ఉత్తరప్రదేశ్‌లో సమాజ్ వాది, బహుజన సమాజ్‌పా ర్టీలు రెండూ కలిసి పొత్తు ఏర్పాటు చేసుకొని, 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఉమ్మ డిగా పోటీ చేయ్యాలనే నిర్ణ యానికి రావడాన్ని సోషల్ జస్టిస్ పార్టీ తరపున ఆహ్వానం పలుకుతున్నాం. మొత్తం 80 స్థానాల్లో చెరి 38 స్థానాలు కలిపి 76 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకుని, తద్వారా ఐక్యకూటమి పని విధానానికి ఆ రెండు పార్టీలు ఒక నమూనాగా నిలిచాయి. మిగిలిన 4 సీట్లను మిత్రు లకు వదిలివేయాలని భావించి, కలుపుకొని వెళ్ళే దృక్పథాన్ని ఆ పార్టీలు ప్రదర్శించాయి. దీంతో 1993లో బహుజన్ సమాజ్ పార్టీ అధినేత కాన్షీరామ్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్ యాద వ్‌లు ఐక్యంగా పోరాడి, అధికారం సాధించిన గొప్ప చరిత్ర మళ్ళీ పునరావృతం కానుంది. ఇరుపార్టీలు విడివిడిగా పోటీచేసిన దుష్ఫలితంగానే 2014 లోక్ సభ ఎన్నికల్లోనూ, 2017 శాసనసభ ఎన్నికల్లోనూ అగ్రకులోన్మాద, మతోన్మాద శక్తులు పైచేయి సాధిం చాయి. ఆ తరువాత జరిగిన గోరఖ్‌పూర్, పూల్‌పూర్, ఖైరానా లోక్‌సభ నియోజక వర్గాల ఉపఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీలు కలిసికట్టుగా పోటీచేయగా, బీజేపీ మట్టికరచింది. ఈ విజయాలు కాంగ్రెస్‌తో నిమిత్తం లేకుండానే సాధించటం విశేషం.
తాజాగా, ఈ రెండు పార్టీలే ఒక ఎన్నికల ఒప్పం దానికి రావటం భారత రాజకీయాల్లోనే ఒక మలుపు, నిజానికి ఎస్పీ, బీఎస్పీల కలయిక అంటే, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఐక్యతే. ప్రసుత్తం ఏర్పడిన ఈ రెండు పార్టీల పొత్తు జ్యోతిబా పూలే, బాబాసాహెబ్ అంబేడ్కర్ ప్రవచించిన సామాజిక న్యాయం, సామా జిక ప్రజాస్వామ్య లక్ష్యాల దిశగా వేసే మరో ముందడుగుగా చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది. ఈ రెండు పార్టీల కలయిక, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రాజకీయ ఐక్యత ప్రాముఖ్యం కేవలం యూపీకే పరి మితం కాదు. యావత్ దేశానికీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రా నికి కూడా వర్తిస్తుంది. జాతీయంగాగానీ, ప్రాంతీ యంగాగానీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలూ, వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు అన్నీ ఆధిపత్య కులం అనే ఉమ్మడి స్వభావం కలిగినట్టివే. అవి జాతీయ స్థాయిలోనూ, ప్రాంతీయస్థాయిలోనూ, ఒక దానికి మరొకటి నిజమైన ప్రత్యామ్నాయం కాజాలవు.
బీజేపీకి, కాంగ్రెస్‌కి మధ్య ఎలాంటి భిన్నమైన సామాజిక స్వభావం గానీ, ఆర్థిక విధానాలు గానీ లేవు. హిందుత్వ స్వభావం మాత్రం రెంటికీ ఉమ్మడి గుణమే. అది ఇటీవలి రాహుల్‌గాంధీ దేవాలయాల సందర్శనలు, పూజా పునస్కారాల ద్వారా అతి స్పష్టంగా బహిర్గతమౌతోంది. అయితే కాంగ్రెస్ పార్టీ మేకవన్నె పులిలాగా తన నిజస్వరూపాన్ని కప్పిపుచ్చు కుంటూ మోసపూరితమైన వాదనలతో లౌకికవాద జపంచేస్తూ కుయుక్తులతో ఎస్పీ, బీఎస్పీల సామాజిక శిబిరంలో దూరాలని కుటిలప్రయత్నం చేస్తోంది. గొర్రెలమందలోనికి దూరాలని తోడేలు చేసే దుష్ప్రయత్నం వంటిదే, ఇప్పుడు కాంగ్రెస్ చేస్తోంది. అయితే, ఈ కుట్రను పసిగట్టిన అఖిలేశ్, మాయావతిలు కాంగ్రెస్‌ని సరిగ్గానే దూరంగా పెట్టారు. ఈ విధానం తాత్కాలిక ఎత్తుగడగానే కాకుండా, వ్యూహాత్మకంగానే కొనసాగిస్తూ, జాతీయ స్థాయిలో నిజమైన సామాజిక ప్రత్యామ్నాయ రాజ కీయశక్తులను కూడగట్టడం ఆ రెండు పార్టీల ముందున్న నేటి చారిత్రక కర్తవ్యం. ఇందుకు దోహ దపడే విధంగా, ఆంధ్రప్రదేశ్‌లోనూ అలాగే, అన్ని రాష్ట్రాలలోనూ పోరాడుతోన్న సామాజిక, రాజకీయ, ప్రజాస్వామిక శక్తులు తమ తమ విధానాలను, కార్యాచరణనూ మలచుకోవాలి.ఈ మహత్తర కార్య క్రమంలో ఆంధ్రప్రదేశ్ లోని సామాజిక రాజకీయ శక్తులు కూడా క్రియాశీలకపాత్ర వహించాలి. ఆంధ్ర ప్రదేశ్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ప్రజలు ఒక స్వతంత్ర రాజకీయశక్తిగా 2019 ఎన్నికల్లో పోటీ చెయ్యాలి.
ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి. పార్లమెంట్‌లో ఇటీవల 124వ రాజ్యాంగ సవరణ ద్వారా అగ్రవర్ణాలకు ఆర్థిక వెనుకబాటుతనం ముసు గులో 10% రిజర్వేషన్లు కల్పించిన సందర్భంలో ఎస్పీ, బీఎస్పీలు తీసుకున్న వైఖరి ప్రస్తుత రిజర్వేషన్ వర్గాలకు నష్టకరం అనే విషయం సుస్పష్టమే. ఎందు కంటే, రిజర్వేషన్లకు మౌలిక ప్రాతిపదికగా ఉంటున్న సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా, ఆర్థిక వెనుక బాటుతనాన్ని మాత్రమే ప్రాతిపదికగా చేసుకొని కల్పించిన రిజర్వేషన్లను దేశంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ప్రజలందరూ ముక్తకంఠంతో తిరస్కరి స్తు న్నారు. ఎస్పీ, బీఎస్పీలు ఈ విషయమై తమ వైఖరిని పునరాలోచించుకోవాలి. ఏదేమైనా ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ, బీఎస్పీల పొత్తును ఆహ్వానిస్తూ, రాష్ట్రం లోనూ, దేశంలోనూ ఆ నమూనాలో 2019 ఎన్నికల్లో తగుచర్యలు తీసుకొన వలసిన తక్షణ కర్తవ్యం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రాజకీయశక్తులపై ఉంది. ఓట్లు మనవే సీట్లూ మనవే, మన ఓట్లు మనకే వేసుకొం దాం. రాజ్యాధికారాన్ని సాధించుకొందాం.
వై. కోటేశ్వరరావు
వ్యాసకర్త సీనియర్ అడ్వకేట్, సెంటర్ ఫర్ సోషల్ జస్టిస్, మొబైల్ : 98498 56568
Comments
Please login to add a commentAdd a comment