
ప్రేమజంట శ్రావణి , గణెష్
రొంపిచెర్ల: తల్లిదండ్రుల నుంచి రక్షణ కల్పించాలని ప్రేమజంట రొంపిచెర్ల పోలీ సులను ఆశ్రయించారు. వారు చెప్పిన వివరాల మేరకు.. కలకడ మండలం గంగాపురం గ్రామానికి చెందిన బాలినేని శీనయ్య కుమార్తె శ్రావణి(21) హైదరాబాదులోని యశోద ఆస్పత్రిలో స్టాఫ్‌నర్సుగా పనిచేస్తోంది. రొంపిచెర్ల మండలం చెంచెంరెడ్డిగారిపల్లె దళితవాడకు చెందిన నారాయణ కుమారుడు గణెష్(26) హైదరాబాదులో ప్రయివేటు అడిటర్ దగ్గర పనిచేస్తున్నారు. వీరు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కులాలు వేరు కావడంతో పెళ్లికి తల్లిదండ్రులు అంగీకరించలేదు. ఫిబ్రవరి 8వ తేదీన హైదరాబాదులో వివాహం చేసుకున్నారు. తమకు శ్రావణి కుటుంబ సభ్యుల నుంచి ప్రమాదముందని, రక్షణ కల్పిం చాలని రొంపిచెర్ల ఎస్‌ఐ నాగార్జునరెడ్డికి వారు మొరపెట్టుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment