ఇండియా కూటమి..యూపీలో పొత్తుకు బ్రేక్‌ ? | Dead Lock In Up Seat Sharing Between Congress Sp | Sakshi
Sakshi News home page

ఇండియా కూటమి..యూపీలో పొత్తుకు బ్రేక్‌ ?

Published Tue, Feb 20 2024 1:32 PM | Last Updated on Tue, Feb 20 2024 2:53 PM

Dead Lock In Up Seat Sharing Between Congress Sp - Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఇండియా కూటమికి బీటలు వారే అవకాశాలు కనిపిస్తున్నాయి. 80 లోక్‌సభ స్థానాలున్న యూపీలో పొత్తులో భాగంగా కాంగ్రెస్‌కు ఇచ్చే స్థానాలపై సమాజ్‌వాద్‌ పార్టీ కొంత కఠినంగానే ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా రెండు పార్టీల నేతల మధ్య జరిగిన సీట్‌ షేరింగ్‌ చర్చల్లో మొరాదాబాద్‌ డివిజన్‌లోని మూడు సీట్లపై ప్రతిష్టంభన నెలకొన్నట్లు సమాచారం.

ఈ మూడు సీట్లను కాంగ్రెస్‌కు ఇచ్చేది లేదని ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ హస్తం పార్టీ నేతలకు తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఇరు పార్టీల మధ్య పొత్తు ఉంటుందా లేదా అనేదానిపై స్పష్టత లేదు. కాగా, సీట్ల పంపిణీ విషయంలో రెండు పార్టీల మధ్య ఒప్పందం జరిగే వరకు రాహుల్‌గాంధీ నిర్వహిస్తున్న భారత్‌​ జోడో న్యాయ యాత్రలో పాల్గొనేది లేదని అఖిలేశ్‌ స్పష్టం చేశారు. ప్రస్తుతం రాహుల్‌ గాంధీ యాత్ర యూపీలోనే కొనసాగతున్న విషయం తెలిసిందే. మరోవైపు పొత్తులో భాగంగా రాష్ట్రంలో మొత్తంగా 17 సీట్లను కాంగ్రెస్‌కు ఇచ్చేందుకు అఖిలేశ్‌ అంగీకరించినట్లు ప్రచారం జరుగుతోంది.

ఇదీ చదవండి.. కేంద్రం ఆఫర్‌ తిరస్కరణ.. చర్చలు విఫలం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement