
సాక్షి, వజ్రపుకొత్తూరు (శ్రీకాకుళం): జిల్లాలోని అండర్ గ్రౌండ్ కేడర్ కలిగిన మావోయిస్టుల కుటుంబ సభ్యులను ఎస్పీ అమిత్ బర్దార్ సోమవారం కలిసి యోగక్షేమా లు అడిగి తెలుసుకున్నారు. ఉద్దానంలోని బాతుపు రం గ్రామానికి చెందిన యూజీ కేడర్ గల మావోయిస్టులైన మెట్టూరు జోగారావు, చెల్లూరి నారాయణరావుల కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. అవ్వా.. బాగున్నావా అంటూ ఆప్యాయంగా మాట్లాడుతూ వారి జీవనోపాధి సాగుతున్న తీరు, కుటుంబ నేపథ్యం, పిల్లల చదువు, ఆరోగ్య పరిస్థితి ని అడిగి తెలుసుకున్నారు. మీకు మీ కుటుంబ స భ్యులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా, అవసరమైన వైద్య చికిత్సలు అందించడానికి ప్రభుత్వం సి ద్ధంగా ఉందన్నారు.
మావోయిస్టుల తల్లులు మెట్టూ రు చిన్న పల్లెమ్మ, చెల్లూరి నీలమ్మలకు దుప్పట్లు, చీర, మెడికల్ కిట్‌తో పాటు పండ్లు, నిత్యావసర స రుకులను అందజేశారు. పోలీసులు ప్రజలతో స్నే హంగా ఉండాలని సూచించారు. పర్యటనలో ఆయ న వెంట కాశీబుగ్గ రూరల్ సీఐ డి.రాము, స్థానిక ఎస్‌ఐ కూన గోవిందరావు తదితరులు ఉన్నారు.
జనజీవన స్రవంతిలో కలవండిఅడవి బాటను వీడి మావోయిస్టులు జన జీవన స్ర వంతిలో కలవాలని ఎస్పీ పిలుపు నిచ్చారు. అజ్ఞాత జీవనం గడుపుతున్న మావోయిస్టులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ప్రస్తుతం కరోనా వచ్చి అడవిలో ఉంటున్న వారు జనజీవన స్రవంతిలో కలిస్తే మెరుగైన వైద్యం అందిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment