ఈ చాకులు చాలా షార్ప్ గురూ! | This knife is very sharp! | Sakshi
Sakshi News home page

ఈ చాకులు చాలా షార్ప్ గురూ!

Published Sun, Sep 11 2016 1:03 AM | Last Updated on Mon, Sep 4 2017 12:58 PM

ఈ చాకులు చాలా షార్ప్ గురూ!

ఈ చాకులు చాలా షార్ప్ గురూ!

వంటింట్లో వాడే చాకులు కొద్దినెలలకే పదును కోల్పోతాయి. పదును కోల్పోయిన చాకులతో కూరగాయలు తరగడం ఒక పట్టాన కుదరదు. పదును తగ్గిన చాకులతో చికెన్, మటన్ లాంటివి తరగాలంటే ఆ తంటాలు చెప్పనలవి కాదు. వంటింటి చాకులను తరచుగా పదును పెట్టుకోవాల్సిందే. ఏళ్ల తరబడి పదును కోల్పోని చాకులు వంటింట్లో అందుబాటులో ఉండే బాగుండునని చాలామంది అనుకునే ఉంటారు. బహుశ, అలాంటి వాళ్ల కోసమే తయారైన చాకులు ఇవి. లేజర్ బాండెడ్ టిటానియం-కార్బైడ్ సర్ఫేస్‌తో తయారైన ఈ చాకులను తరచు పదును పెట్టుకోవాల్సిన పని లేదు. ఎంతగా వాడినా ఇవి అంత త్వరగా పదును కోల్పోవు. పాతికేళ్ల వరకు వీటి పదును తగ్గనే తగ్గదని వీటిని మార్కెట్‌లోకి విడుదల చేసిన టీబీ గ్రూప్ చెబుతోంది. పాతికేళ్ల తర్వాత వీటిని పదును పెట్టుకుంటే, మరో పాతికేళ్లు నిక్షేపంగా పనిచేస్తాయని కూడా చెబుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement