Koteswara Rao
-
అప్పు ఇచ్చిన వ్యక్తి పంట తీసుకెళ్లడంతో..కౌలు రైతు ఆత్మహత్యాయత్నం
నకరికల్లు: అప్పు తీర్చలేదని తాను పండించిన పంటను అప్పు ఇచ్చిన వ్యక్తి తీసుకెళ్లడంతో అవమానభారం తట్టుకోలేక ఓ కౌలు రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు... పల్నాడు జిల్లా నకరికల్లు మండలం పాపిశెట్టిపాలేనికి చెందిన కౌలు రైతు చెన్నంశెట్టి కోటేశ్వరరావు కొన్నేళ్లుగా కౌలుకు తీసుకుని వరి పంట సాగు చేస్తున్నాడు. ఈ ఏడాది కూడా రెండెకరాల్లో సాగు చేశాడు. వరుస నష్టాలతో పెట్టుబడికి తెచ్చిన అప్పులు భారంగా మారాయి.ఒక ఎరువుల దుకాణంలో పంటకు కావాల్సిన ఎరువులు, పురుగు మందులు, పెట్టుబడి కోసం చేసిన అప్పు రూ.2 లక్షలకు చేరింది. అప్పును తీర్చేందుకుగాను 95 బస్తాలకు పైగా ధాన్యం, మరోవైపు రూ.50 వేల నగదు దశలవారీగా చెల్లించినా ఇంకా బాకీ మిగిలి ఉంది. కాగా, శుక్రవారం వరి పంట నూర్పిడి చేయగా వచ్చిన మొత్తం 80 ధాన్యం బస్తాలను దుకాణదారుడు తన గుమస్తాను పంపి తీసుకెళ్లాడు. దీంతో కోటేశ్వరరావు ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు నరసరావుపేటలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చేర్పించారు. -
సినిమానే మనల్ని ఎంచుకుంటుంది
‘‘మంచి చిత్రం ఎంచుకున్నామంటూ చాలా మంది అంటారు. కానీ, సినిమా అంటే ప్యాషన్ ఉన్నవాళ్లనే ఆ సినిమా ఎంపిక చేసుకుంటుంది.. అంతేకానీ, సినిమాను మనం సెలెక్ట్ చేసుకోం’’ అని డైరెక్టర్ హరీష్ శంకర్ అన్నారు. ప్రణవ చంద్ర, మాళవిక సతీషన్ జంటగా శివ నాగేశ్వరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దోచేవారెవరురా’. బొడ్డు కోటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమా మార్చి 11న విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ని హరీష్ శంకర్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ఎన్నో మంచి సినిమాలు తీసిన శివ నాగేశ్వరావుగారు ఇప్పుడు ‘దోచేవారెవరురా’ వంటి మంచి కథతో వస్తున్నారు. ట్రైలర్, పాటలు బాగున్నాయి.. ఈ సినిమా పెద్ద హిట్ కావాలి’’ అన్నారు. ‘‘కథ మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతుంది. కుటుంబమంతా చూడదగ్గ సినిమా ఇది’’ అన్నారు శివ నాగేశ్వరరావు. ‘‘దోచేవారెవరురా’లో మంచి వినోదం ఉంటుంది’’ అన్నారు బొడ్డు కోటేశ్వర రావు. -
నెటాప్స్ ముసుగులో టెర్రర్ సాఫ్ట్!
సాక్షి, అమరావతి: టీడీపీ హయాంలో చోటు చేసుకున్న ఫైబర్‌నెట్ ప్రాజెక్టు కుంభకోణంలో కీలక పాత్రధారి కనుమూరి కోటేశ్వరరావును సీఐడీ తాజాగా అరెస్టు చేసింది. షెల్ కంపెనీల ముసుగులో రూ.284 కోట్ల మేర ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టినట్లు దర్యాప్తులో గుర్తించారు. ఆ నిధులను నాటి ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ సన్నిహితుడు, ఫైబర్ నెట్ కుంభకోణంలో ప్రధాన నిందితుడైన వేమూరి హరిప్రసాద్ కంపెనీలకు మళ్లించినట్లు వెల్లడైంది. ఈ కేసులో కనుమూరిని ఏ–23గా సీఐడీ పేర్కొంది. ఈ కుంభకోణంపై సీఐడీ దర్యాప్తు మొదలు కాగానే విదేశాలకు ఉడాయించడంతో కనుమూరిపై సీఐడీ లుక్ అవుట్ నోటీస్ జారీ చేసింది. ఈ నెల 12న అమెరికా నుంచి తిరిగి వచ్చిన నిందితుడిని శంషాబాద్ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకుని సీఐడీ అధికారులకు సమాచారమిచ్చారు. సీఐడీ అధికారుల బృందం హైదరాబాద్ చేరుకుని కనుమూరి కోటేశ్వరరావును అరెస్టు చేసింది. నిందితుడికి న్యాయస్థానం ఈ నెల 21వరకు రిమాండ్ విధించడంతో విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. కీలక పురోగతి టీడీపీ హయాంలో ఇన్‌క్యాప్ వీసీగా ఉన్న కె.సాంబశివరావు, ఫాస్ట్‌లేన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ డైరెక్టర్ విప్లవ కుమార్(ఏ–20), జెమిని కమ్యూనికేషన్స్ లిమిటెడ్ డైరెక్టర్ విజయ్‌కుమార్ రామ్మూర్తి(ఏ–21)లను ఈ కేసులో సీఐడీ అధికారులు ఇప్పటికే అరెస్టు చేశారు. ఈ కేసులో ఏ–1గా ఉన్న వేమూరి హరికృష్ణ ప్రసాద్, ఏ–11 తుమ్మల గోపీచంద్, ఏ–22 రామ్‌కుమార్ రామ్మూర్తి ముందస్తు బెయిల్ పొందిన విషయం తెలిసిందే. నిధుల మళ్లింపులో వేమూరి హరికృష్ణకు సహకరించిన కనుమూరి కోటేశ్వరరావును అరెస్టు చేయడం ద్వారా సీఐడీ అధికారులు ఈ కేసులో కీలక పురోగతి సాధించారు. షెల్ కంపెనీలతో కొల్లగొట్టారు.. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన ఫైబర్ నెట్ ప్రాజెక్టులో టీడీపీ పెద్దలు యథేచ్ఛగా అవినీతికి పాల్పడ్డారు. రూ.333 కోట్ల విలువైన ఫైబర్ నెట్ ప్రాజెక్టు మొదటి దశ పనులను నిబంధనలకు విరుద్ధంగా లోకేశ్ సన్నిహితుడైన వేమూరి హరికృష్ణకు చెందిన టెరా సాఫ్ట్‌కు కేటాయించారు. వేమూరి హరికృష్ణ ప్రజాధనాన్ని కాజేసేందుకు కనుమూరి కోటేశ్వరరావు సహకారాన్ని తీసుకున్నాడు. వేమూరికి చెందిన కాఫీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలలో కనుమూరి కోటేశ్వరరావు భాగస్వామిగా ఉన్నాడు. వేమూరి హరికృష్ణ, తుమ్మల గోపీచంద్, రామ్‌కుమార్ రామ్మూర్తిలతో కలసి అప్పటికప్పుడు విజయవాడ కేంద్రంగా నెటాప్స్ ఫైబర్ సొల్యూషన్స్ ఎల్ఎల్పీ అనే మ్యాన్‌పవర్ సప్లై కంపెనీ పేరిట ఓ షెల్ కంపెనీని సృష్టించారు. ఆ కంపెనీ ఫైబర్ నెట్ ప్రాజెక్టుకు అవసరమైన సిబ్బందిని సమకూర్చినట్లు, పర్యవేక్షించినట్లు కథ నడిపించారు. ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న టెరాసాఫ్ట్ కంపెనీ, ఇతర కంపెనీలకు గత సర్కారు ఏకంగా రూ.284 కోట్లు విడుదల చేసింది. ఈ వ్యవహారంలో టెరాసాఫ్ట్ లావాదేవీలను సీఐడీ అధికారులు ఇండిపెండెంట్ ఏజెన్సీ ఐబీఐ గ్రూప్ ద్వారా ఆడిటింగ్ జరపడంతో బాగోతం బట్టబయలైంది. టెరాసాఫ్ట్ కంపెనీ నిబంధనలను ఉల్లంఘించిందని, నాసిరకం పరికరాలు సరఫరా చేసి ప్రభుత్వాన్ని మోసగించిందని ఐబీఐ గ్రూప్ నిర్ధారించింది. నెటాప్స్ – టెరాసాఫ్ట్ వయా వేమూరి ► నెటాప్స్ కంపెనీకి చెల్లించిన రూ.8.35 కోట్లను వేమూరి హరికృష్ణకు చెందిన ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు మళ్లించారు. ► నెటాప్స్ కంపెనీ నుంచి రూ.1.49 కోట్లను వేమూరి హరికృష్ణ కుమార్తె వేమూరి అభిజ్ఞ ఖాతాకు మళ్లించారు. విదేశాల్లో ఉన్న ఆమె ఇక్కడ తమ కంపెనీలో పని చేస్తున్నట్లు చూపించి జీతం కింద నెలకు రూ.1.35 లక్షలు చెల్లించారు. ► నెటాప్స్ కంపెనీ వేమూరి హరికృష్ణ భార్య వేమూరి నీలిమ ఫ్లాట్ కొనుగోలు చేసేందుకు అడ్వాన్స్‌గా రూ.39.74 లక్షలు బదిలీ చేసింది. ► నెటాప్స్ కంపెనీ 2017 జూన్ నుంచి 2020 జూన్ మధ్య ఎలాంటి సేవలు, పరికరాల సరఫరా లేకుండానే వేమూరి హరికృష్ణకు రూ.95.90 లక్షలు బదిలీ చేసింది. ► నెటాప్స్ కంపెనీ 2017 జనవరి నుంచి 2019 మార్చి మధ్యలో సేవలు, పరికరాల సరఫరా లేకుండా స్ఫూర్తి ఇన్నోవేషన్స్‌కు రూ.76 లక్షలు బదిలీ చేసింది. -
వారసత్వంతో కాదు జవసత్వాలతో రాజకీయాల్లోకి రావాలి: వెంకయ్య నాయుడు
సాక్షి, కృష్ణా జిల్లా: జిల్లాలోని మచిలీపట్నంలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పర్యటించారు. జిల్లా పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో పిన్నమనేని కోటేశ్వరరావు కాంస్య విగ్రహాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. పిన్నపనేని కోటేశ్వరరావు నిత్యం ప్రజల కోసం పని చేశారని అన్నారు. కార్యక్రమంలో మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యేలు పేర్ని నాని, సామినేని ఉదయభాను, ఎంపీ కేశినేని నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా త ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. జై ఆంధ్ర ఉద్యమంలో పిన్నమనేని కోటేశ్వరరావుతో పాల్గొన్న అనుభవం ఉందని గుర్తు చేసుకున్నారు. తెలుగుదనం ఉట్టిపడేలా ఆహార్యంతో అందరినీ ఆకట్టుకున్న వ్యక్తి కోటేశ్వరరావు అని, నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడిన వ్యక్తి అని ప్రశంసించారు. ఏపీలో కృష్ణాజిల్లాతో ఆయనకు ఒక ప్రత్యేకత ఉందని, 22 ఏళ్లు జిల్లాకు చైర్మన్‌గా పనిచేయడం సాధారణ విషయం కాదన్నారు. ఎన్టీఆర్, నాగేశ్వరరావు పుట్టింది ఈ జిల్లాలోనేనని, ఘంటసాల వెంకటేశ్వరరావు లాంటి మహనీయులు ఈ జిల్లా వాసులనేనని ప్రస్తావించారు. పాఠశాలల అభివృద్ధిపై పిన్నమనేని ప్రత్యేక శ్రద్ధ చూపించారు. రాజకీయంగా పార్టీ మారకుండా పార్టీలకు అతీతంగా పాలించడం సాధారణ విషయం కాదు. ఇప్పుడున్న రాజకీయాల్లో హుందాతనం తగ్గిపోతుంది. చట్ట సభల్లో శాసన సభ్యులు మాట్లాడే భాష, వ్యవహరిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. వారసత్వంతో కాదు జవసత్వాలతో రాజకీయాలలోకి రావాలి. కులం కన్న గుణం మిన్న అనేది అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎన్నికల సమయాల్లో రాజకీయపార్టీలు అమలుకాని హామీలు ఇస్తున్నాయి. ఎన్నికల మ్యానిఫెస్టోకి చట్టబద్దత కల్పించాలనే డిమాండ్ వస్తుంది. ఇది మంచిదే.. దీనిపై విస్తృత మైన చర్చ జరగాలి’ అని తెలిపారు చదవండి: ఏపీ ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు.. ఇక సులభంగా మ్యుటేషన్లు -
టీడీపీ నేతల ప్రోద్భలంతోనే ఆ దుష్ప్రచారం?
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్సీపీ నాయకురాలు నందమూరి లక్ష్మీపార్వతి, సినీనటి పూనమ్‌కౌర్‌లపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కోటేశ్వరరావు అలియాస్ కోటి మంగళవారం నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు. ఇతడిపై హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసుస్టేషన్లో రెండు కేసులు నమోదై ఉన్నాయి. తనపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో జరిగిన దాడి వెనుక కోటి అనే వ్యక్తి ఉన్నాడని లక్ష్మీపార్వతి సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ కేసు దర్యాప్తులో ఉండగానే సినీనటి పూనమ్‌కౌర్ కూడా తనపై గుర్తు తెలియని వ్యక్తులు అభ్యంతకరమైన పోస్టింగ్‌లు పెట్టారంటూ ఫిర్యాదు ఇచ్చారు. ఈ రెండు కేసులను సాంకేతికంగా దర్యాప్తు చేసిన సైబర్‌క్రైమ్ పోలీసులు రెండు కేసుల్లోనూ కోటినే ప్రధాన సూత్రధారిగా గుర్తించారు. అతని కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తుండగా, లాయర్‌తో కలిసి వచ్చి లొంగిపోతానంటూ కోటి కొన్నాళ్లుగా సైబర్‌క్రైమ్ పోలీసులకు వర్తమానం పంపుతూ వచ్చాడు. హఠాత్తుగా మంగళవారం నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు. అతని రాకని పసిగట్టి సైబర్‌క్రైమ్ పోలీసులు కోర్టుకు చేరుకునేలోపే కోటి న్యాయస్థానంలో లొంగిపోయాడు. చదవండి: (దురుద్దేశంతోనే నాపై దుష్ప్రచారం: లక్ష్మీ పార్వతి) ప్రముఖులకు దగ్గరై... ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీడీపీ నాయకులు సోషల్‌మీడియా కేంద్రంగా వైసీపీ నాయకులపై విషప్రచారం చేశారు. ఇందులో కోటిని కూడా ఉపయోగించారు. టీడీపీ నేతలు ఓ పథకం ప్రకారం వారు టార్గెట్ చేసిన వారి వద్దకు కోటిని పంపిస్తుంటారని సైబర్‌క్రైమ్ పోలీసులు భావిస్తున్నారు. వారి ‘లక్ష్యాల’తో పరిచయం, స్నేహాం ద్వారా తనపై నమ్మకం కలిగేలా ప్రవర్తించి కోటి ఆపై అసలు పని ప్రారంభిస్తాడు. అవకాశం చిక్కినప్పుడల్లా వారి ఫోన్లలో తనకు కావాల్సిన అంశాలు పొందుపరిచే వాడని, లక్ష్మీపార్వతి ఫోన్‌ను కూడా అలాగే ఉపయోగించినట్లు ఆధారాలు లభించాయని పోలీసులు పేర్కొన్నారు. కోటిని అదే విధంగా పూనమ్‌కౌర్ వద్దకు కూడా పంపిన టీడీపీ నాయకులు ఆమెతో ఏపీకి చెందిన ఓ ప్రముఖ నటుడికి వ్యతిరేకంగా మాట్లాడించి, వాటిని యూట్యూబ్‌లో అప్లోడ్ చేసేలా చేశారని భావిస్తున్నారు. ఈ రెండు కేసులకు సంబంధించిన పలు వివరాలను కోటి నుంచి రాబట్టాల్సి ఉండటంతో సైబర్‌క్రైమ్ పోలీసులు అతణ్ణి కస్టడీకి కోరాలని భావిస్తున్నారు. సోషల్ మీడియాలో కోటి కార్యకలాపాలు, కోటికి, టీడీపీ నాయకులకు ఉన్న సంబంధాల గురించి నిర్థారణ కావాలంటే అతణ్ణి కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించాల్సి ఉందని వారు చెప్తున్నారు. చదవండి: సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన పూనమ్ కౌర్ -
ఆ ‘పొత్తు’ దేశానికే నమూనా!
ఉత్తరప్రదేశ్‌లో సమాజ్ వాది, బహుజన సమాజ్పా ర్టీలు రెండూ కలిసి పొత్తు ఏర్పాటు చేసుకొని, 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఉమ్మ డిగా పోటీ చేయ్యాలనే నిర్ణ యానికి రావడాన్ని సోషల్ జస్టిస్ పార్టీ తరపున ఆహ్వానం పలుకుతున్నాం. మొత్తం 80 స్థానాల్లో చెరి 38 స్థానాలు కలిపి 76 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకుని, తద్వారా ఐక్యకూటమి పని విధానానికి ఆ రెండు పార్టీలు ఒక నమూనాగా నిలిచాయి. మిగిలిన 4 సీట్లను మిత్రు లకు వదిలివేయాలని భావించి, కలుపుకొని వెళ్ళే దృక్పథాన్ని ఆ పార్టీలు ప్రదర్శించాయి. దీంతో 1993లో బహుజన్ సమాజ్ పార్టీ అధినేత కాన్షీరామ్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్ యాద వ్లు ఐక్యంగా పోరాడి, అధికారం సాధించిన గొప్ప చరిత్ర మళ్ళీ పునరావృతం కానుంది. ఇరుపార్టీలు విడివిడిగా పోటీచేసిన దుష్ఫలితంగానే 2014 లోక్ సభ ఎన్నికల్లోనూ, 2017 శాసనసభ ఎన్నికల్లోనూ అగ్రకులోన్మాద, మతోన్మాద శక్తులు పైచేయి సాధిం చాయి. ఆ తరువాత జరిగిన గోరఖ్‌పూర్, పూల్పూర్, ఖైరానా లోక్‌సభ నియోజక వర్గాల ఉపఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీలు కలిసికట్టుగా పోటీచేయగా, బీజేపీ మట్టికరచింది. ఈ విజయాలు కాంగ్రెస్‌తో నిమిత్తం లేకుండానే సాధించటం విశేషం. తాజాగా, ఈ రెండు పార్టీలే ఒక ఎన్నికల ఒప్పం దానికి రావటం భారత రాజకీయాల్లోనే ఒక మలుపు, నిజానికి ఎస్పీ, బీఎస్పీల కలయిక అంటే, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఐక్యతే. ప్రసుత్తం ఏర్పడిన ఈ రెండు పార్టీల పొత్తు జ్యోతిబా పూలే, బాబాసాహెబ్ అంబేడ్కర్ ప్రవచించిన సామాజిక న్యాయం, సామా జిక ప్రజాస్వామ్య లక్ష్యాల దిశగా వేసే మరో ముందడుగుగా చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది. ఈ రెండు పార్టీల కలయిక, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రాజకీయ ఐక్యత ప్రాముఖ్యం కేవలం యూపీకే పరి మితం కాదు. యావత్ దేశానికీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రా నికి కూడా వర్తిస్తుంది. జాతీయంగాగానీ, ప్రాంతీ యంగాగానీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలూ, వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు అన్నీ ఆధిపత్య కులం అనే ఉమ్మడి స్వభావం కలిగినట్టివే. అవి జాతీయ స్థాయిలోనూ, ప్రాంతీయస్థాయిలోనూ, ఒక దానికి మరొకటి నిజమైన ప్రత్యామ్నాయం కాజాలవు. బీజేపీకి, కాంగ్రెస్‌కి మధ్య ఎలాంటి భిన్నమైన సామాజిక స్వభావం గానీ, ఆర్థిక విధానాలు గానీ లేవు. హిందుత్వ స్వభావం మాత్రం రెంటికీ ఉమ్మడి గుణమే. అది ఇటీవలి రాహుల్‌గాంధీ దేవాలయాల సందర్శనలు, పూజా పునస్కారాల ద్వారా అతి స్పష్టంగా బహిర్గతమౌతోంది. అయితే కాంగ్రెస్ పార్టీ మేకవన్నె పులిలాగా తన నిజస్వరూపాన్ని కప్పిపుచ్చు కుంటూ మోసపూరితమైన వాదనలతో లౌకికవాద జపంచేస్తూ కుయుక్తులతో ఎస్పీ, బీఎస్పీల సామాజిక శిబిరంలో దూరాలని కుటిలప్రయత్నం చేస్తోంది. గొర్రెలమందలోనికి దూరాలని తోడేలు చేసే దుష్ప్రయత్నం వంటిదే, ఇప్పుడు కాంగ్రెస్ చేస్తోంది. అయితే, ఈ కుట్రను పసిగట్టిన అఖిలేశ్, మాయావతిలు కాంగ్రెస్‌ని సరిగ్గానే దూరంగా పెట్టారు. ఈ విధానం తాత్కాలిక ఎత్తుగడగానే కాకుండా, వ్యూహాత్మకంగానే కొనసాగిస్తూ, జాతీయ స్థాయిలో నిజమైన సామాజిక ప్రత్యామ్నాయ రాజ కీయశక్తులను కూడగట్టడం ఆ రెండు పార్టీల ముందున్న నేటి చారిత్రక కర్తవ్యం. ఇందుకు దోహ దపడే విధంగా, ఆంధ్రప్రదేశ్‌లోనూ అలాగే, అన్ని రాష్ట్రాలలోనూ పోరాడుతోన్న సామాజిక, రాజకీయ, ప్రజాస్వామిక శక్తులు తమ తమ విధానాలను, కార్యాచరణనూ మలచుకోవాలి.ఈ మహత్తర కార్య క్రమంలో ఆంధ్రప్రదేశ్ లోని సామాజిక రాజకీయ శక్తులు కూడా క్రియాశీలకపాత్ర వహించాలి. ఆంధ్ర ప్రదేశ్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ప్రజలు ఒక స్వతంత్ర రాజకీయశక్తిగా 2019 ఎన్నికల్లో పోటీ చెయ్యాలి. ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి. పార్లమెంట్లో ఇటీవల 124వ రాజ్యాంగ సవరణ ద్వారా అగ్రవర్ణాలకు ఆర్థిక వెనుకబాటుతనం ముసు గులో 10% రిజర్వేషన్లు కల్పించిన సందర్భంలో ఎస్పీ, బీఎస్పీలు తీసుకున్న వైఖరి ప్రస్తుత రిజర్వేషన్ వర్గాలకు నష్టకరం అనే విషయం సుస్పష్టమే. ఎందు కంటే, రిజర్వేషన్లకు మౌలిక ప్రాతిపదికగా ఉంటున్న సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా, ఆర్థిక వెనుక బాటుతనాన్ని మాత్రమే ప్రాతిపదికగా చేసుకొని కల్పించిన రిజర్వేషన్లను దేశంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ప్రజలందరూ ముక్తకంఠంతో తిరస్కరి స్తు న్నారు. ఎస్పీ, బీఎస్పీలు ఈ విషయమై తమ వైఖరిని పునరాలోచించుకోవాలి. ఏదేమైనా ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ, బీఎస్పీల పొత్తును ఆహ్వానిస్తూ, రాష్ట్రం లోనూ, దేశంలోనూ ఆ నమూనాలో 2019 ఎన్నికల్లో తగుచర్యలు తీసుకొన వలసిన తక్షణ కర్తవ్యం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రాజకీయశక్తులపై ఉంది. ఓట్లు మనవే సీట్లూ మనవే, మన ఓట్లు మనకే వేసుకొం దాం. రాజ్యాధికారాన్ని సాధించుకొందాం. వై. కోటేశ్వరరావు వ్యాసకర్త సీనియర్ అడ్వకేట్, సెంటర్ ఫర్ సోషల్ జస్టిస్, మొబైల్ : 98498 56568 -
తండ్రి మృతదేహంతోనే నాలుగు రోజులుగా..
-
ప్రత్యామ్నాయం అంటే కాంగ్రెస్ అనుకూల కూటమేనా?
సందర్భం ప్రజానుకూల విధానాలు అనుసరించని పార్టీలు, కాంగ్రెస్‌తో సహా లేదా కాంగ్రెస్ మినహా పలు ప్రాంతీయ పార్టీలతో సీపీఐ, సీపీఎంలు ఏర్పాటు చేయాలనుకునేది ప్రజానుకూలమైన విధానాల ప్రాతిపదికగా రూపొందే కూటమి కాదు. ఒక సందర్భంలో ఇ.ఎం.ఎస్.నంబూద్రిపాద్ చెప్పిన ‘‘ప్రజలకు కావలసింది, ఒక ప్రత్యామ్నాయ విధానాల సమూహమే కానీ, ఒక ప్రత్యామ్నాయ తలకాయల గుంపు కాదు.’’ అన్నసూక్తిని గుర్తుకు తెచ్చుకోవాలి. జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయం ఏమిటి? అనే చర్చ ఇప్పుడు బలంగా సాగుతోంది. ఇందుకు 2019 ఎన్నికలు సమీపిస్తూండటం ఒక కారణం కాగా, బీజేపీ బలహీనపడుతూండటం కూడా మరొక కారణం. గత నాలుగేళ్ళుగా బీజేపీ, ఎన్నికల ప్రణాళికలో చేసిన వాగ్దానాలను అమలు జరపకపోగా, ప్రజా వ్యతిరేక పాలననే కొనసాగించింది. అంతేగాక, మేధావులపైనా, ప్రజాస్వామికవాదులపైనా, దళి తులు, మైనార్టీలపైనా హత్యలు, దాడులు బీజేపీ పాలనలో పెచ్చు పెరిగిపోయాయి. పాలకవర్గాల్లో అసహనం, ప్రజల్లో అభద్రత పెరిగాయి. కనుక రాజకీయ ప్రత్యామ్నాయం అవసరం మరింతగా పెరిగింది. అయితే, ఏది ప్రత్యామ్నాయం, అనేదే కీలకమైన ప్రశ్న. ఈ నేపథ్యంలో రెండు కమ్యూనిస్టు పార్టీల జాతీయస్థాయి మహాసభలకు ప్రాముఖ్యత ఏర్పడింది. రెండు పార్టీల ప్రధాన లక్ష్యం బీజేపీని ఓడించడం. కాంగ్రెస్‌తో సహా బీజేపీయేతర పార్టీలన్నిటితో కలిపి కూటమి ఏర్పడాలనే విధానం సీపీఐలో ఇప్పటికే స్పష్టంగానే వుంది. అంటే, కాంగ్రెస్‌ను కూడా కలుపుకోవాలనేది ఆ పార్టీ నిర్ణయ సారాంశం. అయితే సీపీఎం విధానం అంత సూటిగా లేదు. ఎందుకంటే, ఆ పార్టీ విధానం అటూ ఇటూ మారుతూ వస్తోంది. 1964 నాటి పార్టీ చీలికకు ఆనాటి సీపీఐ నాయకత్వం చేపట్టిన కాంగ్రెస్ అనుకూల పోకడే ప్రధాన కారణం అని సీపీయం నాయకత్వం ఆనాడు స్పష్టంగానే ప్రకటించింది. అయితే కాంగ్రెస్, టీడీపీల మధ్య ఏ ప్రజాస్వామిక, ఆర్థిక, సామాజిక విధానాలపరమైన వ్యత్యాసాల కారణంగా 2004, 2009 ఎన్నికల్లో ఒకసారి కాంగ్రెస్‌ను, మరోసారి టీడీపీని బలపరిచిందో, ఆ పార్టీ నాయకత్వమే చెప్పాలి. ప్రస్తుతం ప్రతిపాదిస్తోన్న బీజేపి వ్యతిరేక కూటమిలో కాంగ్రెస్ స్థానం ఏమిటి, అన్నది ముఖ్యమైన అంశంగా సీపీఎంలో చర్చ జరుగుతూండటం బహిరంగ రహస్యమే. వాస్తవానికి 1964 నాటి చీలిక ప్రకారం రెండు పార్టీలు, సీపీఐ, సీపీఎంలుగా కొనసాగాలంటే కాంగ్రెస్ అనుకూల, ప్రతికూల విధానాల ప్రాతిపదిక ఉండితీరాలి. ఆ ప్రాతిపదికే లేకపోతే అప్పుడు పార్టీని చీల్చడమే తప్పు; ఇప్పుడు రెండు పార్టీలుగా కొనసాగడం అంతకన్నా తప్పు. నేటి ఈ వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకుని ఉండబట్టేనేమో, సీపీఐ నాయకత్వం రెండు పార్టీల విలీనాన్ని పదేపదే బలంగా ప్రతిపాదిస్తూ వస్తోంది. ఆ ప్రతిపాదనను సీపీయం నాయకత్వం అదేపనిగా తిరస్కరిస్తూ వస్తోంది. ఈ తిరస్కరణకు సీపీఎం నాయకత్వం మనస్సులో ఏ కారణాలు పని చేస్తున్నాయో ప్రజలకైతే అర్థం కావడం లేదు. కాంగ్రెస్ పరిపాలన ఎంతటి జుగుప్సాకరంగా, అవినీతిమయంగా, ప్రజా వ్యతిరేకంగా సాగుతుందో చెప్పటానికి ప్రబలమైన ప్రత్యక్ష సాక్ష్యం, 2014 ఎన్నికల్లో ప్రజలు పచ్చి మతోన్మాద బీజేపీని ఎన్నుకుని అధికారంలో కూర్చోబెట్టటమే. గతంలో వాజ్‌పేయి నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం, పదేళ్ల కాంగ్రెస్ యుపిఎ పరిపాలన అనంతరం నాలుగేళ్ల కిందట తిరిగి బిజెపి బహు పెద్ద మెజారిటీతో అధికార పీఠానికి ఎగబాకడం చూసిన తరువాత కూడా, మళ్ళీ కాంగ్రెస్‌తో కలిసిన ప్రత్యామ్నాయాల గురించి సీపీఐ, సీపీఎంలు ఆలోచించటం ఎంతటి ఆత్మవంచన? ఎంతటి ఆత్మహత్యా సదృశ్యం? అసలు ప్రత్యామ్నాయం అంటే ఏమిటి? అది రాజకీయ విధాన ప్రత్యామ్నాయంగా వుండాలి. ఆ రాజకీయ విధానం అభివృద్ధికరమైన, మార్పు దిశగా నడిచే సామాజిక, ఆర్థిక, సాంస్కృతికపరమైన స్వభావంతో కూడుకుని ఉండాలి. కాంగ్రెస్ పార్టీ విధానాలుగానీ, సీపీఐ, సీపీఎంలు ప్రతిపాదిస్తోన్న కూటమిలోని భాగస్వామ్య ప్రాంతీయ రాజకీయ పార్టీలు అనుసరిస్తోన్న విధానాలు గానీ, ప్రజానుకూలంగా వున్నాయా? కనీసం ఆ సీపీఐ, సీపీఎంలు సమర్థించేవిగానైనా వున్నాయా? ప్రజానుకూల విధానాలు అనుసరిం చని పార్టీలు, కాంగ్రెస్‌తో సహా లేదా కాంగ్రెస్‌ను మినహాయించి పలు ప్రాంతీయ పార్టీలతో సీపీఐ, సీపీఎంలు ఏర్పాటు చేయాలనుకునేది ప్రజానుకూలమైన విధానాల ప్రాతిపదికగా రూపొందే కూటమి కాదు. ఒక సందర్భంలో ఇ.ఎం.ఎస్.నంబూద్రిపాద్ చెప్పిన ‘‘ప్రజలకు కావలసింది, ఒక ప్రత్యామ్నాయ విధానాల సమూహమే కానీ, ఒక ప్రత్యామ్నాయ తలకాయల గుంపు కాదు.’’ అన్నసూక్తిని గుర్తుకు తెచ్చుకోవాలి. బీజేపీ ఉగ్రవాద హిందుత్వ పార్టీకాగా, కాంగ్రెస్ తదితర పార్టీల్లో హెచ్చు భాగం ఉదారవాద హిందుత్వ పార్టీలే. తరతమ తేడాలేతప్ప స్వభావం మాత్రం ఒక్కటే. మరో ప్రత్యేకత ఏమిటంటే, దేశంలోని దాదాపు అన్ని ప్రాంతీయ రాజకీయ పార్టీలూ, ఏదో ఒక దశలో మతోన్మాద బీజేపీతో చెలిమి చేసినట్టివే. ఏవో తమ సొంత కారణాల వల్ల ఆ పార్టీకి ఈ పార్టీలు ప్రస్తుతం దూరంగా వుండవచ్చు. అంతమాత్రాన బీజేపీతో జతకట్టగలిగిన ఆ పార్టీల అలనాటి స్వభావం మారిందనుకోలేం. మారినట్లుగా దాఖలాలూ లేవు. ఇప్పుడు తాము ప్రతిపాదిస్తున్న బీజేపీ వ్యతిరేక కూటమిలో చేర్చదలచుకుంటోన్న ఒక్కొక్క పార్టీ గత చరిత్రను సీపీఐ., సీపీఎం.లు బహిరంగంగా ప్రకటించాలి. ఈ పార్టీలు బీజేపీ దగ్గరకు జరిగినా, లేక, దూరంగా వెళ్ళిపోయినా అవి తమ అప్పటి అవసరాల కోసం, అవకాశవాదంతో ఏర్పరచుకొన్న వైఖరే తప్ప, విధానపరమైన నిర్ణయాలు కావు. ఇలాంటి శక్తులతో కలసి నిజమైన బిజెపి వ్యతిరేక కూటమిని సీపీఐ, సీపీఎంలు నిర్మించడం సాధ్యమేనా? సామాజిక న్యాయం, కుల వివక్షలను గురించి మాటల్లో చెప్పడం కాదు. అది చేతల్లో కనపడాలి. ముఖ్యంగా కీలకమైన రాజకీయ రంగంలో స్పష్టంగా ప్రతిబింబించాలి. దినదినం క్షీణించిపోతున్న తమ ఉనికిని నిలబెట్టుకొని, బలపడి.. సామాజిక కులవర్గ దృక్పధంతో ప్రత్యామ్నాయాన్ని గురించి ఆలోచించి కమ్యూనిస్టు పార్టీల మçహాసభలు సరైన నిర్ణయాలు తీసుకోవాలి. కనుక, సరైన ప్రత్యామ్నాయాన్ని ఎంపిక చేసుకొనడంపైనే ఆ పార్టీల భవిష్యత్తు ఆధారపడి వుంటుంది. నిజమైన కమ్యూనిస్టులుగా, నిజమైన సామాజిక రాజకీయ శక్తులతో కలిసి, నిజమైన ప్రత్యామ్నాయ, రాజకీయ శిబిరాన్ని నిర్మించడమా? లేక, బూటకపు లౌకిక శక్తులు, బూటకపు ప్రజాతంత్ర శక్తులతో జతకట్టి, బూట కపు ప్రత్యామ్నాయాన్ని నిర్మించడమా? ఇవే, సీపీఐ, సీపీఎం మహాసభల ముందున్న నిజమైన ప్రత్యామ్నాయాలు. కొసమెరుపు: బీజేపీ వ్యతిరేక కూటమిలో భాగంగా కాంగ్రెస్‌తో ఫ్రంట్‌కు సీపీఎం అంగీకరించనున్నట్లు తాజా వార్తలు. - వై. కోటేశ్వరరావు వ్యాసకర్త సీనియర్ న్యాయవాది, సామాజిక విశ్లేషకులు ‘ 98498 56568 -
కష్టాల కడలిలో తవిల్ కళాకారుడు
-
వారి తప్పులు..
తప్పులు కప్పిపుచ్చుకునేందుకే దరఖాస్తులు మాయం రిమ్స్ సిబ్బంది నిర్వాకంతో దరఖాస్తుదారుల అవస్థలు సవరణ కోసం వచ్చిన దరఖాస్తులూ కాలం చెల్లిందంటూ తిరస్కరణ ఒకే రకమైన వైద్యసేవలకు రకరకాల మొత్తాల మంజూరు మంజూరీలో జాప్యంతో మరో నష్టం శ్రీకాకుళం:చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకే రిమ్స్ మెడికల్ రీయింబర్స్మెంట్ విభాగంలోని కొందరు సిబ్బంది దరఖాస్తులను మాయం చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే సవరణల పేరుతో తిప్పి పంపిన దరఖాస్తులు తిరిగి అందితే కాలతీతమైందంటూ తిరస్కరిస్తున్నారు. వీరి చర్యలతో ఎందరో ఉద్యోగులు బాధితులుగా మారి రీయింబర్స్‌మెంట్‌కు నోచుకోవడం లేదు. వంగర మండలంలో పనిచేస్తున్న కోటేశ్వరరావు అనే ఉపాధ్యాయుడు 2012లో వజ్రపుకొత్తూరులో పనిచేస్తున్నప్పుడు 36 వేల రూపాయల రీయింబర్స్‌మెంటుకు దరఖాస్తు చేసుకున్నారు. ఆరు నెలల తరువాత కొన్ని చోట్ల సంతకాలు లేవంటూ రిమ్స్ అధికారులు ఈ దరఖాస్తును తిప్పి పంపారు. సదరు ఉపాధ్యాయుడు వాటిని సరిచేసి 2013లో మళ్లీ దరఖాస్తు పంపారు. మూడు నెలలపాటు అధికారులు దాన్ని తొక్కిపెట్టి ఆ తర్వాత తిరస్కరించారు. దీనికి వీరు చెప్పిన కారణం.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన మూడు నెలల్లోగా దరఖాస్తు చేయకపోవడమేనట! నిబంధనల ప్రకారం ఇది వాస్తవమే అయినా తొలిసారి దరఖాస్తు చేసుకున్న తేదీని పరిగణనలోకి తీసుకోవాలి. ఆ తర్వాత సవరణల కోసం ఎన్నిసార్లు వెనక్కి పంపించినా దాన్ని పరిగణనలోకి తీసుకోకూడదు. రిమ్స్ అధికారులు గతంలో దరఖాస్తును స్వీకరించి సవరణ కోసం వెనక్కి పంపిన విషయాన్ని గుర్తించక తిరస్కరించారు. ఇదే విషయాన్ని సంబంధిత శాఖాధికారులు, దరఖాస్తుదారులు లేఖ ద్వారా తెలపడంతో నాలిక కరుచుకున్న రిమ్స్ అధికారులు ఏకంగా ఆ దరఖాస్తునే కనబడకుండా చేశారు. ఇదేమిటని అడిగితే దరఖాస్తుల కట్టలు ముందు పడేసి వెతుక్కోమంటున్నారని సంబంధిత ఉపాధ్యాయుడు వాపోయాడు. ఈ దరఖాస్తు రిమ్స్ అధికారులకు అందలేదనడానికి కూడా వీల్లేదు. సవరణ కోసం వెనక్కి పంపినప్పుడు ఆ విభాగం వారు ఓ సీరియల్ నెంబరు కూడా కేటాయించారు. ఈ విషయం చెబుతున్నా పట్టించుకున్న వారే కరువయ్యారు. ఇదిలా ఉంటే ఒకే రకమైన చికిత్సలకు వేర్వేరు మంజూరీలు సాధారణమయ్యాయి. టెక్కలి పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయినికి ప్రసూతి కోసం * 12,566 మంజూరు చేయగా, జలుమూరు మండలంలో పనిచేస్తున్న మరో ఉపాద్యాయినికి 13,600 రూపాయలు మంజూరు చేశారు. అలాగే హిస్టరేక్టమీ అనే శస్త్రచికిత్సకు * 18,500 వరకు మంజూరు చేసే అవకాశం ఉండగా బూర్జ మండలానికి చెందిన ఓ ఉపాధ్యాయినికి * 26వేలు, తోటవాడకు చెందిన ఓ ఉపాధ్యాయినికి 13వేలు, ఎచ్చెర్ల మండలానికి చెందిన ఉపాధ్యాయినికి 17,500 రూపాయలు, హిరమండలం మండలానికి చెందిన ఓ ఉపాధ్యాయినికి ఏకంగా రూ.21వేలు మంజూరు చేశారు. దరఖాస్తు చేసుకున్న మొత్తంలో పది శాతానికి మించి కోత ఉండకూడదని నిబంధన ఉంది. ప్రభుత్వం నిర్దేశించిన రేటు కంటే ఎక్కువ మొత్తాలను నమోదు చేస్తే ప్రభుత్వ రేటు ప్రకారం కోత విధించాల్సి ఉంటుంది. మందులు, వైద్యుని ఫీజులతో పాటు మత్తుమందుకు సంబంధించి రేట్లలో కోత విధించకూడదు. అయితే బూర్జలో పనిచేస్తున్న కుమారి అనే ఉపాధ్యాయిని గర్భసంచిలో ఉన్న శిష్టులను తొలగించుకునేందుకు శస్త్రచికిత్సలు జరిపించుకున్నారు. ఇందుకుగానూ 49,155 రూపాయలు మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకోగా, రిమ్స్ అధికారులు రూ.19,120 మాత్రమే మంజూరు చేశారు. ఇంతపెద్ద మొత్తం కోత విధించకూడదని నిబంధన ఉంది. ఇలా కోత విధిస్తే ముందుగా దరఖాస్తుదారునికి తెలపాల్సి ఉన్నా ఈమె విషయంలో అలా జరగలేదు. ఓసారి ఎంతో కొంత మొత్తం మంజూరు చేసేస్తే సంబంధిత ఉపాధ్యాయినికి మరోసారి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండదు. ఓ విశ్రాంత ఉపాధ్యాయుడు 2012లో రూ. 10 వేలకు, 2013లో రెండు దఫాలు * 20వేలకు మంజూరు కోరుతూ దరఖాస్తు చేసుకోగా, ఈ దరఖాస్తులు కనిపించకుండా పోయాయి. ఇదేమని అడిగితే పలికే నాధుడే అక్కడ లేకుండా పోయాడు. మంజూరులోనూ జాప్యం ఇదిలా ఉంటే బిల్లుల మంజూరులో తీవ్ర జాప్యం జరుగుతుండడం వలన కొంత మొత్తాన్ని కోల్పోవాల్సి వస్తుందేమోనని దరఖాస్తుదారులు ఆవేదన చెందుతున్నారు. రాష్ట్ర విభజన తరువాత ఇటువంటి పరిస్థితి ఏర్పడింది. 2014 జూన్ 2వ తేదీకి ముందు అందినదరఖాస్తులను ఈ ఏడాది మార్చి 30లోగా మంజూరు చేస్తే సమస్య ఉండేది కాదు. అలా జరగకపోవడం వల్ల మంజూరైన మొత్తాన్ని 42, 58 శాతాలకు విడగొట్టాల్సి ఉంటుంది. 42 శాతం తెలంగాణ రాష్ట్ర వాటాగా, 58 శాతం ఆంధ్ర రాష్ట్ర వాటాగా మంజూరు చేయాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ వాటా ఇచ్చేందుకు నిరాకరిస్తే ఉద్యోగులు ఆ మొత్తాన్ని నష్టపోయినట్లే. అయితే ఇటువంటి అవకాశాలు చాలా తక్కువని ఖజానాశాఖాధికారులు చెబుతున్నా దరఖాస్తుదారులు మాత్రం ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే పాత దరఖాస్తులను ఖజానా శాఖాధికారులు అనుమతించక పోవడమే ఇందుకు కారణం. ప్రభుత్వం గడువు పెంచక పోవడం వల్ల ఇలా జరిగిందని త్వరలోనే ఉత్తర్వులు రావచ్చని ఖాజనాశాఖాధికారులు అంటున్నారు. తాము చేసిన పొరపాట్లు బయట పడతాయని భావించే ఇటీవల జిల్లా కలెక్టర్ కొంత మంది కలెక్టరేట్ సిబ్బందికి చెందిన దరఖాస్తులను త్వరితగతిన మంజూరు చేయాలని పంపించగా కల్లబొల్లి మాటలు చెప్పి వాటిని వెనక్కి పంపించారన్న వాదన రిమ్స్ సిబ్బంది నుంచే విన్పిస్తోంది. -
ఏసీబీకి చిక్కిన కోటేశ్వరుడు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :గ్రంథాలయాల్లో కూడా లంచాలుంటాయా..చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకున్నవారి నుంచి కూడా ఆమ్యామ్యాలు అడుగుతారా..పీఎఫ్ బకాయి ఇవ్వాలంటే రూ.36 వేలు లంచం ఇవ్వాల్సిందేనా? ఇవీ గురువారం పలువురికి తలెత్తిన ప్రశ్నలు. ఔట్‌సోర్సింట్ ఉద్యోగులకు 40 నెలల బకాయి విడుదల చేయాలంటే తనకు లంచం ఇవ్వాల్సిందేనని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి జలగడుగుల కోటేశ్వరరావు 12 మంది చిరుద్యోగుల నుంచి లంచం డిమాండ్ చేశారు. కోపంతో ఉన్న చిరుద్యోగులు లంచం ఇవ్వకుండా ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో ఏసీబీ అధికారులు వలపన్ని కోటేశ్వరరావును గురువారం పట్టుకున్నారు. కోటేశ్వరరావు పరిధిలో జిల్లాలోని 44 శాఖా గ్రంథాలయాలు పనిచేస్తున్నాయి. 42 మంది శాశ్వత ఉద్యోగులు, 14 మంది ఇతర విభాగాల ఉద్యోగులున్నారు. అటెండర్, లైబ్రేరియన్లు, రికార్డ్ అసిస్టెంట్లు హర్షా అనే ఏజెన్సీ ద్వారా ఔట్సోర్సింగ్ పద్ధతిన కొంతమంది పని చేస్తున్నారు. ఒక్కో ఉద్యోగి నుంచి రూ.4 వేలు చొప్పున లంచం డిమాండ్ చేయగా తామంత ఇచ్చుకోలేమని తెగేసి చెప్పినా కోటేశ్వరరావు వినలేదు. తన సహోద్యోగులకూ డబ్బులివ్వాలని పట్టుబట్టారు. దీంతో రూ.3 వేలు చొప్పున 12 మంది రూ.36 వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. తొలివిడతగా రూ.18 వేలు ముట్టజెప్పాలని, పని పూర్తిచేస్తే మిగతా సొమ్ము ఇవ్వాలని కూడా డిమాండ్ చేయడంతో ఉద్యోగులు విసిగిపోయారు. ఏడాదిన్నర క్రితం జి.సిగడాంలో గ్రంథపాలకుడిగా చేరిన సీహెచ్ వెంకటేశ్ ఏసీబీని ఆశ్రయించడంతో కోటేశ్వరరావు పాపం పడింది. ఇదీ జరిగింది.. ఏజెన్సీ ద్వారా నియామకమైన ఉద్యోగులకు తొలుత పీఎఫ్ ఖాతాలు లేవు. దీంతో 40 నెలల సొమ్ము సిబ్బందికి రావాల్సి ఉంది. ఒక్కో ఉద్యోగికి సుమారు రూ.50 వేలు పైనే పెండింగ్‌లో ఉంది. ఈ సొమ్ము రిలీజ్ చేయాలంటే లంచం ఇవ్వాలని కోటేశ్వరరావు డిమాండ్ చేసినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. వాస్తవానికి బకాయి సొమ్ము చెక్కు ఇటీవల కార్యదర్శి వద్దకు వచ్చింది. దానిని ఏజెన్సీ నిర్వహకులకు ఇచ్చేయడం కూడా జరిగిపోయింది. అయినా లంచం డిమాండ్ చేయడం గమనార్హం. లంచం ఇవ్వకపోతే ఉద్యోగం నుంచి తీసేస్తామని కోటే శ్వర రావు హెచ్చరించినట్టు అధికారులు తెలిపారు. నాలుగు రోజులుగా ఇదే విషయం కార్యదర్శికి ఉద్యోగుల మధ్య వాగ్వాదం జరుగుతున్నట్టు తెలిసింది. చిరుద్యోగులమైన తమనూ లంచం డిమాండ్ చేస్తుండడంపై 12 మంది ఉద్యోగులు కోపోద్రిక్తులైపోయి ఏసీబీని ఆశ్రయించారు. ఫిర్యాదు మేరకు ఏసీబీ డీఎస్పీ రంగరాజు ఆధ్వర్యంలో సీఐ లక్ష్మోజీ, సిబ్బంది గురువారం రాత్రి రెడ్‌హ్యాండెడ్‌గా కోటేశ్వరరావును పట్టుకున్నారు. సొమ్ము తీసుకుని జేబులో పెట్టుకుంటుండగా ఏసీబీ అధికారులు మాటువేసి దాడి చేసి పట్టుకున్నారు. ఏడు నెలల క్రితమే కోటేశ్వరరావు ఇక్కడ విధుల్లో చేరారు. గతంలోనూ ఆరోపణలే! విశాఖ జిల్లాకు చెందిన కోటేశ్వరరావుపై గతంలోనూ ఎన్నో ఆరోపణలున్నాయి. కడపలో ఉద్యోగం చేస్తున్నప్పుడు అక్కడి సంయుక్త కలెక్టర్ సంతకం ఫోర్జరీ చేశారనే ఆరోపణలున్నట్టు తెలిసింది. గుంటూరు రీజినల్ లైబ్రరీలో పని చేస్తున్నప్పుడు ఆయనపై నిర్భయ కేసు కూడా నమోదైనట్టు అధికారులు తెలిపారు. అదే కేసులో సస్పెండ్ అయ్యి కొన్నాళ్ల తరువాత తిరిగి పోస్టింగ్ తెప్పించుకుని ఇక్కడకు వచ్చారని చెబుతున్నారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు పడే సమయంలోనూ ఆయన లంచం డిమాండ్ చేసేవారని సహోద్యోగులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో రాజాంలో పనిచేశా. ఏడాదిన్నర క్రితం జి.సిగడాంలో విధుల్లో చేరా. సుమారు రూ.63 వేలు పీఎఫ్ బకాయి ఉంది. అటెండర్లకు సుమారు రూ.50 వేల వరకు బకాయి ఉంది. పెండింగ్ సొమ్ము ఖాతాల్లో జమ చేయమన్నాం. ఆయన అడిగినంత ఇచ్చుకోలేమని కూడా చెప్పాం. చివరకు ఆరుగురు ఉద్యోగులు రూ.3 వేల చొప్పున వసూలు చేసి రూ.18 వేలు కోటేశ్వరరావు చేతిలో పెట్టాల్సి వచ్చింది. ఇది చాలా ఘోరం. అందుకే ఏసీబీని సంప్రదించాం. - సీహెచ్. వెంకటేశ్, గ్రంథపాలకుడు, జి.సిగడాం -
అన్ని రకాల సినిమాలూ తీయాలని ఉంది!
‘‘దెయ్యం పట్టిన ఓ స్త్రీ... తన భర్త చేతుల్లోనే హత్యకు గురవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమా తీశాను. తక్కువ బడ్జెట్లో సినిమా తీయొచ్చనే కారణం చేతనే... హారర్ నేపథ్యాన్ని ఎంచుకున్నాను. అన్ని రకాల సినిమాలు తీయాలనేది నా లక్ష్యం’’ అని యువ దర్శకుడు రాహుల్ సంక్రిత్యన్ అన్నారు. ఆయనను దర్శకునిగా పరిచయం చేస్తూ కోటేశ్వరరావు మోరుసు నిర్మించిన చిత్రం ‘ది ఎండ్’. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోందని దర్శకుడు ఆనందం వెలిబుచ్చారు ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ -‘‘మాది మధ్య తరగతి కుటుంబం. స్కాలర్షిప్పులతో చదువుకున్నాను. చిన్నప్పట్నుంచీ కెమెరా అంటే ఇష్టం. ఆ ఇష్టమే నన్ను సినిమాల వైపు నడిచించింది. నాలుగు లఘు చిత్రాలు తీశాను. అందులో మూడు హారర్ చిత్రాలు. ఒకటి ప్రేమకథ. ఇటీవల మా టీవీ వారు నిర్వహించిన లఘు చిత్రాల కాంటెస్ట్‌లో నా లఘు చిత్రానికి ప్రథమ స్థానం లభించింది. ఆ వెంటనే అవకాశాలు కూడా తలుపు తట్టాయి. కొందరు నిర్మాతలు నన్ను కలిశారు కూడా. కానీ... ముందు ‘ది ఎండ్’ చేశాను. త్వరలో ఓ ప్రేమకథ చేయబోతున్నా’’ అని చెప్పారు. -
సింహాచలమూ..తక్కువేం కాదు
మన్యంలో సంచలనమైన చింతపల్లి సబ్ ట్రెజరీ కుంభకోణం కీలక మలుపులు తిరుగుతోంది. కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. నిన్నటి వరకు ట్రెజరీ అకౌంటెంట్ పేరు మాత్రమే ప్రధానంగా వినిపించేంది. తాజాగా వైద్య ఆరోగ్యశాఖలోని చిరుద్యోగి అక్రమాలు అధికారులకు దిమ్మ తిరిగేలా చేస్తున్నాయి. ఆ శాఖలో యూడీసీగా పనిచేస్తున్న సింహాచలం 15 నెలల్లో ఏకంగా రూ.1.4 కోట్లు కొల్లగొట్టిన విషయం వెలుగు చూసింది. చింతపల్లి: చింతపల్లి సబ్ ట్రెజరీ కార్యాలయంలో అక్రమాలపై వెద్య,ఆరోగ్యశాఖ చీఫ్ అకౌంటెంట్(హైదరాబాద్) ఐ.కోటేశ్వరరావు ఆధ్వర్యంలో గురువారం విచారణ ప్రారంభమైంది. పలు పీహెచ్‌సీల సిబ్బంది జీతభత్యాలకు సంబంధించిన వివరాలతోపాటు ట్రెజరీ ద్వారా డ్రా చేసిన నగదుకు సం బంధించిన వివరాలు, కాంట్రాక్టు ఉద్యోగుల పేరిట పంపిణీ చేసిన డీడీలు వంటి అంశాలపై లోతుగా విచారణ జరిపారు. అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. చింతపల్లి, జీకేవీధి, కొయ్యూ రు మండలాల్లోని తాజంగి, కోరుకొండ, సప్పర్ల, పెదవలస, జర్రెల, దారకొండ, రాజేంద్రపాలెం పీహెచ్సీలలో 43 మంది కాంట్రాక్టు ఉద్యోగులు పని చేస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వీరి వేతనానికి సరిపడే బడ్జెట్ కాకుండా రెట్టింపు రాబట్టుకుని రూ.కోట్లలో అక్రమాలకు పాల్పడిన విషయం తెలిసిందే. 2013-14 సంవత్సరానికి రూ.2.87 కోట్లు ట్రెజరీ అధికారులతో కుమ్మక్కయి వైద్యశాఖ ఉద్యోగులు కాజేసీన విషయం విదితమే. ఇందుకు సహకరించిన అకౌంటెంట్ అప్పలరాజు ఖాతాలోకి రూ.17 లక్షలు నేరుగా జమ కావడంతో ఇప్పటి వరకు ఇతడే ప్రధాన నిందితునిగా ప్రచారం జరిగింది. ప్రస్తుతం విశాఖపట్నం ఆర్సీడీ ప్రభుత్వ ఆస్పత్రిలో యూడీసీగా పని చేస్తున్న సింహాచలం 2012-13లో కోరుకొండ, దారకొండ, పెదవలస పీహెచ్‌సీల్లో యూడీసీగా డిప్యుటేషన్‌పై బాధ్యతలు చేపట్టారు. ఆయా ఆస్పత్రులలో పనిచేస్తున్న గుమాస్తాలకు సరైన కంప్యూటర్ పరిజ్ఞానం లేకపోవడంతో బిల్లుల వ్యవహారాలన్నీ ఇతనికే అప్పగించారు. ఇదే ఆదునుగా భావించిన సింహాచలం కొందరు వైద్యశాఖ అధికారులతో కుమ్మక్కయి భారీ ఎత్తున నిధులు తన ఖాతాలోకి జమ చేసుకున్నట్లు తెలిసింది. 2012 మే నుంచి 2013 మార్చి వరకు యూనియన్ బ్యాంకు చింతపల్లి బ్రాంచిలోని అకౌంట్ నంబర్లో రూ.1.4 కోట్లు జమ చేసుకున్నారు. అనంతరం అతనికి విశాఖ ఆర్సీడీ ఆస్పత్రికి బదిలీ అయింది. ఆరోగ్యశాఖలో బోగస్ కాంట్రాక్టు ఉద్యోగుల జాబితా వెలుగు చూసిన వెంటనే సింహాచలం కుంభకోణం బయటపడింది. కిందిస్థాయి ఉద్యోగిగా పనిచేస్తున్న సింహాచలమే ఇంత భారీ అవినీతికి పాల్పడితే బడ్జెట్ కేటాయింపులకు ప్రధాన సూత్రధారులైన ఆ శాఖ ఉన్నతాధికారులు ఇంకెన్ని కోట్లు కొల్లగొట్టారో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోట్లు కొల్లగొట్టిన సింహాచలం విశాఖపట్నం, రింతాడ ప్రాంతాల్లో విలువైన భవంతులు నిర్మించుకున్నాడని, మైదాన ప్రాంతాల్లో విలాస వంతమైన జీవితాన్ని గడుపుతున్నాడని ఈ ప్రాంత ఉద్యోగులు చెప్పుకుంటున్నారు. ఆస్పత్రుల రికార్డులు పరిశీలన స్థానిక కమ్యూనిటీ ఆస్పత్రిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అన్ని పీహెచ్‌సీల రికార్డులను తనిఖీ బృందంప్రాథమికంగా పరిశీలించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న పీహెచ్సీలలో గతంలో పని చేసిన వైద్యాధికారులు, యూడీసీలు, గుమస్తాల వంటి వారి వివరాలను కూడా సేకరించారు. 2013-14కు సంబంధించి బ్యాంకుల ద్వారా డ్రా చేసిన అన్ని రకాల నగదు వివరాలను విచారణ బృందం పరిశీలించింది. శుక్రవారం కూడా కార్యాలయంలో విచారణ జరపనున్నామని వారు తెలిపారు. పూర్తి స్థాయి విచారణ అనంతరం నివేదికలను జిల్లా కలెక్టర్‌కు అందజేయనున్నారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ జూనియర్ అకౌంట్ అధికారులు ప్రవీణ్‌కుమార్, చింతపల్లి క్లస్టర్ అధికారి శర్మ ,తదితరులు ఉన్నారు. -
ఆర్టీసీలో మరో ఇంటిదొంగ
రాణిగంజ్ డిపోలో రూ.10 లక్షలు స్వాహా కాంట్రాక్ట్ ఉద్యోగి ఘనకార్యం సాక్షి,సిటీబ్యూరో: ఆర్టీసీలో మరో ఇంటిదొంగ గుట్టు రట్టయింది. ఉద్యోగుల జీతాల సొమ్ములోంచి ఏకంగా రూ.10 లక్షలు స్వాహా చేశారు. రాణిగంజ్-1 డిపోలో జరిగిన ఈ ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. ఆఫీస్క్లర్క్గా పనిచేస్తున్న ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగి శివాజీ సంస్థ ఉద్యోగులకు చెల్లించాల్సిన జీతం డబ్బును నొక్కేశాడు. గతంలో మిధానీ డిపోలో జరిగిన ఘటన మరువక ముందే మరో ఘటన వెలుగులోకి రావడంతో ఆర్టీసీ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. నగరంలోని అన్ని డిపోల్లోని అకౌంట్లను తనిఖీలు చేయాలని గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటీవ్ డెరైక్టర్ ఎ. కోటేశ్వరరావు ఆదేశించారు. గతంలో ఆర్టీసీలో అక్రమాలకు పాల్పడిన ఇద్దరు ఉద్యోగులూ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులే కావడం గమనార్హం. ఆర్టీసీలో పదవీ విరమణ పొందిన కొందరిని కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ కేటగిరీల్లో వినియోగించుకుంటున్నారు. అలా విధులు నిర్వహిస్తున్న వారే ఇలా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని అధికారులు అభిప్రాయపడుతున్నారు. గతనెలలో మిధాని డిపోకు చెందిన రిటైర్డ్ ఉద్యోగి.. వాణిజ్య కార్యక్రమాల ద్వారా ఆర్టీసీకి లభించిన రూ.40 లక్షలను స్వాహా చేశాడు. స్టాళ్ల ద్వారా వచ్చిన ఆదాయానికి తప్పుడు లెక్కలు చూపించి అతను సొమ్ము కాజేశాడు. ఈ ఘటనపై డిపో అధికారులు వెంటనే సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. తాజాగా, రాణిగంజ్-1 డిపో లో పని చేస్తున్న రిటైర్డ్ ఉద్యోగి శివాజీ కూడా ఉద్యోగుల జీతాల కోసం విడుదల చేసిన చెక్కుల్లో అంకెలను మార్చేసి ఎక్కువ డబ్బు డ్రా చేసినట్టు డిపో మేనేజర్ గుర్తించారు. ఇతను విడతల వారీగా మొత్తం రూ.10 లక్షల వరకు స్వాహా చేసినట్టు అధికారులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అన్ని డిపోల్లోనూ క్షుణ్ణంగా తనిఖీలు... వరుసగా జరుగుతున్న సంఘటనలను దృష్టిలో ఉంచుకొని అన్ని డిపోల్లోనూ ఆదాయ,వ్యయాలపై కచ్చితమైన లెక్కలను సమర్పించాల్సిందిగా డిపో మేనేజర్లను ఆదేశించినట్లు ఈడీ చెప్పారు. ఆర్టీసీ సొమ్ము కాజేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని, వారి నుంచి మొత్తం డబ్బు వసులు చేస్తామని ఆయన చెప్పారు.