తుమకూరు: ఇప్పుడు సోషల్ మీడియా సర్వస్వం అయిపోయింది. ఏ కార్యక్రమాన్నైనా ఆన్‌లైన్లో నిర్వహిస్తూ యువత హడావుడి చేస్తోంది. దానికి తాజా ఉదాహరణే ఈ పెళ్లి. ఒక ప్రేమ జంట ఫేస్‌బుక్ లైవ్‌లో పరిణయం చేసుకున్నారు. తుమకూరు జిల్లాలోని మధుగిరి పట్టణానికి చెందిన కిరణ్ అదే ప్రాంతానికి చెందిన అంజన ప్రేమించుకుంటున్నారు. రాజకీయ నాయకుడైన యువతి తండ్రి వారి ప్రేమకు అడ్డుచెప్పడంతో జంట రెండు రోజుల క్రితం ఇళ్ల నుంచి పారిపోయింది. శుక్రవారం ఈ జంట ఒక ఆలయంలో పెళ్లి చేసుకుంది. అంతేకాదు వరుడు తన ఫేస్‌బుక్ ఖాతాలో పెళ్లిని ప్రత్యక్ష ప్రసారం కూడా చేశాడు. యువతి తండ్రి ఫిర్యాదుతో మధుగిరి పట్టణ పోలీసులు ప్రేమికుల కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment