రాజధాని ప్రాంతంలో జరిగిన జ్యోతి హత్యకేసు మరువక ముందే జిల్లాలోని గుంటుపల్లి వద్ద మరో ఘటన చోటుచేసుకుంది. వేరే ప్రాంతం నుంచి వచ్చిన యువతీ యువకుల్లో యువతి తీవ్ర గాయాలతో ఘటనా స్థలంలోనే మృతి చెందగా, యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. కామవరపుకోట మండలం జీలకర్రగూడెంలోని గుంటుపల్లి బౌద్ధారామాలు చూసేందుకు ఆదివారం కావడంతో సందర్శకులు భారీగా వచ్చారు.