ఎస్పీతో పొత్తుకు స్వస్తి పలికామని బీఎస్పీ చీఫ్ మాయావతి ప్రకటించారు. ఇక ఎలాంటి ఎన్నికల్లో అయినా తమ పార్టీ సొంతగానే పోటీచేస్తుందని ఆమె పేర్కొన్నారు. గతంలో అఖిలేష్ నేతృత్వంలోని ఎస్పీ ప్రభుత్వం దళితులు, యాదవేతరుల అభివృద్ధికి ఎలాంటి కృషి చేయలేదని అదే సార్వత్రిక ఎన్నికల్లో తమ వైఫల్యానికి కారణమైందని మాయావతి ఎస్పీపై ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే.