ఉత్తరప్రదేశ్‌లో పది రాజ్యసభ స్థానాలకు ఎన్నికలకు ముందు రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. సమాజ్ వాది(ఎస్పీ) పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఏర్పాటు చేసిన సమావేశానికి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు హాజరుకాలేదు.
వీరిలో ఎస్పీని వీడి బీజేపీలో చేరిన ఎమ్మెల్యేలు రాకేశ్ పాండే, అభయ్ సింగ్, రాకేష్ ప్రతాప్ సింగ్, మనోజ్ పాండే, వినోద్ చతుర్వేది, మహారాజీ ప్రజాపతి, పూజా పాల్, పల్లవి పటేల్ ఉన్నారు. దీంతో ఎస్పీలో చీలికలు వచ్చాయనే ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే కొన్ని కారణాలతో ఈ ఎమ్మెల్యేలు సమావేశానికి రాలేకపోయారని, ఈ విషయాన్ని ముందుగానే పార్టీ అధిష్టానానికి తెలియజేశామని ఎస్పీ నేతలు చెబుతున్నారు. ఈ ఎమ్మెల్యేలంతా నేడు (మంగళవారం) జరిగే రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేయనున్నారు.
మరోవైపు బీజేపీ దాని మిత్రపక్షాల ఎమ్మెల్యేలకు లోక్ భవన్ ఆడిటోరియంలో శిక్షణ సమావేశాన్ని నిర్వహించింది. సాయంత్రం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో పార్టీ ఎన్నికల వ్యూహాన్ని ఖరారు చేశారు. బీజేపీ ఓటింగ్ శిక్షణ సమావేశానికి మిత్రపక్షాలైన అప్నా దళ్ (ఎస్), నిషాద్ పార్టీ, సుభాఎస్పీ నేతలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. సరైన ఓటింగ్ విధానాన్ని అధికారులు వారికి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment