
ఎస్పీ అన్బురాజన్ (ఫైల్ ఫోటో)
సాక్షి, వైఎస్సార్ కడప జిల్లా : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వస్తున్న వదంతులను నమ్మొద్దని జిల్లా ఎస్పీ అన్బురాజన్ కోరారు. ఎవరైనా అలాంటి అబద్దపు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత కొన్ని రోజులుగా హత్య కేసులో సునీల్ గ్యాంగ్ ప్రమేయం ఉన్నట్లు వస్తున్న వార్తల పట్ల ఎస్పీ స్పందించారు. అలాగే అవాస్తవాలను ప్రచురించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.