సాక్షి, అనంతపురం: ప్రత్యర్థుల కుట్ర భగ్నమైంది. వైఎస్సార్‌సీపీని, ఆ పార్టీ నేత.. హిందూపురం ఎంపీ అయిన గోరంట్ల మాధవ్‌ను బద్నాం చేయాలనే ప్రయత్నం బెడిసి కొట్టింది. ఎంపీ గోరంట్ల మాధవ్ పేరిట సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఒరిజినల్ కాదని, ఫేక్ అని అనంతపురం ఎస్పీ ఫకీరప్ప ప్రకటించారు.
బుధవారం మధ్యాహ్నాం ఈ వ్యవహారంపై మీడియాతో ఎస్పీ ఫకీరప్ప మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో వచ్చిన వీడియో ఒరిజినల్ కాదని, ఫేక్ అని చెప్పారు. ఆ వీడియో మార్ఫింగ్ లేదా ఎడిటింగ్ జరిగి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం చేశారు. అంతేకాదు ఈ వీడియోను చూస్తున్న విజువల్స్‌ను.. వీడియో తీసి పోస్ట్ చేశారు అని ఆయన వెల్లడించారు. వీడియోను మార్ఫింగ్ చేసినట్లు ఎంపీ అనుచరులు ఫిర్యాదు చేశారని తెలియజేశారు. ఈ మేరకే దర్యాప్తు చేపట్టామని అన్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఐ.టీడీపీ వాట్సాప్ గ్రూపులో మొదట వచ్చింది. 4వ తేదీ అర్ధరాత్రి 2.07కు +447443703968 నెంబర్ నుంచి పోస్ట్ చేశారు. యూకేలో రిజిస్టర్ అయిన నెంబర్‌తో వీడియో అప్‌లోడ్ అయ్యింది. ఈ వీడియోకు సంబంధించి బాధితులెవరూ ఫిర్యాదు చేయలేదు. ఆ నెంబర్ ఎవరిదో కనుక్కునే పనిలో ఉన్నాం. వీడియో ఫార్వర్డ్, రీపోస్ట్ చేయడం వల్ల అది ఒరిజినల్ అని గుర్తించలేకపోతున్నామని ఎస్పీ స్పష్టం చేశారు. వైరల్ అవుతున్న వీడియో ఒరిజినల్ అని నిర్ధారించలేమని, అలాగే ఒరిజినల్ వీడియో దొరికే దాకా ఏం చెప్పలేమని ఎస్పీ తేల్చి చెప్పారు.
ఇదీ చదవండి: తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ
Comments
Please login to add a commentAdd a comment