ఎస్పీ గౌతమి శాలి
కూడేరు: రాత్రి పూట గస్తీని పెంచి చోరీలను అరికట్టాలని ఎస్పీ గౌతమి శాలి ఆదేశించారు. కూడేరు ఎస్సీ కాలనీ వద్ద ఉన్న ఎస్‌బీఐ ఏటీఎం సెంటర్లో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రూ.18,41,300 ఎత్తుకెళ్లిన విషయం విదితమే. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఆమె చోరీ జరిగిన ఏటీఎం సెంటర్‌ను తనిఖీ చేశారు. సీసీ కెమెరా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధాన రహదారి పక్కన ప్రైవేటు వ్యక్తులు ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సీఐ శివరాముడుని ఆదేశించారు. దేవాలయాలు, ఏటీఎం సెంటర్లపై నిఘా పెంచాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక పోలీసులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment