Dr. B. R. Ambedkar Konaseema District Latest News
-
వీసీ కుర్చీ కోసం ఖర్చీఫ్‌లు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: విశ్వవిద్యాలయాలు రాజకీయ చక్రబంధంలో అల్లాడి పోతున్నాయి. వేలాది మంది విద్యార్థుల భవిష్యత్‌కు దిశానిర్దేశం చేసే విశ్వవిద్యాలయాలకు వైస్ చాన్సలర్ల నియామకానికి సంబంధించిన పీటముడి వీడటం లేదు. పనితీరు, నైపుణ్యంతో ప్రమేయం లేకుండా రాజకీయ పలుకుబడి, ధనబలం ఉన్న వారికే ఈ పోస్టులు కట్టబెట్టే ప్రయత్నాలు ఉన్నత స్థాయిలో జరుగుతున్నాయి. రాష్ట్రంలో చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఏడు నెలలు కావస్తున్నా జేఎన్టీయూ కాకినాడ, ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయాలకు ఉప కులపతి నియామకంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో దూరదృష్టితో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జేఎన్టీయూ, రాజానగరంలో ఆదికవి నన్నయ వర్సిటీలను స్థాపించారు. ఈ రెండు ప్రాంతాల్లో రెండు వర్సిటీలకు అంకురార్పణ చేసి ఉన్నత విధ్యాభివృద్ధికి బాటలు వేశారు.రాజకీయాలు చొప్పించిన కూటమి సర్కారుప్రారంభంలో ఎనిమిది జిల్లాల పరిధిలో కాకినాడ వర్సిటీ ఏర్పాటైంది. 160 ఇంజినీరింగ్ కాలేజీల ద్వారా ఏటా సుమారు 45వేల మంది విద్యార్థుల భవిష్యత్యుకు మార్గం చూపించింది జేఎన్టీయూ కాకినాడ. ఇంతటి ప్రాధాన్యం కలిగిన ఈ వర్సిటీకి వీసీ నియామకాన్ని త్వరతిగతిన చేపట్టాలని మేధావి వర్గం సూచిస్తోంది. ఈ రెండు వర్సిటీల వీసీలను కూటమి ప్రభుత్వం గద్దెనెక్కిన రోజుల వ్యవధిలోనే అర్ధంతరంగా ఇంటికి పంపించేసింది. విశ్వవిద్యాలయాల్లో రాజకీయాలు చొప్పించడం సహేతుకం కాదనే మేధావి వర్గం అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోకుండా కేవలం గత ప్రభుత్వ హయాంలో నియమితులయ్యారనే ఏకైక కారణంతో ఇద్దరు వీసీలను తప్పించింది. వాస్తవానికి జేఎన్టీయూ కాకినాడ వర్సిటీ వీసీ పదవీ కాలం ఆరు నెలలు, నన్నయ్య వర్సిటీ వీసీ పదవీకాలం రెండేళ్లు మిగిలి ఉండగానే కూటమి ప్రభుత్వం అర్ధంతరంగా రాజీనామా చేయించింది. అలాగని ఎక్కడా అధికారిక ఉత్తర్వులు లేకుండా మౌఖిక ఆదేశాలతోనే ఈ రాజీనామాలు చేయించింది. ఇదంతా ప్రభుత్వం గద్దె నెక్కి పట్టుమని 10 రోజులు కూడా గడవకుండానే జరిపించేసి తమ భవిష్యత్‌ను దెబ్బతీసిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు వీసీలు రాజీనామా చేసి ఇంచుమించు ఏడు నెలలు కావస్తున్నా రెండు వర్సిటీలు ఇన్చార్జ్ వీసీలతోనే కాలక్షేపం చేస్తున్నాయి.నియామకం ఇలా..గత డిసెంబర్లో రెండు వర్సిటీల పాలకమండళ్ల అత్యవసర భేటీలో వీసీల నియామకాల కోసం చర్చించారు. సెర్చ్ కమిటీలో ఉండే ముగ్గురు విద్యావేత్తలలో విశ్వవిద్యాలయాల పాలకమండలి ఒక అభ్యర్థిని ఎంపిక చేస్తుంది. యూజీసీ ఒక విద్యావేత్తను, ప్రభుత్వం మరో అభ్యర్థిని నియమిస్తుంది. సెర్చ్ కమిటీలు దర ఖాస్తులు పరిశీలన చేసి మూడు పేర్లతో జాబితా రూ పొందిస్తే ఒకరి పేరును వీసీగా గవర్నర్ ఖరారు చేస్తారు.ఎవరి ప్రయత్నాలు వారివే...ప్రస్తుత ఇన్చార్జిలుగా చేస్తున్న వారితో పాటు గతంలో రిజిస్ట్రార్లు, డైరెక్టర్లుగా పనిచేసిన వారితో పాటు ప్రస్తుత డైరెక్టర్లు కూడా ఈ సీటు ఆశిస్తున్నారు. వీసీల కోసం దరఖాస్తు చేసిన అభ్యర్థులు సామాజిక, ఆర్థిక అంశాల ప్రాతిపదికన జరుగుతోన్న ప్రయత్నాలు అటు జేఎన్టీయూకే, ఇటు ఆదికవి నన్నయ వర్సిటీలో హాట్‌టాపిక్‌గా మారాయి. జేఎన్టీయూకే ప్రొఫెసర్ మురళీకృష్ణ, ఆదికవి నన్నయ్య వర్సిటీకి జియాలజీ ప్రొఫెసర్ వై.శ్రీనివాసరావు ప్రస్తుతం ఇన్చార్జి వీసీలుగా కొనసాగుతున్నారు. వీరితో పాటు పలువురు వీసీ పోస్టు ఆశిస్తూ ఆ మేరకు ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. ఈ నెలాఖరు నాటికి ఈ ప్రక్రియ పూర్తి అవుతుందంటున్నారు. పూర్తి స్థాయి వీసీలు నియామకంలో జరుగుతోన్న జాప్యం రెండు వర్సిటీల అభివృద్ధిపై ప్రభావం చూపిస్తోందంటున్నారు. ఇదే విషయమై పదేపదే విద్యార్థులు మొత్తుకుంటున్నా సెర్చ్ కమిటీ అంటూ సర్కార్ కాలయాపన చేస్తోందనే విమర్శలున్నాయి. వీసీ పీఠం కోసం ఖర్చుకు వెనుకాడకుండా పై స్థాయిలో కొందరు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. జేఎన్టీయూ కాకినాడ కుర్చీ కోసం రూ. రెండు, మూడు కోట్లకు వెనుకాడటం లేదని వర్సిటీలో ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. సెర్చ్ కమిటీకి 30 మంది వరకు దరఖాస్తు చేసుకున్నా ఇప్పటికే తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక వర్సిటీ ప్రొఫెసర్ ఈ పోస్టు కోసం మాట్లాడుకున్నారని వినిపిస్తోంది. ఇందుకు పొరుగు రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన ఒక ప్రజాప్రతినిధి, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంలో చినబాబుతో మంతనాలు సాగిస్తున్నారని సమాచారం. ఆదికవి నన్నయ్య వీసీ కుర్చీ కోసం కృష్ణా, గుంటూరు ప్రాంతానికి చెందిన ఒక మహిళా ప్రొఫెసర్ ప్రయత్నాలు చేస్తున్నారని తెలియవచ్చింది. కూటమి సర్కార్‌లో కొందరు పెద్దలతో ఉన్న పరిచయాలతో ఆమె ఈ పోస్టు కోసం ఉన్నత స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నారంటున్నారు. వర్సిటీ వర్గాల్లో జరుగుతోన్న చర్చను బట్టి సెర్చ్ కమిటీలు వీసీల నియామకానికి ఆశావహుల నుంచి దరఖాస్తులు తీసుకోవడానికే పరిమితమయ్యాయి.వీసీలను త్వరగా నియమించాలిగత వీసీలకు ఇంకా సమయం ఉన్నా అర్ధంతరంగా తొలగించి ఇన్చార్జి వీసీలను నియమించారు. విశ్వవిద్యాలయాలను ఆరు నెలలుగా ఇన్చార్జ్ వీసీల పాలనలోనే నడుపుతున్నారు. వైస్ చాన్సలర్లను త్వరగా నియమిచాలి. ఇన్‌చార్జ్‌లు ఉండడంతో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉండదు. ఈ కారణంగా విద్యావ్యస్థకు నష్టం జరిగే పరిస్థితి ఉంది.– ఎం.గంగా సూరిబాబు, ఎస్ఎఫ్ఐ, జిల్లా కార్యదర్శి, కాకినాడఇన్చార్జులు చురుకుగా నిర్ణయాలు తీసుకోలేరుయూనివర్సిటీల నిర్వహణలో ఫుల్చార్జి వైస్ చాన్సలర్లను నియమించాల్సిన ప్రభుత్వం ఇన్చార్జిలతో కాలం గడపడం సహేతుకం కాదు. ఇన్చార్జిలు ఎవరైనా సరే ఆయా యూనివర్సిటీలకు సంబంధించిన కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో చురుకై న పాత్ర నిర్వర్తించలేరు. అదే ఫుల్‌చార్జ్ వైస్ చాన్సలర్ ఉంటే అవసరం అనుకుంటే గవర్నర్ వద్దకు నేరుగా వెళ్లి యూనివర్సిటీ కోసం మాట్లాడే అవకాశం ఉంటుంది. వెంటనే ఫుల్‌చార్జ్ వీసీలను నియమించాలి.– అశోక్‌కుమార్, డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, తూర్పుగోదావరిజిల్లా -
కుండపోత.. ఉక్కపోత..
సాక్షి, అమలాపురం: వాతావరణం చాలా విచిత్రంగా మారింది. ఎప్పుడు ఎండ కాస్తుందో, ఎప్పుడు వాన పడుతుందో తెలియడం లేదు. వేసవిని తలదన్నెలా ఎండ కాస్తూ ప్రజలను భయపెడుతోంది. అంతలోనే చల్లని చినుకులు సేదతీర్చుతున్నాయి. అమలాపురంలో మంగళవారం గంట పాటు ఏకదాటిగా వర్షం పడింది. ఏకంగా 18.2 మీమీ కురిసింది. ఉదయం పది గంటల నుంచి పదకొండు గంటల వరకు కురిసిన వర్షంతో సామన్యులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి భానుడు విజృంభించాడు. విపరీతమైన ఎండతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. -
ఈ–క్రాప్ నమోదు తప్పనిసరి
అల్లవరం: రైతులు తాము పండించే పంట వివరాలను ఈ–క్రాప్‌లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి వి.బోసుబాబు సూచించారు. బెండమూర్లంక గ్రామంలో జరుగుతున్న ఈ–క్రాప్ నమోదు కార్యక్రమాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 1.52 లక్షల ఎకరాల్లో వరినాట్లు పూర్తయ్యాయన్నారు. 64 వేల ఎకరాల్లో ఈ–క్రాప్ నమోదు జరిగిందని, ఈ నెల 31 లోపు వంద శాతం పూర్తి చేయాలన్నారు. సెప్టెంబర్ 15లోగా ఈ–క్రాప్ నమోదు చేసిన పంటకు రైతుల ఈ–కేవైసీని నమోదు చేయాలన్నారు. అనంతరం ప్రతి గ్రామ సచివాలయంలో డ్రాఫ్ట్ జాబితాను ప్రదర్శించి, రైతులకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరించాలన్నారు. అల్లవరం మండలంలో 2,380 ఎకరాల్లో వరినాట్లు పూర్తి కాగా, 1,650 ఎకరాల్లో పంట వివరాలు నమోదు జరిగినట్టు తెలిపారు. వరిని కుళ్లు తెగులు ఆశించకుండా హెక్సాకోనోజోల్ మందును పిచికారీ చేయాలని సూచించారు. ఆయన వెంట ఏడీ షంషీ, వ్యవసాయాధికారి ఎన్వీవీ సత్యనారాయణ, ప్రకృతి వ్యవసాయాధికారి శ్రీనివాసరావు, విస్తరణాధికారి శివమోహన్, సర్పంచ్ బర్రే సీతారత్నం, రైతులు ఉన్నారు. -
కలెక్టర్ ఫొటోతో వాట్సాప్ సందేశాలు
అమలాపురం రూరల్: కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఫొటోను వాట్సాప్ డీపీగా పెట్టుకుని జిల్లాలోని అధికారులకు, ఇతరులకు గుర్తు తెలియని వ్యక్తులు వాట్సాప్ సందేశాలు పంపిస్తున్నారు. వారితో చాటింగ్ చేస్తూ సంభాషణ కొనసాగిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్ మహేష్ కుమార్ మంగళవారం ప్రకటన విడుదల చేరారు. వాట్సాప్ లో చూపిస్తున్న 947855 66071 నంబర్ తనది కాదని స్పష్టం చేశారు. ఎవ్వరూ ఆ నంబర్ నుంచి మెసేజ్‌లకు స్పందించవద్దని, ఫోన్ కాల్స్‌ను స్వీకరించవద్దని తెలిపారు. పాఠ్య, నోట్ పుస్తకాల పంపిణీ పూర్తి అమలాపురం టౌన్: జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ప్రభుత్వం సరఫరా చేసిన పాఠ్య, నోట్ పుస్తకాల పంపిణీ దాదాపు పూర్తయ్యిందని డీఐఈవో వనుము సోమశేఖరరావు తెలిపారు. వాటిని విద్యార్థులు సక్రమంగా సద్వినియోగం చేసుకుంటున్నారా అనే విషయాన్ని తల్లిదండ్రులు పర్యవేక్షించాలని సూచించారు. అలాగే కళాశాలల్లో ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు కూడా ఆరా తీయాలన్నారు. మలికిపురం మండలం కేశనపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వృక్ష శాస్త్ర అధ్యాపకుడు లేని కారణంగా గెస్ట్ లెక్చరర్ ఫ్యాకల్టీ నుంచి దరఖాస్తులు ఆహ్వానించామన్నారు. పోస్టు గ్రాడ్యుయేషన్‌లో 50 శాతం మార్కులు సాధించిన వారు అర్హులన్నారు. బోధన చేసిన గంటకు రూ.150 చొప్పున నెలకు రూ.10 వేల మించకుండా గౌరవ భృతి ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. ఆసక్తి కలవారు ఈ నెల 24వ తేదీ సాయంత్రం లోపు దరఖాస్తులను ఆ కళాశాలలో సమర్పించాలన్నారు. -
కల్యాణ వైభోగమే..
అన్నవరం: పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంతో అత్యంత అపూర్వ ఘట్టం. ఆ కార్యక్రమం తమ ఇష్టదైవం సన్నిధిలో జరగాలని చాలామంది కోరుకుంటారు. అన్నవరంలోని వీర వెంకట సత్యనారాయణస్వామివారి దేవస్థానం వివాహాలకు పెట్టింది పేరు. ఇక్కడ ఏటా వేల సంఖ్యలోవివాహాలు జరుగుతాయి. మంచి ముహూర్తాల సమయంలో ఈ సంఖ్య భారీగా పెరుగుతుంది. ప్రస్తుతం శ్రావణ మాసం కావడంతో రత్నగిరిపై వివాహాల సందడి మొదలైంది. నూతన దంపతులతో కళకళ నూతన దంపతులతో సత్యదేవుని ఆలయ ప్రాంగణం కిటకిటలాడుతోంది. వివిధ ప్రాంతాల నుంచి కూడా నూతన వధూవరులు స్వామివారి దర్శనానికి తరలివస్తున్నారు. వీరందరూ వ్రతాలను ఆచరించి, స్వామివారిని దర్శించుకుని తమ జీవితం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు. సత్యదేవుని సన్నిధిలో ఏటా ఐదు వేల జంటలు వేదమంత్రాల సాక్షిగా ఒక్కటవుతున్నాయి. వీరితో బాటు ఎక్కడెక్కడో వివాహాలు చేసుకున్న మరో పది వేల జంటలు సత్యదేవుని సన్నిధికి విచ్చేస్తున్నాయి. పెళ్ల్లిళ్ల సీజన్ శ్రావణ మాసం ప్రారంభమైన తర్వాత ఇప్పటి వరకూ సత్యదేవుని సన్నిధిలో ఐదు వందలకు పైగా వివాహాలు జరిగాయి. ఆగస్టు ఐదు నుంచి శ్రావణ మాసం ప్రారంభం కాగా ఏడో తేదీ నుంచి వివాహాలు మొదలయ్యాయి. ఈ నెల 15వ తేదీ ఒక్కరోజే వందకు పైగా జరిగాయి. మిగిలిన రోజుల్లో పది నుంచి ఇరవై వరకూ జరుగుతున్నాయి. 18, 19వ తేదీలలో దాదాపు 50 జంటలు ఒక్కటయ్యాయి. నేటి నుంచి భారీ సంఖ్యలో.. రత్నగిరిపై బుధవారం నుంచి ఈ నెల 23వ తేదీ వరకూ భారీ సంఖ్యలో వివాహాలు జరగనున్నాయి. ఈ మూడు రోజులూ రత్నగిరిపై సత్రం గదులలో దాదాపు 70 శాతం, అన్ని వివాహ మండపాలను పెళ్లి బృందాలు రిజర్వ్ చేసుకున్నాయి. ఇదే ముహూర్తానికి పెళ్లిళ్లు పెట్టుకున్న మిగిలిన వారందరూ మంటపాలు లభ్యం కాక తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. సర్దుబాటు చేయ‘లేఖ’ రత్నగిరిపై వివాహాల నేపథ్యంలో సత్రం గదులు, అతిథి గృహాల కోసం భారీ డిమాండ్ ఏర్పడింది. కొండపై ఉన్న 600 వసతి గదులలో దాదాపు 70 శాతం రిజర్వ్ అయిపోయాయి. వాటికి సంబంధించి చార్టులు కూడా సిద్ధమయ్యాయి. మిగిలిన గదుల కోసం విపరీతమైన పోటీ ఏర్పడింది. కొండకు వచ్చే భక్తులు, పెళ్లి బృందాలు గదుల కోసం ప్రముఖ రాజకీయ నాయకులు, వీఐపీల సిఫారసు లేఖలను తీసుకువస్తున్నారు. ఈ వ్యవహారం దేవస్థానం అధికారులకు తలనొప్పిగా మారింది. గదులను సర్దుబాటు చేయలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రత్నగిరిపై జోరుగా వివాహాలు నేటి నుంచి మూడు రోజుల పాటు భారీ ముహూర్తాలు సత్రం గదులు 70 శాతం రిజర్వ్ శ్రావణంలో ఇప్పటికే 500 పెళ్లిళ్లు -
రొయ్య రయ్..
సాక్షి అమలాపురం: వెనామీ సాగుకు పూర్వ వైభవం వచ్చింది. రొయ్యల ధరలకు రెక్కలు వచ్చాయి. గడిచిన నెల రోజుల్లో కౌంట్‌కు కేజీకి రూ.50 నుంచి రూ.60 వరకు పెరిగాయి. సాగు విస్తీర్ణం తగ్గడంతో పాటు సాగు చేసిన చోట వాతావరణ మార్పుల వల్ల తెగుళ్లు సోకి పంట దెబ్బతినడంతో అంచనాలకు మించి ధరలు పెరిగాయని రైతులు చెబుతున్నారు. వెనామీ సాగు అధికం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో వెనామీ సాగు అధికంగా ఉంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాతో పాటు కాకినాడ జిల్లాలో సుమారు 25 వేల ఎకరాల వరకూ ఉంటుందని అంచనా. గడిచిన నెల రోజులుగా రొయ్యల ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుత మార్కెట్లో కీలకమైన వంద కౌంట్ (కేజీకి 100 రొయ్యలు) ధర కొనుగోలుదారులు రూ.260గా నిర్ణయించారు. మార్కెట్లో పోటీ కారణంగా కేజీకి మరో రూ.10 పెంచి కొనుగోలు చేస్తున్నారు. అలాగే 90 కౌంట్ రూ.270 నుంచి రూ.280 వరకు, 80 కౌంట్ రూ.280 నుంచి రూ.290 వరకు, 70 కౌంట్ రూ.300 నుంచి రూ.310ల వరకు, 60 కౌంట్ రూ.320 నుంచి రూ.330 వరకు, 50 కౌంట్ రూ.340 నుంచి రూ.350 వరకు, 40 కౌంట్ రూ.375 నుంచి 385 వరకు, 30 కౌంట్ రూ.470 నుంచి రూ.480 వరకు ఉంది. రొయ్యల కొనుగోలుదారులు నిర్ణయించిన ధర కన్నా రూ.పది అదనంగా చేసి కొంటున్నారు. ఎగుమతుల జోరు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లకు రొయ్యల ఎగుమతి జోరుగా సాగుతుండడంతో వెనామీ ధరలు పెరిగాయి. కానీ డిమాండ్‌కు తగిన విధంగా రొయ్యలు అందుబాటులో లేవు. 100 కౌంట్ నుంచి 70 కౌంట్ మధ్యలో ఉన్న వెనామీ రొయ్యలు చైనాకు అధికంగా రవాణా జరుగుతుండగా, అంతకన్నా తక్కువ కౌంట్ అంటే 60 నుంచి 30 కౌంట్ మధ్య రొయ్యలు అమెరికాతో పాటు యూరప్ దేశాలకు ఎగుమతి అవుతున్నాయని చెబుతున్నారు. తెగుళ్ల బెడద కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలో గోదావరి నదీపాయలను ఆనకుని అనధికార ఆక్వా సాగు జరుగుతోంది. వరదలకు భయపడి ఇక్కడ జూలై నెలాఖరు నాటికి పట్టుబడులు వచ్చేలా చూసుకుంటారు. ఈ ఏడాది జూలై 20కి వరదలు రావడం వల్ల రైతులు నష్టాలను చవిచూశారు. దీని వల్ల కూడా సాగు తగ్గింది. ఇదే సమయంలో సాగు చేసిన చోట ఈ ఏడాది తెగుళ్ల తీవ్రత అధికంగా ఉంది. వెనామీ రొయ్యలకు వైట్ స్పాట్, వైట్ గట్ వంటి తెగుళ్లు, హెచ్‌పీ వల్ల రొయ్యల్లో ఎదుగుదల లోపం వంటి కారణాలతో దిగుబడి గణనీయంగా పడిపోయింది. ఎంతగా అంటే రెండు జిల్లాలకు కలిపి రోజుకు సగటున 400 మెట్రిక్ టన్నుల వరకు దిగుబడిగా వచ్చి కొనుగోలు కేంద్రాలకు వచ్చేది. కానీ ఇప్పుడు రోజుకు 150 టన్నులు కూడా మార్కెట్‌కు రావడం లేదు. ఈ కారణాల వల్లే వెనామీకి ధరలు పెంచడం మినహా మరో మార్గం కొనుగోలుదారులకు లేకుండా పోయింది. మార్కెట్‌ను గుప్పెట పెట్టుకుంటే అసలుకే మోసం వస్తోందనే కారణానికి తోడు, అనుకూల ప్రభుత్వానికి రైతులలో కొంత సానుకూలత రావాలనే ఉద్దేశంతో ధరలు పెంచారని రైతులు చెబుతుండడం విశేషం. ధరకు రెక్కలు ఐదేళ్ల తర్వాత పెరిగిన వైనం కౌంట్‌కు రూ.50 నుంచి 60 వరకూ అధికం వరదలు, తెగ్గుళ్లతో తగ్గిన సాగు ఉన్న వాటికి డిమాండ్ కౌంట్ రకం ధర (రూ.లలో) 30 470 40 375 50 340 60 320 70 300 80 280 90 270 100 260దెబ్బతీసిన తెగుళ్లు ఇటీవల రొయ్యల కొనుగోలుదారులు సిండుకేటుగా మారి ధరలు తగ్గించడం పరిపాటిగా మారింది. టీడీపీకి అనుకూలంగా ఉండే కొనుగోలుదారులు ధరలను తగ్గించడం ద్వారా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి చెడ్డ పేరును తీసుకురావడానికి యత్నించారు. ధరలు తగ్గిన ప్రతి సందర్భంలోనూ గత ప్రభుత్వం కలుగజేసుకుని కనీస మద్దతు ధరలు (ఎంఎస్సీ) ప్రకటించి రొయ్యలు కొనుగోలు చేయించింది. కరోనా తర్వాత నుంచి అంతర్జాతీయంగా ఎగుమతుల తగ్గుదల చోటు చేసుకుని ఆ ప్రభావం ధరలపై పడింది. 100 కౌంట్ ధర కేజీ రూ.210 నుంచి రూ.230 మధ్యలో ఉండేది. సిండికేటు కొనుగోలుదారులకు భయపడి కొందరు రైతులు సాగుకు దూరమయ్యారు. మరికొందరు పూర్తిస్థాయిలో రొయ్యలను పెంచలేదు. హైటెక్ పద్ధతిలో సాగు చేసే రైతులు ఎకరాకు గరిష్టంగా లక్ష వరకు రొయ్య పిల్లలను సాగు చేస్తుంటారు. అటువంటి వారు కూడా ఎకరాకు 70 వేల రొయ్యలకు మించి సాగు చేయలేదు. సాగు విస్తీర్ణం తగ్గడమే కారణం సాగు విస్తీర్ణం తగ్గడం వల్లే రొయ్యలకు ధర పెరిగింది. ఇప్పుడిప్పుడే సాగు మొదలు పెట్టినా డిసెంబర్, జనవరి వరకు దిగుబడి వచ్చే అవకాశం లేదు. అప్పటి వరకు మార్కెట్లో వెనామీ రొయ్యలకు ధర అధికంగానే ఉంటుంది. – బి.రాంబాబు, ఆక్వా రైతు, అమలాపురం -
జిల్లాకు 57 లక్షల ఉపాధి పనిదినాలు
అమలాపురం రూరల్: ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టాల్సిన పనులను గుర్తించి నివేదిక ఇవ్వాలని అధికారులను కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం ఉపాధి హామీ పనులపై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు తమ శాఖల్లో ఉపాధి హామీ పనులు కింద చేయడానికి అవకాశం ఉన్న పనుల వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు ఉపాధి హామీ పథకం కింద 57 లక్షల పని దినాలను లక్ష్యంగా ఇచ్చారని, వాటిని చేరుకునేలా పనులను గుర్తించేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. మెటీరియల్, లేబర్ కాంపోనెంట్ల కింద జిల్లాలో 266 రకాల పనులను చేపట్టవచ్చన్నారు. ఆగస్టు 23న రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలలో ప్రత్యేక సభలు నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో గ్రామ సభలకు కనీసం 30 శాతం మంది ప్రజలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఏపీవోలు, ఏపీడీలు ముందుగానే సమావేశమై ప్రస్తుతం జరుగుతున్న, జరగబోయే పనుల ప్రణాళిక రూపొందించుకుని గ్రామ సభలలో ఆమోదం తీసుకోవాలనన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి, డీఆర్ఓ ఎం.వెంకటేశ్వర్లు, డ్వామా పీడీ మధుసూదన్, జిల్లా ఉధ్యానశాఖ అధికారి బీవీ రమణ పాల్గొన్నారు. దేవాలయాల అభివృద్ధికి ప్రతిపాదనలు ప్రసాద్ పథకంలో దేవాలయాలను అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం దేవదాయ ధర్మాదాయ శాఖపై సమీక్షించారు. జిల్లాలో దేవదాయశాఖ పరిధిలోని ఆలయాలు, వాటిలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు తదితర వాటిపై ఆరా తీశారు. జిల్లాలో సుమారు 216 ఎకరాల దేవాలయ భూములు ఆక్రమణకు గురయ్యాయని అధికారులు తెలపగా, తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పెద్ద మొత్తంలో ప్రసాదాలు తయారు చేస్తున్న దేవాలయాలలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించి నాణ్యతను పరీక్షించాలన్నారు. సమావేశంలో డీఆర్ఓ ఎం.వెంకటేశ్వర్లు, ఆర్టీవో జి.కేశవవర్ధన్ రెడ్డి, జిల్లా దేవదాయ ధర్మాదాయశాఖ అధికారి ఎం.లక్ష్మీనారాయణ, మున్సిపల్ కమిషనర్ మనోహర్, అంతర్వేది ఈవో సత్యనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. సీసీ కెమెరాలతో పర్యవేక్షణ జిల్లాలో ముఖ్యమైన ప్రదేశాలు, ప్రభుత్వ కార్యాలయాల్లోని రికార్డు రూమ్‌లను సీసీ టీవీ కెమెరాల ద్వారా పర్యవేక్షించే దిశగా కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయాలని కలెక్టర్ మహేష్ కుమార్ అన్నారు. ఈ విషయంపై మంగళవారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులు, ఎస్ఎన్ఆర్ ఈ–డేటా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లోని (తహసీల్దార్ ) రికార్డు రూమ్‌లు, సంక్షేమ హాస్టళ్లు, ఇసుక రీచ్‌లు, ఇసుక నిల్వ కేంద్రాలు, ఇతర ముఖ్యమైన ప్రదేశాలలో సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేసి కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం ద్వారా పర్యవేక్షించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సమన్వయంతో లక్ష్యాన్ని చేరుకోవాలి అధికారులతో కలెక్టర్ మహేష్ కుమార్ -
యూనివర్సిటీ ఖ్యాతి పెంచాలి
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): యూనివర్సిటీ స్థాయి మరింత పెంచాలని, రాబోయే తరాలకు విద్యావృక్షంలా తయారు చేయాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ కె.రామ్మోహనరావు పేర్కొన్నారు. జేఎన్టీయూ కాకినాడ వర్సిటీ 16 వ్యవస్థాపక దినోత్సవం మంగళవారం నిర్వహించగా ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. రామ్మోహనరావు మాట్లాడుతూ రీసెర్చ్ సెంటర్లు మరిన్ని ఏర్పాటుచేసి విద్యార్థులను పరిశోధన వైపు ప్రోత్సహించాలన్నారు. జేఎన్టీయూకే వీసీ మురళీకృష్ణ మాట్లాడుతూ ఉన్నత విద్యలో పరీక్షా విధానం, మెఽథడాలజీ, బోధన పద్ధతులు, పాఠ్య ప్రణాళికలో తీసుకురావలసిన మార్పులపై దృష్టి సారిస్తున్నామన్నారు. కాకినాడ సీపోర్టు సీఈఓ మురళీధర్ మాట్లాడుతూ వర్సిటీ ద్వారా సమాజానికి ఉపయోగపడే ప్రాజెక్టులు చేపట్టాలన్నారు. వర్సిటీ అనుబంధ కళాశాలలకు ఉత్తమ ఫెర్మార్మెన్స్ అవార్డులతో పాటు ఐపీఎస్ అధికారి ఎంవీఆర్ కృష్ణతేజకు యంగ్ అచీవర్ అవార్డు అందజేశారు. రెక్టార్ కేవీరమణ, రిజిస్ట్రార్ రవీంద్ర, డైరెక్టర్లు, అధ్యాపకులు పాల్గొన్నారు. బస్‌షెల్టర్ కూల్చివేసిన కూటమి నాయకులు పెదపూడి: అనపర్తి మండలం పొలమూరు గ్రామంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి తండ్రి గంగిరెడ్డి, తల్లిపేరు మీద ఉన్న బస్‌షెల్టర్‌ను కూటమి నాయకులు మంగళవారం జేసీబీతో దౌర్జన్యంగా కూల్చివేశారు. దీంతో బస్‌షెల్టర్ లేకపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. కూటమి నాయకులు దౌర్జన్యంగా బస్‌షెల్టర్ కూల్చివేయడంపై ప్రజల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పొలమూరు గ్రామంలో తూర్పు పేటలో 20 ఏళ్ల క్రితం టీడీపీ హయాంలో జన్మభూమి గ్రామ సభల్లో నిర్ణయం మేరకు 30శాతం ప్రజావిరాళం (కాంట్రిబ్యూషన్)తో మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి తన తండ్రి గంగిరెడ్డి పేరుమీద ఈ నిర్మాణం చేపట్టారు. అప్పట్లో సూర్యనారాయణనరెడ్డి మూడు బస్షెల్టర్లు నిర్మాణాకి సుమారు రూ.లక్ష విరాళం ఇచ్చి వాటిని నిర్మించారు. అప్పటి నిబంధనల ప్రకారం ప్రజా విరాళం ఇచ్చినవారి పేర్లతో బస్‌షెల్టర్ నిర్మించుకోవచ్చు. అప్పటి టీడీపీ ఎమ్మెల్యే దివంగత నల్లమిల్లి మూలారెడ్డి హయాంలో నిర్మాణాలు చేపట్టారు. పొలమూరులో రెండు, చిన్న పొలమూరులో ఒకటి నిర్మించారు. ఈ బస్షెల్టర్లను ప్రయాణికులు వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పొలమూరు తూర్పు పేట వద్ద బస్‌షెల్టర్‌ను దౌర్జన్యంగా కూటమి నాయకులు కూల్చివేశారు. మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి ఆయన తండ్రి పేరు మీద ఉన్న కట్టడాన్ని కూల్చివేయడమే లక్ష్యంగా పరిపాలన సాగుతోందా అంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు. -
రాఖీ కట్టి.. రక్షణ కోరి..
పిఠాపురం: రాఖీ పౌర్ణమి సందర్భంగా దత్తాత్రేయుని జన్మస్థలమైన పిఠాపురంలోని ఆలయాలకు భక్తులు క్యూ కట్టారు. తెల్లవారుజాము నుంచి వేలాది మంది భక్తుల తరలిరావడంతో దత్తాత్రేయుని ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఏటా రాఖీ పౌర్ణమికి దేశ విదేశాల నుంచి భక్తులు ఇక్కడకు వచ్చి దత్తాత్రేయునికి రాఖీలు కడతారు. ఈ ఏడాది సుమారు 20 వేల మంది మహారాష్ట్ర భక్తులు తరలివచ్చి స్వామివారికి రాఖీలు కట్టి పూజలు చేశారు. పిఠాపురంలో ప్రముఖ పుణ్య క్షేత్రమైన పాదగయ కుక్కుటేశ్వరస్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
మంగళవారం శ్రీ 20 శ్రీ ఆగస్టు శ్రీ 2024
ఇది మే 17న తీసిన చిత్రం. కూనవరం మేజర్ డ్రెయిన్ మొగ ద్వారా సముద్రంలో కలిసే (స్ట్రైట్‌కట్) ప్రాంతం. ఇలా ఇసుక మేటలు వేసింది. ఏటా డ్రెయిన్‌లో నీరు లేని సమయంలో మేటలు వేయడం సహజమే అయినా ఈసారి ఏకంగా ఐదు నుంచి ఆరు అడుగుల ఎత్తున ఇసుక మేట వేసింది. దీనివల్ల ఖరీఫ్ సాగుకు తీవ్ర ఇబ్బంది ఏర్పడుతోందని, వరి చేలు మంపుబారిన పడతాయని అప్పుడే శ్రీసాక్షిశ్రీ హెచ్చరించింది. కొత్త ప్రభుత్వం ఏర్పడినా దీని వంక కన్నెత్తి చూడకపోవడంతో అనుకున్నంత పని అయ్యింది. గత నెలలో కురిసిన భారీ వర్షాలతో జరగాల్సిన నష్టం జరిగింది. ఇది ఆగస్టు 14న మొగ తెరిచిన నాటి సమయంలో ముంపునీరు డ్రెయిన్ ద్వారా సముద్రంలో కలుస్తున్న దృశ్యం. కూనవరం మొగ మూసుకుపోవడంతో వరి చేలు నీట మునగడంపై శ్రీసాక్షిశ్రీలో వచ్చిన కథనాలకు తోడు ఆయకట్టు రైతులు పలు దఫాలుగా జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. కొంతమంది ఆక్వా రైతుల మాటలు నమ్మి మొగ తెరవకపోతే సాగు వదిలేస్తామని హెచ్చరించడంతో ఎట్టకేలకు స్పందించి మొగ తవ్వకాలు చేశారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇది ఆగస్టు 19న కూనవరం మొగ వద్ద పరిస్థితి. సముద్ర కెరటాలకు మొగ మూసుకుపోయింది. వారం పది రోజులుగా సరైన వర్షాలు లేకపోవడంతో డ్రెయిన్‌లో నీరు పెద్దగా లేదు. డ్రెయిన్ నుంచి బలమైన ఒత్తిడితో నీరు సముద్రంలోకి దిగకపోవడం, కెరటాలతో మేటలు వేసేశాయి. ఇప్పుడు మూడు, నాలుగు అడుగుల ఎత్తున మేటలు వేయడంతో అధికారులు కంగుతిన్నారు. డ్రెయిన్ ఆనుకుని ఉన్న సాంప్ (పర్ర భూములు)ల్లోకి నీరు వెళ్లకుండా అడ్డుకట్టు వేసి డ్రెయిన్ ద్వారా సముద్రంలోకి నీరు బలమైన ఒత్తిడితో దిగేలా చేసినా ఫలితం ఇవ్వలేదు. దీనితో మొగ మరోసారి పూడుకుపోయింది. -
ఎస్పీ కార్యాలయానికి 18 అర్జీలు
అమలాపురం టౌన్: స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 18 అర్జీలు వచ్చాయి. జిల్లా ఎస్పీ బొడ్డేపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి అర్జీదారులు వచ్చి తమ సమస్యలపై ఫిర్యాదు చేశారు. వచ్చిన అర్జీల్లో కొన్నింటిని ఎస్పీ అక్కడికక్కడే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు. మిగిలిన ఫిర్యాదులపై ఆయా పోలీస్ స్టేషన్ల సీఐలు, ఎస్సైలతో మాట్లాడి నిర్ణీత సమయంలో పరిష్కరించాలని ఎస్పీ ఆదేశించారు. ఫిర్యాదుదారులు కొందరు తమ కుటుంబ సమేతంగా వచ్చి కుటుంబ వివాదాలు, ఆస్తి తగాదాలపై ఎస్పీకి ఏకరవు పెట్టారు. ఎస్పీ కార్యాలయ ప్రజా సమస్యల పరిష్కార వేదిక పర్యవేక్షణ ఎస్సై డి.శశాంక పాల్గొన్నారు. జగన్ కోసం నిలబడే వారు లక్షల్లో.. అమలాపురం టౌన్: మేము గేట్లు తెరిస్తే జగన్ మాత్రమే నిలుస్తారన్న రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్ సీపీ జిల్లా ఐటీ విభాగం అధ్యక్షుడు తోరం గౌతమ్ రాజా ఖండించారు. ఈ మేరకు అమలాపురంలో గౌతమ్ రాజా సోమవారం ప్రకటన విడుదల చేశారు. సొంత ప్రయోజనాల కోసం పార్టీ మారిపోయే ప్రతి ఒక్కరూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మామూలేనని ఆయన మంత్రి విమర్శలను కొట్టి పారేశారు. మాజీ ముఖ్యమంత్రి జగనన్న వెంట నిలబడే నాయకులు, కార్యకర్తలు లక్షల్లో ఉన్నారని గుర్తు చేశారు. ఈవీఎంల గోల్‌మాల్‌తో నెగ్గిన మీకు మా అధినేత జగన్‌ను విమర్శించే అర్హత లేదని పేర్కొన్నారు. తోబుట్టువుల బంధాన్ని తెలిపేలా రాఖీ అమలాపురం టౌన్: తోబుట్టువుల బంధాన్ని తెలుపేలా జిల్లాలో రక్షాబంధన్ వేడుకలను జరుపుకొన్నారు. చెల్లి అన్నకు, అక్క తమ్ముడికి రాఖీ కట్టి పండగ విశిష్టతను చాటారు. రాఖీ పౌర్ణమిని అమలాపురంలోని ఓం శాంతి కేంద్రం ఇన్చార్జి బ్రహ్మకుమారి శ్రీదేవి ఆధ్వర్యంలో బ్రహ్మకుమారీలు ఘనంగా జరుపుకొన్నారు. అమలాపురంలోని రెండో అదనపు జిల్లా కోర్టు జడ్జి వి.నరేష్ వద్దకు బ్రహ్మకుమారీలు వెళ్లి రాఖీ కట్టారు. అలాగే జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు, ఎంపీ గంటి హరీష్మాధుర్ల వద్దకు కూడా వెళ్లి రాఖీలు కట్టారు. బ్రహ్మకుమారీలు వారి నుదుట తిలకం దిద్ది స్వీట్లు తినిపించి ఆత్మీయతను చాటారు. ఓం శాంతి కేంద్రం ఇన్చార్జి బ్రహ్మకుమారి శ్రీదేవితోపాటు బ్రహ్మకుమారి స్వరూప తదితరులు పాల్గొన్నారు. పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం అమలాపురం రూరల్: జిల్లా పరిధిలోని వన్ స్టాప్ సెంటర్లో కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేసేందుకు వివిధ పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారిత అధికారి ఝన్సీరాణి తెలిపారు. ఈ పోస్టులను కలెక్టర్ మహేష్‌కు మార్ అధ్యక్షతన భర్తీ చేస్తారన్నారు. 25–42 ఏళ్ల మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్, కేస్ వర్కర్, పారా లీగల్ పర్సన్, లాయర్, పారా మెడికల్ పర్సన్, సోషల్ కౌన్సెలర్, కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న ఆఫీస్ అసిస్టెంట్, బహుళ ప్రయోజన సిబ్బంది, కుక్, సెక్యూరిటీ గార్డ్ తదితర పోస్టులకు దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. కోనసీమ ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్ నుంచి దరఖాస్తులను డౌన్లోడ్ చేసుకుని ఈ నెల 30వ తేదీలోగా ముమ్మిడివరంలో ఎయిమ్స్ కళాశాలలోని జిల్లా మహిళా, శిశు సంక్షేమ సాధికారిత అధికారి కార్యాలయంలో అందించాలన్నారు. కనక దుర్గమ్మకు లక్ష గాజుల పూజ తాళ్లపూడి: స్థానిక నవదుర్గాది పరివార సహిత కననదుర్గమ్మ ఆలయంలో శ్రావణ పూర్ణిమ సందర్భంగా సోమవారం లక్ష గాజులతో పూజా మహోత్సవం నిర్వహించారు. అమ్మవారికి గాజులు అలంకరించి కుంకుమార్చనలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు అల్లూరి శివప్రసాద్ ఆధ్వర్యంలో మహిళలు కుంకుమార్చన, లక్ష గాజుల పూజలో పాల్గొన్నారు. అమ్మవారికి గాజులు అలంకరించారు. -
మళ్లీ మొగటికే..
ఫ మూసుకుపోయిన కూనవరం మొగ ఫ తెరిచిన వారం రోజుల్లోనే ఇలా ఫ వర్షాలు పడితే మరోసారి ముంపు ఫ శాశ్వత పరిష్కారం కోరుతున్న రైతులు సాక్షి, అమలాపురం/ ఉప్పలగుప్తం: కూనవరం మొగ తెరిపించేందుకు అసలైన సమయంలో అనుమతులు ఇవ్వకుండా ఉన్నతాధికారులు చేసిన జాప్యంతో అవసరం లేని సమయంలో మొగ తెరవాల్సి వచ్చింది. ఇప్పుడు అది పూడుకుపోవడం చూసి ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోసారి భారీ వర్షాలు పడితే చేలు ముంపు బారిన పడి ఈ సారి నష్టం మరింత పెరిగే అవకాశముంది. దీంతో డ్రైన్స్ అధికారులు స్పందించి డ్రెజ్జర్‌ను రప్పించారు. దీనిద్వారా తవ్వకాలు చేయాలని నిర్ణయించారు. ఈ పనులతో కూడా పెద్దగా ప్రయోజనం ఉండదని, సాగు పూర్తయ్యే వరకూ తరచూ డ్రెజ్జింగ్ చేయాల్సిందేని రైతులు చెబుతున్నారు. అందరూ చెబుతున్నా.. ఈ డ్రెయిన్‌కు శాశ్వత పరిష్కారం చూపాలని గతంలో నిపుణుల కమిటీ పలు సూచనలు చేసింది. ముంబయికి చెందిన ఓష్ణోగ్రఫీ సంస్థ సర్వే చేపట్టింది. సముద్రంలోకి గ్రోయిన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు చేసింది. అంతమాత్రాన ఇది విజయవంతం అవుతోందని చెప్పలేమని ఆ సంస్థ తేల్చి చెప్పింది. కానీ కొంతమంది విశ్రాంత సాగునీటి పారుదల శాఖ అధికారులు మాత్రం కూనవరం, రామేశ్వరం మొగలను ఆనుకుని ఉన్న పర్రభూముల (సాంప్)లో ఆక్రమణలు తొలగించాలని సూచిస్తున్నారు. దీనివల్ల కొంత వరకూ ముంపు నీటికి పరిష్కారం దొరుకుతుందంటున్నారు. సుమారు ఆరు వేల ఎకరాల విస్తీర్ణంలో సహజ సిద్ధంగా ఏర్పడిన పర్ర భూములను ఆక్రమించి కొందరు ఆక్వా సాగు చేస్తున్నారు. దీనివల్ల అవి కుచించుకుపోయాయి. లేకుంటే ఈ పర్ర భూముల్లోకి ముంపునీరు చేరి నదుల ద్వారా సముద్రంలో కలిసేది. అలాగే పర్ర భూముల నుంచి సముద్రంలోకి నీరు దిగేలా పలుచోట్ల గండ్లు కొట్టాలని, అప్పుడు వేగంగా ముంపునీరు సముద్రంలో దిగుతుందని వారు తేల్చారు. ఈ కార్యాచరణ రూపొందించడంలో అధికారులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కూనవరం డ్రెయిన్ నుంచి మొగ వరకూ సుమారు కిలో మీటరు పొడవునా డ్రెజ్జింగ్ చేస్తున్నారే తప్ప అటు చిర్రయానం పర్రభూమి నుంచి ముంపునీరు సముద్రంలోకి దిగే విధంగా, ఇటు ఎస్.యానాం పర్ర భూముల నుంచి సముద్రంలోకి నీరు దిగేలా గండ్లు పెడితే చాలా వరకూ సమస్య తీరుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఆ దిశగా పదేళ్లుగా కార్యాచరణ చేపట్టకపోవడం ఆయకట్టు రైతులకు శాపంగా మారింది. సాగు వదిలేస్తున్నారు.. మధ్య డెల్టా (కోనసీమ)లో కీలకమైన కూనవరం మైజర్ డ్రెయిన్ దశాబ్దాల కాలంగా ఆయకట్టు రైతులకు కడగండ్లను మిగులుస్తోంది. ఉప్పలగుప్తం, అమలాపురం, కాట్రేనికోన, ముమ్మిడివరం మండలాల్లో ఒకప్పుడు 35 వేల ఎకరాల ఆయకట్టుకు చెందిన ముంపునీరు ఈ డ్రెయిన్ ద్వారా సముద్రంలో కలిసేది. సహజ సిద్ధంగా తెరుచుకోవడం, మూసుకుపోవడం ఈ మొగ లక్షణం. దీనికి శాశ్వత పరిష్కారం చూపాల్సి ఉండగా ఏటా తాత్కాలికంగా మొగ తవ్వకాలు చేసి వదిలేస్తున్నారు. గతంలో ఈ సమస్య ఉన్నా పదేళ్లుగా మాత్రం ఆయకట్టు రైతులకు పెనుముప్పుగా మారింది. దీని ద్వారా ముంపునీరు దిగక ఈ ప్రాంతంలో సుమారు 4 వేల ఎకరాల్లో వరి చేలు ఆక్వా చెరువులుగా మారిపోయాయి. మరో రెండు వేల ఎకరాల్లో రైతులు సాగు వదిలేశారు. ఇక మిగిలింది 29 వేల ఎకరాలు. ఇంతటి ఆయకట్టుకు చెందిన ముంపునీరు దిగేందుకు వీలుగా మొగకు శాశ్వత పరిష్కారం చూపాలని రైతులు కోరుతున్నారు. ప్రక్షాళన చెయ్యాల్సిందే.. కోనసీమలో డ్రైనేజీ వ్యవస్థను మొత్తం ప్రక్షాళన చేయాలి. ఆక్రమణలు తొలగించి డ్రెయిన్లలో పూడిక తొలగించాలి. రెవెన్యూ, మైనర్, మీడియం, మేజర్ డ్రెయిన్లను ఒకేసారి ఆధునీకరించాలి. అలాగే డ్రెయిన్ల నీరు కలిసే నదులపై ఉన్న అవుట్‌ఫాల్ స్లూయిజ్‌లను నిర్మించడంతో పాటు మొగలకు శాశ్వత పరిష్కారం చూపాలి. ఇందుకు రూ.500 కోట్లు అవుతోందని చేయలేమని అధికారులు చెబుతున్నారు. కానీ ఇక్కడ ఏడాదిలో పండే పంట విలువ రూ.2,800 కోట్లు అనే విషయాన్ని ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయి. కూలీలకు 1.65 కోట్ల పనిదినాలు దొరుకుతుందనే విషయాన్ని ప్రభుత్వం గుర్తు పెట్టుకుని డ్రైనేజీ వ్యవస్థను ప్రక్షాళన చేయాలి. –అయితాబత్తుల ఉమామహేశ్వరరావు, కోనసీమ రైతు పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి, గోపవరం, ఉప్పలగుప్తం మండలం -
నిర్దిష్ట వ్యవధిలో సమస్యలు పరిష్కరించండి
జాయింట్ కలెక్టర్ నిషాంతి అమలాపురం రూరల్: మారుమూల గ్రామాల నుంచి ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి వచ్చే అర్జీదారుల సమస్యలపై సానుకూలంగా స్పందించి, నిర్దిష్ట కాల వ్యవధిలో పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి అధికారులకు సూచించారు. సోమవారం అమలాపురంలోని కలెక్టరేట్ గోదావరి భవన్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. జేసీతో పాటు డీఆర్వో ఎం.వెంకటేశ్వర్లు, ఐసీడీఎస్ పీడీ ఎం.ఝాన్సీరాణి, డీఆర్డీఏ పీడీ డాక్టర్ వి.శివశంకర్ ప్రసాద్‌లు ప్రజల నుంచి 126 అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా నిషాంతి మాట్లాడుతూ అర్జీదారుల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటిని త్వరితగతిన పరిష్కరించాలనే సంకల్పంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందన్నారు. ఒకవేళ పరిష్కారానికి ఆస్కారం లేని ఫిర్యాదులు వస్తే అందుకు గల కారణాలను సంబంధిత ఫిర్యాదుదారులకు తెలపాలన్నారు. ఫిర్యాదులు నమోదు విభాగాన్ని ఆమె స్వయంగా పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. దివ్యాంగుల వద్దకు జాయింట్ కలెక్టర్ వెళ్లి అర్జీలు స్వీకరించారు. జిల్లా వైద్య సేవల సమన్వయ అధికారి కార్తీక్‌రెడ్డి, సీపీఓ వెంకటేశ్వర్లు, ట్రాన్స్‌కో ఈఈ మోకా రవికుమార్, జిల్లా మత్స్యశాఖ అధికారి ఎన్.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. సేంద్రీయ ఉత్పత్తులతో ఆరోగ్యం సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులను తీసుకోవడం ద్వారా ఆరోగ్యకర జీవనాన్ని గడపవచ్చని జాయింట్ కలెక్టర్ నిషాంతి తెలిపారు. కలెక్టరేట్ ప్రాంగణంలో రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటైన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శనను ఆమె ప్రారంభించి, పలు ఉత్పత్తులను కొనుగోలు చేశారు. సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులకు నేటి మార్కెట్లో మంచి డిమాండ్ ఉందన్నారు. ఈ స్టాల్లో కూరగాయలు, ఆకుకూరలు, పప్పు దినుసులు, దేశవాళీ రకాలైన నల్ల బియ్యం తదితర రకాలు ఉన్నాయని ఆమె తెలిపారు. జిల్లా వ్యవసాయ అధికారి వి.బోసుబాబు, డీపీఎం కె.శ్రీనివాస్, అడిషనల్ డీపీఎం సత్యనారాయణ, ఆదర్శ రైతు అప్పారి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
నిబంధనలు తొలగించాలి
ఎమ్మెల్సీ ఐవీ డిమాండ్ అమలాపురం టౌన్: రాష్ట్రంలో సర్వ శిక్ష విభాగంలో పనిచేస్తున్న ఇన్‌క్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్ల (ఐఈఆర్పీ) జీతాల చెల్లింపుపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన అక్రమ నిబంధనలను తక్షణమే రద్దు చేయాలని ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు (ఐవీ) డిమాండ్ చేశారు. అమలాపురంలోని యూ టీఎఫ్ జిల్లా కార్యాలయంలో ఉన్న ఎమ్మెల్సీ ఐవీని ఐఈఆర్పీలు ఆదివారం కలిసి తమ సమస్యలను వివిరిస్తూ ఓ వినతి పత్రం అందించారు. దీనిపై స్పందించిన ఐవీ మాట్లాడుతూ ఐఈఆర్పీలు జీతాల చెల్లింపులపై ఆంక్షలు విధించడం అన్యాయ మని అన్నారు. వారు రెగ్యులైజేషన్ అడగకూడదని, కోర్టులకు వెళ్లడానికి వీలులేదని, ఎలాంటి కార ణం లేకుండా విధుల నుంచి తొలగించే అధికారం యాజమాన్యనికి ఉంటుందన్న నిబంధనలు వర్తింపచేయడం సరికాదని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. బాండు పేపరుపై సంతకం పెడితేనే జీతం చెల్లిస్తామన్న నిబంధన మరీ దారుణమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి అసంబద్ధ, అక్రమ నిబంధనలను తొలగించాలని డిమాండ్ చేశారు. రాత పూర్వకమైన ఉత్తర్వులు లేకుండా ఈ నిబంధనలు అమలు చేయడమేమిటని ఎమ్మెల్సీ ప్రశ్నించారు. ఈ నిబంధనల వల్ల 1350 మంది ఐఈఆర్పీలు ఇబ్బంది పడుతున్నారని, ఉన్నతాధికారుల దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్తానని ఆయన తెలిపారు. -
అయినవిల్లికి పోటెత్తిన భక్తులు
అయినవిల్లి: అయినవిల్లి విఘ్నేశ్వరస్వామి ఆలయం ఆదివారం భక్తులతో పోటెత్తింది. స్వామిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఆలయ ప్రధానార్చకుడు అయినవిల్లి సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో స్వామికి మేలుకొలుపు సేవ, పంచామృతాభిషేకం, ఏకాదశ, లఘున్యాస, రుద్రాభిషేకాలు, వివిధ ప్రత్యేక పూజలు జరిపారు. స్వామి మహానివేదన అనంతరం వివిధ పుష్పాలతో అర్చకస్వాములు సర్వాంగ సందరంగా అలంకరించారు. స్వామివారి లఘున్యాస, ఏకదశ రుద్రాభిషేకాల్లో 34 మంది, లక్ష్మీగణపతి హోమంలో 12 మంది దంపతులు పాల్గొన్నారు. 20 మంది తమ నూతన వాహన పూజలు నిర్వహించారు. 24 చిన్నారులకు తులాభారం నిర్వహించారు. స్వామివారి అన్నదాన పథకంలో 1384 మంది అన్నప్రసాదం స్వీకరించారు. స్వామివారికి వివిధ పూజలు, అన్నదాన విరాళాలుగా రూ.2,07,312 ఆదాయం లభించిందని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. నిత్యాన్నదాన పథకానికి రూ.లక్ష విరాళం ఆలయంలో అమలు చేస్తున్న నిత్యాన్నదాన పథకానికి ముమ్మిడివరం వాస్తవ్యులు ముళ్లపూడి శ్రీగణేష్ కుటుంబ సభ్యులు ఆదివారం రూ.లక్ష విరాళం అందజేశారు. ఈ సొమ్మును ఆలయ అర్చకుడు సత్తిబాబుకు అందజేశారు. దాతను వేదపండితులు వేదమంత్రాలతో సత్కరించి స్వామి చిత్రపటం ప్రసాదం అందజేశారు. -
క్రీడాకారులను తయారు చేసుకోవాలి
ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు అమలాపురం టౌన్: క్రీడాకారులు అప్పటికప్పడు పుట్టరని, ప్రతిభ గల క్రీడాకారులను మనం తయారు చేసుకుంటేనే వారు అంచలంచెలుగా ఎదిగి జాతీయ స్థాయికి ఎదుగుతారని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. పాఠశాలల స్థాయిలోనే విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని నింపి క్రీడాంశాలవారీగా వారి ఆసక్తిని బట్టి నిష్ణాతులైన క్రీడాకారులుగా తీర్చిదిద్దినప్పుడే క్షేత్రస్థాయి నుంచి క్రీడా వ్యవస్థ బలపడుతుందని ఆయన అభిప్రాయ పడ్డారు. ఈ మేరకు ఆయన ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో క్రీడా స్ఫూర్తి అంశంపై వివరించారు. ఇప్పడు రాష్ట్ర ప్రభుత్వం జాతీయ స్థాయి క్రీడలను నిర్వహించాలన్న ఆలోచనను స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని క్షేత్ర స్థాయిలో అమలు చేసి పాఠశాలల విద్యార్థుల్లో వారి వారి అభిరుచులను బట్టి క్రీడా స్ఫూర్తి నింపి సత్ఫలితాలు సాధించారని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వంలో కూడా ఆ తరహా ప్రయత్నం సాగాలని ఆకాంక్షించారు. స్పోర్ట్ పాలసీలు తయారు చేసినప్పుడు క్రీడలపై అవగాహన లేని ఐఏఎస్ అధికారులు సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకోకూడదని సూచించారు. స్పోర్ట్స్ పాలసీ రూప కల్పనలో విశ్రాంత స్పోర్ట్స్ ఉన్నతాధికారులు, జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారుల ఆలోచనలు, సూచనలకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. వేణుగోపాలస్వామికి వెండి ఆభరణాల సమర్పణ మామిడికుదురు: మండలంలోని మొగలికుదురు గ్రామంలో కొలువుదీరిన శ్రీరుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామికి గ్రామానికి చెందిన దండు భీమరాజు, విజయలక్ష్మి దంపతులు రూ.1.5 లక్షల విలువైన వెండి ఆభరణాలను ఆదివారం సమర్పించారు. శ్రావణమాసం సందర్భంగా భీమరాజు దంపతులు స్వామి వారికి వెండి కవచం, శంఖు చక్రాలు తదితర ఆభరణాలను అందజేశారు. అర్చక్షులు సంప్రోక్షణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వెండి ఆభరణాలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు. నేడు యథావిధిగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక అమలాపురం రూరల్: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక సోమవారం అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్లోని గోదావరి భవన్లో ఉదయం 10 గంటల నుంచి యథావిధిగా నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ సమస్యలను జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకువచ్చి తగు పరిష్కార మార్గాలు పొందాలని ఆయన విజ్ఞప్తి చేశారు. లోవలో భక్తుల సందడి తుని రూరల్: తలుపులమ్మ అమ్మవారిని దర్శించేందుకు వచ్చిన భక్తులతో లోవ దేవస్థానంలో సందడి నెలకొంది. ఆదివారం వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన భక్తులు ఎనిమిది వేల మంది అమ్మవారిని దర్శించుకున్నట్టు కార్యనిర్వహణ అధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.1,19,975, పూజా టికెట్లకు రూ.65,930, కేశఖండనశాలకు రూ.15,040, వాహన పూజలకు రూ.6,200, కాటేజీలు, పొంగలి షెడ్లు, వసతి గదుల అద్దెలు రూ.74,392, విరాళాల ద్వారా రూ.85,353, మొత్తం రూ.3,76,890 ఆదాయం సమకూరినట్టు ఈఓ వివరించారు. సత్యదేవుని నిత్యాన్నదాన పథకానికి రూ.1,00,001 అన్నవరం: సత్యదేవుని నిత్యాన్నదాన పఽథకానికి రాయుడు శ్రీనివాసరావు (కాకినాడ) రూ.1,00,001 విరాళాన్ని ఆది వారం సమర్పించారు. దాతకు అన్నదానం రశీదు, బాండ్‌ను అధికారులు అందజేశారు. -
సత్యదేవుని ఆలయానికి భక్తుల తాకిడి
● స్వామిని దర్శించిన 40 వేల మంది ● దేవస్థానం ఆదాయం రూ.40 లక్షలు అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆదివారం వేలాదిగా వచ్చిన భక్తులతో కిటకిటలాడింది. సత్యదేవుని సన్నిధిన శనివారం రాత్రి పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. వివాహాలు చేసుకున్న నవ దంపతులు, ఇతర ప్రాంతాలలో వివాహాలు చేసుకున్నవారు పెద్ద సంఖ్యలో సత్యదేవుని ఆలయానికి తరలి వచ్చారు. వారంతా సత్యదేవుని వ్రతమాచరించి స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఇతర భక్తులు కూడా తోడవడంతో ఆలయంతో బాటు ఆలయ ప్రాంగణం, వ్రతాలాచరించే భక్తులతో వ్రత మంటపాలు, స్వామివారి దర్శనం అనంతరం సేద తీరే భక్తులతో విశ్రాంతి మంటపాలు కిక్కిరిసిపోయాయి. సుమారు 40 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించగా స్వామివారి వ్రతాలు మూడు వేలు నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. స్వామివారి నిత్యాన్నదాన పథకంలో ఐదు వేల మంది భక్తులకు భోజన సౌకర్యం కల్పించారు. కన్నుల పండువగా రథోత్సవం సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతేదేవి అమ్మవారి రథోత్సవం ఆది వారం కన్నుల పండువగా జరిగింది. ఉదయం పది గంటలకు రధాన్ని తూర్పు రాజగోపురం ముందుకు తీసుకువచ్చారు. అనంతరం ఆ రధంపై సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లను ప్రతిష్టించారు. ఆలయ ప్రధాన అర్చకుడు కోట సుబ్రహ్మణ్యం స్వామి, అమ్మవార్లకు పూజలు చేశారు. అనంతరం దేవస్థానం ఏఈఓ కృష్ణారావు కొబ్బరికాయ కొట్టి రధోత్సవం ప్రారంభించారు. తరువాత ఆలయ ప్రాకారంలో రధానికి నాలుగు దిక్కుల కొబ్బరి కాయలు కొట్టి రధోత్సవాన్ని నిర్వహించారు. రూ.2,500 టిక్కెట్ తో ఇద్దరు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేదపండితులు, అర్చకులు, వ్రతపురోహితులు పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సత్యదేవుని రథోత్సవం -
తెలుగు భాషను పరిరక్షించుకుందాం
● శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రతాప్ ● వైభవంగా 138వ జాతీయ శతాధిక కవి సమ్మేళనం అమలాపురం రూరల్: తెలుగు భాష పరిరక్షణకు తెలుగువారు కృషి చేయాలని అంతర్జాతీయ సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కత్తిమండ ప్రతాప్ అన్నారు. కవులు సామాజిక చైతన్యంతో కవిత్వం రాయాలని ఆయన అన్నారు. ఆయన ఆధ్వర్యంలో అమలాపురం అంబేద్కర్ కమ్యూనిటీ భవనంలో ఆదివారం వ్యావహారిక భాషోద్యమ నాయకుడు గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు భాషా సంబరాలు నిర్వహించారు. ప్రాచీన, ఆధునిక కవుల వేషధారణలతో సాగిన ఈ కార్యక్రమం ఆద్యంతం ఆకట్టుకుంది. సెప్టెంబర్ 29వ తేదీన అనకాపల్లిలో తెలుగు భాషోత్సవాలు, శతాధిక కవుల కవి సమ్మేళనం నిర్వహించనున్నట్లు ప్రతాప్ తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు హాజరై కళావేదిక సాహితీ సేవను ప్రశంసించారు. తెలుగు తేజం, గోదావరి సోషల్ అండ్ కల్చర్ అసోసియేషన్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ నేషనల్ అకాడమీ సంయుక్తంగా సాహితీ రంగాల్లో ఉత్తమ సేవలు అందించిన ప్రముఖ కవయిత్రి కొల్లి రమావతి రాజమహేంద్రవరం నన్నయ విద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ తరపట్ల సత్యనారాయణ, తెలుగు అధ్యాపకులు ప్రముఖ సాహితీవేత్త మాకే బాలార్జున సత్యనారాయణ, ప్రముఖ రచయిత్రి చిట్టె లలిత, ప్రముఖ రచయిత్రి ఈశ్వరి భూషణం విశ్రాంత విద్యాధికారి గిరిజన సంక్షేమం కేఆర్.పురం ఏలూరుకు చెందిన డాక్టర్ టి.పార్థసారధి, కాకినాడ పీఆర్ కళాశాల సంస్కృత శాఖా అధ్యక్షురాలు డాక్టర్ వై. బుజ్జిలకు జ్ఞాపిక, ప్రశంసాపత్రం, రూ.10వేలు నగదు పురస్కారాన్ని అందజేశారు. కళావేదిక జాతీయ కన్వీనర్ కొల్లి రమావతి, జాతీయ అధ్యక్షురాలు ఈశ్వరి భూషణం, జాతీయ మహిళా అధ్యక్షురాలు చిట్టె లలిత జిల్లా కమిటీల ఏర్పాటులోనూ సాహితీ యజ్ఞంలో నిరంతరం కృషి చేస్తున్నారని ప్రతాప్ ప్రశంసించారు. ఈ సందర్భంగా పలువురు సాహితీవేత్తలను సత్కరించారు. కార్యక్రమంలో కళావేదిక జాతీయ అధ్యక్షురాలు ఈశ్వరి భూషణం, జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ టి.పార్థసారధి, పోలిశెట్టి అనంతలక్ష్మి దేవి, అరిగెల బలరాం మూర్తి , గుర్రం రామకృష్ణారావు పాల్గొని కవి సమ్మేళనం నిర్వహించారు. రాష్ట్రం నుంచి 150 మంది కవులు తమ కవితల ద్వారా తెలుగు భాషా వైభవాన్ని చాటి చెప్పారు. -
నిన్నటి క్లిక్.. రేపటి కిక్కు
అభిరుచే వృత్తిగా మారింది మొదట్లో ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. ఫొటోగ్రఫీపై ఉన్న అభిరుచి క్రమంగాా పెరగడంతో దాన్నే వృత్తిగా మలుచుకున్నా. వృత్తిపరంగా, అభిరుచి పరంగా ఫొటోగ్రఫీనే ఆశగా, శ్వాసగా జీవిస్తున్నా. నా ప్రయాణంలో ప్రతి దృశ్యాన్ని కెమెరాలో బంధించేందుకు ప్రయత్నిస్తాను. ప్రకృతి చిత్రాలు, ఆరుదుగా కనిపించే లొకేషన్లు, ప్రత్యేకతను సంత రించుకున్న చిత్రాలను కెమెరాలో బంధిస్తుంటాను. – చిట్టూరి దుర్గాప్రసాద్, ఫొటోగ్రాఫర్, వెదురుపాక, రాయవరం మండలం పోటీ విపరీతంగా పెరిగింది ఫొటోగ్రఫీలో సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరిగింది. టెక్నాలజీకి అనుగుణంగా ఫొటోగ్రాఫర్లు కూడా అప్డేట్ కావాల్సిన అవసరం ఉంది. అప్డేట్ కాని ఫొటోగ్రాఫర్లు పోటీలో వెనుకబడి పోతున్నారు. ఫొటోగ్రఫీని కూడా ఒక వృత్తిగా భావించి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందించాలి. అప్పుడే ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు అభివృద్ధి చెందడానికి అవకాశముంటుంది. – పోసిన వీరేంద్రకుమార్, రాష్ట్ర అధ్యక్షులు, ఏపీ ఫొటోఅండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, రాజమహేంద్రవరం నైపుణ్యానికి కొదవులేదు సాంకేతికత ఎంత పెరిగినా నైపుణ్యానికి ఉన్న ప్రాధాన్యం ఏమాత్రం తగ్గలేదు. ఆసక్తి ఉండాలే కానీ ప్రకృతిపై కన్నేస్తే కమనీయమైన దృశ్యాలను చిత్రీకరించే వీలుంది. సృజనాత్మకత, ఓపిక, సమయం కేటాయిస్తే మంచి ఫోటోగ్రాఫర్‌గా రాణించొచ్చు. ఈ వృత్తిలో సంపద ఎలా ఉన్నా సంతృప్తి పుష్కలంగా ఉంటుంది. – చిక్కం శ్రీనివాస్, పద్మాలయ స్డూడియో, అంగర ● ప్రతి ఫొటో.. ఓ జ్ఞాపకం ● చరిత్రను సజీవంగా నిలిపే ఫొటోగ్రఫీ ● ఫొటోలు, సెల్ఫీలకు పెరుగుతున్న ప్రాధాన్యం ● నేడు ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం రాయవరం/కపిలేశ్వరపురం: భావావేశాలకు గురిచేసే ఎన్నో సంఘటనలు.. ఆ ఘటనల దృశ్యాలు..వాటి జ్ఞాపకాలను మనసు తన కాన్వాస్‌పై ముద్రించుకుంటుంది. ఆ అనుభూతులను ఆస్వాదించడమో.. లేదా అనుభవించడమో పూర్తి కాకముందే మరో సంఘటన.. దృశ్యంగా.. జ్ఞాపకంగా.. ఇలా జీవిత పర్యంతం ఎన్నో ఘటనల దృశ్యాలు మదిలో నిక్షిప్తమై కాలగతిలో కలసిపోతుంటాయి. వాటిలో కొన్ని ఘటనల దృశ్యాలు మాత్రం ఎప్పటికీ మదిని ముద్దాడేవో.. మెలిపెట్టేవో.. గిలిగింతలు పెట్టేవో కచ్చితంగా ఉంటాయి. వాటిని కళ్లముందు నిలిపే అద్భుతం ‘చిత్రం’ మాత్రమే. అనుకునో.. కావాలనో.. ఆదమరచినపుడో ఎవరో కెమేరాతో క్లిక్ మనిపించిన ఆ చిత్రం నిజంగా మాయావే. ఎన్నేళ్లు గతించిపోయినా ఏ మూలనుంచో.. ఏ ఆల్బం నుంచో బయటపడినపుడు గత కాలపు మధురోహల్లోకి తీసుకుపోయి మురిపించేస్తుంది. కన్నీరు పెట్టిస్తుంది. అవి ఆనంద బాష్పాలు కావచ్చు.. నిబ్బరం కోల్పోయి ఒలికిన కన్నీరు కావచ్చు. కాలాన్ని సైతం జయించిన ఆ ‘చిత్రం’.. ఎంతో అపురూపం. మనసుతో తీస్తేనే ఫొటోగ్రాఫ్.. సాంకేతికంగా వృద్ధి చెందిన తరువాత వచ్చిన ఆవిష్కరణల్లో కెమేరా ఒక అద్భుతం. ఆ కెమేరా లెన్స్ ముందున్న దృశ్యాన్ని క్లిక్ మనిపిస్తే అది కేవలం ఫొటో అవుతుంది కానీ ఫొటోగ్రఫీ కాదు. ముందున్న దృశ్యాన్ని క్లిక్‌మనిపించే వ్యక్తి కన్ను భావగర్భితమైనదైనపుడే.. అటువంటి వ్యక్తి క్లిక్‌చేసి ఆవిష్కరించే చిత్రాన్నే ఆహా.. ఏం ఫొటోగ్రాఫ్ అనగలం. అలాంటి కెమెరా పితామహుడు డాగురేకు పేటెంట్ లభించిన రోజు ఆగస్టు 19న ఏటా ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఫొటో విశ్వ వ్యాపితం.. అందుకే మిత్రులు, కుటుంబ సభ్యుల సమాగమం.. శుభాశుభ కార్యాలు.. సభలు, సమావేశాలు.. అది ఏదైనా నేడు ఫొటోలు తీయించడం సాధారణమైన విషయం. రేపటికి అదో జ్ఞాపకమే కాదు.. రిఫరెన్స్ కూడా. ఇక సాధారణ ప్రజా జీవనంలోకి వస్తే ప్రతి ఇంటా ఎన్నో బ్లాక్ అండ్ వైట్ ఫొటోలు.. రెండు లేదా మూడు దశాబ్దాల నాటి ఫొటోలు ఎన్నో ఉంటాయి. అవి చూచినపుడల్లా ఆ రోజుల్లోకి వెళ్లిపోయి నాటి డ్రెస్సింగ్, హెయిర్ స్టైల్ చూసుకుని ఎన్ని కామెంట్లు పాసైపోతాయో.. అన్నీ మనసును ఆ రోజుల్లోకి తీసుకెళ్లి గిలిగింతలు పెడతాయి. గమ్మత్తైన చప్పుడు ‘క్లిక్’ క్లిక్.. గమ్మత్తైన మెత్తని చప్పుడు. క్షణాల్లో సుందర దృశ్యం. చూపుడువేలి కొనతో బటన్ నొక్కితే ఎదుటి దృశ్యం చిన్ని చిప్‌లో బంధీ అవుతుంది. కొంతమందికి ఎన్ని సార్లు, ఎన్ని వేల ఫొటోలు తీయించుకున్నా కొత్తదనమే. గుండె కింద మెత్తని మధుర జ్ఞాపకాలను నిక్షిప్తం చేసి అవసరమైనప్పుడు వీక్షించగలిగే అపురూపమైన అవకాశాన్ని మనకు ఫొటోగ్రఫీ అందిస్తుంది. ఇటీవల కాలంలో సెల్ఫోన్ల రాకతో కెమెరాల ప్రాభవం కాస్త తగ్గినా విలక్షణమైన ఫొటోలకు మాత్రం స్టూడియోలు, కెమెరాలను ఆశ్రయించక తప్పదు. రోలికార్డ్, రైస్ ల్యాండర్, రోలీ ఫ్లెక్స్, నికాన్, కేనన్ వంటి ఎన్నో కంపెనీల కెమెరాలు వివిధ మోడళ్లలో అందుబాటులోకి వచ్చాయి. వేల నుంచి లక్షల విలువ చేసే కెమెరాలు ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఫొటోగ్రఫీ అనేది గ్రాఫోన్ అనే పదం నుంచి పుట్టింది. గ్రాఫోన్ అంటే రాయడం, చిత్రించడం అని అర్ధం. మొదటిసారిగా 1826లో ఫ్రెంచి శాస్త్రవేత్త జోసఫ్ నైసిఫర్ నిస్సీ కనిపెట్టిన మొదటి కెమెరాతో ప్రారంభమైన ఫొటోగ్రఫీ నేడు డిజిటల్ ఫొటోస్ స్థాయికి అభివృద్ధి చెందింది. తీసే ఫొటోను బట్టి దాని ప్రాముఖ్యాన్ని బట్టి నేడు వివిధ లెన్సులు అందుబాటులోకి వచ్చాయి. సెల్ఫోన్లో బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు అందుబాటులోకి జనబాహుళ్యానికి ఫొటోగ్రఫీ మరింత దగ్గరైంది. తాజాగా డ్రోణ్ ఫొటోగ్రఫీతో విహంగ వీక్షణం చేస్తూ తీసే ఫొటోలకు ఎంతో డిమాండ్ ఉంది. వినూత్న రీతిలో.. నేచురల్, వైల్డ్ లైఫ్, ఫైన్ ఆర్ట్స్, నైట్ స్కేప్, వెడ్డింగ్ ఫొటోగ్రఫీ, యాష్రో ఫొటోగ్రఫీ, స్ట్రీట్ ఫొటోగ్రఫీ, సీటీస్కేప్స్, ల్యాండ్ స్కేప్స్, నైట్స్కేప్స్ ఇలా ఎన్నో రకాలుగా ఫొటోగ్రాఫర్లు తమ ప్రతిభ చాటుకుంటున్నారు. ఎమోషన్లు, ఫీలింగ్స్, సేడ్నెస్, థింకింగ్, కేరింగ్ ఇలా అన్ని రకాల ఎమోషన్లను ఒక్క క్లిక్‌తో చూపిస్తుంటారు. అంతే కాకుండా సమాజంలో జరుగుతున్న ఆకృత్యాలను కళ్లకు కట్టినట్టు చూపించి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే ఫోటోలు తీయడంలోను కొందరకు తమ ప్రతిభ చూపుతున్నారు. తరాలుగా ఇదే పని.. కాకినాడలో చెక్కా బసవరాజు 1885లో ఓ హాబీగా ఫొటోగ్రఫీని ప్రారంభించి చెక్కా బసవరాజు అండ్ సన్స్ ఏర్పాటు చేశారు. నాలుగు తరాలుగా తన కుటుంబం ఆ ప్రతిష్టను నిలబెట్టుకుంటున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఫొటోగ్రఫీ అసోసియేషన్లలో నాలుగు వేల మంది వరకు ఫొటోగ్రాఫర్లు ఉన్నారు. ఫొటోగ్రాఫర్లలో మిక్సింగ్ ఎడిటర్లు, ఫొటగ్రఫీ ఎడిటర్లు, ఫొటో ల్యాబ్ ఆపరేటర్లు ఇలా.. ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు ఏడు వేల మంది ఈ వృత్తిపై ఆధారపడి ఉన్నారు. కాకినాడ జిల్లాలో 15 మండలాలకు చెందిన సుమారు 2వేల మంది ఫోటోగ్రాఫర్లు 4 జోన్లు, 8 సంఘాలుగా ఉన్నారు. కుటుంబం అంతా కలసికట్టుగా.. కపిలేశ్వరపురం మండలంలోని అంగర గ్రామానికి చెందిన పద్మాలయా ఫోటో స్టూడియోను 1986 ఆగస్టు 16న ప్రారంభించారు. వారి కుటుంబం ఫో టో గ్రాఫర్ల జీవన విధానాన్ని స్పష్టం చేస్తుంది. గ్రా మానికి చెందిన సోదరులు చిక్కం నరసింహారావు, శ్రీనివాస్, కాశీ విశ్వనాథం 38 ఏళ్లుగా స్టూడియో నిర్వహిస్తున్నారు. ఆహ్లాదకరమైన ప్రకృతి అందాల ను కెమేరాతో ఒడిసి పట్టడం శ్రీనివాస్‌కు అలవాటు. -
రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి మృతి
సామర్లకోట: స్థానిక రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో సుమారు 60 ఏళ్ల వయసున్న వ్యక్తి మృత దేహాన్ని గుర్తించారు. రైల్వే పోలీసు కథనం ప్రకారం పిఠాపుం–సామర్లకోట కేఎం నెంబరు 630/–34–40 పోస్టుల మధ్య ఆ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. రైల్వే ఏఎస్ఎం జీకేఎస్ శ్రీదేవి ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించినట్టు తెలిపారు. మృతదేహం వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదన్నారు. తలకు ఎడమ వైపు గాయం ఉన్నదని, మృతుడు చామనచాయ రంగులో ఉండి కుడి చాతిపై పుట్టుమచ్చ, బొడ్డు దిగువ భాగంలో మరో పుట్టు మచ్చ ఉండి, తెలుపు షర్టు నీలం గళ్ల లింగి ధరించి ఉన్నాడని చెప్పారు. రైల్వే ఎస్సై బి.లోవరాజు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పెద్దాపురం ఏరియా ఆస్పత్రికి తరలించామన్నారు. రత్నగిరిపై మరొకరు..అన్నవరం: రత్నగిరిపై తూర్పు రాజగోపురం దిగువన గల ఘాట్‌రోడ్ లో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అతని వయసు 55 ఏళ్లు ఉంటాయని, తెల్ల చొక్కా, కాషాయం రంగు లుంగీ ధరించి ఉన్నాడని తెలిపారు. అతని మృతదేహాన్ని ప్రత్తిపాడు ఆసుపత్రి మార్చురీకి తరలించామని తెలిపారు. -
మద్యం దుకాణం వాచ్‌మన్‌పై హత్యాయత్నం
● పోలీసుల అదుపులో నిందుతుడు ● ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కొవ్వూరు: పట్టణంలో బస్టాండ్ సెంటర్లోని ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద నైట్ వాచ్‌మన్‌గా పని చేస్తున్న ఖండవల్లి జయరాజుపై ఆదివారం తెల్లవారు జామున హత్యాయత్నం జరిగింది. మెరకవీధికి చెందిన పిండి సుబ్రహ్మణ్యం తెల్లవారు జామున నాలుగు గంటలకు దుకాణం వద్దకు వచ్చి మద్యం కావాలని అడిగారు. దుకాణం మూసేశారని, మద్యం లేదని చెప్పడంతో ఆగ్రహించిన సుబ్రహ్మణ్యం తనతో తెచ్చుకున్న చాకుతో దాడి చేసి జయరాజు ముఖం, తల, చేతులపైన, చెవి వెనుక, ఛాతీ పైన గాయపరిచారు. జయరాజు కింద పడిపోవడంతో చనిపోయాడనుకుని సుబ్రహ్మణ్యం పారిపోయినట్లు పోలీసులు చెబుతున్నారు. చాకుకు ఉన్న పిడి విరిగిపోవడంతో బాధితుడికి ప్రాణాపాయం తప్పింది. తీవ్ర రక్తస్రావంతో పడి ఉన్న జయరాజును స్థానికులు స్థానిక సామాజిక ఆస్పత్రికి తరలించారు. నిజానికి మానసిక వికలాంగురాలైన సుబ్రహ్మణ్యం సోదరి పట్ల జయరాజు గతంలో అసభ్యకరంగా ప్రవర్తించారని, ఆ కోపంతోనే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసుల ప్రాధమిక విచారణలో తేలిందని ఎస్సై కె.జగన్మోహన్రావు తెలిపారు. ఈ విషయంపై సుబ్రహ్మణ్యం సోదరుడు గతంలో జయరాజును మందలించాడని వివరించారు.సెంట్రింగ్ పనులు చేసుకునే సుబ్రహ్మణ్యం తరచూ బయటి ప్రాంతాలకు వెళ్లి వస్తుంటాడని, వీరి ఇంటి పక్కనే సుబ్రహ్మణ్యం సోదరుడు నివసిస్తుంటే, వదిన వీరికి వండి పెడుతుండేందన్నారు. సోదరి పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్టు తెలుసుకుని జయరాజుపై కక్షతో ఈ హత్యాయత్నానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. ఆసుపత్రి నుంచి అందిన సమాచారం మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితుడు సుబ్రహ్మణ్యాన్ని అదుపులోకి తీసుకున్నామని, డీఎస్పీ జి.దేవకుమార్ ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
అమెరికాలో ఇంటర్న్‌షిప్‌నకు అమలాపురం కుర్రాడు
అమలాపురం టౌన్: పట్టణానికి చెందిన పిల్లాడి మధుకృష్ణ చంద్రబాబు సినీ నటుడు సోనూసూద్ అందించిన సాయంతో చదువుకుని ప్రయోజకుడై అమెరికాలో ఇన్టర్న్షిప్కు ఎంపికయ్యాడు. స్థానిక చిరు వ్యాపారి కుమారుడైన అతడు సోనూ అందించిన రూ.10 లక్షల సాయంతో పంజాబ్‌లోని లూధియానాలోని సిటీ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీలో డిగ్రీ చేస్తూ ఈ ఘనత సాధించాడు. జే–వన్ వీసాపై ఆ యువకుడిని హాస్పటాలిటీ స్టూడెంట్ – ఎక్ఛేంజ్ విజిటర్‌గా 12 నెలల పాటు అమెరికా వెళ్లనున్నాడు. కరోనా కాలంలో రవాణా స్తంభించినపడు స్థానిక ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు, సామాజిక కార్యకర్త బాబీ గాబ్రియేల్ సాయంతో తన చదువు కోసం లూధియానా వర్సిటీకి వెళ్లినట్టు గుర్తుచేసుకున్నాడు. ఈ సందర్భంగా వారు చంద్రబాబును అభినందించారు. -
సంస్కృతంతో విడదీయరాని బంధం
సంస్కృతంతో తెలుగుకు విడదీయరాని సంబంధం ఉంది. తెలుగులో 40 శాతం పదాలు సంస్కృతం నుంచే వచ్చాయని భాషా శాస్త్రవేత్తల అభిప్రాయం. తెలుగు, సంస్కృతం రెండు ఒకే భాషా కుటుంబానికి చెందకపోయినా ఒకటితో ఒకటి కలిసి మనగలగడం ఆశ్చర్యం. – డాక్టర్ పీవీబీ సంజీవరావు, తెలుగు శాఖధిపతి, ఎస్‌కేవీటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్టాంప్ విడుదల సంస్కృతం భారతీయ భాషలలో అంతర్లీనంగా ఉంటుంది. కొన్ని పదాలు అటూఇటూ రూపాంతరం చెందాయి. రూపాంతర భాషాకుటుంబాలకి ప్రాకృతభాషలని పేరు. సంస్కృతంపై ఉజుపిస్ దేశం స్టాంప్ విడుదల చేయడం ఆనందంగా ఉంది. నేడు నన్నయ యూనివర్శిటీ, కలెక్టరేట్లో ఈ స్టాంప్‌ని విడుదల చేయనున్నారు. – శ్రీనివాస చీమలమర్రి, అంబాసిడర్ ఫర్ జైన్ లిటరేచర్, రిపబ్లిక్ ఆఫ్ ఉజుపిస్ -
రూ.4 లక్షల ఖరీదైన బైక్ చోరీ
పెద్దాపురం: స్థానిక బ్యాంక్ కాలనీలో సుమారు రూ.నాలుగు లక్షల విలువైన బైక్ చోరీకి గురైనట్లు ఆదివారం ఫిర్యాదు అందింది. స్థానిక ఎస్సై మౌనిక తెలిపిన వివరాల మేరకు స్థానిక నియర్స్ కింగ్ ఓపెరా అపార్ట్మెంట్లో ఉంటున్న ఆర్అండ్బి డీఈ ఎం.నాగేశ్వరరావుకు చెందిన ఏపీ39క్యూజే 3838 నెంబరు గల బైక్ యథావిధిగానే పార్క్ చేసి ఉంచారు. ఆదివారం ఉదయం లేచి చూసేసరికి బైక్ కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బహ్రెయిన్‌లో పెదపట్నంలంక యువకుడి ఆత్మహత్య మామిడికుదురు: ఉపాధి కోసం బహ్రెయిన్ వెళ్లిన పెదపట్నంలంక యువ కుడు ఉరి వేసుకుని చనిపోయాడని కుటుంబ సభ్యులకు శనివారం రాత్రి సమాచారం రావడంతో వారు కన్నీరు మున్నీరవుతున్నారు. వివరాల్లోకి వెళితే మామిడికుదురు మండలం పెదపట్నంలంక శివారు దుర్గాపట్నానికి చెందిన నాగులాపల్లి వీర వెంకటదుర్గా నాగసాయి (22) బహ్రెయన్‌లో శనివారం ఉరి వేసుకుని చనిపోయాడు. గత నెల 22న ఇంటి నుంచి వెళ్లిన నాగసాయి 29న బెహ్రెయిన్ చేరుకున్నాడని అతని మేనమామ ఉండపల్లి రమేష్ అలియాస్ శ్రీను ఆదివారం తెలిపారు. అక్కడ పెట్రోల్ బంకులో పని చేస్తున్నాడని, అక్కడి సమస్యలపై ఎప్పుడూ చెప్పలేదని, చనిపోవడానికి రెండు రోజులు ముందు కూడా ఫోన్లో మాట్లాడాడని ఆయన తెలిపారు. నాగసాయి మృతిపై విచారణ జరిపించాలని, అతని మృతదేహాన్ని స్వదేశం రప్చించేందుకు సహకరించాలని ఎంపీ గంటి హరీష్ మాధుర్, పి.గన్నవరం ఎమ్మె ల్యే గిడ్డి సత్యనారాయణను కోరారు. ఇండియన్ ఎంబసీ అధికారులతో కూడా ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నామని మేనమామ తెలిపారు. చెరువులో మునిగి వ్యక్తి మృతి కొత్తపల్లి: ప్రమాదశాత్తు చెరువులోపడి ఒక వ్యక్తి మృతి చెందినట్టు పోలీసులు ఆదివారం తెలిపారు. మండలంలోని కొమరగిరి శివారు చిన్న కలవలదొడ్డికి చెందిన దొంగల శ్రీను(48) అదే గ్రామంలో ఉన్న కఠారి చంటిబాబు పొలంలో ఉన్న చెరువులోకి గేదెను కడిగేందుకు దిగాడు. ప్రమాదశాత్తు అదుపుతప్పి చెరువులో పడి మృతి చెందాడు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఎస్సై వెంకటేష్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
విశ్వజన మోహితం సంస్కృతం
కంప్యూటర్‌కు వాడుకోగలిగే భాషల్లో మొదటి స్థానం సంస్కృతానిదే. ఆ భాష అతి గొప్ప లక్షణం ఎన్ని వేల లక్షల కొత్త పదాలనైనా తయారు చేయవచ్చు. వాటికి వ్యత్పత్తి కలిగి ఉండడం మరో ప్రత్యేకత. అందుకనే లిథునియా, రష్యా, స్లొవేకియా మొదలైన యూరోపియన్ దేశాల వారు వారి మూలాలను సంస్కృతంలో వెతుక్కుంటున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం రెండు రకాల స్టాంపులను ఉజుపిస్ విడుదల చేస్తోంది. వాటి ధర ఇండియన్ కరెన్సీలో రూ.ఒక్కొటి రూ.120 ఉంటుంది. ● ప్రపంచంలో 877 భాషలపై ఎంతో ప్రభావం ● భారత సంస్కృతి, సంస్కృతం ప్రతిష్టమైనవి ● నేడు విశ్వ సంస్కృత భాషా దినోత్సవం ● సంస్కత భాషపై అభిమానంతో నేడు ఉజుపిస్ దేశం స్టాంప్ విడుదల సీటీఆర్ఐ(రాజమహేంద్రవరం): భాషలకు సంస్కృతం తల్లివంటిది అని తొలి తెలుగు వ్యాకరణకర్త, ఆంధ్రభాషాభూషణము రచయత మూలఘటిక కేతన అన్నట్లుగా ప్రపంచం అంతా ఇప్పుడు సంస్కృతం గురించి గొప్పగా చెప్పుకుంటోంది. కాని భారతదేశంలో పుట్టిన సంస్కృతం ఒక్క వర్గం వారికి తప్ప మరే ఇతర వర్గాల వారు అభ్యసించకపోవడంతో ఆ భాష నేడు కనుమరుగవుతోంది. పాశ్చాత్య దేశాల వారు ఈ భాష ఔన్నత్యాన్ని గుర్తించి నేర్చుకోవడం హర్షణీయం. నిజానికి సంస్కృతం అంటే భాష కాదు. కృతము అంటే చెయటము లేదా చేసినదని, సంస్కరిపబడిన పని, భాష అని అర్థము. జనని ఎల్ల భాషలకు సంస్కృతంబు అనడానికి కారణమిదే. ప్రపంచంలో అతి పురాతన భాషల్లో సంస్కృతం ఒకటి. మన దేశ అధికారిక భాషగా గుర్తించబడి గౌరవించబడుతోంది. సంస్కృతాన్ని దేవ భాష, అమరవాణి, గీర్వాణిగా పిలుస్తారు. సంస్కృతం దేశ భాషలపైనే కాదు, ప్రపంచంలోని 877 భాషలపై తన ప్రభావాన్ని కలిగి ఉందని పరిశోధనలు తేల్చారంటే ఆ భాష ప్రభావం అర్థం చేసుకోవచ్చు. సంస్కృతం ఔన్నత్యాన్ని నిలబెట్టేలా ఏటా శ్రావణ పౌర్ణమి రోజున విశ్వ సంస్కృత భాషా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. సంస్కృత భాష గొప్పదనం సంస్కృతాన్ని ఉన్నతమైనదిగా గుర్తించారు కాబట్టే ఈ భాషలోని గ్రంథాలను వివిధ భాషల్లోకి పాశ్చాత్య పండితులు అనువదించుకున్నారు. అలాగే ఆధునిక విజ్ఞాన విషయాలకు సంస్కృత సాహిత్యం భాండాగారం. ఇవే మన ప్రస్తుత సంస్కృతికి నిలువుటద్దాలై మనల్ని ముందుకు నడిపిస్తున్నాయనడంలో అతిశయోక్తి లేదు. పంచతంత్రం, హితోపదేశం, ఇతిహాసాలు రామాయణ, భారతం, భర్తృహరి సుభాషితాలు ప్రపంచ సాహిత్యానికి అద్భుతమైన ఎన్సైక్లోపీడియాలు. సంస్కృతంపై ఉజుపిస్ దేశం స్టాంప్ విడుదల.. మన సంస్కృతానికి మనం గౌరవం ఇవ్వకపోయినా పాశ్చాత్య దేశాల వారు ఎంతో గౌరవం ఇస్తున్నారు. ఏకంగా రిపబ్లిక్ ఆఫ్ ఉజుపిస్ దేశం వారు ప్రపంచ సంస్కృత దినోత్సవం సందర్భంగా లిధునియా రాజధాని ఇండియన్ ఎంబసీలో సోమవారం గౌరవ సూచకంగా కమోరెటివ్ స్టాంపును విడుదల చేస్తోంది. అసలు యూరోపియన్ దేశమైన ఉజుపిస్ సంస్కృత పై ఇంత గౌరవాన్ని ఉంచి స్టాంపును ఎందుకు విడుదల చేస్తోందన్న అనుమానం రావటం సహజం. ఉజుపిస్ అధికారిక భాష లిధునియా. ఈ భాష సంస్కృతానికి చాల దగ్గరగా ఉంటుంది. పేరుకే యూరోపియన్ భాష లిథునియా కాని అనుసరించేది పూర్తిగా సంస్కృతమే. అతిపురాతమైన విల్నియస్ యూనివర్సిటీలో ఏషియన్ ట్రాన్సిడెంటల్ స్టడీస్ కేంద్రంలో సంస్కృత శాఖ ఉంది. ఈ కేంద్రంలో పనిచేసే ఆచార్య వితస్ బిధునస్ 2016లో సంస్కృత లిథునియామాల అనే పుస్తకాన్ని ప్రచురించారు. ఇందులో సంస్కతానికి లిథునియాకి వున్న సంబంధం గురించి వివరించారు. -
వందే సంస్కృత భారతీమ్
భాషాసు ముఖ్య మధుర దివ్య గీర్వాణ భారతి ! తస్మాది కావ్యం మధురం తస్మాదపి సుభాషితం! పద్మాసన ప్రియాం దేవీం వీణా పుస్తక ధారిణీం! జననీం సర్వవిద్యానాం ప్రపంచంలో ఉన్న వేల భాషలలో సంస్కృతం ప్రాచీనమైనది. సాహిత్య పరంగా, సౌందర్యపరంగా, వాంగ్మయ వైశాల్యపరంగా, శబ్ద సంపదగా ఏ దృష్టితో చూసినా దీనిని మించిన భాష మరొకటి లేదు. భారతీయులు దీనిని చూసి గర్వించాలి. సరళంగా స్పష్టంగా నేర్చుకోదగిన భాష సంస్కృతం. అభ్యసించేలా కృషి చేద్దాం! రాబోయే తరాలకు అలవాటు చేద్దాం. – రాజనాల రాజేశ్వరి, సంస్కృతశాఖ, శ్రీమతి కందుకూరి రాజ్యలక్ష్మి ప్రభుత్వ మహిళా కళాశాల -
వంద కిలోల గంజాయి పట్టివేత
● ఇద్దరు నిందితుల అరెస్టు ● డీఎస్పీ శ్రీనివాసులు రాజానగరం: జాతీయ రహదారిపై అక్రమంగా తరలిస్తున్న వంద కిలోల గంజాయిని స్థానిక పోలీసులు ఆదివారం పట్టుకుని, ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ గంజాయి విలువ సుమారు రూ.5 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఉత్తర మండల డీఎస్పీ కె.శ్రీనివాసులు తెలిపిన వివరాల మేరకు రాజానగరంలోని మాధవీ ఫంక్షన్ హాలు వద్ద జాతీయ రహదారిపై వాహానాలను తనిఖీ చేస్తుండగా విశాఖపట్నం నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న టిఎన్ 88 బి 5961 నంబరు గల లారీలో తరలిస్తున్న వంద కిలోల గంజాయి పట్టుబడింది. తమిళనాడులోని సేలం జిల్లా వజపడి మండలం, వెప్పిలైపట్టిపుదుర్‌కు చెందిన లారీ డ్రైవర్ కమ్ ఓనర్ అయిన మరిముత్తు ఆర్ముగమ్ (45), పెరంబలూరు జిల్లా, సిరుమతూర్ మండలం, కుదిక్కడుకు చెందిన వేల్ మురుగన్ (27) పశ్చిమ బెంగాల్ కిరాయికి వెళ్లి తిరిగి వస్తూ విశాఖపట్నం సమీపంలోని ఏజెన్సీ ప్రాంతం నుంచి ఈ గంజాయిని తక్కువ రేటుకు కొనుగోలు చేశారు. అక్కడ నుంచి ఆ గంజాయిని ఐదు సంచులలో నింపి తీసుకువెళ్లి, చిల్లర వ్యాపారం చేస్తున్నారన్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, గంజాయిని, లారీని, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఈ కేసులో చురుగ్గా పనిచేసిన సీఐ, ఎస్సైలను ఎస్పీ నరసింహ కిశోర్ అభినందించినట్టు డీఎస్పీ తెలిపారు. ఏడాదిలో ఏడు కేసులు.. స్థానిక పోలీసు స్టేషను పరిధిలో ఈ ఏడాదిలో గంజాయి అక్రమ రవాణాకు సంబంధించి ఇంతవరకు ఏడు కేసులు నమోదయ్యాయని ఉత్తర మండల డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. వీటిలో సుమారు రూ.25 లక్షలు విలువ చేసే 506.35 కిలోల గంజాయితో పాటు రవాణాకు ఉపయోగించిన రెండు లారీలు, ఒక వ్యాన్, ఒక మోటారు సైకిలును స్వాధీనం చేసుకుని, 22 మందిని అరెస్టు చేశామన్నారు. సమావేశంలో సీఐ ఎస్పీ వీరయ్యగౌడ్, ఎస్సై మనోహార్ పాల్గొన్నారు. -
గాయత్రి మాతగా వనదుర్గమ్మ
అన్నవరం: రత్నగిరి దుర్గామాత శ్రీ వనదుర్గ అమ్మవారి శ్రావణమాస జాతర మహోత్సవాలలో భాగంగా నాలుగో రోజు ఆదివారం వనదుర్గ అమ్మవారిని గాయత్రి మాతగా అలంకరించి పండితులు పూజించారు. ఉదయం ఎనిమిది నుంచి 11 గంటల వరకు రుత్విక్కులు నవగ్రహ జపాలు, శ్రీచక్రార్చన, పురుష, శ్రీ సూక్త పారాయణ, మూలమంత్ర జపాలు, సూర్యనమస్కారాలు, సప్తశతీ పారాయణలు, మూలమంత్ర జపాలు, బాల, కన్య, సువాసినీ పూజలు ఘనంగా నిర్వహించారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు లక్ష కుంకుమార్చన, చండీహోమం నిర్వహించారు. కుంకుమార్చన అనంతరం సాయంత్రం ఆరు గంటలకు అమ్మవారికి నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి, ప్రసాదాలు నివేదించి భక్తులకు పంపిణీ చేశారు. వేద పండితులు గొల్లపల్లి ఘనాపాఠి. యనమండ్ర శర్మ, ఉపాధ్యాయుల రమేష్, ముష్టి పురుషోత్తం, కల్యాణబ్రహ్మ ఛామర్తి కన్నబాబు, ప్రథమశ్రేణి వ్రత పురోహితులు నాగాభట్ల రవిశర్మ, పాలంకి పట్టాభి, అంగర సతీష్, ఆలయ అర్చకులు కోట వంశీ, పరిచారకులు పవన్ ఈ కార్యక్రమాలలో పాల్గొన్నారు. నేడు అమ్మవారికి చండీహోమం శ్రావణ పౌర్ణిమ సందర్భంగా సోమవారం జరిగే చండీహోమం పూర్ణాహుతి కార్యక్రమంతో వనదుర్గ అమ్మ వారి జాతర మహోత్సవాలు ముగియనున్నాయి. ఉద యం తొమ్మిది గంటలకు చండీహోమం ప్రారంభమ వుతుంది. 11 గంటలకు జరిగే పూర్ణాహుతి కార్యక్ర మంలో రుత్విక్కులు హోమద్రవ్యాలను సమర్పిస్తారు. అనంతరం అమ్మవారికి వేదపండితుల ఆశీస్సులు, ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. -
