యువకుడిపై కత్తులతో దాడి.. పరిస్థితి విషమం | Man attacked with knives | Sakshi
Sakshi News home page

యువకుడిపై కత్తులతో దాడి.. పరిస్థితి విషమం

Published Sat, Jun 27 2015 10:44 AM | Last Updated on Sun, Sep 3 2017 4:28 AM

Man attacked with knives

విజయనగరం: ఓ యువకుని పై గుర్తు తెలియని దుండగులు కత్తులు, ఇనుపరాడ్లతో దాడి చేసిన సంఘటన విజయనగరం జిల్లా కొత్తవలస మండలం తుమ్మకపల్లి గ్రామంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన జగదీష్(23) అనే యువకుడు ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లగా, కొత్తవలస రైల్వేగేటు సమీపంలో.. ఆటోలో వచ్చిన గుర్తుతెలియని దుండగులు కత్తులతో, ఇనుప రాడ్లతో అతనిపై దాడి చేసి తిరిగి ఆటోలో పరారయ్యారు. స్థానికులు అతన్ని వెంటనే ఆస్పత్రికి త రలించి పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స నిర్వహించిన అనంతరం అతిని పరిస్థితి విషమించడంతో అతనిని వైజాగ్ ఆస్పత్రికి తరలించారు. పాత కక్షల కారణంగానే దాడి జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement