మద్యం మత్తులో కత్తులతో దాడి | three attacked by a man with knifes | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో కత్తులతో దాడి

Published Fri, Jul 3 2015 11:05 AM | Last Updated on Sun, Sep 3 2017 4:49 AM

three attacked by a man with knifes

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని నాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎర్రకుంటలో పర్వేజ్ అనే వ్యక్తిపై ముగ్గురు వ్యక్తులు కత్తితో దాడి చేశారు. పర్వేజ్‌తో పాటు మరో ముగ్గురు వ్యక్తులు ఎర్రకుంట శ్మశానవాటిక ఎదురుగా ఉన్న ఓపెన్ గ్రౌండ్‌లో గురువారం రాత్రి ఒంటి గంట సమయంలో మద్యం సేవించారు.

అనంతరం ఆ ముగ్గురు వ్యక్తులు పర్వేజ్‌ను కత్తులతో పొడిచారు. సుధాకర్ అనే వ్యక్తి పాతకక్షలతోనే ఈ దాడికి పథకం పన్నినట్లు తెలిసింది. తీవ్రంగా గాయపడిన పర్వేజ్‌ను చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement