
డా. బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ: గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్ ఎస్పీగా మన తెలుగువాడు నియమితుడు కావడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మామిడికుదురు మండలం పెదపట్నంలంకకు చెందిన వాసంశెట్టి రవితేజను గాంధీనగర్ ఎస్పీగా నియమించారు. రవితేజ సోమవారం బాధ్యతలు స్వీకరిస్తాడని అతని తండ్రి వాసంశెట్టి నాగేశ్వరరావు ఆదివారం తెలిపారు.
రవితేజ తండ్రి నాగేశ్వరరావు, తల్లి మల్లికాదేవి తెలంగాణ హైకోర్టు న్యాయవాదులుగా పని చేస్తున్నారు. 2015 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన రవితేజ విధి నిర్వహణలో ఉత్తమ సేవలకు గాను గతంలో డిప్యూటీ సీఎం నవీన్ పటేల్ చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకున్నారు. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ పోలీస్ డిప్యూటీ కమిషనర్‌గా పని చేశారు. అక్కడ పని చేస్తూ ఎస్పీగా పదోన్నతి పొందారు.
Comments
Please login to add a commentAdd a comment