తరచూ ఫోన్‌ చేసి భార్యను వేధిస్తున్నాడని.. | Person Stabbed With Knife By Husband For Making Calls To Wife In Vijayawada | Sakshi
Sakshi News home page

తరచూ ఫోన్‌ చేసి భార్యను వేధిస్తున్నాడని..

Published Tue, Oct 20 2020 5:55 PM | Last Updated on Tue, Oct 20 2020 6:03 PM

Person Stabbed With Knife By Husband For Making Calls To Wife In Vijayawada - Sakshi

(ఫైల్‌ ఫోటో)

సాక్షి, విజయవాడ : విజయవాడలోని పటమట స్టెల్లా కాలేజీ సమీపంలో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. తన భార్యకు ఫోన్‌ చేసి తరచుగా వేధిస్తున్న వ్యక్తిని భర్త కత్తితో పొడిచాడు. వివరాలు.. కృష్ణలంక ప్రాంతానికి చెందిన ఒక మహిళకు పిచ్చయ్య అనే వ్యక్తి తరచూ ఫోన్‌ చేసి అసభ్యంగా మాట్లాడుతూ వేధింపులకు గురిచేసేవాడు. దీంతో ఆ మహిళ తన భర్త సిద్దుల రవిపాల్‌కు విషయాన్ని తెలిపింది. రవిపాల్‌ తన భార్యతో పిచ్చయ్యకు ఫోన్‌ చేయించి ఇంటికి పిలిపించాడు. అనంతరం రవిపాల్‌ కత్తితో పిచ్చయను పలుమార్లు పొడవడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పిచ్చయ్యను ఈఎస్‌ఐ ఆసుపత్రికి తరలించారు. కాగా దాడికి పాల్పడ్డ రవిపాల్‌పై కేసు నమోదు చేసిన పటమట పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. (చదవండి : ప్రేమ వ్యవహారం: ప్రణయ్ దారుణ హత్య)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement