ప్రేమజంట ఆత్మహత్య | love couples'suicide | Sakshi
Sakshi News home page

ప్రేమజంట ఆత్మహత్య

Published Fri, Jan 24 2014 12:42 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM

love couples'suicide

 టీనగర్,న్యూస్‌లైన్: పెళ్లి చేసుకున్న కొద్దిసేపటికే ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన తిరువారూరు జిల్లాలో చోటుచేసుకుంది. నీడామంగళం సమీపంలోగల వయ్యగళత్తూర్ గ్రామం దక్షిణ వీధికి చెందిన జయరామన్. ఇతని కుమారుడు రంజిత్‌కుమార్ (25) పట్టభద్రుడు. అదే ప్రాంతానికి చెందిన మదియళగన్ కుమార్తె జయప్రియ (20). వీరు ఆరు నెలలుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమకు తల్లిదండ్రులు అభ్యంతరం తెలిపారు. దీంతో జీవితంలో ఒకటి కాలేమని, చావులోనైనా  ఒక్కటయ్యేందుకు నిర్ణయించారు. బుధవారం ఒం టరిగా ఇంట్లో ఉన్న రంజిత్‌కుమార్ జయప్రియను ఇంటికి రప్పించి ఆమెకు తాళికట్టి పెళ్లాడాడు. వెంటనే దంపతులు ఇద్దరూ క్రిమి సంహారక మందుతాగి ఆత్మహత్య చేసుకున్నారు. గమనించిన స్థానికులు వారిని నీడామంగళం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రంజిత్‌కుమార్, జయప్రియ మృతి చెందారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement