కోడలిని కత్తితో పొడిచి.. ఆపై ఆత్మహత్యాయత్నం | Aunty Stabbed Daughter In Law | Sakshi
Sakshi News home page

కోడలిని కత్తితో పొడిచి.. ఆపై ఆత్మహత్యాయత్నం

Published Wed, Mar 28 2018 6:34 AM | Last Updated on Tue, Nov 6 2018 8:28 PM

Aunty Stabbed Daughter In Law - Sakshi

మంచాల : ఓ మహిళపై మరో మహిళ కత్తితో దాడి చేసి.. ఆపై ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన మండల పరిధిలోని ఎల్లమ్మతండాలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఎల్లమ్మతండాకు చెందిన సపావట్‌ కవిత, సపావట్‌ బుజ్జి వరుసకు అత్తాకోడల్లు. మంగళవారం వారిద్దరూ వంట చెరకు కోసం సమీపంలోని అడవికి వెళ్లారు. కవిత కట్టెలు చూస్తుంది. అప్పటికే బుజ్జి తనతో పాటు తెచ్చుకున్న కత్తితో..  తన కోడలు కవితను పొడిచి చంపడానికి యత్నించింది. కవిత తప్పించుకొని సమీపంలో వ్యవసాయ  పొలం వద్ద ఉన్న వ్యక్తులను ఆశ్రయించింది.

దాడిలో కవిత కత్తి గాట్లకు గురైంది. గమనించిన స్థానికులు బుజ్జి వద్దకు వెళ్లడానికి ప్రయత్నించడంతో.. బుజ్జి సమీపంలోని ఎత్తయిన బండరాయి ఎక్కి దూకింది. ఈ ప్రమాదంలో బుజ్జి తలకు బలమైన గాయాలయ్యాయి. దీంతో స్థానికులు  గ్రామంలో వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. బుజ్జిని చికిత్స నిమిత్తం నగరంలోని కిమ్స్‌ వైద్యశాలకు తరలించారు. కవితను హస్తనాపురంలోని అమ్మ వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం ఇద్దరూ చికిత్స పొందుతున్నట్లు సమాచారం.   ఒక్కరుపై ఒక్కరు దాడి చేసుకోవడానికి గల కారణాలు తెలియరాలేదు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement