వేటాడే మూడో కన్ను
వేటాడే మూడో కన్ను
Published Thu, Feb 23 2017 9:19 PM | Last Updated on Tue, Sep 5 2017 4:26 AM
- నేరస్తుల గుర్తింపు కోసం మరో సాంకేతిక పరికరం
- పోలీసుల జేబుకు మ్యాన్‌ఓన్ కెమెరా
- పరిసర ప్రాంతాలపై నిఘా
- మాస్టర్ కంట్రోల్ రూమ్‌తో అనుసంధానం
శ్రీశైలం: గత కృష్ణా పుష్కరాలలో అనుమానిత వ్యక్తుల వేలిముద్రలను సేకరించి వారిలో నేరస్తుల గుర్తింపు కోసం జిల్లా పోలీస్ అధికారులు బయోమెట్రిక్ విధానాన్ని అలవలంభించారు. ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో మరో ఆధునిక సాంకేతిక పరికరాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. నేరస్తుల గుర్తింపుతో పాటు ఆ పరికరం ధరించి ఉన్న వ్యక్తి చుట్టూ జరుగుతున్న సంఘటనలు కూడా రికార్డు అయి నేరుగా మాస్టర్ కంట్రోల్ రూమ్‌లోని సీసీ కెమెరాల మానిటరింగ్ రూమ్‌కు చేరుకుంటాయి. ఈ పరికరం పేరు మ్యాన్‌ఓన్ కెమెరా. సెల్ ఫోన్ సైజ్‌లో ఉండే ఈ పరికరం ఆయా సమస్యాత్మక ప్రాంతాలలో విధి నిర్వహణలో ఉన్న పోలీసులు తమ జేబులకు తగిలించుకుంటారు. ఈ పరికరంఽలో ఉన్న కెమెరాలు చుట్టూ పక్కల జరుగుతున్న సంఘటనలన్నింటిని రికార్డు చేస్తాయి. అలాగే అనుమానిత వ్యక్తులు, నేరస్తులు ఈ కెమెరా రికార్డర్ ద్వారా మాస్టర్ కంట్రోల్ రూమ్ వారు గుర్తిస్తారు. వెంటనే ఆ ప్రాంతానికి ఇన్‌చార్జిగా ఉన్న పోలీసు అధికారికి సమాచారాన్ని చేరవేస్తారు. వారు అప్రమత్తమై ఆ ప్రాంతానికి చేరుకుని అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతారు. అలాగే సంఘ వ్యతిరేక వ్యక్తుల కదలికలను కూడా గుర్తించి క్షణాల్లో పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసే అవకాశం ఉంటుంది. ఈ మ్యాన్‌ఓన్ కెమెరాను జిల్లా ఎస్పీ రవికృష్ణ, ఏఆర్ అడిషనల్ ఎస్పీ వెంకటేష్‌లు గురువారం వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహించే పోలీసులకు అమర్చి వాటి పనితీరును మాస్టర్ కంట్రోల్ రూమ్‌లోని సీసీ కెమెరాల ద్వారా పరిశీలించారు. అనుమానిత వ్యక్తులను గుర్తించేందుకు మాస్టర్ కంట్రోల్ రూములోని ప్రత్యేక క్రైమ్ పోలీసులను కూడా ఏర్పాటు చేశారు. వీరే కాకుండా క్షేత్య్రాప్తంగా మఫ్టీలో సుమారు 200 మంది క్రైమ్‌పార్టీ సిబ్బందిని కూడా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు.
Advertisement
Advertisement