ప్రతీకాత్మకచిత్రం
న్యూ ఢీల్లీ: దేశ రాజధాని ఢీల్లీలో దారుణం చోటుచేసుకుంది. యువకుల మధ్య జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల వివరాల మేరకు.. ఢిల్లీలోని సఫ్‌దర్‌జంగ్ ఆస్పత్రిలో ముఖేష్, రాకేష్ అనే ఇద్దరు యుకులు సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం వీరిద్దరితోపాటు మరో స్నేహితుడు నీరజ్‌పై ముగ్గురు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ తగాదాలో నీరజ్‌పై 22 సార్లు కత్తితో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మిగతా ఇద్దరికి గాయలయ్యాయి. ఈ ఘటనపై హత్య కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులలో కృష్ణ, రవిని అరెస్టు చేసి మరొక వ్యక్తి (మైనర్) కోసం వెతుకుతున్నట్లు తెలిపారు.
కాగా బాధితులు పనిచేస్తున్న ఆసుపత్రిలోనే ఇంతకముందు నిందితులు కృష్ణ, రవి పనిచేసేవారని కానీ ప్రస్తుతం వారి స్థానంలో కాని ముఖేష్, రాకేష్ రావడంతో వీరి మధ్య శత్రుత్వం ఏర్పడిందని సౌత్ వెస్ట్ డీసీపీ ప్రతాప్ సింగ్ తెలిపారు. ఈ నేపథ్యంలో కృష్ణ , రవి ఇద్దరు వాళ్ల(మైనర్ బాలుడు) స్నేహితుడితో కలసి వీరిని అడ్డగించి వారిపై దాడి చేశారని పేర్కొన్నారు. ఇరు బృందాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకొని, ఘర్షణకు దారితీసిందని, ముఖేష్, రాకేష్‌పై దాడి చేస్తున్న క్రమంలో నీరజ్ అడ్డగించడంతో వారు నీరజ్‌ను 22 సార్లు కత్తితో పొడిచి చంపినట్లు ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment