
సాక్షి, కర్నూలు : అల్లర్లకు పాల్పడిన వారిపై బైండోవర్ కేసులు నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ పక్కిరప్ప అన్నారు. గురువారం నందికోట్కూరు పోలీస్ స్టేషన్‌ను ఆకస్మిక తనిఖీ చేశారాయన. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల దృష్ట్యా గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. గత ఎన్నికల్లో గ్రామాల్లో అల్లర్లు సృష్టించిన వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని వెల్లడించారు. స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలు వెంటనే పరిష్కరించడంలో జిల్లా మొదటి స్థానంలో ఉందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment