
‘‘మంచి చిత్రం ఎంచుకున్నామంటూ చాలా మంది అంటారు. కానీ, సినిమా అంటే ప్యాషన్ ఉన్నవాళ్లనే ఆ సినిమా ఎంపిక చేసుకుంటుంది.. అంతేకానీ, సినిమాను మనం సెలెక్ట్ చేసుకోం’’ అని డైరెక్టర్ హరీష్ శంకర్ అన్నారు. ప్రణవ చంద్ర, మాళవిక సతీషన్ జంటగా శివ నాగేశ్వరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దోచేవారెవరురా’. బొడ్డు కోటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమా మార్చి 11న విడుదల కానుంది.
ఈ చిత్రం ట్రైలర్‌ని హరీష్ శంకర్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ఎన్నో మంచి సినిమాలు తీసిన శివ నాగేశ్వరావుగారు ఇప్పుడు ‘దోచేవారెవరురా’ వంటి మంచి కథతో వస్తున్నారు. ట్రైలర్, పాటలు బాగున్నాయి.. ఈ సినిమా పెద్ద హిట్ కావాలి’’ అన్నారు. ‘‘కథ మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతుంది. కుటుంబమంతా చూడదగ్గ సినిమా ఇది’’ అన్నారు శివ నాగేశ్వరరావు. ‘‘దోచేవారెవరురా’లో మంచి వినోదం ఉంటుంది’’ అన్నారు బొడ్డు కోటేశ్వర రావు.
Comments
Please login to add a commentAdd a comment