
వైఎస్సార్ జిల్లా: వివేకా కేసులో సాక్షిగా ఉన్న భరత్ యాదవ్ సంచలన విషయాలు వెల్లడించాడు. ఆ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి సునీల్ యాదవ్ 2019, మార్చి 14వ తేదీ రాత్రి వైఎస్ అవినాష్‌రెడ్డి ఇంట్లో ఉన్నట్లు కొన్ని పత్రికలు అవాస్తవాలను ప్రచారం చేయడం తనకు చాలా ఆశ్చర్యాన్ని కల్గించిందని, ఆ రోజు రాత్రి సునీల్ యాదవ్ పులివెందుల ఆస్పత్రి వద్ద ఉన్నట్లు సీబీఐకి ఇప్పటికే ఆధారాలు సమర్పించానని అన్నాడు.
సీబీఐ చెబుతున్నట్లు అవినాష్‌రెడ్డి ఇంటికి సునీల్ యాదవ్ వెళ్లే అవకాశమే లేదన్నాడు. ఆధారాలు ఇచ్చినా మళ్లీ అవాస్తలను చెబుతున్నారని, నిజాన్ని దాచి ఒకే కోణంలో దర్యాప్తు జరుగుతున్నట్లు ఉందన్నాడు. మీడియా కూడా అసత్యాలను ప్రచారం చేస్తోందన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment