సాక్షి, శ్రీకాకుళం: జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అడాల వెంకటరత్నంను సరెండర్ చేస్తూ ఎన్నికల కమిషన్ మంగళవారం రాత్రి ఆదేశాలు జారీ చేసింది. ఆయన కమిషనరేట్‌లో రిపోర్టు చేయాలని కూడా ఈసీ ఆదేశించింది. ఆయన సరెండర్‌కు కారణాలు తెలియకపోయినప్పటికీ.. ఎన్నికల విధులు సక్రమంగా నిర్వర్తించకపోయినా, ఒక వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నా ఎన్ని కల సంఘం వేటు వేసే అవకాశం ఉం టుంది. కొద్దికాలం జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన ఎం.రామారావును సరైన సమాచారా న్ని ఇవ్వని కారణంగా ఎన్నికల సంఘం కొద్ది కాలం క్రితం బదిలీ చేసిన విషయం తెలిసిందే.
వీరిద్దరూ డైరెక్టు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కారు. కన్ఫర్మ్‌డ్ ఐఏఎస్, ఐపీఎస్‌లను టీడీపీ ప్రభుత్వం ఇక్కడ నియమించిన విషయం గమన్హారం. ఎస్పీ వెంకటరత్నం హోం మంత్రి చినరాజప్ప వద్ద ఓఎస్‌డీగా పనిచేస్తూ శ్రీకాకుళం ఎస్పీగా వచ్చారు. ఇటీవల జిల్లాలో వేలాది మందిపై పోలీసులు బైండోవర్ కేసులు నమోదు చేశారు. వీరిలో అనేక మంది కొన్నేళ్లుగా ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. టీడీపీ నేతలు సూచించిన వారిపై బైండోవర్ కేసులు నమోదు చేయడంతో పోలీస్‌శాఖపై దుమారం చెలరేగింది. అలాగే మరికొన్ని విషయాల్లో కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. జిల్లాకు వచ్చిన ఎన్నికల పరిశీలకుల నుంచి సమాచారాన్ని సేకరించిన ఈసీ ఎస్పీ వెంకరత్నంను సరెండర్ చేసినట్టు సమాచారం. ఆయన స్ధానంలో ఇప్పటివరకూ ఎవరినీ నియమించలేదు. బుధవారం ప్రభుత్వం సూచించే ఐదుగురిలో ఒకరిని ఎస్పీగా ఎంపిక చేసే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment