఎంగేజ్మెంట్ బారాత్‌లో చేసిన కత్తి విన్యాసం ఓ బాలుడి ప్రాణం తీసింది. ఒకప్పుడు ఉత్తరాదికి మాత్రమే పరిమితమైన ఈ ‘కత్తుల సంస్కృతి’ సిటీకి పాకడంతో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. వీటి క్రయవిక్రయాలు, వినియోగంపై నిఘా పెంచాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా సోషల్‌మీడియాపై నిఘా ఉంచిన నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసుల దృష్టికి రాహుల్, సాయిలు పోస్ట్ చేసిన ఫొటోలు వచ్చాయి. దీంతో ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు నేతృత్వంలో ఎస్సైలు చంద్రశేఖర్‌రెడ్డి, బి.శ్రవణ్‌కుమార్, కేఎస్ రవి, కె.శ్రీకాంత్ శుక్రవారం వలపన్ని వీరిద్దరినీ పట్టుకున్నారు. వీరి వద్ద ఉన్న మారణాయుధాలు పరిశీలించగా నిబంధనలకు విరుద్ధమని, అక్రమాయుధాలుగా తేలింది. సాయి విచారణలో అర్జున్ పేరు వెలుగులోకి రావడంతో ముగ్గురినీ అరెస్టు చేశారు. 9 అంగుళాల కంటే ఎక్కువ పొడవు ఉన్న, పదునైన అంచులతో కూడిన కత్తులు తదితరాలు కలిగి ఉండటం ఆయుధ చట్ట ప్రకారం నేరమని డీసీపీ రాధాకిషన్‌రావు స్పష్టం చేస్తున్నారు. వీటిని విక్రయిస్తున్న ఆన్లైన్ సంస్థలు, డెలివరీ చేస్తున్న కొరియర్ సంస్థలకూ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించామని, వారినీ విచారిస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు అవసరమైన జాబితాలను సిద్ధం చేస్తున్నారు. -
పాతక్షక్షల నేపథ్యంలో ఇరువర్గాల ఘర్షణ
♦ కత్తులతో పరస్పర దాడి ♦ ఇద్దరికి తీవ్రగాయాలు: జీజీహెచ్‌కు తరలింపు గుంటూరు రూరల్: పాత కక్షల నేపథ్యంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగి కత్తులతో నరుక్కున్న ఘటన శుక్రవారం మండలంలోని గోరంట్లలో చోటు చేసుకుంది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోరంట్ల గ్రామంలోని ఓ ఆలయ కమిటీ నిర్వహణపై రెండు వర్గాల మధ్య వివాదం ఉండేది. గురువారం వినాయక ఉత్సవాల్లో భాగంగా ఒక వర్గం ఏర్పాటు చేసిన వినాయక నిమజ్జనోత్సవానికి రెండో వర్గం వ్యక్తులు వచ్చారని ఘర్షణ చోటుచేసుకుంది. ఘర్షణలో రెండో వర్గానికి చెందిన ఓ వ్యక్తిపై దాడి జరిగింది. దాడిపై రెండో వర్గం వారు శుక్రవారం ఉదయం నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై శుక్రవారం రాత్రి తిరిగి వివాదం రాజుకుంది. గ్రామంలోని రైస్‌మిల్ సెంటర్లో ఇరువర్గాలకు చెందిన వ్యక్తులు వాదనకు దిగారు. అది కాస్తా ఘర్షణకు దారి తీసి ఒక వర్గానికి చెందిన జుజ్జులూరి లక్ష్మీనారాయణ, జుజ్జులూరి విజయరాజు, వేముల రాణి తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను గ్రామస్తులు గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. ఘటనపై మండల నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీస్ వాహనం ఎదుటే వివాదం.. ? గురువారం ఫిర్యాదు చేసిన ఘటనలో విచారణ నిమిత్తం గ్రామానికి వచ్చిన పోలీస్ వాహనం ఎదుటే వివాదం జరిగినట్లు సమాచారం. గురువారం దాడిచేసి గాయపరిచినవారిని పట్టించేందుకు పోలీసులతో పాటు సెంటర్‌కు వచ్చిన వ్యక్తులపై ప్రత్యర్థులు పోలీసుల ఎదుటే కత్తులతో దాడిచేసి గాయపరిచారని తెలిసింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటుండగా పోలీసులు చూసీచూడన్నట్లు ఉన్నారని, దీంతోనే దాడిచేసి గాయపరిచిన ఐదుగురు వ్యక్తులు పరారయ్యారని సమాచారం. గురువారం దాడి జరిగిన తర్వాత ఇరువర్గాలను శుక్రవారం ఉదయం స్టేషన్‌కు పిలిపించి విచారించి కేసు నమోదు చేస్తే దాడులు జరిగేవి కాదని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. -
ఈ చాకులు చాలా షార్ప్ గురూ!
వంటింట్లో వాడే చాకులు కొద్దినెలలకే పదును కోల్పోతాయి. పదును కోల్పోయిన చాకులతో కూరగాయలు తరగడం ఒక పట్టాన కుదరదు. పదును తగ్గిన చాకులతో చికెన్, మటన్ లాంటివి తరగాలంటే ఆ తంటాలు చెప్పనలవి కాదు. వంటింటి చాకులను తరచుగా పదును పెట్టుకోవాల్సిందే. ఏళ్ల తరబడి పదును కోల్పోని చాకులు వంటింట్లో అందుబాటులో ఉండే బాగుండునని చాలామంది అనుకునే ఉంటారు. బహుశ, అలాంటి వాళ్ల కోసమే తయారైన చాకులు ఇవి. లేజర్ బాండెడ్ టిటానియం-కార్బైడ్ సర్ఫేస్తో తయారైన ఈ చాకులను తరచు పదును పెట్టుకోవాల్సిన పని లేదు. ఎంతగా వాడినా ఇవి అంత త్వరగా పదును కోల్పోవు. పాతికేళ్ల వరకు వీటి పదును తగ్గనే తగ్గదని వీటిని మార్కెట్లోకి విడుదల చేసిన టీబీ గ్రూప్ చెబుతోంది. పాతికేళ్ల తర్వాత వీటిని పదును పెట్టుకుంటే, మరో పాతికేళ్లు నిక్షేపంగా పనిచేస్తాయని కూడా చెబుతోంది. -
మద్యం మత్తులో కత్తులతో దాడి
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని నాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎర్రకుంటలో పర్వేజ్ అనే వ్యక్తిపై ముగ్గురు వ్యక్తులు కత్తితో దాడి చేశారు. పర్వేజ్‌తో పాటు మరో ముగ్గురు వ్యక్తులు ఎర్రకుంట శ్మశానవాటిక ఎదురుగా ఉన్న ఓపెన్ గ్రౌండ్లో గురువారం రాత్రి ఒంటి గంట సమయంలో మద్యం సేవించారు. అనంతరం ఆ ముగ్గురు వ్యక్తులు పర్వేజ్‌ను కత్తులతో పొడిచారు. సుధాకర్ అనే వ్యక్తి పాతకక్షలతోనే ఈ దాడికి పథకం పన్నినట్లు తెలిసింది. తీవ్రంగా గాయపడిన పర్వేజ్‌ను చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
యువకుడిపై కత్తులతో దాడి.. పరిస్థితి విషమం
విజయనగరం: ఓ యువకుని పై గుర్తు తెలియని దుండగులు కత్తులు, ఇనుపరాడ్లతో దాడి చేసిన సంఘటన విజయనగరం జిల్లా కొత్తవలస మండలం తుమ్మకపల్లి గ్రామంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన జగదీష్(23) అనే యువకుడు ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లగా, కొత్తవలస రైల్వేగేటు సమీపంలో.. ఆటోలో వచ్చిన గుర్తుతెలియని దుండగులు కత్తులతో, ఇనుప రాడ్లతో అతనిపై దాడి చేసి తిరిగి ఆటోలో పరారయ్యారు. స్థానికులు అతన్ని వెంటనే ఆస్పత్రికి త రలించి పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స నిర్వహించిన అనంతరం అతిని పరిస్థితి విషమించడంతో అతనిని వైజాగ్ ఆస్పత్రికి తరలించారు. పాత కక్షల కారణంగానే దాడి జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
నకిలీ కరెన్సీ ముఠా దాడిలో కానిస్టేబుల్ మృతి