హైకోర్టు జడ్జికే దమ్కీ.. పోలీస్ అధికారులపై వేటు | 3 UP Cops Suspended Allegedly Ask Judge On Phone | Sakshi
Sakshi News home page

హైకోర్టు జడ్జికే దమ్కీ.. పోలీస్ అధికారులపై వేటు

Published Fri, Oct 28 2022 9:13 PM | Last Updated on Fri, Oct 28 2022 10:05 PM

3 UP Cops Suspended Allegedly Ask Judge On Phone  - Sakshi

లక్నో: పోలీసు సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, ఇద్దరు కానిస్టేబుల్స్‌ నేరుగా హైకోర్టు జడ్జితో మీ ఇల్లు ఎక్కడా, ఎక్కడికి రావాలి అని ప్రశ్నించడంతో సస్పెండ్‌ అయ్యారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్‌ నగర్‌ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం... గత ఆదివారం అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తి ప్రకాష్‌ సింగ్‌ జిల్లాకు వచ్చినప్పుడూ ఈ ముగ్గురు పోలీసులకు ఎస్కార్ట్‌ డ్యూటీ పడింది.

దీంతో ఆ ముగ్గురు పోలీసులు న్యాయమూర్తితో ఫోన్‌లో ఇల్లు ఎక్కడ ఉంది, ఎక్కడకు రావాలి అని నేరుగా ప్రశ్నించారు. దీంతో న్యాయమూర్తి సీరియస్‌ అయ్యి పోలీస్‌ సూపరింటెండ్‌కి పిర్యాదు చేశారు. అంతే అధికారులు అదేరోజు ఆ ముగ్గురు పోలీసులను తక్షణమే సస్పెండ్‌ చేశారు. ఐతే ఈ విషయామై నేరుగా న్యాయమూర్తిని సంప్రదించకూడదని అధికారులు తెలిపారు. న్యాయమూర్తి ప్రోటోకాల్‌ని పర్యవేక్షిస్తున్నావారి వద్ద నుంచి సమాచారం తెలుసుకోవాలని  చెప్పారు. ఐతే వారు న్యాయమూర్తి ఫోన్‌ నెంబర్‌ ఎలా సంపాదించారనేది తెలియరాలేదన్నారు. 

(చదవండి: స్టాలిన్‌ ఎందుకు మౌనంగా ఉన్నారు? పరువు, గౌరవం కోసం ఎంతకైనా వెళ్తా...నటీ ఖుష్బు సీరియస్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement