లక్నో : ఎస్పీతో పొత్తుకు స్వస్తి పలికామని బీఎస్పీ చీఫ్ మాయావతి ప్రకటించారు. ఇక ఎలాంటి ఎన్నికల్లో అయినా తమ పార్టీ సొంతగానే పోటీచేస్తుందని ఆమె పేర్కొన్నారు. గతంలో అఖిలేష్ నేతృత్వంలోని ఎస్పీ ప్రభుత్వం దళితులు, యాదవేతరుల అభివృద్ధికి ఎలాంటి కృషి చేయలేదని అదే సార్వత్రిక ఎన్నికల్లో తమ వైఫల్యానికి కారణమైందని మాయావతి ఎస్పీపై ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే.
లోక్‌సభ ఎన్నికల అనంతరం ఎస్పీ తీరును గమనించిన తర్వాత ఆ పార్టీతో పొత్తు ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవడం సాధ్యం కాదని అవగతమైందని చెప్పారు. పార్టీ విస్తృత ప్రయోజనాల కోసం రానున్న ఏ ఎన్నికల్లోనైనా ఒంటరి పోరుకే సిద్ధం కావాలని పార్టీ నిర్ణయం తీసుకుందని మాయావతి ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment