సాక్షి, విజయవాడ: వివాదాస్పద ఎస్పీలపై ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. అభియోగాలపై నోటీసులు జారీ చేసింది. ఈసీ సస్పెండ్ చేసిన ఎస్పీలు అమిత్ బర్దర్, బిందు మాధవ్, బదిలీ అయిన ఎస్పీ కృష్ణకాంత్‌కు నోటీసులు జారీ చేసింది. పల్నాడు, అనంతపురం, తిరుపతి అల్లర్ల లో ఎస్పీల వైఫల్యం, పాత్రపై విచారణ జరగనుంది. ఎస్పీల వివరణ ఆనంతరం నేరుగా విచారించే అవకాశం ఉంది.
ఏపీలో ఎన్నికల తర్వాత చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ ఘటనలపై సిట్ చీఫ్ వినీత్ బ్రిజిలాల్ రేపు(సోమవారం) ఈసీకి నివేదిక ఇవ్వనున్నారు. కాగా, ఏపీలో ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై దర్యాప్తు కోసం 13 మంది అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
కాగా, పల్నాడుతో పాటు రాయలసీమ జిల్లాల్లో చోటు చేసుకున్న హింసపై సిట్ దర్యాప్తు జరుపుతోంది. ఇప్పటికే హింస జరిగిన ప్రాంతాల్లో సిట్ బృందం పని ప్రారంభించింది. ఈ మేరకు సిట్ చీఫ్ వినీత్ బ్రిజిలాల్ రేపు ఈసీకి నివేదిక ఇవ్వనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment