
భోపాల్ : విధుల్లో ఉండగా నిద్రపోయినందుకు గాను ముగ్గురు పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు. వివరాలు.. విధి నిర్వహణలో అధికారులు ఎంత అలర్ట్‌గా ఉన్నారో పరీక్షించాలనుకున్నారు ఇండోర్ ఎస్పీ మహ్మద్ యూసఫ్ ఖురేషి. అందులో భాగంగా ఇండోర్‌లోని పలు పోలీస్ స్టేషన్లలో సోమవారం రాత్రి తనిఖీలు నిర్వహించారు. చాలా చోట్ల అధికారులు నిద్ర పోతున్నట్లు తెలిసిందన్నారు. వీరిని సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. ఓ కానిస్టేబుల్, హెడ్‌కానిస్టేబుల్‌తో పాటు ఏఎస్సైని కూడా సస్పెండ్ చేసినట్లు ఖురేషి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment