
మధురవాడ(భీమిలి): ప్రేమ..ఖండాంతరాలను దాటింది. విశాఖలోని మధురవాడకి చెందిన అమ్మాయి..ఐర్లాండ్ దేశ అబ్బాయి పెద్దలను ఒప్పించి..గురువారం ఒక్కటయ్యారు. జీవీఎంసీ 6వ వార్డు మధురవాడ రేవళ్లపాలేనికి చెందిన పిళ్లా శ్రీమన్నారాయణ, నిర్మల దంపతుల కుమార్తె డాక్టర్ చాముండేశ్వరి చైనాలో ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో పనిచేస్తుంది. ఐర్లాండ్‌కు చెందిన డాక్టర్ రాబర్ట్ చారల్స్ పవర్ జర్మనీలో ఉద్యోగం చేస్తున్నాడు.
మనిషి పుట్టుక పూర్వోత్తరాలు, జబ్బులు తదితర అంశాలపై పరిశోధనలు చేస్తున్నాడు. ఏయూ నుంచి డాక్టరేట్ కూడా పొందాడు. 2016లో హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో జరిగిన ఓ కాన్ఫరెన్స్‌లో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. 2018లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 2019లో వీరి నిశ్చితార్థం జరగ్గా వివాహం విశాఖలోని సాగర్‌నగర్ బే లీఫ్ రిసార్ట్‌లో గురువారం రాత్రి జరిగింది. హిందూ సంప్రదాయం ప్రకారం వరుడు పూజా కార్యక్రమాలు పూర్తి చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment