లంబసింగి ట్రైలర్‌.. కట్టిపడేసిన దివి! | Director Harish Shankar Launched Divi Vadthya Lambasingi Movie Trailer | Sakshi
Sakshi News home page

Lambasingi Movie Trailer: లంబసింగి ట్రైలర్‌.. కట్టేపడేసిన దివి!

Mar 11 2024 4:51 PM | Updated on Mar 11 2024 5:13 PM

Director Harish Shankar Launched Divi Vadthya Lambasingi Movie Trailer - Sakshi

వేసవిలో సిమ్లా, ఊటీ, కశ్మీర్ వంటి హిల్ స్టేష‌న్స్‌కు టూర్ వేయాలని చాలా మంది అనుకుంటారు! ఎందుకంటే… అక్కడ చల్లగా ఉంటుంది కాబట్టి! ఆంధ్రాలోనూ అటువంటి హిల్ స్టేషన్ ఒకటి ఉంది. ఆంధ్రా కశ్మీర్‌గా పాపులర్ అయ్యింది. అదే ‘లంబసింగి’. ఇప్పుడు ఆ ఊరిలో జరిగిన ఒక ప్రేమ కథ సినిమాగా రూపొందుతోంది. ‘లంబసింగి’ చిత్రంతో ప్రముఖ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టారు.

నవీన్ గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఆయన సమర్పకులు. భరత్‌ రాజ్‌ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ ‘బిగ్ బాస్’ ఫేమ్ దివి కథానాయికగా కాన్సెప్ట్ ఫిల్మ్స్ పతాకంపై ఆనంద్.టి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘ఎ ప్యూర్ లవ్ స్టోరీ’ అనేది ఉపశీర్షిక. ఇటీవల విడుదలైన "నచ్చేసిందే... డోలారే... వయ్యారి గోదారి పాటలకు అద్భుతమైన స్పందన లభించింది.

లేటెస్ట్‌గా లంబసింగి ట్రైలర్‌ను దర్శకుడు హరీష్ శంకర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'కళ్యాణ్ కృష్ణ సినిమా చేస్తున్నాడు అంటే నా సొంత సినిమాలా అనిపించింది. ట్రైలర్ బాగుంది, అందమైన లొకేషన్స్‌లో సినిమాను చిత్రీకరించిన విధానం బాగుంది. దర్శకుడు నవీన్ గాంధీ ఒక అందమైన ప్రేమకథను లంబసింగి సినిమా ద్వారా చెప్పబోతున్నారు. దివికి, అలాగే భరత్ రాజ్‌కు ఈ మూవీ మంచి పేరు తెచ్చి పెట్టాలని కోరుకుంటున్నాను. మార్చి 15న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న లంబసింగి సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా' అన్నారు.

చదవండి: అయోధ్య బాలరామున్ని దర్శించుకున్న ఉపాసన!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement