
అరెస్టయిన సూర్య, సునాల్, సతీష్, భాగవత్
తిరువళ్లూరు(తమిళనాడు): రౌడీలుగా గుర్తింపు పొందాలన్న ఉద్దేశంతో నలుగురు యువకులు కలిసి రోడ్డుపై వెళుతున్న ఇద్దరిని అడ్డగించి కత్తులతో విచక్షణరహితంగా నరికి హల్‌చల్ సృష్టించారు. ఈ సంఘటన బుధవారం రాత్రి తిరువళ్లూరు సమీపంలో కలకలం రేపింది. తిరువళ్లూరు జిల్లా తిరువేళాంగాడు యూనియన్ రాజ్‌పద్మనాభపురం గ్రామానికి చెందిన వినోద్(36), విజయకుమార్(41). ఇద్దరూ ఊత్తుకోటలోని ప్రయివేటు కంపెనీలో హెచ్‌ఆర్ మేనేజర్లు. వీరు విధులు ముగించుకుని బుధవారం రాత్రి బైక్‌లో ఇంటికి బయలుదేరారు.
తిరువళ్లూరు సమీపంలోని కలియనూర్ వద్ద వెళుతుండగా నలుగురు యువకులు వారిని అడ్డగించి బైకులు లాక్కుని వారిపై కత్తులతో దాడి చేసి కలియనూర్ గ్రామానికి వెళ్లి కత్తులతో హల్‌చల్ చేసారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రాణాప్రాయస్థితిలో పడి వున్న బాధితులను చెన్నై ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసుల విచారణలో కలియనూర్ గ్రామానికి చెందిన సూర్య(21), ఏకాటూరు గ్రామానికి చెందిన సునాల్(24), పాక్కుపేట గ్రామానికి చెందిన సతీష్(19), కడంబత్తూరు చెందిన భాగవత్(25)గా గుర్తించారు. విచారణలో తమకు సినిమా పిచ్చి ఎక్కువగా వుండడంతో సినిమాల్లో రౌడీలుగా రాణించాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు.
చదవండి:
కి‘లేడీ’ల హల్‌చల్: వృద్ధులను కత్తితో బెదిరించి భారీ దోపిడీ
కూకట్‌పల్లిలో కాల్పుల కలకలం..చంపేసి.. దోచేశారు
Comments
Please login to add a commentAdd a comment