![Cops Seen Watching As Dying Gangster Was Stabbed In Jail On CCTV - Sakshi](/styles/webp/s3/article_images/2023/05/6/delhi.jpg.webp?itok=G62x27fY)
తీహార్ జైలులో గ్యాంగ్‌స్టర్ టిల్లు హత్యకు సంబంధించిన తాజా సీసీఫుటేజ్ వీడియో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనతో ఒక్కసారిగా తీహార్ జైలులోని అధికారులు, భద్రతా సిబ్బంది ప్రవర్తన విషయమై విమర్శలు వెల్లువెత్తాయి. ఢిల్లీలోని తీహార్ జైలులో జరిగిన గ్యాంగ్‌వార్‌లో టిల్లు తాజ్‌పురియా చనిపోయినట్లు అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సీసీఫుటేజ్ ప్రకారం..నిజానికి జైలులో భద్రతా సిబ్బంది సమక్షంలోనే గ్యాంగ్‌స్టర్ టిల్లు హత్యకు గురయ్యినట్లు తెలుస్తోంది.
ఆ వీడియోలో.. సుమారు 20 మంది ఖైదీలు టిల్లుపై దారుణంగా దాడిచేశారు. దీంతో భద్రతా సిబ్బంది అతని జైలు నుంచి తరలిస్తుండగా ప్రత్యర్థి గ్యాంగ్ మరోసారి దాడికి పాల్పడింది. వారంతా భద్రతా సిబ్బంది సమక్షంలో సుమారు 90 సార్లు కత్తితో దాడికి పాల్పడినట్లు కనిపిస్తోంది. భద్రతా సిబ్బంది ప్రేక్షక పాత్ర పోషించేదే తప్ప వారిని ఆపే యత్నం చేయలేదు. గ్యాంగ్‌స్టర్ టిల్లు శరీరీంపై సుమారు 100 గాయాలు గుర్తులు ఉన్నట్లు సమాచారం. దీంతో ఏడుగురు పోలీసులు సస్పెండ్ అయ్యారు. ఆ తీహార్ జైలులో నియమించబడిన భద్రతా సిబ్బంది తమిళనాడు స్పెషల్ పోలీస్ ఫోర్స్‌కు చెందినవారు.
ఇదిలా ఉండగా, సెప్టెంబరు 2021లో రోహిణి కోర్టు కాంప్లెక్స్‌లోని కోర్టు గదిలో ప్రత్యర్థి గ్యాంగ్‌స్టర్ జితేందర్ మాన్ అలియాస్ గోగీని దారుణంగా హత్య చేసిన కేసులో మరణించిన తాజ్‌పురియా ప్రధాన నిందితుడు. ఐతే పోలీసులు తమ నాయకుడి మరణానికి ప్రతీకారంగా గోగీ గ్యాంగ్ సభ్యలు తాజ్‌పురియా హత్యకు పథకం పన్నారని ఆరోపణలు చేయడం గమనార్హం. కాగా, గత నెలలో, గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సన్నిహితుడు ప్రిన్స్ తెవాటియాను ప్రత్యర్థి ముఠా సభ్యులు తీహార్ జైలులో దాడి చేసి చంపిన ఘటన మరువక మునుపే మరో గ్యాంగ్‌స్టర్ హత్యకు గురవ్వడం చర్చనీయాంశంగా మారింది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
(చదవండి: మణిపూర్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు)
Comments
Please login to add a commentAdd a comment