స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు ప్రారంభం
రాయవరం: ఉపాధ్యాయుల వృత్తి నైపుణ్యాలను పెంచేందుకు ఉద్దేశించిన స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు శనివారం జిల్లా వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ఇకపై ప్రతి నెలా ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులతో పాటు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్లకు సబ్జెక్టు కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు 50 శాతం మంది పాల్గొనగా, సబ్జెక్టు కాంప్లెక్స్ సమావేశాల్లో భాగంగా తెలుగు, గణితం, బయలాజికల్ సైన్స్ సబ్జెక్టు ఉపాధ్యాయులకు సమావేశాలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 22 మండలాల్లో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు 47, తెలుగు, గణితం, బయలాజికల్ సైన్స్ సబ్జెక్టు కాంప్లెక్స్ ఉపాధ్యాయులకు 21, వ్యాయామ ఉపాధ్యాయులకు 7 స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించారు. వీటిని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.కమలకుమారి పర్యవేక్షించారు. -
అమలాపురంలో ఐఎంఏ వైద్యుల నిరసన
కోల్‌కతాలో వైద్యురాలి హత్యపై ఖండన అమలాపురం టౌన్: కోల్‌కతాలో వైద్యురాలిపై లైంగిక దాడి, ఆపై హత్య చేసిన ఘటనపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) జిల్లా శాఖ ఆధ్వర్యంలో వైద్యులు నిరసన తెలిపారు. శనివారం జిల్లాలోని వైద్యులు తమ విధులను బహిష్కరించి అమలాపురంలో నిరసన ప్రదర్శన చేశారు. స్థానిక గడియార స్తంభం సెంటర్‌కు జిల్లా నలుమూలల నుంచి వైద్యులు చేరుకుని కోల్‌కతా ఘటనను తీవ్రంగా ఖండించారు. వైద్యురాలిపై ఆటవికంగా లైంగిక చేసి, అతి కిరాతంగా హత్య చేసిన తీరుపై ఐఎంఏ వైద్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో దోషులను తక్షణమే శిక్షించాలని నినాదాలు చేశారు. తొలుత గడియార స్తంభం సెంటర్లో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తర్వాత ధర్నా నిర్వహించారు. అక్కడి నుంచి ప్రదర్శనగా కలెక్టరేట్ వరకూ చేరుకున్నారు. కలెక్టరేట్‌కు ఎదురుగా ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి వైద్యులు పూలమాలలు వేశారు. అనంతరం కలెక్టర్ రావిరాల మహేష్ కుమార్‌ను కలసి ఇటీవల కాలంలో వైద్యులపై పెరుగుతున్న దాడులను వివరించారు. దాడులు అరికట్టకపోతే తాము వైద్య సేవలు అందించలేమని వివరించారు. ఐఎంఏ జిల్లా శాఖ అధ్యక్షుడు వీఎస్‌ఎస్‌ఎన్ మూర్తి, కార్యదర్శి డాక్టర్ కడలి ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో వైద్యులు పీఎస్ శర్మ, గొలకోటి రంగారావు, బి.రాఘవేంద్రరావు, జి.ప్రభాకర్, పయ్యావుల సురేష్, గిరిజా, రమాదేవి, దీపిక తదితరులు పాల్గొన్నారు. వైద్యుల నిరసన శిబిరాన్ని పట్టణ సీఐ కె.క్రిష్టోఫర్ సందర్శించారు. వైద్యులపై జరుగుతున్న దాడులపై చట్ట ప్రకారం తీసుకునే చర్యలను ఆయన వివరించారు. నిరసన ప్రదర్శన అనంతరం స్థానిక గడియారం స్తంభం సెంటర్లో దాడుల నుంచి వైద్యులు ఎలా రక్షణ పొందాలి, దాడులకు పాల్పడే వ్యక్తులను చట్టప్రకారం శిక్షించే అంశాలపై ఐఎంఏ వైద్యులు మాట్లాడారు. -
సాధారణ బదిలీలకు పచ్చజెండా
రాయవరం: ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. బదిలీల షెడ్యూల్, మార్గదర్శకాలతో జీఓ 75ను విడుదల చేసింది. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన ఈ బదిలీలు జరగనున్నాయి. అయితే బదిలీలను కేవలం 15 శాఖలకే పరిమితం చేశారు. రెవెన్యూ (ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్), పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (ఇన్క్లూడింగ్ సెర్ఫ్), మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, జీవీడబ్ల్యూవీ అండ్ వీఎస్‌డబ్ల్యూఎస్, సివిల్ సప్లయిస్, మైనింగ్ అండ్ జియాలజీ, ఇంజినీరింగ్ స్టాఫ్ ఇన్ ఆల్ డిపార్ట్మెంట్స్, దేవదాయ, రవాణా, పరిశ్రమలు, స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్, కమర్షియల్ టాక్స్, ఎకై ్సజ్, ఈఎఫ్ఎస్ అండ్ టీ శాఖల్లో బదిలీలు జరగనున్నారు. ఈ ఏడాది జూలై 31 నాటికి ప్రస్తుతం పనిచేస్తున్న చోట ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి తప్పనిసరిగా బదిలీ ఉంటుంది. మిగిలిన వారు జీరో సర్వీస్‌పై రిక్వెస్ట్ బదిలీకి అర్హులవుతారు. ఉద్యోగ సంఘాల నేతలకు మాత్రం బదిలీ ఒకే స్థానంలో తొమ్మిదేళ్ల వరకూ మినహాయింపు ఉంటుంది. ఈ నెల 19 నుంచి ఈ నెల 31వ తేదీ వరకూ బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేశారు. తిరిగి సెప్టెంబర్ 1వ తేదీ నుంచి బదిలీలపై నిషేధం కొనసాగుతుంది. కాగా ఉపాధ్యాయులు మాత్రం ఈ బదిలీ ఉత్తర్వుల పరిధిలోకి రారు. ఇదిలా ఉంటే ఎన్నికలకు ముందు ఎన్నికల నిబంధనల్లో భాగంగా రెవెన్యూ అధికారులు, ఎంపీడీఓలు బదిలీలకు నోచుకోగా, ఇటీవలే వారిని తిరిగి పూర్వపు స్థానాలకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు వచ్చిన విషయం పాఠకులకు తెలిసిందే. ఫ ప్రభుత్వ జీవో విడుదల ఫ 15 శాఖలలో బదిలీలకు చర్యలు -
కాలువలో మహిళ మృతదేహం
ఏలేశ్వరం: మండలంలోని మర్రివీడు గ్రామంలో ఏలేరు ప్రాజెక్టుకు వెళ్లే ప్రధాన కాలువలో శనివారం గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. మృతదేహానికి కాళ్లు, చేతులు, తల లేవు. దుండుగులు హత్య చేసి కాలువలో పడేసి ఉంటారని భావిస్తున్నారు. ఉదయం కాలువ పక్కనుంచి వెళుతున్న మత్స్యకారులు నీటిలో తేలుతున్న మృతదేహాన్ని గుర్తించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మృతురాలి వయసు 30 నుంచి 35 ఏళ్లు ఉంటుందని, హత్య జరిగి వారం రోజులు అయ్యి ఉంటుందని భావిస్తున్నారు. మొండెం మాత్రమే లభ్యం కావడంతో కాలువ ఎగువ ప్రాంతాలైన అడ్డతీగల, రాజవొమ్మంగి మండలాల నుంచి కొట్టుకువచ్చిందా లేదా మైదాన ప్రాంతం నుంచి తీసుకువచ్చి ఇక్కడ పడేశారా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఫ హత్యచేశారని పోలీసుల అనుమానం -
ఇలా ఇసుకిస్తారా!
● కపిలేశ్వరపురం స్టాక్ పాయింట్ వద్ద 60,188 మెట్రిక్ టన్నుల ఇసుక అమ్మకాలు జరిపారు. ఇప్పుడు కొద్దిపాటి నిల్వలు మాత్రమే ఉన్నాయి. మరో రెండు రోజుల్లో ఈ నిల్వలూ పూర్తి కానున్నాయి. ● ఆలమూరు మండలం జొన్నాడ స్టాక్ పాయింట్ వద్ద 10,590 మెట్రిక్ టన్నుల ఇసుక ఉండగా, జిల్లాలో తొలి స్టాక్ పాయింట్ ఇదే. అయితే ఇసుక అమ్మకాలు పూర్తయ్యాయి. ఇప్పుడున్న కొద్దిపాటి ఇసుక మట్టిలో కలిసిపోయింది. ● ఉచిత ఇసుక నిల్ ● జిల్లాలో ఆరు స్టాక్ పాయింట్లు ● మిగిలింది అరకొర నిల్వలే ● అదీ పీఆర్ అప్పగించామంటున్న అధికారులు ● వరదతో అక్టోబర్ 15 వరకూ ర్యాంపుల్లో సేకరణ కష్టమే ● నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం సాక్షి, అమలాపురం/ రావులపాలెం/ కొత్తపేట/ కపిలేశ్వరపురం/ ఆలమూరు: ఇసుక కంటికి కనిపించడం లేదు.. ఎక్కడా దొరికే పరిస్థితి లేదు.. నిల్వలు లేక స్టాక్ పాయింట్లు తెరిచే పరిస్థితి లేదు. కొద్దిపాటి నిల్వలను సైతం ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తామని అధికారులు చెబుతుండడంతో ఇసుక దొరకడం లేదు. ఇదే సమయంలో గోదావరి వరద నీటి ప్రవాహం కారణంగా అక్టోబర్ 15 వరకూ ఇసుక తవ్వకాలు చేసే అవకాశాలు కనిపించడం లేదు. ఈ ప్రభావం నిర్మాణ రంగంపై పడుతోంది. కార్మికుల ఉపాధికి గండి కొడుతోంది. మొదలు పెట్టే సమయానికి.. కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీ మొదలు పెట్టే సమయానికి జిల్లాలో ఆరు స్టాక్ పాయింట్లలో 2,44,131 మెట్రిక్ టన్నుల ఇసుక ఉందని తేల్చారు. రావులపాలెం–1 స్టాక్ పాయింట్లో 33,888 మెట్రిక్ టన్నులు, రావులపాలెం–2లో 82,089, కొత్తపేట (మందపల్లి) 25,898, జొన్నాడ 10,590, తాతపూడి 31,478, కపిలేశ్వరపురంలో 60,188 మెట్రిక్ టన్నుల చొప్పున నిల్వలు ఉండగా, ప్రభుత్వం ఇక్కడి నుంచి ఇసుక అమ్మకాలు చేపట్టింది. కానీ అంతకు ముందే అంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటి రోజు నుంచే రావులపాలెం–1, 2, మందపల్లి ఇసుక స్టాక్ పాయింట్ల నుంచి దొడ్దిదారిన టన్నుల కొద్దీ ఇసుకను తరలించుకుపోయారు. కపిలేశ్వరపురం మండల పరిధి తాతపూడి వద్ద కూడా ఇలా కొల్లగొట్టేందుకు ప్రయత్నించగా స్థానికులు తిరగబడడంతో నిలిచిపోయింది. తరువాత గుర్తించిన నిల్వలను ప్రభుత్వం ఉచితం పేరుతో టన్నుకు రూ.265 చొప్పున వసూలు చేసి అమ్మకాలు చేసిన విషయం తెలిసిందే. పేరుకు ఉచిత ఇసుకే కానీ టీడీపీ ప్రజాప్రతినిధుల పేరున ట్యాక్స్‌లు, లారీల యజమానులు రెట్టింపు చేసి రవాణా చార్జీలు వసూలు చేయడంతో ఉచిత ఇసుక కాస్తా వినియోగదారులకు మోయలేని భారంగా మారింది. అప్పటి వరకూ ఇంతే.. ఇప్పటికీ గోదావరిలో వరద నీరు ప్రవహిస్తోంది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి శనివారం సాయంత్రం ఆరు గంటల సమయంలో 2,02,483 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఎగువన క్యాచ్మెంట్ ఏరియాలో ఇంకా వర్షాలు పడే అవకాశముంది. సహజంగా గోదావరికి ఆగస్ట్‌లోనే పెద్ద వరదలు వస్తుంటాయి. అక్టోబర్ 15 వరకూ ఇదే పరిస్థితి ఉంటోంది. దీనివల్ల ర్యాంపులు నిర్వహించే అవకాశం తక్కువ. అప్పటి వరకూ ర్యాంపుల నుంచి ఇసుక తీయడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. ముందుచూపు లేకుండా.. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జూన్ 4న వచ్చాయి. అప్పటి వరకూ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా ఎంపిక చేసిన స్టాక్ పాయింట్లలో భారీగా ఇసుక నిల్వ చేసింది. కూటమి ప్రభుత్వం, అధికార టీడీపీ ఎమ్మెల్యేలు ఆ నిల్వలను కొల్లగొట్టుకుని జేబులు నింపుకోవాలని చూశారే తప్ప గోదావరి వరదలు వస్తే మూడున్నర నెలల పాటు ఇసుక సేకరణ ఇబ్బంది అవుతోందనే ధ్యాస లేకుండా పోయింది. గోదావరికి జూలై 20 తరువాత కాని వరద రాలేదు. అప్పటి వరకూ ఇసుక సేకరించే అవకాశమున్నా కొత్త ప్రభుత్వం గుర్తించ లేదు. దీనివల్ల ఇప్పుడు కొరత వేధిస్తోంది. నిర్మాణ రంగంపై ప్రభావం జిల్లాలోని స్టాక్ పాయింట్లలో ఇసుక లేదు. ర్యాంపులు అప్పుడే తెరుచుకోక ఇసుకకు కొరత ఉండనుంది. పట్టణాలు, అభివృద్ధి చెందిన గ్రామాల్లో అపార్ట్మెంట్లు, కమర్షియల్ భవనాలు నిర్మించేవారు ముందుగానే ఈ పరిస్థితి ఊహించి ఇసుక నిల్వ చేసుకున్నారు. కానీ సామాన్యులు, మధ్య తరగతి కుటుంబాలు ఇసుక నిల్వ చేయలేదు. ఇసుక కొరత ప్రభావం వీరిపై అధికంగా పడనుంది. నిల్వలు అడుగంటినందున ఇసుకకు మరింత డిమాండ్ వచ్చిన తరువాత ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖకు అప్పగిస్తామని చెబుతున్నారు. ఈ ఇసుకను సైతం తెలుగు తమ్ముళ్లు దొడ్డిదారిన విక్రయించే అవకాశముందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు నిఘా ఉంచాలనే డిమాండ్ ఉంది. కపిలేశ్వరపురంలో ఇసుక స్టాక్ పాయింట్ ఇక నో స్టాక్.. రావులపాలెం–1 స్టాక్ పాయింట్లో 33,888 మెట్రిక్ టన్నుల ఇసుక ఉన్నట్టు మొదట్లో అధికారులు చెప్పారు. దాదాపు ఇక్కడ అమ్మకాలు పూర్తయ్యాయి. అధికారికంగా ఇసుక మొత్తం ఖాళీ అయ్యింది. అదనంగా ఏమీ లేదు. ఎటువంటి విక్రయాలూ జరగడం లేదు. ఉన్నది పోగు చేస్తూ.. రావులపాలెం–2లో ప్రభుత్వం 82,089 మెట్రిక్ టన్నుల ఇసుక ఉన్నట్టు చెప్పింది. వాస్తవంగా ఇంతకన్నా అధికంగానే ఇక్కడ ఇసుక ఉందని అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం ఇక్కడ కేవలం 600 టన్నుల మాత్రమే ఉంది. ఉన్న కొద్దిపాటి ఇసుకను పోగు పెడుతున్నారు. అయితే కొబ్బరి ఆకులు, డస్టు పౌడర్ వస్తుండడంతో ఇది ఇళ్ల కట్టుబడికి పనికి రాదని చెబుతున్నారు. వచ్చే కొద్దిపాటి ఇసుకను పంచాయతీరాజ్ శాఖ పరిధిలో ఉంచుతామని అధికారులు వివరించారు. అభివృద్ధికని చెబుతూ.. కొత్తపేట మండలం మందపల్లి వద్ద ఉన్న ఈ స్టాక్ పాయింట్లో 25,898 మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వలు ఉన్నాయి. ఇక్కడ అమ్మకాలు దాదాపుగా పూర్తయ్యాయి. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక కొత్తపేట ఇసుక స్టాక్ పాయింట్ నుంచి ఇసుకను టీడీపీ నాయకులు అక్రమంగా తరలించారు. ఇంకా 1,200 టన్నుల మిగిలిన ఇసుకను అభివృద్ధి కార్యక్రమాల కోసం నిల్వ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఇది కాకుండా మరో వెయ్యి టన్నుల ఇసుక స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఖాళీ స్థలంలో నిల్వ చేశారు. -
యువకుడి మృతదేహం లభ్యం
కె.గంగవరం: కోటిపల్లిలోని గౌతమి గోదావరి నదిలో శుక్రవారం సాయంత్రం స్నానానికి దిగి కుందూల నరేంద్ర (25) గల్లంతయ్యాడు. రాత్రి నుంచి గజ ఈతగాళ్లతో స్థానిక పోలీసులు, రెవెన్యూ సిబ్బంది గాలింపు చర్యలు చేట్టారు. స్నానానికి దిగిన ప్రాంతానికి కూతవేటు దూరంలో శనివారం ఉదయం శవమై తేలాడు. వెంటనే గుర్తించిన ఈతగాళ్లు మృతదేహాన్ని గట్టుకు చేర్చారు. కె.గంగవరం పోలీసులు మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే నరేంద్ర మృతితో ద్రాక్షారామ తోటపేటలో విషాదచాయలు అలముకున్నాయి. నరేంద్ర తల్లి ద్రాక్షారామలోని ప్రైవేట్‌గా ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంది. -
వ్యక్తి ఆత్మహత్య
కపిలేశ్వరపురం: మండలంలోని కేదారిలంక గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ కోణాల ఏడుకొండలు (43) తన ఇంట్లో ఈ నెల 16న రాత్రి ఉరివేసుకుని మృతి చెందాడు. మనస్పర్థల కారణంగా ఇటీవల అతని భార్య ధనలక్ష్మి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపం చెందిన ఏడుకొండలు తన ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అతని కుమార్తె పావని ఫిర్యాదు మేరకు అంగర ఇన్చార్జి ఎస్సై సురేష్‌బాబు ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రైలు కిందపడి ఆత్మహత్య
తుని: రైలు కింద పడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు జీఆర్పీ ఎస్సై షేక్ అబ్దుల్ మారూఫ్ శనివారం తెలపారు. ఆ వివరాల్లోకెళ్తే.. తుని మండలం సూరవరం గ్రామానికి చెందిన వజ్రపు భాను పద్మేశ్వరరావు (19) ఇంట్లో ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో చనిపోవాలనే నిర్ణయానికి వచ్చాడు. స్థానిక రైల్వే పెద్ద గేటు సమీపంలో తుని నుంచి అన్నవరం వైపు వెళ్తున్న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. శృంగార వల్లభునికి రూ.2.69 లక్షల ఆదాయం పెద్దాపురం: మండలంలోని తొలి తిరుపతి స్వయంభూ శృంగార వల్లభుని ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముందస్తు ఏర్పాట్లు చేశారు. ఆలయంలో వివిధ సేవల టిక్కెట్లు, అన్నదానం, కేశ ఖండన ద్వారా స్వామికి 2,68,814 రూపాయలు ఆదాయం సమకూరినట్లు ఈఓ తెలిపారు. సుమారు 12 వేల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారని, సుమారు నాలుగు వేల మంది భక్తులు అన్నదానం స్వీకరించారని పేర్కొన్నారు. -
విజన్ కార్యాచరణ తయారు చేయాలి
అమలాపురం రూరల్: వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా వికసిత్ ఆంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పనకు వచ్చే ఐదేళ్లకు జిల్లా కార్యాచరణ తయారు చేయాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం అమలాపురం కలెక్టరేట్లో శాఖల వారీగా జిల్లా యాక్షన్ ప్లాన్ రూపొందించే అంశంపై కార్యశాల నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా అధికారులందరికీ ఈ నెల 21 నుంచి 31 వరకూ రాష్ట్ర స్థాయిలో సంబంధిత హెచ్ఓడీల సమావేశాలు నిర్వహించి, తమ శాఖల ప్రణాళికను రూపొందించడానికి దిశానిర్దేశం చేస్తారన్నారు. జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి, సీపీఓ వెంకటేశ్వర్లు, డీఆర్డీఏ పీడీ శివశంకర ప్రసాద్, డ్వామా పీడీ మధుసూదన్, అగ్రికల్చర్ జేడీ బోసుబాబు పాల్గొన్నారు. సోలార్ రూఫ్‌టాప్‌లు నిర్మించుకోవాలి పేద, మధ్యతరగతి కుటుంబాలు ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన కింద తమ ఇళ్లపై సోలార్ రూఫ్ టాప్‌లను నిర్మించుకోవడం ద్వారా 300 యూనిట్ల వరకూ విద్యుత్తును ఆదా చేసుకోవచ్చని కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రధాన మంత్రి సూర్యఘర్ యోజన క్యూఆర్ కోడ్ సెల్ఫీ స్టాండ్‌ను ఆయన పరిశీలించారు. క్యూఆర్ కోడ్లను స్కాన్ చేసి ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన కింద రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఒక కిలో వాట్ సామర్థ్యం గల సోలార్ ప్యానల్లను ఏర్పాటు చేసుకుంటే రూ. 30 వేల వరకూ రాయితీ అందిస్తుందని, రెండు కిలోవాట్ల సామర్థ్యానికి రూ. 60 వేలు, మూడు కిలోవాట్లకు గరిష్టంగా రూ.78 వేల వరకూ రాయితీ అందిస్తుందన్నారు. ఈ పథకం కింద సోలార్ ప్యానల్ ఏర్పాటు చేసుకోవడానికి అతి తక్కువ వడ్డీకే బ్యాంకుల నుంచి రుణాలు లభిస్తాయన్నారు. సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటుకు టోల్ ఫ్రీ నంబర్ 1912కు ఫోన్ చేయవచ్చని తెలిపారు. -
కిడ్నీ బాధితుడికి రూ.లక్ష సాయం
కాట్రేనికోన: ిప.గన్నవరం నియోజకవర్గం లంకల గన్నవరం డొక్కా సీతమ్మ కాలనీకి చెందిన కొల్లు రవీంద్ర (21) రెండు కిడ్నీలు పాడై మంచాన పడ్డాడు. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న ముమ్మిడివరం నియోజకవర్గం పల్లం గ్రామానికి చెందిన అగ్నికుల క్షత్రియ యువత సాయం అందించారు. నిరుపేద కుటుంబానికి అండగా ఉండాలనే తపనతో స్నేహితులంతా కలసి రూ.లక్ష సేకరించి అందజేశారు. ఆర్థిక సహాయం అందించిన యువకుల్లో అవనిగడ్డ నారాయణమూర్తి, మల్లాడి దయ, అవనిగడ్డ శ్రీరాములు, బొమ్మిడి శ్రీరాములు, రాజు, శంకర్, నాయకర్, రామరాజు, వీరబాబు తదితరులు ఉన్నారు. జిల్లా ఏఎస్పీగా ప్రసాద్ అమలాపురం టౌన్: జిల్లా ఏఎస్పీ (అడ్మిన్)గా ఏవీఆర్‌పీబీ ప్రసాద్ బదిలీపై వస్తున్నారు. ఇప్పటి వరకూ ఇక్కడ ఏఎస్పీగా పనిచేసిన ఎస్.ఖాదర్ బాషాకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. బాషాను మంగళగిరిలోని పోలీస్ హెడ్ క్యార్టర్స్‌లో రిపోర్టు చేయాలని ఆదేశాలు వచ్చాయి. నెల్లూరు జిల్లా క్రైం విభాగం ఏఎస్పీగా పనిచేస్తున్న ప్రసాద్ జిల్లాకు వస్తున్నారు. ఆయన రెండు రోజుల్లో బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని స్థానిక ఎస్పీ కార్యాలయం పేర్కొంది. ఇక్కడ పనిచేసిన ఏఎస్పీ బాషా ఏడాదిన్నర కిందట బాధ్యతలు చేపట్టారు. కోనసీమ జిల్లా ఏర్పాటయ్యాక ప్రసాద్ మూడో ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరించనున్నారు. చవితి ఏర్పాట్లకు శ్రీకారం అయినవిల్లి: అయినవిల్లి విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో వచ్చే నెల 7 నుంచి 15 వరకూ నిర్వహించే వినాయక చవితి మహోత్సవాలకు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ శనివారం శ్రీకారం చుట్టారు. ఆలయ ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు, ప్రధానార్చకుడు అయినవిల్లి సూర్యనారాయణ మూర్తి మంత్రోచ్ఛారణల మధ్య ఎమ్మెల్యే ఉత్సవాలకు నాంది పలికారు. గ్రామ సర్పంచ్ కాకర శ్రీనివాస్, జెడ్పీటీసీ సభ్యుడు గన్నవరపు శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీ బయ్యా చినబాబు తదితరులు పాల్గొన్నారు. బాలాజీ ఆలయంలో భక్తుల సందడి మామిడికుదురు: అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామి ఆలయం శ్రావణ మాసం సందర్భంగా శనివారం భక్తులతో సందడిగా మారింది. తొలుత పవిత్ర వైనతేయ గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారికి ముడుపులు, మొక్కుబడులు చెల్లించారు. ఆలయం చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేశారు. స్వామి వారికి వివిధ సేవల ద్వారా రూ.3,17,707 ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ గ్రంధి మాధవి తెలిపారు. ఇందులో లడ్డూ ప్రసాదం, దర్శనం టిక్కెట్ల విక్రయం ద్వారా రూ.2,30,798, నిత్యాన్నదాన ట్రస్టుకు భక్తులు రూ.86,909 విరాళంగా అందించారు. 3,671 మంది స్వామి వారిని దర్శించుకోగా, 2,948 మంది అన్నప్రసాదం స్వీకరించారు. స్వామివారి నిత్యాన్నదాన ట్రస్టుకు పాశర్లపూడిబాడవకు చెందిన కాండ్రేగుల వెంకటేశ్వరరావు, సూర్యావతి దంపతులు రూ.11,111 విరాళంగా సమర్పించారు. -
త్వరలోనే ప్రభాస్‌తో స్పిరిట్
రాజానగరం: ప్రముఖ సినీ హీరో ప్రభాస్‌తో త్వరలోనే స్పిరిట్ సినిమా ప్రారంభమవుతుందని సినీ దర్శకుడు సందీప్‌రెడ్డి స్పష్టం చేశారు. అర్జున్‌రెడ్డి, కబీర్‌సింగ్, యానిమల్ చిత్రాలు తీసి హిట్ కొట్టి ఫామ్‌లో ఉన్న ఆయన స్థానిక జీఎస్ఎల్ వైద్య కళాశాల ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన స్వతంత్య్ర ఆసుపత్రి 38వ వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనతో ‘సాక్షి’ ముచ్చడించింది. ఆ వివరాలు ఇలా.. ప్రశ్న: మీరు తీసే సినిమాల్లో వైద్యానికి సంబంధించి అంశాలే ఎక్కువగా ఉంటున్నాయి. దానికి కారణాలేంటి? సందీప్‌రెడ్డి: ఫిజియోథెరపీ కోర్సు చేసిన నేను కొంతకాలం ప్రాక్టీస్ కూడా చేశాను. అందువల్ల ఆ ఛాయలు సినిమాల్లో కాస్త డీప్‌గా కనిపిస్తుంటాయి. ప్రశ్న: వైద్య రంగంలో ఉన్న మీరు సినిమా రంగం వైపు ఎందుకు వెళ్లారు? సందీప్‌రెడ్డి: విద్యార్థి దశ నుంచి ఎందుకో సినిమాలపై ఎక్కువగా ఆసక్తి ఉండేది. సినిమా తీసే విధానాన్ని నిశితంగా పరిశీలించే వాడిని. అందుకే ఫిజియోథెరపిస్టుగా ప్రాక్టీసు చేసే సమయంలోనే సినీ రంగం వైపు అడుగులు పడ్డాయి. ప్రశ్న: తదుపరి సినిమాల గురించి చెబుతారా..! సందీప్‌రెడ్డి: ప్రభాస్ హీరోగా ‘స్పిరిట్’ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభమవుతుంది. ప్రశ్న: మహేష్‌బాబుతో సినిమా అన్నారు, ఎప్పుడు చేస్తారు? సందీప్‌రెడ్డి: ప్రస్తుతం అందుకు సమయం లేదు. స్పిరిట్ సినిమా తరువాత యానిమల్– 2కి వెళ్తాం. ఈ రెండింటికీ కనీసం నాలుగేళ్లు పడుతుంది. ఆ తరువాతే ఏదైనా ఉంటుంది. ప్రశ్న: వైద్య విద్యార్థులకు మీరిచ్చే సందేశం ఏంటి? సందీప్‌రెడ్డి: సినిమాల ద్వారానే నా సందేశం ఏంటో చెబుతూనే ఉన్నాను. ఏదేమైనా చేసే పనిపై ఫోకస్ పెట్టాలి. అప్పుడే సరైన ఫలితాలను అందుకోగలుగుతాం. -
గోవిందా.. హరి గోవింద
ఫ వాడపల్లికి ఆధ్యాత్మిక శోభ ఫ పెరిగిన భక్తుల రద్దీ ఆత్రేయపురం: గోవిందా.. హరి గోవింద నామస్మరణ మార్మోగింది. కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి ఆలయం శనివారం కిక్కిరిసింది. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. వేద పండితులు, అర్చకులు పువ్వుల రాయుడు వేంకటేశ్వర స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, నీరాజన మంత్రపుష్పం తదితర పూజలు నిర్వహించారు. భక్తులు తలనీలాలు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. ఏడు శనివారాల నోము ఆచరిస్తున్న భక్తులు ఏడు ప్రదక్షిణలు చేసి మొక్కుబడులు తీర్చుకున్నారు. కోరిన కోర్కెలు తీరిన భక్తులు స్వామివారి దర్శనానికి కాలినడకన వచ్చారు. ఆలయ ఆవరణలో వేలాది మందికి అన్నసమారాధన జరిగింది. ఈ ఏర్పాట్లను దేవదాయ ధర్మదాయశాఖ డిప్యూటీ కమిషనర్, ఆలయ ఈఓ భూపతిరాజు కిశోర్‌కుమార్ పర్యవేక్షించారు. అలాగే పురాణ ప్రసిద్ధి చెందిన ర్యాలి జగన్మోహినీ కేశవస్వామి ఆలయం, ఆత్రేయపురం శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. -
తోడుగా.. రక్షగా..
ఫ అప్యాయతకు ప్రతీక రక్షాబంధన్ ఫ తోబుట్టువుల అనురాగాలకు సూచిక ఫ రేపు రాఖీ పండగ రాయవరం: కష్టాల్లో తోడూనీడగా... అనుబంధానికి ప్రతిరూపంగా.. యోగక్షేమాలు తెలుసుకుంటూ.. ఆప్యాయత పంచుతూ.. తోబుట్టువుల బంధాన్ని శాశ్వతంగా నిలిపేదే రక్షాబంధన్. అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల ఆత్మీయతకు నిర్వచనమే రాఖీ పండగ. ఇది సోదరి, సోదరుని మధ్యన ప్రేమానుబంధానికి ప్రతీక. ఈ నెల 19వ తేదీ సోమవారం శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమి తిథి కావడంతో రాఖీ పౌర్ణమిని తోబుట్టువులు ఆనందోత్సాహాలతో జరుపుకొనేందుకు సిద్ధమవుతున్నారు. పండగ రోజు పుట్టిళ్లు సందడిగా మారనున్నాయి. అక్కాచెల్లెళ్లు కట్టిన రాఖీలతో సోదరుల చేతులు వివిధ రంగులు, డిజైన్ల రాఖీలతో కళకళలాడనున్నాయి. అండగా ఉంటామని హామీ ఇస్తూ అన్నదమ్ములు తమకు తోచిన కానుకలు సోదరీమణులకు ఇస్తారు. రక్షా బంధన్‌ను రాఖీ పౌర్ణమి.. జంధ్యాల పౌర్ణమిగా పిలుస్తారు. విద్యార్థినీ విద్యార్థులు, యువతీ యువకుల మధ్య సోదరభావం, నైతిక విలువలు పెరిగేందుకు ఇది దోహపడుతోంది. ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్ పెరుగుతున్న పరిస్థితుల్లో కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థి సంఘాలు ఈ పండగను ఘనంగా నిర్వహించేందుకు చొరవ చూపాలి. మహాలక్ష్మి స్వరూపంగా.. ఆడ పడుచును మహాలకి్ష్మ్ స్వరూపంగా, పరాశక్తికి ప్రతీకగా భావించే సంస్కృతి మనది. కష్ట సుఖాల్లో భరోసాను అక్కాచెల్లెళ్లకు కల్పించడమే రాఖీ బంధం. సోమవారం జిల్లా వ్యాప్తంగా రాఖీ పౌర్ణమిని ఘనంగా నిర్వహించుకొనేందుకు సోదర సోదరీమణులు సన్నద్ధమవుతున్నారు. శ్రావణమాసంలో పౌర్ణమి రోజున వచ్చే ఈ పర్వదినాన్ని జంధ్యాల పౌర్ణమిగా పిలుస్తుంటారు. తమిళనాడులో పూనూల్పర్వగా, కేరళలో ఆవని ఆవిట్టంగా పిలుస్తుంటారు. ఉత్తరాదిలో రక్షాబంధన్‌గా పిలవడం పరిపాటి. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం (ఓంశాంతి) ప్రతినిధులు రాఖీ పండగను ఆధ్యాత్మిక విశిష్టతగలదిగా భావిస్తారు. తమ కార్యాలయాల్లో ఆధ్యాత్మిక కార్యకలాపాలు నిర్వహిస్తారు. ప్రభుత్వ అధికారులు, రాజకీయ ప్రముఖులతో పాటు ఇతర రంగాల ప్రముఖులకు కూడా పండగ రోజు బ్రహ్మకుమారీలు రాఖీలు కట్టడం ఆనవాయితీగా వస్తోంది. మార్కెట్లో కళకళ రాఖీ పండగను పురస్కరించుకుని మార్కెట్లోని పలు ఫ్యాన్సీ షాపుల్లో సంప్రదాయ, ఆధునిక రాఖీలు కనువిందు చేస్తున్నాయి. వ్యాపారులు రంగురంగుల రాఖీలను అమ్మకాలకు పెట్టారు. ముఖ్యంగా పిల్లలను ఆకర్షించే వివిధ కామిక్ రాఖీలను ఎక్కువగా విక్రయిస్తున్నారు. మరికొన్ని బంగారు బ్రాస్లెట్లను తలపిస్తూ ధగధగలాడుతున్నాయి. రుద్రాక్ష, ప్లాస్టిక్, పూల రాఖీలు, రంగు పూసల రాఖీలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. ఇవి కాలానుగుణంగా కొత్త డిజైన్లలో వస్తున్నాయి. గతంతో పోల్చితే విక్రయాలు పెరుగుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. రూ.10 నుంచి రూ.వేల ధరల్లో లభ్యమవుతున్నాయి. అన్నంటే ప్రాణం నాకు సొంత అన్నయ్యలు లేరు. నా కజిన్స్ అంతకంటే ఎక్కువగా భావిస్తాను. ఏటా మా అన్నకు రాఖీ కడతాను. ఎంత దూరాన ఉన్నా మా అన్న నా దగ్గరకు వచ్చి రాఖీ కట్టించుకొని వెళ్తాడు. అన్ని పండగల్లో అన్నాచెల్లెల గురించి తెలియజేసే పండగ ఇదే. ఎంత వయసు వచ్చినా అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ఏదీ సాటిరాదు. –ఆర్.కృష్ణమాధురి, మండల లెవిల్ అకౌంటెంట్, విద్యాశాఖ కార్యాలయం, మండపేట కష్ట సుఖాల్లో తోడుండేవాడే.. కష్ట సుఖాల్లో తోడుగా నిలిచి, మన శ్రేయస్సు కోరుకునే వారే సోదరులు. నా అన్నయ్యలు ఎప్పుడూ నాకు వెన్నంటే నిలిచారు. రాఖీ పండగ వస్తుందంటే నా కంటే ఎక్కువగా అన్నయ్యలు సంతోషపడతారు. ఎంతదూరాన ఉన్నా రాఖీ పండగకు తప్పనిసరిగా ఇంటికి వచ్చి ఆశీర్వదించి వెళ్తారు. వారి ప్రేమాభిమానాలు ఎప్పటికీ నిలిచి ఉండాలని కోరుకుంటాను. –షేక్ కరీమున్నీసా బేగం, పసలపూడి, రాయవరం మండలం ఆన్లైన్లో కానుకలు కాలం మారడంతో పాటు రక్షా బంధన్ తీరు మారింది. విద్య, ఉపాధి, ఇతరత్రా కారణాలతో దూర ప్రాంతాల్లో ఉంటున్న సోదరులకు పోస్టు ద్వారా రాఖీలను పంపితే వాటిని కట్టుకొని తోబుట్టువులకు కానుకలు పంపే సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా పరస్పరం అభినందనలు తెలుపుకొంటూ ఆనందాన్ని పంచుకుంటున్నారు. పద్ధతులు మారినా రాఖీ అనుబంధం, ఆప్యాయత మాత్రం చెక్కు చెదరలేదు. -
మందపల్లిలో శని త్రయోదశి పూజలు
కొత్తపేట: శనిదోష నివారణకు ప్రసిద్ధి చెందిన మందపల్లి ఉమామందేశ్వర (శనైశ్చర) స్వామివారిని శనివారం అత్యధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. స్వామికి ప్రీతికరమైన శనివారంతో పాటు త్రయోదశి పర్వదినం కలసి రావడంతో ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంతో పాటు ఆలయం వెనుక షెడ్లలో భక్తులు పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవారి దర్శనానికి బారులు తీరారు. దేవదాయ, ధర్మదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్, దేవస్థానం ఈఓ కె.విజయలక్ష్మి ఆధ్వర్యంలో భక్తుల పూజలు, దర్శనానికి ఏర్పాట్లు చేశారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా పూజలు, తైలాభిషేకాల టిక్కెట్ల ద్వారా దేవస్థానానికి రూ.13,89,710, అన్నప్రసాదం విరాళాల రూపంలో రూ.57,700 ఆదాయం వచ్చిందని ఈఓ విజయలక్ష్మి తెలిపారు. కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ దంపతులు మందపల్లి శనైశ్చరుని దర్శించుకుని ప్రత్యేక పూజలు, తైలాభిషేకం చేశారు. ఆలయ సంప్రదాయం ప్రకారం కలెక్టర్ దంపతులకు దేవస్థానం తరఫున స్వాగతం పలికారు. పూజాధికాల అనంతరం వేదపండితులు వేదాశీస్సులు అందించి, శాలువాతో సత్కరించారు. స్వామివారి ప్రసాదం, చిత్రపటం అందజేశారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ జీవీవీ సత్యనారాయణ, తహసీల్దార్ వై.రాంబాబు, ఆర్ఐ కె.ఏడుకొండలు తదితరులు ఉన్నారు. డివైడర్‌ను దాటి.. ముగ్గురిని ఢీకొట్టి ఆలమూరు: ఓ వ్యాన్ డివైడర్‌ను దాటొచ్చి రెండు బైక్‌లను ఢీకొన్న ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. జాతీయ రహదారిలోని చొప్పెల్ల వద్ద శనివారం ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. చొప్పెల్లకు చెందిన ఆకులు వెంకన్న (45), అడబాల సత్యనారాయణ (57)లు ఓ బైక్ వస్తుండగా, చిక్కిరెడ్డి రాజు (32) మరో బైక్‌పై ఆగి ఉన్నారు. వీరు వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి వెళ్తున్నారు. జొన్నాడ నుంచి రాజమహేంద్రవరం వైపు ఇటుక లోడుతో వెళ్తున్న వ్యాన్ ఇక్కడి కొండలమ్మ గుడి జంక్షన్‌కు వచ్చేసరికి అదుపుతప్పి డివైడర్ దాటుకుంటూ వచ్చి వీరి బైక్‌లను ఢీకొంది. అనంతరం మరో వాహనం దగ్గరకు వచ్చి ఆగింది. ఈ ప్రమాదంలో పై ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఎస్సై ఎం.అశోక్ తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వెంటనే హైవే, 108 అంబులెన్స్ సిబ్బంది వచ్చి క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మెరుగైన వైద్యం నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో రెండు బైక్‌లూ నుజ్జునుజ్జయ్యాయి. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముగ్గురిలో సత్యనారాయణ, వెంకన్న పరిస్థితి విషమంగా ఉందనే అభిప్రాయాన్ని వైద్యులు వ్యక్తం చేయడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. మరో క్షతగాత్రుడు చిక్కిరెడ్డి రాజు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు చెప్పారు. వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఈ మేరకు ఆలమూరు ఎస్సై ఎం.అశోక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వృద్ధుడి మృతి కాజులూరు: గొల్లపాలెంలోని కాజులూరు రోడ్ జంక్షన్లో శనివారం హెరిటేజ్ పాల వ్యాన్ సైకిల్‌ను ఢీకొన్న ఘటనలో ఓ వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఆర్యావటం శివారు ముత్తావారిగరువుకు చెందిన కోట వెంకట్రావు (70) ఐస్‌క్రీమ్ వ్యాపారం చేస్తూ జీవనోపాధి సాగిస్తున్నాడు. శనివారం ఉదయం తన సైకిల్‌పై గొల్లపాలెం నుంచి ఇంటికి వెళ్తుండగా కాజులూరు రోడ్ జంక్షన్లో ఎదురుగా వస్తున్న హెరిటేజ్ పాల వ్యాన్ ఢీకొంది. ఈ ఘటనలో వెంకట్రావు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు వెంకట్రావుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ కేసును గొల్లపాలెం ఎస్సై ఎం.తులసీరామ్ దర్యాప్తు చేస్తున్నారు. ఫ బైక్‌లను ఢీకొన్న వ్యాన్ ఫ ఒకరికి తీవ్ర గాయాలు ఫ ఇద్దరి పరిస్థితి విషమం -
వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి
కలెక్టర్ మహేష్ కుమార్ అమలాపురం రూరల్: సీబీఎస్ఈ సిలబస్ అనుబంధ పాఠశాలల్లో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో జిల్లాలోని సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్, హాస్టళ్ల నిర్వహణ, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, సీబీఎస్సీ సిలబస్ అనుబంధ పాఠశాలల్లోని వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తదితర అంశాలపై సమీక్షించారు. జిల్లాలోని 55 బీసీ, ఎస్సీ వెల్ఫేర్ హాస్టళ్లలో ఎంతమంది పిల్లలు ఉన్నారని, వారికి అందిస్తున్న భోజనం, కాస్మోటిక్ చార్జీలు, మెడికల్ క్యాంపుల నిర్వహణ తదితర అంశాలపై అధికారులను ఆరా తీశారు. సోషల్ వెల్ఫేర్ జేడీ జ్యోతిలక్ష్మీదేవి, డీఈఓ ఎం.కమలకుమారి తదితరులు పాల్గొన్నారు. పూర్తిగా మంచానికి, వీల్ చైర్‌కు పరిమితమైనట్లు వికలాంగ సర్టిఫికెట్లు పొంది అధిక మొత్తంలో పెన్షన్లు పొందుతున్న పింఛనుదారులను పునః పరిశీలించాలని కలెక్టర్ మహేష్‌కుమార్ ఆదేశించారు. జిల్లాలో దివ్యాంగులకు అందిస్తున్న పింఛన్లపై ఆయన సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పూర్తి అంగవైకల్యం కలిగి మంచానికి, కుర్చీలకే పరిమితమైనట్లు సదరం సర్టిఫికెట్లు పొంది, లేక ఎటువంటి సర్టిఫికెట్ లేకుండా రూ.15 వేల పింఛన్ అందుకుంటున్న వ్యక్తులు 668 మంది ఉన్నారన్నారు. ఇందులో కొంతమంది అతి తక్కువ అంగవైకల్యం కలిగి ఉన్నప్పటికీ పూర్తి అంగవైకల్యం కేటగిరీలో రూ.15 వేల పింఛన్లు పొందుతున్నారని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. దీనిపై జిల్లాలో 5 రీఅసెస్మెంట్ మెడికల్ టీమ్‌లను ఏర్పాటు చేసి పునః పరిశీలించాలన్నారు. ఈ టీమ్‌లో ఆర్థోపెడీషియన్, ఫిజీషియన్, మెడికల్ ఆఫీసర్ ఉంటారన్నారు. ఈ ప్రక్రియ నెలాఖరు లోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. డీఎంహెచ్ఓ దుర్గారావు దొర, డీఆర్డీఏ పీడీ శివశంకర ప్రసాద్, డీసీహెచ్ ఎస్.కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. -
మహాలక్ష్మీ నమో నమః
● వెదురుపాక పీఠంలో వార్షికోత్సవాలు ప్రారంభం ● నేత్రపర్వంగా సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణం రాయవరం: శ్రీమహాలక్ష్మీ నమో నమః అంటూ ఆ అమ్మవారిని కొలిచారు.. ప్రత్యేక పూజలు చేశారు. దీనికి రాయవరం మండలం వెదురుపాక విజయదుర్గా పీఠం వేదిక అయ్యింది. పీఠం 52వ వార్షికోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. 1972లో పీఠాధిపతి వాడ్రేవు వెంకటసుబ్రహ్మణ్యం (గాడ్) పీఠం ఏర్పాటు చేసినప్పటి నుంచి ఏటా పీఠం వార్షికోత్సవాలను ఆగస్టు 16న ప్రారంభిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం విజయదుర్గా అమ్మవారికి ప్రత్యేక పూజలు, నవగ్రహ మండపారాధన చేశారు. కొల్హాపూర్ వేద పండితులచే శ్రీమహాలక్ష్మి అమ్మవారికి తిరుమంజనం అర్చన, హోమం నిర్వహించారు. సాయంత్రం 6.30 గంటలకు తమిళనాడు తిరుత్తణి ఆలయ అర్చకులచే సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణం శాస్త్రోక్తంగా జరిపారు. ఈ సందర్భంగా పీఠాధిపతి వాడ్రేవు వెంకటసుబ్రహ్మణ్యం (గాడ్) మాట్లాడుతూ లోక కల్యాణార్థం ప్రత్యేక పూజలు, అభిషేకాలు, కళ్యాణోత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. పీఠంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పీఠం ప్రతినిధుల ఆధ్వర్యంలో అన్న సమారాధన నిర్వహించారు. అన్నవరం దేవస్థానం ఆలయ కమిటీ చైర్మన్ ఐవీ రోహిత్, ఇన్చార్జి ఈఓ డి.రమేష్‌బాబులు విజయదుర్గా పీఠాన్ని సందర్శించి, గాడ్ ఆశీస్సులు అందుకున్నారు. పీఠం అడ్మినిస్ట్రేటర్ వీవీ బాపిరాజు, విజయదుర్గా సేవా సమితి ప్రతినిధులు భాస్కరనారాయణ, జి.సత్యవెంకటకామేశ్వరి, పి.సత్యకనకదుర్గ, బి.రమ, పీఠం పీఆర్వో వి.వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక అలంకరణలో విజయదుర్గమ్మ -
చమురు సంస్థలకు చెంపపెట్టు
● ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు ● ఖనిజ సంపద నుంచి ఇక ఆదాయం అమలాపురం టౌన్: మైనింగ్ చేసే సంస్థలు విధిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు రాయల్టీ చెల్లించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం హర్షణీయమని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు అన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ నాయకత్వంలో న్యాయమూర్తులు ఈ తీర్పు చెప్పడం రాష్ట్రంలో ఖనిజ సంపద కార్యకలాపాలు, అన్వేషణల పేరుతో దోచుకుంటున్న చమురు సంస్థలకు చెంప పెట్టులాంటిదన్నారు. శుక్రవారం అమలాపురంలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. 30 ఏళ్ల నుంచి కేజీ బేసిన్ పరిధిలో చమురు సంస్థలు భూమిని తవ్వి, గుల్లచేసి అన్వేషణలు, కార్యకలాపాల పేరుతో రూ.కోట్లు దోచుకుంటున్నాయని గుర్తు చేశారు. మొత్తంగా కేజీ బేసిన్ ప్రాంతానికి దాదాపు రూ.50 లక్షల కోట్ల రాయల్టీ రావాల్సి ఉందన్నారు. చమురు సంస్థలు సోషల్ రెస్పాన్స్‌బులిటీ పేరుతో చిన్న సామాజిక భవనాలు నిర్మించడం, అక్కడక్కడ రోడ్లు వేయడం తప్ప భారీ మొత్తంలో రాయల్టీ రూపంలో ఆయా ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయించిన సందర్భాలు లేవన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చమురు సంస్థల నుంచి రాయల్టీని పూర్తి స్థాయిలో రాబడితే రాష్ట్రానికి ఉన్న కొన్ని ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయని ఆయన అన్నారు. కొన్నేళ్లుగా చమురు సంస్థలు ఇక్కడ భూములను ఇష్టానుసారం తవ్వేసి చమురు, సహజ వాయువులను వెలికితీస్తూ వ్యవసాయాన్ని విచ్ఛిన్నం చేస్తున్న పరిణామాలపై తాము ఉద్యమాలు చేస్తున్నామని గుర్తు చేశారు. మైనింగ్ చేసే సంస్థల నుంచి రాయల్టీ నిధులను రాబట్టినప్పుడే రాష్ట్రాభివృద్ధి సాకారమవుతుందని పేర్కొన్నారు. ఉదాహరణకు పోలవరం ప్రాజెక్ట్, విశాఖ స్టీల్ ప్లాంట్ తదితర మేజర్ పనులకు రాయల్టీ సొమ్ము ద్వారా నిధులు సమకూర్చుకునే పరిస్థితి ఉంటుందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో మిత్రత్వంతో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ఆ దిశగా రాయల్టీ నిధులను కేంద్రం మెడలను వంచి సాధించాలన్నారు. -
53 మిలియన్ల కిలోల పొగాకు విక్రయాలు
దేవరపల్లి: వేలం కేంద్రాల్లో పొగాకు కొనుగోళ్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. మార్కెట్లో లభిస్తోన్న ధర రైతులకు లాభసాటిగా ఉండడంతో రైతులు పొగాకు విక్రయాలు వేగంగా జరుపుతున్నారు. 2023–24 పంట కాలంలో పండించిన పొగాకును ఈ ఏడాది మార్చి 6న కొనుగోలు చేయడం ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లాలోని రెండు వేలం కేంద్రాలతో పాటు ఏలూరు జిల్లాలోని మూడు వేలం కేంద్రాలు రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలో ఉన్నాయి. ఇప్పటి వరకూ 127 రోజులు కొనుగోళ్లు నిర్వహించారు. శుక్రవారం నాటికి ఐదు వేలం కేంద్రాల్లో సుమారు రూ.1,749 కోట్ల విలువ గల 53 మిలియన్ల కిలోల పొగాకు కొనుగోలు చేశారు. 2023–24 ఏడాదికి బోర్డు 48.25 మిలియన్ల కిలోల ఉత్పత్తికి అనుమతి ఇవ్వగా, ప్రకృతి వైపరీత్యాల కారణంగా సాగు విస్తీర్ణం పెరగడంతో ఉత్పత్తి బాగా పెరిగింది. దీంతో 67 మిలియన్ల కిలోలు పొగాకు ఉత్పత్తి అవుతుందని పోగాకు బోర్డు అధికారులు, కొనుగోలు సంస్థలు అంచనా వేశాయి. దాదాపు ఈ అంచనాలకు చేరువలో పొగాకు ఉత్పత్తి అవుతోంది. ఇప్పటి వరకూ 53 మిలియన్ల కిలోల పొగాకు విక్రయాలు జరగడంతో బ్రైట్ గ్రేడు పొగాకు అమ్మకాలు దాదాపు చివరి దశకు చేరుకున్నట్టేనని అధికారులు వివరిస్తున్నారు. -
రత్నగిరి కిటకిట
తొండంగి: శ్రావణమాసంలో వివాహా ముహూర్తాల నేపథ్యంలో శుక్రవారం రత్నగిరి నూతన దంపతులతో కిటకిటలాడింది. గురువారం రాత్రి వివాహాలు జరగడంతో రాష్ట్రం నలుమూలల నుంచి నూతన దంపతులు సత్యదేవుని వ్రతాలు ఆచరించేందుకు అధిక సంఖ్యలో వచ్చారు. అదేవిధంగా రత్నగిరి, సత్యగిరి కొండలపై కూడా వివాహాలు జరిగాయి. ఈ నేపథ్యంలో వ్రతమంటపాలన్నీ నూతన వధూవరులతోపాటు భక్తులతో రద్దీగా మారాయి. సత్యదేవుని దర్శనానికి భక్తులు బారులు తీరారు. దేవస్థానం అధికారులు భక్తులకు ఇబ్బంది కలగకుండా మంచినీరు, మజ్జిగ వంటివి ఏర్పాటు చేశారు. కాగా శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం పండగ సందర్భంగా రత్నగిరి కొండపై వనదుర్గ అమ్మవారి ఆలయంలోనూ, కొండ దిగువ దుర్గామాత ఆలయంలోనూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. రెండు వేల వ్రత మంటపాల్లో ఏసీలు పనిచేయక భక్తులకు ఇబ్బందులు రత్నగిరి కొండపైకి సత్యదేవుని వ్రతమాచరించే భక్తులకు రెండు వేలు రూపాయల వ్రత మంటపాల్లో ఏసీలు రెండు రోజులుగా సక్రమంగా పనిచేయక భక్తులు ఇబ్బందులు పడ్డారు. కొండపైన రూ.1,500, రూ.వెయ్యి తదితర కేటగిరిల్లో మంటపాలు కేటాయించి భక్తులకు వ్రతాలు నిర్వహిస్తారు. భక్తుల సౌకర్యార్థం కొండపై స్వామి వారి ప్రధానాలయం ఎదురుగా ఏసీ మంటపాలను ఏర్పాటు చేశారు. సెంట్రల్ ఏసీ పనిచేయకపోవడంతో అధికారులు ప్రత్యామ్నాయంగా విడిగా ఏసీలు ఏర్పాటు చేశారు. అవి రెండు రోజులుగా సక్రమంగా పనిచేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డామని భక్తులు వాపోయారు. దేవస్థానం అధికారులు వ్రత మంటపాల్లో పూర్తిస్ధాయిలో ఏసీ పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వ్రతం నిర్వహించే సమయంలో కేవలం దంపతులకు మాత్రమే కూర్చునే అవకాశం ఇస్తున్నారని, కుటుంబ సమేతంగా దంపతులతోపాటు తమ సంతానాన్ని కూడా వ్రతంలో పాల్గొనేందుకు వ్రత మంటపాల్లో కూర్చునే వెసులుబాటు కల్పించాలని హైదరాబాద్‌కు చెందిన భక్తుడు విఠల్ కోరారు. పిల్లలకు కూడా పూజా విధానం, సత్యదేవుని వ్రత విధానం, ఆచార వ్యవహారాలపై అవగాహన, మరింత ఆసక్తి కలుగుతుందన్నారు. -
నిబంధనలు రీచ్ కాక..
● సీఆర్‌జెడ్‌తో అవాంతరాలు ● జిల్లాలో 24 రీచ్‌ల గుర్తింపు ● 12 చోట్ల మాత్రమే తవ్వకాలు ● నిబంధనలు సడలించాలంటున్న అధికారులు సాక్షి, అమలాపురం/ రావులపాలెం: ఇసుక ర్యాంపులకు కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్‌జెడ్) అడ్డుగా మారింది. ఫలితంగా ర్యాంపుల ఏర్పాటుకు ప్రతిబంధకమైంది. జిల్లాలో సముద్ర తీర ప్రాంతాలు, మత్స్యకారులు వేట సాగించే గోదావరి నదీ పరివాహక ప్రాంతాలను సీఆర్‌జెడ్ పరిధిలోకి తీసుకు వచ్చారు. 2011లో సీఆర్‌జెడ్‌ను అమలులోకి తెచ్చారు. దీనివల్ల జిల్లాలోని కీలక ర్యాంపుల్లో ఇసుక తవ్వకాలకు ప్రతిబంధకాలు ఎదురయ్యాయి. సీఆర్‌జెడ్ నిబంధనలు సడలించకుంటే పూర్తిస్థాయిలో ర్యాంపులు అందుబాటులోకి రావని మైనింగ్, పర్యావరణ శాఖ అధికారులు తేల్చి చెబుతున్నారు. సీఆర్‌జెడ్ పరిధిలో సముద్రతీర ప్రాంతం ఉంది. ఆయా చోట్ల ఎటువంటి తవ్వకాలు చేయకూడదు. కానీ ఇక్కడే ఇసుక తవ్వకాలు చేయడంతోపాటు ఆక్వా చెరువుల తవ్వకాలు చేస్తున్న విషయం తెలిసిందే. సీఆర్‌జెడ్ పరిధిని గోదావరి పరివాహక ప్రాంతాలకు సైతం విస్తరించారు. నేషనల్ సెంటర్ ఫర్ సస్టనబుల్ కోస్టల్ మేనేజ్మెంట్ (ఎన్‌సీఎస్‌సీఎం) ఇచ్చిన నివేదిక ఆధారంగా జిల్లాలో 16 మండలాల పరిధిలోని 128 గ్రామాలు సీఆర్‌జెడ్ పరిధిలో ఉన్నాయి. సఖినేటిపల్లి మండలం (ఎనిమిది గ్రామాలు), మలికిపురం (తొమ్మిది), మామిడికుదురు (పన్నెండు), రాజోలు (పన్నెండు), అల్లవరం (పదకొండు), ఉప్పలగుప్తం (పది), అమలాపురం (రెండు), అంబాజీపేట (రెండు), కాట్రేనికోన (పదకొండు), కపిలేశ్వరపురం (రెండు), కొత్తపేట (రెండు), పి.గన్నవరం (పదిహేడు), రావులపాలెం (నాలుగు), అయినవిల్లి (ఆరు), కె.గంగవరం (ఎనిమిది), ముమ్మిడివరం (పన్నెండు) గ్రామాలు సీఆర్‌జెడ్ పరిధిలో ఉన్నాయి. దీనిపై గత నెల 31న అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్లో ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. సీఆర్‌జెడ్‌లో 300 చదరపు మీటర్ల వరకూ మత్స్యకారులు నిర్మాణాలు చేసుకోవచ్చు. స్థానికంగా అనుమతులు తీసుకోవచ్చని నిర్ణయించారు. అలాగే క్రిక్స్లో వాటర్ లెవిల్ విడ్త్ నుంచి 100 మీటర్ల వరకూ బఫర్‌ను 50 మీటర్లు చేశారు. భవన నిర్మాణాలకు సంబంధించిన విషయం పక్కన పెడితే సీఆర్‌జెడ్ పరిధి వల్ల జిల్లాలోని గోదావరిలో పలు ర్యాంపుల వద్ద ఇసుక తవ్వకాలు నిలిచిపోయాయి. అవకాశం ఉన్నా.. జిల్లాలో 12 వరకూ ఇసుక తవ్వకాలకు అనుమతి ఉన్న ర్యాంపులు ఉన్నాయి. వీటి నుంచి తవ్వకాలు సాగిస్తున్నారు. అయితే వాస్తవంగా 24 ప్రాంతాల నుంచి ఇసుక తవ్వకాలు చేసే అవకాశముంది. ఇలా చేస్తే ఉచిత ఇసుక పాలసీ అమలులో ఉన్నా స్థానిక సంస్థలకు సీనరేజ్ రూపంలో, ప్రభుత్వానికి జీఎీస్టీ రూపంలో ఆదాయం రావడంతోపాటు ఇసుక లభ్యత అధికంగా ఉంటోంది. భవన నిర్మాణ రంగం సైతం వేగంగా వృద్ధి చెందుతోంది. కానీ సీఆర్‌జెడ్ నిబంధనలతో పలు ర్యాంపుల నుంచి ఇసుక తీసే అవకాశం లేకుండా పోయింది. ఉదాహరణకు కపిలేశ్వరపురం మండల పరిధిలో కపిలేశ్వరపురం, తాతపూడి గ్రామాల్లో సీఆర్‌జెడ్ పరిధిలో ఉన్నాయి. ఇక్కడే ప్రస్తుతం స్టాక్ పాయింట్ల ద్వారా ఇసుక అమ్మకాలు జరుగుతుండడం విశేషం. రావులపాలెం మండలం గోపాలపురం, రావులపాలెం, అయినవిల్లి మండలం వీరవల్లిపాలెం, కె.గంగవరం మండలం కోటిపల్లి, కూళ్ల, సఖినేటిపల్లి, రాజోలు మండలం సోంపల్లి, పి.గన్నవరం మండలం ముంజువరం, లంకల గన్నవరం, మనేపల్లి, పాత గన్నవరం ప్రాంతంలో గతంలో ఇసుక తవ్వకాలు జరిగేవి. వీటిలో ఇసుక ర్యాంపులు అధికం. పరిధి నుంచి తొలగించాలి ఇసుక తవ్వకాలకు వీలుగా గతంలో ర్యాంపులు నిర్వహించిన గ్రామాలను సీఆర్‌జెడ్ పరిధి నుంచి తొలగించాలనే డిమాండ్ పెరుగుతోంది. గనులు, భుగర్భ శాఖ అధికారులు ప్రభుత్వానికి పలు దఫాలు ప్రతిపాదనలు పంపించారు. దీనికి ఎన్విరాల్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ నుంచి అనుమతి రావాల్సి ఉంది. ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర గనులు, భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్రకు దృష్టికి ఈ విషయాన్ని జిల్లా అధికారులు తీసుకు వెళ్లారు. దీనిపై తాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో మాట్లాడతానని ఆయన చెప్పుకొచ్చారు. సీఆర్‌జెడ్‌ను సవరిస్తే కాని ఇక్కడ ఇసుక తవ్వకాలు చేసే అవకాశం లేదు. -
ఆరగించేందుకు అన్నలా..
● అన్న కేంటీన్ల ముసుగులో దోపిడీ ● మరమ్మతుల పేరిట మింగేసి.. సాక్షి, అమలాపురం: ఆరగించేందుకు కొత్త పథకం తెచ్చారు.. పేదలకు బువ్వ అంటూ రూ.లక్షలు బొక్కేసేందుకు తెరలేపారు.. కూటమి ప్రభుత్వంలో మొదలైన అన్న క్యాంటీన్లు పేదల కడుపు నింపకున్నా ముందే టీడీపీ ఆస్తాన కాంట్రాక్టర్ల జేబులు మాత్రం నింపుతున్నాయి. గతంలో ఉన్న అన్న క్యాంటీన్ భవనాలకు చేపట్టిన చిన్న చిన్న మరమ్మతులకు రూ.లక్షలకు లక్షలు కేటాయించుకున్నారు. ఇక కొత్తగా నిర్మిస్తున్న భవనానికి సైతం కేటాయించిన నిధులు చూసి సామాన్యులను ముక్కున వేలేసుకుంటున్నారు. జిల్లాలో అమలాపురం గ్రేడ్–1 మున్సిపాలిటీతో పాటు మండపేట, రామచంద్రపురం మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటి పరిధుల్లో సుమారు లక్ష మందికి పైగా జనాభా ఉంటారని అంచనా. 2014–19 టీడీపీ పాలనలో రామచంద్రపురం, మండపేట మున్సిపాలిటీల్లో అన్న క్యాంటీన్లను నిర్వహించేవారు. అమలాపురంలో ఏర్పాటు చేయలేదు. అప్పట్లో ఎంపిక చేసిన స్థలం కోర్టు వివాదంలో ఉండడం వల్ల ఇక్కడ నిర్వహించలేదు. ఇప్పుడు రామచంద్రపురం, మండపేటల్లో మరమ్మతులు చేపట్టి శుక్రవారం ప్రారంభించారు. అమలాపురం మున్సిపాలిటీలో కొత్త భవన నిర్మాణం చేపట్టారు. మండపేట మున్సిపాలిటీ పరిధిలో మరమ్మతులకు ఏకంగా రూ.13.85 లక్షలు ఖర్చు చేశారు. భవనంలో లోపల, వెలుపుల చిన్న చిన్న పనులు చేయడంతోపాటు కొత్త హంగులు చేశారు. కాంపౌండ్ వాల్ చుట్టూ దెబ్బతిన్న ఫ్లోరింగ్ చేయడంతో పాటు ఫ్రంట్ ఎలివేషన్ చేశారు. అయితే వీటికి ఇంత ఖర్చు చేయాల్సిన అవసరం లేదని స్థానికులు చెబుతున్నారు. అలాగే రామచంద్రపురం మున్సిపాలిటీలో గతంలో ఉన్న అన్న క్యాంటీన్‌కు రూ.9.71 లక్షలతో మరమ్మతులు నిర్వహించారు. ఇంత ఖర్చు పెట్టి చేసే మరమ్మతులు ఏమున్నాయని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. భవనానికి ఎల్లో బోర్డులు, గ్లాస్లు వేయడంతో పాటు ఫ్లోరింగ్ చేశారు. ఎందుకంత ఖర్చో! అమలాపురం మున్సిపాలిటీలో అన్న క్యాంటీన్‌కు కొత్త భవన నిర్మాణం చేపట్టారు. మున్సిపల్ కార్యాలయం ఆవరణలోనే దీని నిర్మాణం జరుగుతోంది. ఇందుకు రూ.45 లక్షలు వెచ్చిస్తున్నారు. వాస్తవంగా దీని నిర్మాణానికి ఇంత ఖర్చు కాదని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ భవనం పునాదుల దశలో ఉంది. -
కూలీలకు బకాయి వేతనాలు జమ
ఆలమూరు: జిల్లాలోని 22 మండలాలకు చెందిన ఉపాధి కూలీలకు బకాయి వేతనాలు జమ అవుతున్నాయి. మొత్తం 5.11 లక్షల ఉపాధి కూలీలకు గత నాలుగు నెలల నుంచి రూ.75.21 కోట్ల వేతనాలను ప్రభుత్వం అందించాలి. దీనిపై ఈ నెల 4న ‘సాక్షి’ దినపత్రికలో ఆ‘కూలీ’ కేకలు అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ నెల పది వరకూ బకాయి పడిన వేతనాలను ఉపాధి కూలీల బ్యాంకు ఖాతాలో జమ చేసింది. ఈ విషయాన్ని ఎన్ఆర్ఈజీఎస్ పీడీ పి.మధుసూదన్, ఆలమూరు ఏపీఓ జి.అరుణకుమారి తెలిపారు. ఉపాధి కూలీలకు ఏదైనా సమస్య ఉత్పన్నమైతే సంబంధిత ఏపీఓ కార్యాలయాలను సంప్రదించాలన్నారు. నేటి నుంచి స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు రాయవరం: రెండు రోజుల పాటు జరిగే పాఠశాల స్థాయి స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు శనివారం ప్రారంభం కానున్నాయి. 2024–25 విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయులకు పాఠశాల సముదాయ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి అనుగుణంగా సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్ సమావేశాల నిర్వహణకు ఆదేశాలు ఇచ్చారు. ఈ ఉత్తర్వుల ప్రకారం జిల్లాలోని 22 మండలాల్లో 47 ప్రాథమిక స్థాయి కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ కాంప్లెక్స్‌ల పరిధిలోని 50 శాతం ఉపాధ్యాయులు శనివారం జరిగే కాంప్లెక్స్ సమావేశాలకు హాజరు కానుండగా, మిగిలిన 50 శాతం మందికి నిర్దేశించిన కాంప్లెక్స్‌లో సోమవారం హాజరు కానున్నారు. అలాగే తెలుగు, గణితం, బయలాజికల్ సైన్స్ ఉపాధ్యాయులకు శనివారం సబ్జెక్ట్ కాంప్లెక్స్ సమావేశాలు జరగనుండగా, సోమవారం ఇంగ్లిషు, ఫిజికల్ సైన్స్, హిందీ, సోషల్ సబ్జెక్టు ఉపాధ్యాయులకు సబ్జెక్టు సమావేశాలు నిర్వహించనున్నారు. ఉన్నత పాఠశాలల్లో పనిచేసే వ్యాయామ ఉపాధ్యాయులకు స్పోర్ట్స్ కాంప్లెక్స్ సమావేశాలను శనివారం నియోజకవర్గ స్థాయిలో జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సమావేశాలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ నిర్వహించాల్సి ఉంటుంది. జిల్లాలో 123 స్కూల్ కాంప్లెక్స్‌లు ఉండగా, వాటి పరిధిలో 5,442 ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలకు హాజరు కానున్నారు. అలాగే 5,200 మంది వివిధ సబ్జెక్టులకు సంబంధించిన ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొననున్నారు. ఇదిలా ఉంటే కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జిల్లాలకు సంబంధించిన ఉర్దూ టీచర్లకు ఈ నెల 20న రాజమహేంద్రవరంలోని మకా ఉర్దూ మీడియం ప్రాథమికోన్నత పాఠశాలలో నిర్వహించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈఏపీ సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ బాలాజీచెరువు (కాకినాడ సిటీ ): ఏపీ ఈఏపీ సెట్–24 మూడవ దశ కౌన్సెలింగ్‌కు ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ విడుదల చేసింది. గత జూన్ 30వ తేదిన మొదటి దశ ,జూలై నెలలలో రెండవ దశకు నోటిఫికేషన్ విడుదలచేసి సీట్లు భర్తీ చేయగా తాజాగా మూడవ దశకు షెడ్యూల్ విడుదల చేశారు. ● ఆగస్టు 19వ తేది నుంచి 21వ తేది వరకూ అన్లైన్ అన్లైన్ రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు ● ఆగస్టు 22 వ తేది వరకూ అన్లైన్ సర్టిఫికెట్ల పరిశీలన ● ఆగస్టు 20 నుంచి 22 వరకూ వెబ్ అప్షన్లు. 23వ తేదీన వెబ్ అప్షన్లు మార్పునకు అవకాశం. ● ఆగస్టు 26న సీట్ల కేటాయింపు. 26వ తేదీ నుంచి 30వరకూ కళాశాలలో చేరికకు చివరితేది. ● ఉమ్మడి జిల్లాలో హెల్ప్‌లైన్ కేంద్రం ఆంధ్రాపాలిటెక్నిక్ కళాశాల (జగన్నాథపురం) కోల్‌కతా ఘటనపై నేడు ఐఎంఏ నిరసన అమలాపురం టౌన్: కోల్‌కతాలో ఓ జూనియర్ మహిళా డాక్టర్‌పై ఆటవికంగా అత్యాచారం చేసి, ఆ తర్వాత అతి కిరాతకంగా హతమార్చిన ఘటనపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) జిల్లా శాఖ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. డాక్టర్లపై జరుగుతున్న దాడులు, అఘాయిత్యాలపై జిల్లా ఐఎంఏ ఆధ్యర్యంలో అమలాపురంలో శనివారం ఉదయం నిరసన చేపట్టేందుకు నిర్ణయించినట్టు సంఘ జిల్లా కార్యదర్శి డాక్టర్ కడలి ప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. శనివారం ఉదయం కోనసీమలోని వైద్యులంతా అమలాపురం గడియారం స్తంభం సెంటరుకు చేరుకుని, అక్కడ నిరసన వ్యక్తం చేస్తారని చెప్పారు. అక్కడ నుంచి వైద్యులు ప్రదర్శనగా స్థానిక కలెక్టరేట్‌కు చేరుకుని, కలెక్టర్‌కు వినతిపత్రం అందించనున్నట్టు వివరించారు. శనివారం ఉదయం 9 గంటల కల్లా ఐఎంఏ వైద్యులంతా గడియారం స్తంభం సెంటరుకు చేరుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
అగ్ని ప్రమాదంలో లారీ, బైక్ దగ్ధం
మండపేట: పట్టణంలోని బైపాస్ రోడ్డులోని మెకానిక్ షెడ్డు వద్ద గురువారం మంటలు చెలరేగాయి. ప్రమాదంలో లారీ, బైకు పూర్తిగా దగ్ధమయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం బైపాస్ రోడ్డులోని గంగరాజు మెకానిక్ షెడ్లో లారీ మరమ్మతుల్లో భాగంగా గ్యాస్ కటింగ్ చేస్తుండగా ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. డీజిల్ ట్యాంకుకు లీకేజీ ఉండడంతో ఈ ప్రమాదం జరిగినట్టు చెప్తున్నారు. లారీకి సమీపాన ఉన్న బైక్ సైతం అగ్నికి ఆహుతైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి గురైన లారీ రాయవరం మండలం సోమేశ్వరానికి చెందిన అబ్బిరెడ్డి సింహాచలానికి చెందినదిగా గుర్తించారు. -
ఉలిమేశ్వరంలో ఇరువర్గాల దాడి
పెద్దాపురం: మండలంలోని ఉలిమేశ్వరంలో ఇరువర్గాల మధ్య గురువారం సాయంత్రం జరిగిన దాడుల్లో పలువురుకి తీవ్ర గాయాలయ్యాయి. పెద్దాపురం పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ఇరువురు యువకుల మధ్య జరిగిన సంభాషణ చిలికి చిలికి ఇరువర్గాల దాడులకు దారి తీసిందన్నారు. గ్రామ వైఎస్సార్ సీపీ సర్పంచ్ ఆకుల వరలక్ష్మి స్వాతంత్య్ర వేడుకల్లో జాతీయ పతాకావిష్కరణ చేస్తుండగా గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ పేకేటి దొరబాబు స్థానిక యువతతో వ్యక్తిగత తగదాల నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన పల్నాటి శివ, పల్నాటి వెంకటరమణ తదితరులతో వివాదానికి దిగారు. అక్కడే ఉన్న సర్పంచ్ భర్త వీరబాబు ఇది పద్ధతి కాదని వారిని వారించి అక్కడి నుంచి పంపేయడంతో ఉదయం ఎవరికి వారు వెనుదిగారు. సాయంత్రం సమయంలో గ్రామ సెంటర్లో అందరూ ఉండగా అక్కడ ఉన్న ఓ పెద్దాయన కురెమెళ్ల మూలయ్య చేతిలో ఉన్న కర్రను తీసుకుని వెంకటరమణ, శివలపై దొరబాబు, ఆయన తమ్ముడు రామచంద్రరావు తీవ్ర పదజాలంపై కర్రలు, కత్తితో దాడికి పాల్పడ్డారు. ఇరువర్గాల మధ్య తీవ్ర దాడి జరిగిందని పోలీసులు తెలిపారు. దీనిపై ఎస్ఐ మౌనికను వివరణ కోరగా ఇరువర్గాల ఫిర్యాదులతో కేసు నమోదు చేసినట్టు తెలిపారు. -
శ్రీ ప్రకాష్‌లో నృత్య సంధ్య వేడుకలు
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): శ్రీ ప్రకాష్ సినర్జీ పాఠశాలలో శుక్రవారం నృత్య సంధ్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బ్రహ్మాశ్రీ చాగంటి కోటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై మానవుని మేధస్సు నుండి ఉద్భవించిన అద్భుత విషయాలలో కళ ఒకటని, కళను అదరించడం, అభిమానించడం కళాత్మకతకు అద్దం పడతాయన్నారు. తెలుగు సాహిత్యంలో కవిత్వానిది ప్రత్యేక స్థానమని, పద్యం రాయడం ఒక తపస్సు అయితే, పదమును గానం చేయడం తపమేనన్నారు. కలరీ పయట్టు అనే ప్రాచీన యుద్ధ విద్యకు సంబంధించి విన్యాసాలను కేరళకు చెందిన కృష్ణదాస్, కుమార్తె కావ్యలు 45 రోజుల పాటు విద్యార్థులకు నేర్పించి మంచి ప్రదర్శన ఇవ్వడం సంతోషమన్నారు. పాఠశాల డైరక్టర్ విజయప్రకాష్ మాట్లాడుతూ సాంప్రదాయ విలువలు, సంస్కృతి పునాదులుగా చేసుకుని భారతీయతకు అద్దం పడుతూ మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ విద్యార్థుల భవితకు బాటలు వేయడమే శ్రీప్రకాష్ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
మోటార్ సైకిల్ ఢీకొని వ్యక్తి మృతి
అయినవిల్లి: మండలంలోని విలస గ్రామం వద్ద గురువారం ఓ వ్యక్తి మోటార్ సైకిల్ ఢీకొని మృతి చెందాడు. దీనికి సంబంధించి అయినవిల్లి ఎస్సై బి.శ్రీనివాసరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం రాజోలు నుంచి అయినవిల్లి వైపు మోటార్ సైకిల్‌పై వస్తున్న వడ్డేపల్లి శ్రీనివాసరావు (55)ను ముక్తేశ్వరం నుంచి అమలాపురం వైపు వస్తున్న మరో మోటార్ సైకిలిస్టు అతి వేగంగా వచ్చి ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో శ్రీనివాసరావు అక్కడిక్కడే మృతి చెందాడు. అంబులైన్స్‌లో మృతదేహాన్ని అమలాపురం ఏరియా అస్పత్రికి తరలించారు. మృతిని భార్య జ్యోతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు. దేశభక్తి పరుడికి సత్కారం సామర్లకోట: స్థానిక బ్రాహ్మణ అగ్రహరంలో నివాసం ఉంటున్న 101 సంవత్సరాల దివిటి అప్పారావును స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా యువత ఘనంగా సత్కరించింది. యువతలో దేశభక్తి కలిగించడమే లక్ష్యంగా ఆయన 10 ఏళ్లు గా జాతీయ జెండాను భుజాన వేసుకొని పెద్దాపురం నియోజకవర్గం అంతా తిరుగుతూ ఉన్నా రు. ఎవరైనా డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే నిరాకరించడంతో పాటు కాలినడకనే ఎంత దూరం అయినా వెళుతూ ఉంటాడు. 60 ఏళ్ల వయస్సులోనే నడవలేక పోతున్న రోజుల్లో 101 సంవత్సరాల వయస్సులోని కాలినడకనే తిరుగు తూ దేశభక్తి కోసం జాతీయ జెండాను మోస్తున్న అప్పారావును సత్కరించాలని నియోజకవర్గ శోభాయాత్ర నిర్వాహకుడు కర్రి అప్పలరాజు నిర్ణయించారు. ఈ మేరకు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా స్థానిక నీలమ్మ చెరువు గట్టుపై ఉన్న వివేకానంద గ్రంథాలయంలో యువత సత్కరించారు. పెద్దాపురం మాతృత్వ సేవా సంస్థ, ఫేజ్ బుక్ ఫ్రెండ్స్, శోభా యాత్ర నిర్వాహకులు దివిటి అప్పారావును సత్కరించారు. కుండలేశ్వరుడి దేశభక్తి కాట్రేనికోన: మండలంలోని కుండలేశ్వరంలో వేంచేసిఉన్న పార్వతీ సమేత కుండలేశ్వర స్వామి గురువారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాక రంగులతో భక్తులకు దర్శనమిచ్చాడు. ఆలయ అర్చకుడు కాళ్లకూరి కామేశ్వరశర్మ కుండలేశ్వర స్వామిని జాతీయ పతాకం రంగులున్న పూలతో సుందరంగా అలంకరించారు. -
సూక్ష్మ కళతో దేశభక్తి
● చాక్ పీస్, పెన్సిల్ ముల్లుపై జాతీయ జెండా రూపకల్పన గండేపల్లి: చాక్ పీస్, పెన్సిల్ ముల్లుపై జాతీయ జెండాను చెక్కి తన దేశ భక్తిని చాటుకున్నాడు ద్రాక్షారామకు చెందిన పెంకే కృష్ణ స్వామి. మండలంలోని సూరంపాలెం ప్రగతి ఇంజినీరింగ్ కళాశాలలో సీఎస్సీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఆయన పనిచేస్తున్నారు. 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తన దేశ భక్తిని చాటుకున్నారు. జెండాను ప్రదర్శిస్తున్నట్టుగా చాక్ పీస్‌పై, పెన్సిల్ ముల్లుపై ఎగురుతున్న జాతీయ జెండాను చెక్కాడు. సహోపాధ్యాయులు, విద్యార్థులు స్వామికి అభినందనలు తెలియజేశారు. ఆయన గతంలో పెన్సిల్, చాక్ పీస్, ఆకులపై పలువురి దేశ నేతలు, రాజకీయ నాయకుల చిత్రాలను గీసి తన ప్రతిభను చాటుకున్నారు. -
మహనీయుల త్యాగాలే స్ఫూర్తి
●● రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి సుభాష్●● ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు ● కొనసీమ జిల్లా వ్యాప్తంగా పండగ వాతావరణ ● బాలయోగి స్టేడియంలో ఆకట్టుకున్న పోలీసులు కవాతు ● వివిధ శాఖల ప్రగతి శకటాల ప్రదర్శన సాక్షి, అమలాపురం: స్వతంత్య్ర పోరాటంలో మహనీయులు చేసిన త్యాగాలు మరువలేమని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. నాటి పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని నేటితరం యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. జిల్లాను ప్రగతి పథంలో పయనింప చేయడానికి ప్రతి ఒక్కరూ కంకణబద్ధులై కావాలని ఆయన ఆకాంక్షించారు. జిల్లా వ్యాప్తంగా గురువారం 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అమలాపురం బాలయోగి స్టేడియంలో నిర్వహించిన వేడుకలు అంబరాన్ని అంటాయి. రాష్ట్ర కార్మిక శాఖమంత్రి వాసంశెట్టి సుభాష్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. అనంతరం పోలీసు వర్గాలు కవాతుతో చేసిన గౌరవ వందనాన్ని మంత్రి స్వీకరించారు. జిల్లా గత ఏడాది సాధించిన అభివృద్ధి ప్రగతిని ఆయన చదివి వినిపించారు. స్వేచ్చా, స్వాతంత్య్రలకు సూచికగా శాంతి కపోతాలను ఎగురవేశారు. మువ్వన్నల జెండాల రెపరెపల మధ్య స్వాతంత్య్ర దినోత్సవాన్ని జిల్లాలో అంభరాన్నంటేలా నిర్వహించారు. మూడు రంగుల జెండాలు, విద్యుత్ దీపాల అలంకరణాలతో జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల కార్యాలయాలతో జిల్లాలో జాతీయ జెండా ఆవిష్కరణలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనలు, జాతీయ గీతాలాపనలతో పండుగ వాతావరణం నెలకొంది. అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థినీ విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు వీక్షకులను అలరించాయి. దేశభక్తి గీతాలు, స్వాతంత్య్ర ఉద్యమ గేయాలతో నృత్య రూపకాలు ఆకట్టుకున్నాయి. గుడిమెళ్లంక జెడ్పీ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో విద్యార్థులు చేసిన ప్రాచీన క్రీడ మల్ల కంబ ఆహూతులను విశేషంగా ఆకర్షించింది. ఈ సందర్భంగా విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఉత్తమ సేవకులకు పురస్కారాలు వివిధ ప్రభుత్వ శాఖలలో విశిష్ట సేవలు అందించిన జిల్లా అధికారులు ఎనిమిది మందికి, అలాగే ఆయా విభాగాల్లో ఉత్తమ సేవలు అందిస్తున్న సుమారు 245 మంది ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు బహూకరించారు. ఈ కార్యక్రమంలో అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధుర్, జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్, ఎస్పీ బి.కృష్ణారావు, జాయింట్ కలెక్టర్ టి.నిశాంతి, ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వర్లు, అడిషనల్ ఎస్పీ ఖాదర్ బాషా, డీఆర్వో ఎం.వెంకటేశ్వర్లు, అమలాపురం, రామచంద్రపురం, కొత్తపేట ఆర్డీవోలు జి.కేశవవర్ధన్ రెడ్డి, ఎస్.సుధాసాగర్, జీవీవీ సత్యనారాయణ, వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన జిల్లా గత ఏడాది సాధించిన ప్రగతి ఆధారంగా ఆయా శాఖలు చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ శకటాల ప్రదర్శన నిర్వహించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సామాజిక పింఛన్ల పంపిణీ శకటం ప్రథమ స్థానంలో నిలిచింది. అలాగే గనులు, భూగర్భ శాఖ ఆధ్వర్యంలో ఉచిత ఇసుక విధానం తెలిపే శకటానికి ద్వితీయ స్థానం, పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అన్నా క్యాంటిన్ల శకటానికి తృతీయ స్థానం ప్రకటించారు. వీటితో పాటు దేవదాయ ధర్మదాయ, వ్యవసాయ, ఉద్యాన, గృహ నిర్మాణ, వైద్య ఆరోగ్యశాఖ, అగ్నిమాపక శాఖలకు చెందిన శకటాల ప్రదర్శన జరిగింది. కలెక్టరేట్లో జాతీయ జెండా ఆవిష్కరణ 78వ స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా అమలాపురం కలెక్టరేట్లో జాతీయ జెండాను కలెక్టర్ మహేష్ కుమా ర్ ఆవిష్కరించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిశాంతి జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లు, కలెక్టర్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
కన్నుల పండగగా పవిత్రోత్సవం
ఆత్రేయపురం: వాడపల్లి శ్రీ, భూ సమేత వేంకటేశ్వర స్వామి ఆలయంలో రెండో రోజు గురువారం పవిత్రోత్సవాలు కన్నుల పండువగా నిర్వహించారు. వేదపండితులు, అర్చకులు వేద మంత్రాలతో ఆలయ ప్రాంగణం శోభిల్లింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని తిలకించారు. స్వామి, దేవేరుల త్రయాహ్నిక దీక్షా పూర్వక పవిత్రోత్సవాలను పశ్చిమ గోదావరి జిల్లా నడిపూడి గ్రామానికి చెందిన వేదపండితులు ఖండవల్లి రాజేశ్వరవర ప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో నిర్వహించారు. స్వామి వారికి దేవదాయ, ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, ఆలయ ఈఓ భూపతిరాజు కిషోర్‌కుమార్ పట్టు వస్త్రాలను అందజేశారు. పవిత్రోత్సవాల్లో అధిక సంఖ్యలో పాల్గొనడంతో గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు. ఆలయ ఈఓ ఆధ్వర్యంలో సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. నేటితో ముగియనున్న పవిత్రోత్సవాలు ఉదయం 8 గంటలకు సంకల్పం, మహాశాంతి హోమం, ప్రాయశ్చిత్త హోమం, మహా పూర్ణహుతి, పవిత్ర విసర్జన, మహదాశీర్వచనం తదితర పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈఓ తెలిపారు. ఎల్బ్రోస్పై త్రివర్ణ పతాకం కాకినాడ సిటీ: కాకినాడ జిల్లా ఫారెస్టు అధికారి ఎస్.భరణి యూరప్‌లోనే అతి ఎత్తైన పర్వతం ఎల్బ్రోస్ 5,642 మీటర్లు (18,505 అడుగులు) ఎక్కి త్రివర్ణ పతాకాన్ని గురువారం ఉదయం 12.30 గంటలకు ఎగురవేశారు. ఈమె కాకినాడ జిల్లా అధికారి కావడం జిల్లాకు గర్వకారణమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంతటి ఘనత సాధించిన డీఎఫ్ఓ భరణిని జిల్లా అధికారులు అభినందించారు. -
ఇంటింటా వరాలమ్మకు ఆహ్వానం
రాయవరం: శ్రావణం దేవతలకు ఇష్టమైన మాసమని పురాణాలు చెబుతున్నాయి. ముత్తైదువలు, దీర్ఘ సుమంగళీతనం కోసం ఆచరించే వరలక్ష్మీ వ్రతానికి విశేష ప్రాముఖ్యం ఉంది. శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి మొదట వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మీ వ్రతం మహిళలకు అత్యంత ప్రీతిపాత్రమైనది. అష్టలక్ష్మి రూపాన్ని మహిళలు వరలక్ష్మిగా కొలుస్తారు. దీర్ఘకాలం సుమంగళిగా ఉండాలని వివాహితులు, మంచి భర్త లభించాలని యువతులు వ్రతం ఆచరిస్తారు. ఈ వ్రతం ఆచరించడం ద్వారా అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని భక్తుల నమ్మకం. వ్రతం రోజున వేకువనే ఇంటిని శుభ్రపర్చుకుని, గుమ్మాలకు పచ్చని మామిడి తోరణాలు, బంతిపూలను కట్టి అందంగా తీర్చిదిద్దుతారు. వ్రతం నిర్వహించే ప్రదేశంలో పిండితో ముగ్గు వేసి, కలశానికి పసుపు పూసి, నీటితో నింపి మామిడి ఆకులు, కొబ్బరికాయను ఉంచి కొత్త రవికెను కలశంపై ఉంచి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. అష్టోత్తర శతనామాలతో దేవిని పూజించి షడ్రసోపేతమైన మహా నైవేద్యాన్ని ఉంచి భుజిస్తారు. చుట్టుపక్కల ఉన్న సువాసినులను వ్రతానికి పిలిచి వాయనాలు, తాంబూలాలు అందజేసి పూజ ముగిస్తారు. ఇళ్లతో పాటు ఆలయాల్లోనూ వరలక్ష్మీ వ్రతం నిర్వహించనున్నారు. అమ్మవారి ఆలయాల్లో నిర్వాహకులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. పూలు, పండ్లకు గిరాకీ మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే వరలక్ష్మీ వ్రతం పూజా సామగ్రి కొనుగోలుతో మార్కెట్ సందడిని సంతరించుకుంది. జిల్లా వ్యాప్తంగా ప్రధాన పట్టణాలతో పాటు గ్రామాల్లోనూ ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేసి పూజా సామగ్రి విక్రయాలు చేపట్టారు. వ్రతానికి అవసరమైన పసుపు, కుంకుమ, గంధం, పూలు, మామిడాకులు, అరటిపండ్లు, అమ్మవారి ఫొటో, కలశం, కొబ్బరికాయలు, తమలపాకులు, వక్కలు తదితర పూజా వస్తువులు సిద్ధం చేసుకుంటున్నారు. దీంతో పూలకు, పండ్లకు, కొబ్బరికాయలకు గిరాకీ పెరిగింది. కిలో చేమంతి పూలు రూ.400 వరకు ధర పలుకుతున్నాయి. కొబ్బరికాయ ధర రూ.20 నుంచి రూ.30 పలుకుతుండగా, అరటిపండ్లు డజను రూ.50 నుంచి రూ.70 వరకు విక్రయిస్తున్నారు. ఒక్కో తామరపూవు రూ.25 నుంచి రూ.40 వరకు విక్రయిస్తున్నారు. వరలక్ష్మీ వ్రతం విశిష్ఠత నేపథ్యంలో మహిళల భక్తిని వ్యాపారులు సొమ్ము చేసుకున్నారు. ఇక పండ్ల ధరలు చెప్పనక్కరలేకుండా ఉన్నాయి. అలాగే ఇళ్లకు వచ్చి వ్రతాలు చేసే పురోహితులకు సైతం డిమాండ్ పెరిగింది. రూపు అంటే మాటలా! శుభప్రదమైన శ్రావణమాసంలో వ్రతం చేస్తే సిరిసంపదలకు లోటుండదనేది భక్తుల విశ్వాసం. అయితే శ్రావణంలో పూజలు చేయాలంటే మార్కెట్లో పెరిగిన ధరలు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకుని రూ.5 వేలు అయినా అదనంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సంప్రదాయంగా పూజలో ఉంచే లక్ష్మీదేవి బంగారం రూపు, నూతన వస్త్రాలు, పండ్లు, పూల ధరలు మహిళలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ మాసంలో బంగారం కొంటే మంచిదని మహిళల నమ్మకం. వరలక్ష్మీ పూజకు విధిగా బంగారం రూపు ఉండాలని వారు కోరుకుంటారు. ప్రస్తుతం తులం బంగారం రూ.85,150 పలుకుతోంది. అణా బరువున్న వరలక్ష్మీ రూపు రూ.5,500 వేలు ఉంది. గ్రాము రూపు రూ.7,500 చెప్తున్నారు. వరలక్ష్మి రూపులు రూ.2,000, రూ.4000, రూ.5,000 ధరల్లో లభిస్తున్నాయి. తక్కువ ధరకు కొంటే అందులో పైపూత తప్ప లోపలంతా రాగే. ఈ పరిస్థితుల్లో మంచి రేటు పెట్టి కొనకుంటే వరలక్ష్మీ రూపు రావడం గగనమే. సకల శుభాలు కలుగుతాయి శ్రావణమాసంలో వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకుంటే సకల శుభాలు కలుగుతాయి. తొమ్మిది సూత్రాలతో కూడిన దారాన్ని అమ్మవారి విగ్రహం వద్ద ఉంచి వ్రతపూజలు చేసుకుని కుడిచేతికి కట్టుకుంటే ఎంతో మంచిది. వరలక్ష్మీ వ్రతాన్ని ఎవరి శక్తి కొలది వారు చేసుకోవాలి. – కూరెళ్ల శివ, పురోహితుడు, రాయవరం వరలక్ష్మీ రూపులు నేడు వాడవాడలా వరలక్ష్మి వ్రతం వ్రతమాచరించనున్న మహిళలు మార్కెట్లకు శ్రావణ శోభ -
వినాయక ప్రతిమావంతులు..!
●● చవితి ఉత్సవాలకు విగ్రహాలు సిద్ధం ● కళా కౌశలం ప్రదర్శిస్తున్న రాజస్తాన్, బెంగాల్ కళాకారులు ● వేల సంఖ్యలో వస్తున్న ఆర్డర్లు ● మట్టి విగ్రహాలకు పెరిగిన గిరాకీ జిల్లాలో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీఓపీ) విగ్రహాల తయారీ రాజస్తాన్, బెంగాల్ నుంచి వచ్చే కుటుంబాలు – 350 తయారు చేసే విగ్రహాలు – 50 వేలకు పైగానే పని చేస్తున్న కార్మికులు – 850 మంది ఏటా విక్రయాలు – రూ.15 కోట్లకు పైగా విగ్రహాల పరిమాణం – అడుగు నుంచి 25 అడుగులకు పైగా ధర – రూ.5 వేల నుంచి లక్ష వరకు మట్టి విగ్రహాల తయారీ తయారు చేసే వారు – బెంగాల్ కార్మికులు విగ్రహాల ధర – రూ.10 నుంచి రూ.13 వేల వరకు తయారు చేస్తున్న ప్రాంతం – పిఠాపురం పిఠాపురం: ఓ బొజ్జగణపయ్య నీబంటు నేనయ్యా అంటు ఉత్సవ నిర్వాహకులు వినాయక చవితి వేడుకలకు సిద్ధమవుతుంటే ఓ బొజ్జ గణపయ్య మా బొజ్జ నింపయ్యా అంటూ విగ్రహ తయారీదారులు కోరుకుంటున్నారు. వినాయక చవితి ఉత్సవాలు దగ్గర పడుతుండడంతో వినాయక విగ్రహాల తయారీ ఊపందుకుంది. కాకినాడ జిల్లాలో పిఠాపురం, కాకినాడ, తుని తదితర ప్రాంతాల్లో రాజస్థాన్, అనకాపల్లి జిల్లా ఏటికొప్పాక తదితర ప్రాంతాల నుంచి వచ్చిన నిపుణులు వినాయక విగ్రహాల తయారీ దారులు ఇప్పటికే వందల సంఖ్యలో సిద్ధం చేశారు. కళ్లు మిరుమిట్లు గొలుపుతున్న రంగు రంగుల విగ్రహాలను మండపాలలో నిలిపేందుకు వివిధ పరిమాణాల్లో నిలబెట్టేందుకు జోరుగా విక్రయాలు సాగుతున్నాయి. కుటుంబ సమేతంగా.. రాజస్థాన్‌కు చెందిన కళాకారులు తమతమ కుటుంబాలతో సహా వివిధ జిల్లాలకు ఆరు నెలల ముందుగానే వచ్చి విగ్రమాల తయారీ ప్రారంభించారు. ప్రధాన పట్టణాలు, గ్రామాల్లో ముఖ్య కూడళ్ల సమీపంలో ఖాళీ ప్రదేశాన్ని అద్దెకు తీసుకుని భారీ గుడారాలు వేసి అక్కడే నివసిస్తూ విగ్రహాలు తయారు చేస్తున్నారు. కుటుంబంలో అందరు కలిసి పని చేస్తుంటారు. సిద్ధం చేసిన విగ్రహాలను వినాయక చవితి వరకు విక్రయించి తరువాత తమ స్వగ్రామాలకు వెళ్లి పోతారు. కొందరైతే ఇక్కడే ఉండిపోయి ఇతర చిన్న విగ్రహాలు తయారు చేసి అమ్ముకుంటూ ఉండిపోతున్నారు. భారీ విగ్రహాలకు పెరిగిన ఆదరణ గతంలో 2 నుంచి 5 అడుగుల మట్టి విగ్రహాలకే ప్రాధాన్యం ఇవ్వగా, కొన్నేళ్ల నుంచి ఉత్సవ కమిటీల మధ్య పోటీ పెరిగి ఒకరిని మించి ఒకరు భారీ పరిమాణంలో విగ్రహాలు నిలబెడుతున్నారు. దీంతో అడుగు నుంచి 25 అడుగుల ఎత్తు వరకు విగ్రహాలు తయారు చేయాలని రెండు నెలల ముందుగానే ఆర్డర్లు ఇస్తున్నారు. భారీ విగ్రహాలు రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు ఉండగా వేలల్లో వీటికి ఆర్డర్లు రావడం గమనార్హం. మరీ భారీ పరిమాణంలో కావాలనుకున్న వారికి మండల పాల వద్దే కార్మికులు తయారు చేసి ఇస్తున్నారు. వీటి విలువ రూ.లక్షకు పైగానే ఉంటుందని తయారీ దారులు చెప్తున్నారు. మట్టి విగ్రహాలకు పెరుగుతన్న ఆదరణ పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి విగ్రహాలకే ప్రాధాన్యం ఇవ్వాలని పర్యావరణ వేత్తలు సూచిస్తున్నప్పటికీ ఎక్కువగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీఓపీ) తో చేసిన వాటికే గిరాకీ ఉంటోంది. ఆలయాలు, ఇళ్ల వద్ద మాత్రం మట్టి విగ్రహాలకే ప్రాధాన్యం ఇస్తుండగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసే మండపాల వద్ద మాత్రం పీఓపీతో చేసిన వాటికే ప్రాధాన్యం ఇస్తున్నారు. అతి బారీ పరిమాణంలో విగ్రహాలతో పాటు ఆకర్షణీయంగా ఉండాలన్న ఆలోచనతో వీటికి ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే ఈ ఏడాది పిఠాపురంలో మట్టి విగ్రహాల తయారీ ప్రారంభించడంతో వాటికి ప్రాధాన్యం పెరిగింది. కళా నైపుణ్యం అంతా చేతితోనే.. మాది బెంగాల్ ఎన్నో ఏళ్లుగా మా కుటుంబ అంతా ఇదే పనిలో ఉన్నారు. గతంలో పీఓపీతో విగ్రహాలు తయారు చేసే వాళ్లం. పర్యావరణవేత్త, ప్రకృతి వ్యవసాయ వేత్త విజయ్‌రాం సూచనల మేరకు ఈ ఏడాది మట్టి విగ్రహాలు తయారు చేస్తున్నాం. మట్టి విగ్రహాలను చేతితోనే చేయాల్సి ఉంటుంది. వీటికి మౌల్డ్‌లు ఉండవు. ప్రతీ అవయవం మట్టితో నైపుణ్యంగా తయారు చేయాల్సి ఉంటుంది. నెల రోజులుగా మట్టి విగ్రహాల తయారీ ప్రారంభించాం. ఒక విగ్రహం తయారు చేయడానికి ముగ్గురు కార్మికులు కష్టపడితే ఒక రోజులో పూర్తవుతుంది. – సంతోన్, మట్టి విగ్రహాల తయారీ కార్మికుడు, బెంగాల్ గ్యారీ బాయ్ విగ్రహ తయారీదారు, రాజస్థాన్ పీఓపీతో చేసినవే అడుగుతున్నారు ఎక్కువగా పెద్దపెద్ద మండపాలలో నిలిపేందుకు ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో చేసినవే అడుగుతున్నారు. ముందుగా వచ్చి వివిధ భంగిమలలో తయారుచేయాలని ఆర్డర్లు ఇచ్చారు. ఈ ఏడాది ఎక్కువగా పెద్ద విగ్రహాలకు గిరాకీ ఉంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి విగ్రహాలు కొని తీసుకెళుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల కొంత ఇబ్బందిపడినా ఎక్కువగానే విగ్రహాలు తయారు చేశాం. దానికి తగ్గట్టుగానే విక్రయాలు కూడా ఉన్నాయి. పెట్టుబడులు పెరగడంతో లాభాలు తక్కువగా ఉంటాయి. – సోనా రామ్ విగ్రహ తయారీదారుడు, రాజస్థాన్ పర్యావరణ పరిరక్షణకు ప్రోత్సాహంగా.. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ ఏడాది మట్టి విగ్రహాల తయారీ పిఠాపురంలో ప్రారంభించాం. కేవలం మట్టి గోనె సంచులు మాత్రమే ఉపయోగించి మట్టి విగ్రహాలు ఆకర్షణీయంగా తయారు చేయిస్తున్నాం. విగ్రహాలు కేవలం మట్టి రంగులోనే ఉంటాయి ఏ విధమైన రంగులు వేయరు. ఆకర్షణ కోసం వరి పిండి పసుపు కుంకుమలతో అలంకారం చేస్తారు. ఈ మట్టి విగ్రహం ఎక్కడైనా ఏ నీటిలో అయినా నిమజ్జనం చేయవచ్చు. కేవలం 3 రోజుల్లో పూర్తిగా నీటిలో కరిగిపోతుంది. నీటికి గాని పర్యావరణానికి గాని ఎటువంటి హానీ ఉండదు. విగ్రహాలు కొనుగోలు చేసిన వారికి విగ్రహంతో పాటు బియ్యం, గొడుగు, బెల్లం, పంచె ఇస్తున్నాం. ఇవన్నీ ప్రకృతి వ్యవసాయంలో పండించినవే. పంచె చేనేత వస్త్రం మాత్రమే ఇస్తున్నాం. ప్రస్తుతం వీటికి గిరాకీ బాగానే ఉంది ఇప్పటి వరకు సుమారు 130 విగ్రహాలకు ఆర్డర్లు వచ్చాయి. కళాకారుల నైపుణ్యం కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. వీటిని ప్రోత్సహిస్తే వచ్చే ఏడాది మరిన్ని మట్టి విగ్రహాల తయారీకి చర్యలు తీసుకుంటాము. – విజయ్‌రాం, ప్రకృతి వ్యవసాయ వేత్త -
బధిర క్రీడాకారుడికి చేయూతనివ్వండి
పిఠాపురం: ఆసియా, పసిఫిక్ బధిర బాస్కెట్ బాల్ చాంపియన్‌షిప్‌నకు భారత దేశం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మిడి ఏసు కుమార్‌కు ఆర్థిక సాయం అందించి ఆ పోటీలో పాల్గొనే అవకాశం కల్పించాలని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి బొజ్జా మాణిక్యాలరావు దాతలను కోరుతున్నారు. ఇంటర్నేషనల్ బాస్కెట్ బాల్ ఫెడరేషన్ ఆఫ్ డెఫ్ (డీఐబీఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీలు ఆస్ట్రేలియా దేశం మెల్బోర్న్లో ఈ ఏడాది సెప్టెంబర్ 12 నుంచి 29 వరకూ జరుగుతాయని, ఇంత మంచి అవకాశాన్ని దక్కించుకున్న ఏసుకుమార్ పిఠాపురానికి గర్వకారణమన్నారు. దేశ వ్యాప్తంగా 12 మందికి అవకాశం రాగా, తెలుగురాష్ట్రాల నుంచి అతనొక్కడే ఎంపికయ్యారని ఆయన అన్నారు. పోటీలకు వెళ్లి వచ్చేందుకు అయ్యే ఖర్చును క్రీడాకారులే భరించాలని ఆల్ ఇండియా స్పోర్ట్స్ కౌన్సిల్ ఆఫ్ డఫ్ షరతు విధించిందని, అక్కడకు వెళ్లేందుకు రూ.2.06 లక్షల ఖర్చవుతుందని ఆ మొత్తాన్ని భరించే స్థితి అతని కుటుంబానికి లేదని మాణిక్యాలరావు పేర్కొన్నారు. తండ్రి సుబ్బారావు మరణం తర్వాత తల్లి వెంకట లక్ష్మితో కుమార్ వెల్డింగ్ షాపులో పనిచేస్తూ ఆమెకు ఆసరాగా ఉన్నాడన్నారు. స్థానిక రాజీవ్ గాంధీ మున్సిపల్ హైస్కూల్ బాస్కెట్ బాల్ కోర్టులో శిక్షణ పొందిన ఏసు కుమార్ అనేక జాతీయ, రాష్ట్ర స్థాయి బాస్కెట్ బాల్ పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపాడన్నారు. దాతలు ఉమ్మిడి వెంకట లక్ష్మి ఆకౌంట్ నెంబర్ 043210100139503, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పిఠాపురం బ్రాంచ్ ఐఎఫ్ఎస్ఈ కోడ్ యూబీఐ 804321కు కానీ, ఉమ్మిడి ఏసు కుమార్ ఫోన్ పే నెంబర్ 9347199153 సాయం చేయవచ్చని ఆయన కోరారు. -
‘అత్యవసర’ సేవలకు జూడాలు దూరం
కాకినాడ క్రైం: కాకినాడ జీజీహెచ్‌లో కొనసాగుతున్న అత్యవసర వైద్య సేవలను జూనియర్ డాక్టర్లు బహిష్కరించారు. కోల్‌కతాలో ఆర్జీ కార్ వైద్య కళాశాలకు చెందిన పల్మనాలజీ పీజీ విద్యార్థిని దారుణ హత్యాచారం నేపథ్యంలో ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ (ఎఫ్ఏఐఎంఏ) పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. గత కొద్ది రోజులుగా శాంతియుత నిరసన చేపడుతున్న జూడాలు గురువారం నుంచి అత్యవసర సేవలకు కూడా హాజరుకావద్దని నిర్ణయించుకున్నారు. ఘటన జరిగిన వైద్య కళాశాల ఆవరణలో నిరసన చేస్తున్న వైద్య విద్యార్థులపై బుధవారం అర్థరాత్రి వేల మంది రౌడీ మూకలు దాడికి తెగబడ్డాయని కాకినాడ జీజీహెచ్‌లో నిరసన చేపడుతున్న ఆర్ఎంసీ జూనియర్ డాక్టర్లు తెలిపారు. దారుణం జరిగిన హాల్ని ధ్వంసం చేసి సాక్ష్యాలు లేకుండా చేశారన్నారు. ఈ ఘోరాన్ని దేశమంతా చూసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, వైద్యుల సంరక్షణ కోసం సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్‌ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంతవరకు ఎఫ్ఏఐఎంఏ ఆదేశాల మేరకు తమ నిరసన నిరవధికంగా కొనసాగుతుందన్నారు. నిరసన నేపథ్యంలో కాకినాడ జీజీహెచ్‌లోని పోర్టికో వద్ద జూనియర్ డాక్టర్లు పలువురు రోగులతో మాట్లాడారు. అత్యవసర వైద్య సేవలు జీజీహెచ్‌లో కొనసాగుతాయనీ, కేవలం జూనియర్ డాక్టర్లు మాత్రమే హాజరుకారనీ నిరసనలో కొనసాగుతారని తెలిపారు. కలకత్తాలో వైద్య విద్యార్థినిపై జరిగిన దారుణాన్ని పలువురు రోగులు, వారి బంధువులకు వివరించారు. తమ నిరసనకు సంఘీభావం తెలపాలని కోరారు. గురువారం జూడాలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జీజీహెచ్ ఆవరణలో నిరసనలో పాల్గొన్నారు. సాయంత్రం పీఆర్ కాలేజ్ సర్కిల్ వద్ద మానవహారంగా ఏర్పడి దారుణంపై ప్రభుత్వం స్పందించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శుక్రవారం నాటి ర్యాలీలో యూజీ విద్యార్థులు కూడా పాలుపంచుకోనున్నారు. కోలకతా పీజీ విద్యార్థినిపై హత్యాచారానికి సంఘీభావం రోగులు, వారి బంధువులను తమకు మద్దతు తెలపాలని విన్నపం -
టిఫిన్ సెంటర్లో అగ్నిప్రమాదం
అయినవిల్లి: మండల కేంద్రమైన ముక్తేశ్వరం సెంటర్లోని దేవీగణేష్ ప్లాజాలో ఉన్న టిఫిన్ హోటల్లో గురువారం సాయంత్రం గ్యాస్ సిలిండర్ లీకై అగ్ని ప్రమాదం సంభవించింది. దీనికి సంబంధించి స్థానికులు, హోటల్ యజమాని, అమలాపురం ఫైర్ ఆఫీసర్ మురళీ కొండబాబు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ముక్తేశ్వరం సెంటర్లోని దేవీ గణేష్ ప్లాజాలో నిర్వహిస్తున్న చిట్టూరి ఏడుకొండలుకు చెందిన హోటల్లో టిఫిన్లు తయారు చేస్తుండగా ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ లీకై అగ్ని ప్రమాదం సంభవించింది. హోటల్ యజమాని, సిబ్బంది అక్కడి నుంచి దూరంగా వెళ్లి ప్రాణాలు దక్కించుకున్నారు. ఈ ప్రమాదంలో టిఫిన్ తయారీకి సంబంధించిన సామాన్లు, విద్యుత్ పరికరాలు, ఫర్నిచర్ పూర్తిగా కాలిబుడిదయ్యాయి. స్థానికుడు పాస్టర్ పాల్ ఇచ్చిన సమాచారంతో విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకుని మంటలను ఆదుపు చేశారు. ఈ ప్రమాదంలో రూ.1.5 లక్షలు నష్టం వాటిల్లినట్టు ఫైర్ ఆఫీసర్ మురళీ కొండబాబు తెలిపారు.రూ.1.5 లక్షల అస్తిష్టం -
సైబర్ నేరాలతో జాగ్రత్త
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, ప్రిన్సిపల్ జిల్లా జడ్జి సునీత రాజానగరం: అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని సమాజ హితంగా వాడుకోవలసి ఉండగా, కొంతమంది స్వార్థపరులు తమ స్వార్థానికి వాడుతున్న నేపథ్యంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, ప్రిన్సిపల్ జిల్లా జడ్జి సునీత గంధం అన్నారు. ఈ సమయంలో యువత అప్రమత్తంగా ఉంటూ సైబర్ నేరాలను అదుపు చేయడంలో కీలకపాత్ర వహించాలని సూచించారు. స్థానిక గోదావరి గ్లోబర్ యూనివర్సిటీలో ‘డ్రగ్స్ దుర్వినియోగం – యాంటీ ర్యాగింగ్’ అనే అంశంపై ఇంజినీరింగ్ విద్యార్థులకు మంగళవారం చైతన్య సదస్సు నిర్వహించారు. కళాశాలలు, యూనివర్సిటీలలో సీనియర్లు, జూనియర్లను వేధింపులకు గురిచేసి ర్యాగింగ్‌కి పాల్పడం తీవ్రమైన నేరంగా పేర్కొన్నారు. ఈ సమయంలో అటువంటి వారిపై విధించే కేసులు, చట్టాల గురించి అవగాహన కలిగించారు. సీనియర్లు ఎల్లప్పుడూ జూనియర్లకు తమ విజ్ఞానాన్ని పంచుతూ మార్గదర్శకులుగా ఉండాలిగాని, శత్రువుల్లా మారకూడదన్నారు. ఈ విధంగా చేస్తే ర్యాంగింగ్కి పాల్పడిన వ్యక్తుల జీవితాలు నాశనమవుతాయని హెచ్చరించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కె.ప్రకాశ్‌బాబు మాట్లాడుతూ మాదక ద్రవ్యాలకు ఏ ఒక్కరూ బానిసలు కావొద్దన్నారు. అదనపు ఎస్పీ ఎస్ఆర్ రాజశేఖరరాజు మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లు ఏవిధంగా మోసాలకు పాల్పడుతున్నారో వివరించారు. కార్యక్రమంలో జీజీయూ రిజిస్టార్ డాక్టర్ పీఎంఎంఎస్ శర్మ, ప్రిన్సిపాల్స్ డాక్టర్ టి.జయానంద్‌కుమార్, డాక్టర్ ఎస్వీఎస్ఎన్ మూర్తి, రాజమహేంద్రవరం ప్రభుత్వ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ తేతలి రామారెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు. -
సర్దుపాట్లు
● వర్క్ అడ్జెస్ట్‌మెంట్‌కు ప్రభుత్వం సన్నాహాలు ● ఉపాధ్యాయుల అభ్యంతరం రాయవరం: ఉపాధ్యాయుల సర్దుబాటుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. సాధారణంగా ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఉపాధ్యాయుల సర్దుబాట్లు చేయాలి. ప్రస్తుతం విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడిచింది. మరో 10 రోజుల్లో ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలకు కూడా విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు. ఈ దశలో ప్రభుత్వం ఉపాధ్యాయుల సర్దుబాటుకు ఆదేశాలు ఇచ్చింది. వీటిపై ఉపాధ్యాయుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సోమవారం వర్క్ అడ్జస్ట్మెంట్ చేస్తున్నామని, మిగులు ఉపాధ్యాయులు కౌన్సెలింగ్‌కు రావాలని మండల విద్యాశాఖాధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే ఫ్యాఫ్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాలు సర్దుబాటు ప్రక్రియను వ్యతిరేకిస్తూ ఈ ప్రక్రియకు దూరంగా నిలిచారు. ఆందోళనలో టీచర్లు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు ఇప్పుడు సర్దుబాటు బెంగ పట్టుకుంది. జీవో 117కు వ్యతిరేకంగా గత ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల విలీనంపై ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నూతన విద్యా విధానంలో భాగంగా దీన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది. ఈ క్రమంలో విద్యార్థుల సంఖ్య, దూరం ఆధారంగా ప్రాథమిక పాఠశాలల్లో ఒకటి, రెండు తరగతులను సమీపంలో ఉన్న ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. అనంతరం ఉపాధ్యాయుల్ని సర్దుబాటు చేశారు. ఎన్నికలకు ఏడాది ముందు ఉపాధ్యాయ బదిలీలు కూడా చేపట్టారు. అప్పట్లో వ్యతిరేకించిన టీడీపీ విలీన ప్రక్రియను అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న ప్రస్తుత ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. అధికారంలోకి రాగానే 117 జీవోను రద్దు చేస్తామని కూడా ప్రతిపక్షంలో ఉండగా టీడీపీ ప్రకటించింది. అయితే ఇప్పుడు 117 జీవోను రద్దు చేయకుండా, ఉపాధ్యాయులను సర్దుబాటు చేయడాన్ని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ ప్రక్రియను నిలుపుదల చేయాలని, విద్యా సంవత్సరం మధ్యలో సర్దుబాటు ప్రక్రియ చేపట్టడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు నష్టపోతుందని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీఐఎస్‌లో సమాచారం టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌లో ఉపాధ్యాయుల వ్యక్తిగత సమాచారాన్ని ప్రభుత్వం సేకరించింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి ఆధారంగా సర్దుబాట్లు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఇటీవల కాలంలో పలు కారణాలతో పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గింది. ఈ క్రమంలో చాలా పాఠశాలల్లో విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తిలో తేడా వచ్చింది. దీంతో ఉపాధ్యాయులు సర్దుబాటు కోసం ఫేషియల్ అటెండెన్స్ యాప్‌లో టీచర్ల వివరాలను నమోదు చేయించారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా మిగులు ఉపాధ్యాయులను ఇప్పటికే గుర్తించారు. మరోవైపు పలు ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత ఉన్నట్లుగా గుర్తించారు. సబ్జెక్టు టీచర్ల కొరతను తీర్చేందుకు మిగులు సెకండరీ గ్రేడ్ టీచర్ల(ఎస్జీటీ)లను వారి విద్యార్హత ఆధారంగా సబ్జెక్టు టీచర్లుగా పంపించాలని నిర్ణయించారు. మరోవైపు వచ్చే ఏడాది జనవరి నాటికి డీఎస్సీ నియామకాలు చేపడతామని ఇప్పటికే ప్రకటించారు. డీఎస్సీ 2024 నియామకాల అనంతరం తిరిగి ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. జూనియర్లకు ఎఫెక్ట్ మిగులు పోస్టుల నిర్దారణలో కేడర్(సర్వీస్) సీనియార్టీని ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. ఒక పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయుల్లో మిగులు టీచర్లు ఉన్పప్పుడు వారిలో జూనియర్లను మిగులు టీచర్లుగా నిర్దారిస్తారు. గతంలో సీనియర్ కోరుకుంటే వారిని సర్దుబాటు జాబితాలో చేర్చేవారు. ఇప్పుడు ఆ అవకాశం లేకుండా కేవలం కేడర్ జూనియర్‌ను మాత్రమే సర్దుబాటు చేయనున్నారు. ఈ ప్రక్రియ 14వ తేదీలోగా పూర్తి చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేశారు. మిగులు టీచర్లను నిర్ధారించి, మిగులు టీచర్లకు సోమవారం కౌన్సెలింగ్ చేయాలని నిర్ణయించారు. వ్యతిరేకించిన ఉపాధ్యాయ సంఘాలు మిగులు ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. జీవో నంబరు 117, 128 ప్రకారం సర్దుబాటు ప్రక్రియను చేపడుతున్నారు. 117 జీవోనే రద్దు చేయమని డిమాండ్ చేస్తున్నప్పుడు ఆ జీవోను ఆధారంగా చేసుకుని ఉపాధ్యాయుల సర్దుబాటు ఏ విధంగా చేస్తారనేది ఉపాధ్యాయ సంఘాల ప్రధాన డిమాండ్‌గా ఉంది. ముందుగా జారీ చేసిన ఆదేశాల ప్రకారం సోమ, మంగళవారాల్లో మిగులు టీచర్ల సర్దుబాటు చేయాల్సి ఉండగా, సోమవారం ఫాఫ్టో, జాక్టో అసోసియేషన్ల ఆధ్వర్యంలో సర్దుబాటు ప్రక్రియను నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ఈ నేపథ్యంలో సోమవారం జరగాల్సిన సర్దుబాటు ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేశారు. జీవో నంబరు 117, 128 ప్రకాారం కాకుండా జీవో 53 ప్రకారం చేయాలని ఉపాధ్యాయుల సర్దుబాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మండల స్థాయిలోనే కౌన్సెలింగ్ మండల స్థాయి ప్రాతిపదికగానే వర్క్ అడ్జస్ట్మెంట్ చేపట్టాలి. మండల స్థాయిలో పాఠశాలల్లో వాస్తవంగా ఉన్న విద్యార్థుల సంఖ్యను ఆధారంగా చేసుకుని ఉపాధ్యాయుల సర్దుబాటు చేపట్టాలి. జీవో 53 ప్రకారం వర్క్ అడ్జస్ట్మెంట్ చేపట్టాలి. – చింతాడ ప్రదీప్ కుమార్, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు, కాకినాడ 117 జీవో రద్దు చేయాలి ఉపాధ్యాయుల సర్దుబాటుకు ముందుగా జీవో 117ను రద్దు చేయాలి. దానిని రద్దు చేస్తానంటూ ప్రస్తుత ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉండగా చెప్పిన మాటకు కట్టుబడి ఉండాలి. అసంబద్ధంగా ఉన్న జీవో ప్రకారం ఉపాధ్యాయులను సర్దుబాటు చేయడం వల్ల విద్యావ్యవస్థకు నష్టం జరుగుతుంది. – పెంకే వెంకటేశ్వరరావు, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు, అమలాపురం, ప్రభుత్వ నిర్ణయం అసంబద్ధం ఉపాధ్యాయుల సర్దుబాటును 117, 128 జీవోల ప్రకా రం చేప ట్డం అన్యాయం. ఈ నిర్ణయం పూర్తి అసంబద్ధంగా ఉంది. ప్రతిపక్షంలో ఉన్పప్పుడు ప్రస్తుత విద్యాశాఖ మంత్రి లోకేష్ స్వయంగా జీవో 117 రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి రెండు నెలలు పూర్తయినప్పటికీ జీవో రద్దుకు ఉపాధ్యాయ సంఘాలతో చర్చించక పోవడం శోఛనీయం. – పొతంశెట్టి దొరబాబు, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు, అమలాపురం ఉపాధ్యాయ సంఘాల ప్రధాన డిమాండ్లు జీవో నంబరు 53 ప్రకారం ఉపాధ్యాయుల సర్దుబాటు చేయాలి. మండల పరిధిలోనే సర్దుబాట్లు ఉండాలి. తప్పనిసరి పరిస్థితుల్లో డివిజన్ స్థాయిలో చేపట్టాలి. జిల్లాల దాటి ఉపాధ్యాయులను సర్దుబాటు చేయరాదు. ప్రస్తుత అకడమిక్ విద్యా సంవత్సరంలో ఉద్యోగ విరమణ చేస్తున్నవారిని సర్దుబాటు నుంచి మినహాయించాలి. ఫ్లస్–2, సీబీఎస్ఈ అమలవుతున్న పాఠశాలల్లో వర్క్ అడ్జస్ట్మెంట్ చేయరాదు. స్టడీ లీవ్, మెటర్నటీ లీవ్‌లో ఉన్న ఉపాధ్యాయులు ఉన్న చోట వర్క్ అడ్జస్ట్మెంట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి. పీఎస్ హెచ్ఎంను అదే పాఠశాలలో ఉన్న రోల్‌తో సంబంధం లేకుండా కొనసాగించాలి. 6 నుంచి 10 తరగతులు ఉన్న పాఠశాలల్లో 10 సెక్షన్లు దాటితే రెండవ హిందీ, రెండవ పీఎస్ పోస్టు మంజూరు చేయాలి. -
సర్దుబాటు బహిష్కరణ
అమలాపురం టౌన్: విద్యాశాఖ తలపెట్టిన వర్క్ అడ్జస్ట్మెంట్ (ఉపాధ్యాయుల పని సర్దుబాటు)పై ఉపాధ్యాయ సంఘాలు ససేమిరా అంటున్నాయి. అసంబద్ధమైన ఈ ప్రక్రియను తాము బహిష్కరిస్తున్నట్లు జిల్లా ఫాప్టో శాఖ స్పష్టం చేసింది. అలాగే పీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘం కూడా పని సర్దుబాటును బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. ఈ రెండు జిల్లా స్థాయి సంఘాలకు చెందిన ఉపాధ్యాయులు సర్దుబాటు కార్యక్రమానికి సహాయ నిరాకరణ ఉంటుంటుందని చెబుతున్నారు. జిల్లా ఫాప్టోకు సంబంధించిన ఎస్టీయూ, యూటీఎఫ్ జీహెచ్ఎం అసోసియేషన్ నాయకులు నాగిరెడ్డి శివప్రసాద్, పోతంశెట్టి దొర బాబు, ఎస్ఎస్ పల్లంరాజు, పెంకే వెంకటేశ్వరరావు, నారాయణ శ్రీనివాసరావు, నిమ్మకాయ ల గణేశ్వరరావు అమలాపురంలో జరిగిన సమావేశంలో పని సర్దుబాటును వ్యతిరేకించారు. పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు దీపాటి సురేష్‌బాబు, ప్రధాన కార్యదర్శి వాడ్రేవు శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ మొంగం అమృతరావు సైతం ఆ ప్రక్రియను వ్యతిరేకించారు. అగ్రి కోర్సు దరఖాస్తులకు ఆహ్వానం రాజమహేంద్రవరం రూరల్: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 4 సంవత్సరాల బీఎస్సీ(హానర్స్) కోర్సు ప్రవేశం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు రాజమహేంద్రవరం వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ డి.శ్రీనివాస్ ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో ఆరు ప్రభుత్వ కళాశాలలు, ఆరు అనుబంధ కళాశాలలు ఉన్నాయన్నారు. 2024–25 విద్యాసంవత్సరం కోర్సు ప్రవేశాలకు ఆసక్తిగల విద్యార్థులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏఎన్జీఆర్ఏయూ.ఏసీ.ఐఎన్ యూనివర్శిటి వెబ్సైట్ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చన్నారు. ఇందులో కోర్సు వివరాలు, అర్హత, వయోపరిమితి, రైతు వారి కోటా వివరాలు ఇస్తామన్నారు. అపరాధ రుసుంతో ఈనెల 30వతేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ‘పంపా’ రైతుల ఆశలకు లీకేజీ అన్నవరం: స్థానిక పంపా రిజర్వాయర్ బ్యారేజీ గేట్లుకు ఎన్ని సార్లు మరమ్మతులు చేసినా సమస్య మళ్లీ మొదటికి వస్తోంది. గత జూన్‌లో పంపా బ్యారేజీ గేట్లకు సుమారు రూ.20 లక్షలతో మరమ్మతులు చేపట్టినా నాలుగో నెంబర్ గేటు మాత్రం ఇంకా రిజర్వాయర్ అధికారులకు సమస్యగానే మిగిలింది. పంపా రిజర్వాయర్‌లో వంద అడుగుల నీటిమట్టంతో గణనీయంగా నీరు ఉన్నప్పటికీ నాలుగో నంబర్ గేటు నుంచి ఇంకా నీరు లీకవుతోంది. ఈ గేటు ద్వారా పది క్యూసెక్కుల నీరు వృఽథాగా పోతుండడంతో అటు అధికారులు, ఇటు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నీటి లీకేజీని అరికట్టేందుకు ఎండుగడ్డి మోపులుగా కట్టి గేటు దిగువన ఉంచేందుకు రిజర్వాయర్ సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఖరీఫ్‌పై ఆశ చిగురించిన వేళ... నీటి లీకేజీ.. జూలై రెండో వారం నుంచి ఆగస్టు మొదటి వారం వరకు కురిసిన భారీ వర్షాల కారణంగా పంపా రిజర్వాయర్ నీటిమట్టం పెరగడంతో ఆయకట్టు రైతులకు ఖరీఫ్ పంటపై ఆశలు చిగురించాయి. జూలై 23న పంపా ఆయకట్టుకు నీరు విడుదల చేశారు. మొదట 30 క్యూసెక్కులు చొప్పున విడుదల చేశారు. తరువాత వంద క్యూసెక్కులకు పెంచారు. ప్రస్తుతం రైతాంగం ఖరీఫ్ పనుల్లో బిజీగా ఉండగా రిజర్వాయర్ బ్యారేజీ గేటు నుంచి నీరు వృథాగా పోతుండడం అశనిపాతంలా మారింది. పుష్కరాలకు కార్యాచరణ రాజమహేంద్రవరం రూరల్: గోదావరి పుష్కరాలు – 2027 నిర్వహిణకు పటిష్టమైన కార్యాచరణతో ముందుకు వెళదామని కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయ సమావేశ మందిరంలో ఆమె వివిధ అంశాలపై చర్చించారు. ఆమె మాట్లాడుతూ గతంలో జరిగిన పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు సూచనలను సలహాలను పరిగణనలోకి తీసుకొని చర్యలు తీసుకుంటా మన్నారు. శాసన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాసు మాట్లాడుతూ రహదారుల అభివృద్ధి, డ్రైనేజీ సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేయాలన్నారు. మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్ మాట్లాడుతూ నగరంలో డ్రైనేజీ వ్యవస్థ రహదారులపై అవగాహనకు వచ్చానన్నారు. ఎస్పీ డి.నరసింహ కిషోర్ మాట్లాడుతూ ట్రాఫిక్ మళ్లింపు అంశాలపై ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు. -
16 నుంచి రెవెన్యూ సదస్సులు
సాక్షి అమలాపురం: భూ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 16 నుంచి సెప్టెంబర్ 30 వరకూ జిల్లాలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ మహేష్‌కుమార్ తెలిపారు. వీటి నిర్వహణకు సంబంధించి జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిషాంతితో కలిసి మంగళవారం తహసీల్దార్లతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఆదేశాల మేరకు 45 రోజుల పాటు జిల్లాలో అన్ని గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామన్నారు. గ్రామాల వారీగా సదస్సులు నిర్వహించే తేదీలపై ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. మ్యూటేషన్, వెబ్ ల్యాండ్‌లో మార్పులు, 1బి, దారి సమస్య, భూ తగాదాలు ఎక్కువగా ఉంటాయని, ఇలాంటి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సదస్సులను నిర్వహిస్తోందన్నారు. ఉపాధి హామీ పనులకు ప్రణాళికలు అమలాపురం రూరల్: ఉపాధి హామీ పనులకు ఆయా శాఖల అధికారులు ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. 2025 మార్చి 31 వరకు అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఉపాధి పథకం కింద 56 లక్షల పని దినాలకు అనుమతి మంజూరైందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి జిల్లాలో మెటీరియల్ కాంపోనెంట్ కింద సుమారు రూ.100 కోట్లు వచ్చే అవకాశం ఉందన్నారు. అన్ని శాఖల అధికారులు సంబంధిత శాఖలోని పనులను గుర్తించి వారం రోజుల లోపు ప్రతిపాదనలు పంపాలన్నారు. సహకార అభివృద్ధి కమిటీ సమావేశం జిల్లాలోని 166 ప్రైమరీ అగ్రికల్చర్ సొసైటీలలో ఆగస్టు 31వ తేదీ లోపు కంప్యూటరైజేషన్ పూర్తిచేయాలని కలెక్టర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఆయన చాంబర్లో మంగళవారం జిల్లా సహకార అభివృద్ధి కమిటీ 3వ సమావేశం నిర్వహించారు. జిల్లాలోని సహకార సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని నాలుగు పీఎసీఎస్‌లు పెట్రోల్ బంకులు నడపడానికి అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నాయన్నారు. -
స్వర్ణ ధ్వజస్తంభానికి మరిన్ని హంగులు
రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలకు వెంకటేష్ మామిడికుదురు: విశాఖపట్నంలో ఈ నెల 17వ తేదీ నుంచి జరిగే రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలకు మామిడికుదురుకు చెందిన డిగ్రీ విద్యార్థి కడలి దివ్యతేజ వెంకటేష్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డీవీవీ సత్యనారాయణ మంగళవారం తెలిపారు. కాకినాడలో ఈ నెల 11వ తేదీన జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా తరఫున పాల్గొన్న వెంకటేష్ బంగారు పతకం సాధించాడన్నారు. తద్వారా రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించినట్టు తెలిపారు. వెంకటేష్ తో పాటు అతడి కోచ్ కె.చిన్నను ప్రిన్సిపాల్ సత్యనారాయణ, అధ్యాపకులు మోకా రంగారావు, యాలంగి రవికుమార్, పెచ్చెట్టి రాధ అభినందించారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న వెంకటేష్ కవల కొబ్బరి కాయ కొత్తపేట: సహజంగా కొబ్బరికాయకు మూడు కన్నులు ఉంటాయి. కానీ గతంలో రెండు, నాలుగు కన్నుల కొబ్బరికాయలను చూశాం. ఇప్పుడు కొత్తగా ఒక కొబ్బరికాయలో కవల (రెండు) కాయలు బయటపడ్డాయి. కొత్తపేటకు చెందిన పురోహితుడు పెద్దింటి రామచంద్ర శ్రీహరి (రామం) ఇంట శ్రావణ మంగళవారం సందర్భంగా లక్ష్మీదేవి పూజలో కొబ్బరి కాయను కొట్టారు. దానిలో కవల కాయలు కనిపించాయి. పీచు తొలగించగా రెండు కనులు ఉన్నాయి. వీటిని పలువురు భక్తులు తిలకించారు. హోటల్ సర్వర్ అనుమానాస్పద మృతి అమలాపురం టౌన్: అమలాపురం గడియారం స్తంభం సెంటర్లోని ఒక హోటల్లో సర్వర్‌గా పనిచేస్తున్న పులిదిండి సత్యనారాయణ (50) సోమవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పట్టణ సీఐ కె.క్రిష్టోఫర్ తెలిపిన వివరాల ప్రకారం.. అల్లవరం మండలం కొమరగిరిపట్నానికి చెందిన పులిదిండి సత్యనారాయణ పదేళ్లుగా ఇదే హోటల్లో పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి వరకూ పనిచేసి నిద్రపోయాడు. హోటల్ యజమాన్యం మంగళవారం ఉదయం చూసే సరికి మృతి చెంది ఉన్నాడు. సమాచారం అందుకున్న అతడి కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని విలపించారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సత్యనారాయణ హృదయ సంబంధ వ్యాధితో బాధపడుతున్నాడని సమాచారం. కలుపు మందు రుచి చూసిన యువకుడి మృతి పి.గన్నవరం: పొలంలో కలుపు నివారణకు ఉపయోగించే మందు ఎలా ఉంటుందోనని రుచి చూసిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఏఎస్సై పట్టాభిరామయ్య తెలిపిన వివరాల ప్రకారం.. పి.గన్నవరం మండలం ఊడిమూడి గ్రామానికి చెందిన అడబాల శివ (26) ఈ నెల 6న తన పొలం వద్దకు వెళ్లాడు. అక్కడ ఉన్న కలుపు నివారణ మందును ఎలా ఉంటుందో రుచి చూద్దామనుకున్నాడు. దీంతో కొద్దిగా తాగి, వెంటనే బయటకు ఊసేశాడు. కానీ ఈ విషయం ఇంట్లో చెప్పలేదు. ఈనేపథ్యంలో ఈ నెల 12న అతడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే అతడిని రాజమహేంద్రవరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శివ మంగళవారం మృతి చెందాడు. డీజిల్ ట్యాంకర్ నుంచి మంటలు తాళ్లరేవు: జాతీయ రహదారిపై తాళ్లరేవు వద్ద డీజిల్ ట్యాంకర్ నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక శాఖ సిబ్బంది వచ్చి వాటిని అదుపు చేశారు. వివరాల్లోకి వెళితే.. విశాఖపట్నం నుంచి యానాం వెళుతున్న డిజిల్ ట్యాంకర్ తాళ్లరేవుకు వద్దకు వచ్చేసరికీ టైర్ పేలిపోయింది. దీంతో ఒక్కసారిగా మంటలు రేగా యి. గమనించిన డ్రైవర్ ప్రాణభయంతో పరుగులు తీశాడు. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక శాఖ సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను పూర్తిగా అదుపు చేశారు. ఈ ఘటనతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ అక్కడకు చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన వీర వేంకట సత్యనారాయణస్వామివారి దేవస్థానంలోని స్వర్ణ ధ్వజస్తంభానికి మరిన్ని హంగులు సమకూరనున్నాయి. నెల్లూరుకు చెందిన భక్తుడి విరాళం సుమారు రూ.మూడు కోట్లతో ఈ నెల తొమ్మిదో తేదీన స్వామివారి సన్నిధిలో స్వర్ణ ధ్వజస్తంభాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ ధ్వజస్తంభం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. దీని ఏర్పాటు కోసం స్వామివారి ఆలయం ఎదురుగా గల శ్లాబ్‌కు గుండ్రంగా రంధ్రం చేశారు. ధ్వజస్తంభం ఆ రంధ్రంలోంచి ఆలయ శిఖరానికి సమాన ఎత్తు వరకూ వచ్చింది. దాని చివరలో సుదర్శన చక్రం, మేఖలాలు ఏర్పాటు చేశారు. అయితే వర్షం వస్తే ఆ ధ్వజస్తంభం రంధ్రంలోంచి వర్షం చినుకులు దిగువకు పడే అవకాశం ఉంది. దీంతో దాన్ని చెక్కలతో తాత్కాలికంగా మూసివేశారు. ఇప్పుడు ధ్వజస్తంభం నుంచి పైకి చూస్తే శ్లాబ్ రంధ్రానికి వేసిన చెక్కులు తప్పు మరేమీ కనిపించవు. ఈ నేపథ్యంలో ఆ చెక్కలకు బదులు గ్లాస్‌తో తయారు చేసిన డోమ్ లాంటిది ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల దిగువ నుంచి చూస్తే గ్లాస్ డోమ్లోంచి ధ్వజస్తంభం చివరి వరకూ కనిపించే అవకాశం ఉంటుంది. వైదిక కార్యక్రమాలకు అవసరమైనపుడు ధ్వజస్తంభం మీద గ్లాస్ డోమ్ తొలగించేలా ఏర్పాటు చేయనున్నట్లు దేవస్థానం డీఈఈ ఉదయ్ తెలిపారు. అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య కరప: అప్పుల బాధ తట్టుకోలేక విష గుళికలు తిని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరప గ్రామానికి చెందిన వజ్రపు సత్యనారాయణ వెల్డింగ్ పనిచేసుకుంటూ భార్య, ఇద్దరు పిల్లలను పోషించుకుంటున్నాడు. ఆరు నెలల క్రితం వెల్డింగ్ షాపు తీసుకుని సొంతంగా వ్యాపారం ప్రారంభించాడు. పనులు అంతగా లేక, వ్యాపారం సాగక షాపు నిర్వహణకు అప్పులు చేశాడు. వాటిని తీర్చే దారిలేక తాగుడుకు అలవాటు పడ్డాడు. ఈ నేపథ్యంలో అప్పుల బాధ తట్టుకోలేక మంగళవారం ఉదయం వెల్డింగ్ షాపు వద్ద విష గుళికలు తిని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడు వాంతులు చేసుకోవడాన్ని గమనించిన ఒక బాలుడు ఇంటికి వెళ్లి విషయం చెప్పాడు. అతడి భార్య దేవి వెంటనే షాపు వద్దకు వచ్చి భర్తను వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లింది. అక్కడి చికిత్స పొందుతూ సత్యనారాయణ మృతి చెందాడు. దేవి ఫిర్యాదు మేరకు కరప ఇన్చార్జి ఎస్సై పి.శోభన్ కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. కొనసాగుతున్న శిక్షణ సామర్లకోట: స్థానిక విస్తరణ శిక్షణ కేంద్రంలో 11 జిల్లాలకు చెందిన అధికారులకు సుస్థిరాభివృద్ది లక్ష్యాలపై ఇస్తున్న శిక్షణ మంగళవారం కూడా కొనసాగింది. దీనిలో భాగంగా మహిళా స్నేహ పూర్వక గ్రామం అనే అంశంపై తరగతులు జరుగుతున్నాయి. ప్యాకల్టీలు ప్రసాద్, నిహారిక, పద్మజ మాట్లాడుతూ మహిళా సంఘాల ఆర్థిక కార్యక్రమాలల్లో మహిళల భాగస్వామ్యంపై అవగాహన పెంచాలన్నారు. బాల్య వివాహాలకు అడ్టుకట్ట వేయాలని, శారీరక ఆరోగ్యం, మానసిక స్థితిపై శ్రద్ధ చూపాలని సూచించారు. కార్యక్రమంలో ఫ్యాకల్టీలు బి.వెంకటేశ్వర్లు, చక్రఫణిరావు, బి.ఆంజనేయులు పాల్గొన్నారు. -
నేటి నుంచి వాడపల్లిలో పవిత్రోత్సవాలు
● మూడు రోజుల పాటు నిర్వహణ ● ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ అధికారులుఆత్రేయపురం: కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కిన వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు బుధవారం ఉదయం నుంచి ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దేవదాయ ధర్మదాయశాఖ డిప్యూటీ కమిషనర్, ఆలయ ఈఓ భూపతిరాజు కిషోర్‌కుమార్ తెలిపారు. పవిత్రోత్సవాల సందర్భంగా మూడు రోజులు పాటు ఆలయంలో అష్టోత్తర పూజలు, కల్యాణాలు, ఉపనయనాలు, వివాహాలను రద్దు చేశామన్నారు. పవిత్రోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయాన్ని అంగరంగ వైభవంగా తీర్చిదిద్దుతున్నారు. వివిధ రకాల పుష్పాలు, పువ్వులతో ముస్తాబు చేస్తున్నారు. కార్యక్రమాల వివరాలు పవిత్రోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం 8 గంటలకు విష్వక్ష్సేన పూజ, పుణ్యహవచనం, సాయంత్రం 5 గంటలకు సంకల్పం, అంకురార్పణ, అగ్ని ప్రతిష్టాపన, గురువారం ఉదయం 8 గంటలకు సంకల్పం, విష్వక్ష్సేన పూజ, పుణ్యహవచనం, సాయంత్రం 5 గంటలకు పవిత్రారోహణం, విశేష అర్చన, పవిత్ర ప్రతిష్ట ప్రధాన హోమాలు, 16వ తేదీ ఉదయం 8 గంటలకు సంకల్పం, మహా శాంతిహోమం, ప్రాయశ్చిత్ర హోమం, మహాపూర్ణహుతి, పవిత్ర విసర్జన, మహదాశీర్వచనం నిర్వహించనున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి
దెందులూరు: ఆగి ఉన్న లారీని వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ఓ కారు ఢీకొట్టిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. వివరాలిలా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లికి చెందిన దొమ్మేటి నాగార్జున (35), యాగంటి సుబ్రహ్మణ్యం (50), దొమ్మేటి మనోజ్ (21) అన్నదమ్ముల పిల్లలు. వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నారు. ఇదిలా ఉండగా, విజయవాడలో ఆస్పత్రికి వెళ్లిన వీరు మంగళవారం తిరిగి దేవరపల్లికి కారులో బయలుదేరారు. సత్యనారాయణపురం వద్ద రోడ్డు పక్కన ఆగి ఉన్న ఓ లారీని వీరి కారు అతివేగంగా వస్తూ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దొమ్మేటి నాగార్జున, యాగంటి సుబ్రహ్మణ్యం ఘటనా స్థలంలోనే మృతి చెందగా, తీవ్ర గాయాలపాలై అపస్మారక స్థితిలో ఉన్న దొమ్మేటి మనోజ్‌ను హైవే పోలీసులు అంబులెన్స్‌లో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కారు నంబర్ ఆధారంగా మృతుల వివరాలు సేకరించి కుటుంబ సభ్యులకు ఎస్ఐ కే.స్వామి సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
రేషన్ బియ్యం పట్టివేత
పిఠాపురం: మండలంలోని బి.ప్రత్తిపాడు గ్రామంలో మంగళవారం పీడీఎస్ బియ్యం (రేషన్ బియ్యం) పట్టుకున్నట్లు రీజనల్ విజిలెన్స్ ఎస్పీ కేఎస్ఎస్వీ సుబ్బారెడ్డి తెలిపారు. పక్కా సమాచారం మేరకు గ్రామంలో తనిఖీలు నిర్వహించగా ఒక వాహనంలో 58 బస్తాల్లో ఉంచిన 3,150 కేజీల బియ్యాన్ని గుర్తించామన్నారు. దీనిని అక్రమంగా తరలిస్తున్న ఆకుల గంగరాజుపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. సీజ్ చేసిన బియ్యం, వాహనం విలువ రూ.8,93,325 ఉంటుందన్నారు. తనిఖీలో విజిలెన్స్ ఎస్పై టి.జగనాథరెడ్డి, పిఠాపురం సీఎస్‌డీటీ వీరాస్వామి, కానిస్టేబుళ్లు లోవరాజు, శివ, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. 16 నుంచి వెదురుపాక పీఠం వార్షికోత్సవాలు రాయవరం: మండలంలోని వెదురుపాక విజయదుర్గాపీఠం 52వ వార్షికోత్సవాన్ని ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకూ ఘనంగా నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని పీఠం అడ్మినిస్ట్రేటర్ వీవీ బాపిరాజు మంగళవారం పీఠంలో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. వాడ్రేవు వెంకట సు బ్రహ్మణ్యం (గాడ్) 1972లో ఈ పీఠం ఏర్పాటు చేసినప్పటికీ నుంచి ఏటా వార్షికోత్సవాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఈ నెల 16వ తేదీ ఉదయం 9.18 గంటలకు జ్యోతిప్రజ్వలనతో వార్షికోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా విజయదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజ లు, నవగ్రహ మండపారాధన నిర్వహిస్తారు. కొల్హాపూర్ వేదపండితులతో శ్రీమహాలక్ష్మి అమ్మవారికి తిరుమంజనం అర్చన, హోమం, సాయంత్రం 6.30 గంటలకు తమిళనాడు తిరుత్తణి ఆలయ అర్చకులతో సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి కల్యాణం జరుగుతాయి. 17వ తేదీ ఉదయం అహోబిలం వేద పండితులతో లక్ష్మీనరసింహస్వామికి తిరుమంజనం, అర్చన అనంతరం హోమం, సాయంత్రం పీఠంలోని అనంతలక్ష్మి సమేత వీర వేంకట సత్యనారాయణస్వామి కల్యాణం నిర్వహిస్తారు. 18న సీతారామ పట్టాభిషేకం, సాయంత్రం వైఖానస పండితులతో శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి కళ్యాణం జరుగుతుంది. విలేకరుల సమావేశంలో విజయదుర్గా సేవా సమితి ప్రతినిధులు భాస్కర నారాయణ, జి. సత్య వెంకట కామేశ్వరి, పి.సత్య కనకదుర్గ, బి. రమ, పీఠం పీఆర్వో వి.వేణుగోపాల్పాల్గొన్నారు. -
అనుమానంతో భార్యను చంపేశాడు
● పురుషోత్తపట్నంలో దారుణం ● కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు సీతానగరం/రాజానగరం: తాగుడుకు బానిసైన ఓ వ్యక్తి అనుమానంతో తన భార్యను కిరాతకంగా కత్తితో నరికి హత్య చేశాడు. సీతానగరం మండలం పురుషోత్తపట్నంలో మంగళవారం ఈ దారుణం జరిగింది. వివరాల్లోకి వెళితే.. దేవీపట్నం మండలం దండంగికి చెందిన చాట్ల జాన్‌తో నేలకోటకు చెందిన దివ్యభారతి (30)కి 14 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి ముగ్గురు పిల్లలు. పెద్దమ్మాయి రమ్మిత్రీ 8వ తరగతి, కుమారులైన చెర్రి, పోసి ఆరు, ఐదు తరగతులు చదువుతున్నారు. జాన్, దివ్యభారతితో పాటు వారి తల్లిదండ్రులు కూడా సొంతూళ్లను వదిలి సీతానగరం మండలం పురుషోత్తపట్నానికి వచ్చేశారు. భార్యపై అనుమానం తాగుడుకు బానిసైన జాన్ తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. తరచూ ఆమెను వేధింపులకు గురిచేసేవాడు. జాన్ తాగుడుకు బానిస కావడంతో కుటుంబ బాధ్యతను దివ్యభారతి తీసుకుంది. పురుషోత్తపట్నంలో ఒక కూల్ డ్రింక్ షాపు అద్దెకు తీసుకుని జీవనం సాగిస్తోంది. భర్త వేధింపులను భరించలేక, అతడి తీరులో మార్పురాకపోవడంతో విడిపోవాలనే నిర్ణయానికి వచ్చి వేరుగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనాలుగు రోజుల క్రితం వృద్ధురాలైన తన తల్లి సునీతకు ఆరోగ్యం బాగోక రాజమహేంద్రవరం ఆస్పత్రిలో ఉన్న ఆమెకు ఆసరాగా ఉండేందుకు వెళ్లింది. అక్కడి రెండు రోజుల క్రితమే ఇంటికి తిరిగొచ్చింది. కత్తితో నరికి.. దివ్యభారతి మంగళవారం తెల్లవారుజామున 4.45 గంటలకు బహిర్భూమికి వెళ్లిన సమయంలో జాన్ కత్తితో దాడి చేశాడు. ఆమె ఎంత బతిమలాడినా వినకుండా విచక్షణారహితంగా నరికేశాడు. చేతులు, మెడ, నడుము తెగిపోవడంతో దివ్యభారతి అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం జాన్ సిగరెట్టు కాల్చుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మృతురాలి తండ్రి సరిపల్లి చిట్టియ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ అడపా నాగమురళి తెలిపారు. ఘటనా స్థలాన్ని సీఐతో పాటు ఇన్చార్జి ఎస్సై ఆనంద్ కుమార్, సిబ్బంది పరిశీలించారు. -
వరి వడిగా..
పిఠాపురం: వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. జోరుగా వరినాట్లు జరుగుతున్నాయి. పొలాల్లో పనులు చేస్తున్న కూలీలలో పల్లెలు కళకళలాడుతున్నాయి. ముఖ్యంగా గొల్లప్రోలు మండలంలో ఉత్సాహంగా సాగు పనులు జరుగుతున్నాయి. ఒకే ప్రాంతంలోని మెట్ట భూముల్లో వాణిజ్య పంటలను, మాగాణీ భూములతో వరిని పండిస్తున్నారు. ఈ పనుల్లో వ్యవసాయ కూలీలు బిజీగా మారారు. కాగా.. ఇటీవల కురిసిన అధిక వర్షాలతో నాట్లు దశలోనే ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే వరినాట్లు 90 శాతం పూర్తవ్వగా, వాణిజ్య పంటల సాగు చివరి దశకు చేరుకుంది. వర్షాల వల్ల నీట మునిగిన పంటలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. దెబ్బతిన్న పంటలను కాపాడుకునే పనిలో రైతులు ఉన్నారు. మరో పక్క ఇంకా నాట్లు పడని ప్రాంతాల్లో నాట్లు వేసే పనులు ఊపందుకున్నాయి. -
శిక్షణతో ఉపాధి అవకాశాలు మెరుగు
రాజానగరం: పొందిన శిక్షణను ఆచరణలో పెట్టి ఉపాధి అవకాశాలను మెరుగుపర్చుకోవాలని, వ్యవసాయాన్ని వ్యాపార సరళిలో చేపట్టి పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని రాజమహేంద్రవరం సీటీఆర్ఐ డైరెక్టర్ డాక్టర్ మాగంటి శేషుమాధవ్ అన్నారు. నర్సరీ యాజమాన్యం – ఉద్యాన పంటలలో అంట్లు కట్టే పద్ధతులపై కలవచర్లలోని కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే)లో వారం రోజుల పాటు జరిగిన శిక్షణ మంగళవారంతో ముగిసింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి డాక్టర్ శేషుమాధవ్ అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ కేవీకే ద్వారా రైతులు, రైతు మహిళలు, యువతకు అనేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కేవీకే ప్రధానాధికారి డాక్టర్ వీఎస్‌జీఆర్ నాయుడు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కూడా ఉద్యాన పంటల విభాగంతో పాటు వెటర్నరీ, ఫిషరీస్, గృహ విజ్ఞానం, సస్యరక్షణ మున్నగు అంశాలపై జిల్లా ఆత్మ ప్రాజెక్టు సహకారంతో శిక్షణ కొనసాగిస్తామన్నారు. జిల్లా ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ వై.జ్యోతిర్మయి మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానాన్ని సులువుగా అవగాహన చేసుకునే విధానాలను శిక్షణలో వివరించడం హర్షణీయమన్నారు. ఉమ్మడి జిల్లాలోని గొల్లప్రోలు, బిక్కవోలు, రాజానగరం, కడియం మండలాలకు చెందిన 15 శిక్షణకు హాజరుకాగా, వారికి సీటీఆర్ఐ డైరెక్టర్ డాక్టర్ శేషుమాధవ్ ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. కేవీకే ఉద్యాన పంటల అధికారి జేవీఆర్ సత్యవాణి కోర్సు కో ఆర్డినేటర్‌గా వ్యవహరించారు. కార్యక్రమంలో గ్రామీణ ఫౌండేషన్ ప్రాజెక్టు డైరెక్టర్ సత్రుపా, కామానంద్ మిశ్రా, శాంతి వర్థన్ మినిస్ట్రీస్ డైరెక్టర్ వీరబాబు, రఘువీర్, సుచరిత పాల్గొన్నారు. -
జీజీహెచ్ ఉద్యోగికి షోకాజ్ నోటీసు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): అట్రాసిటీ కేసు పెడతానంటూ ఉన్నతాధికారులు, సహోద్యోగులను భయబ్రాంతులకు గురిచేస్తున్న ఓ ఉద్యోగికి రాజమహేంద్రవరం జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీసూర్యప్రభ మంగళవారం షోకాజ్ నోటీసు జారీ చేశారు. దారా గౌతమ్ రాంజీ అనే వ్యక్తి రాజమహేంద్రవరం జీజీహెచ్‌లో జనరల్ డ్యూటీ అటెండర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ అట్రాసిటీ కేసు పెడతానంటూ బెదిరిస్తున్నాడని కొద్దిరోజుల క్రితం అతడి వ్యవహారశైలిపై 38 మంది ఎంఎన్‌వోలు, జీడీఏలు విచారణాధికారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో సూపరింటెండెంట్ జోక్యం చేసుకుని సహోద్యోగులతో వ్యవహరించే తీరును మార్చుకొని రోగుల సంరక్షణ కోసం నిబద్ధతతో పనిచేయాలని, ఇటువంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని రాంజీని మందలించారు. రాంజీ తీరులో మార్పు రాకపోగా ఫిర్యాదుదారులపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాడు. అంతేకాకుండా అట్రాసిటీ కేసు పేరుతో బెదిరింపులకు గురిచేస్తున్నాడనే ఫిర్యాదుతో సూపరింటెండెంట్ మంగళవారం రాంజీకి షోకాజ్ నోటీసు జారీ చేశారు. -
రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ కార్యవర్గంలో జిల్లాకు స్థానం
అమలాపురం టౌన్: రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్‌లో జిల్లాకు రెండు పదవులు దక్కాయి. రాష్ట్ర అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు యెనుముల కృష్ణ పద్మరాజు, రాష్ట్ర అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా జిల్లా అసోసియేషన్ కోశాధికారి దొమ్మేటి వెంకటరమణ ఎన్నికయ్యారు. వీరిద్దరూ అమలాపురానికి చెందిన వారే. దీనిపై అమలాపురంలో సోమవారం జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ కార్యదర్శి వంటెద్దు వెంకన్నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు. విశాఖపట్నంలో ఆదివారం జరిగిన రాష్ట్ర అసోసియేషన్ ఎన్నికల్లో జిల్లాకు ప్రాధాన్యం ఇస్తూ కృష్ణ పద్మరాజు, వెంకటరమణలకు అవకాశం లభించారన్నారు. వీరి ఎన్నిక పట్ల జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కంకిపాటి వెంకటేశ్వరరావు, అసోసియేషన్ ప్రతినిధులు నగభేరి కృష్ణమూర్తి, గారపాటి చంద్రశేఖర్, కత్తుల శ్రీనివాసరావు, మట్టపర్తి సముద్రం తదితరులు హర్షం వ్యక్తం చేశారు. ఎస్పీ కార్యాలయానికి 25 అర్జీలు అమలాపురం టౌన్: స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 25 అర్జీలు వచ్చాయి. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఎస్పీ బొడ్డేపల్లి కృష్ణారావు ఫిర్యాదులను స్వీకరించారు. రాయవరం మండలం పసలపూడికి చెందిన కొవ్వూరి లక్ష్మి తన తండ్రి కృష్ణ మృతికి కారణమైన బాధ్యులను శిక్షించాలంటూ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అలాగే కొందరు ఫిర్యాదుదారులు కుటుంబ సమేతంగా వచ్చి తమ కుటుంబ తగాదాలను ఎస్పీకి చెప్పుకుని న్యాయం చేయాలని కోరారు. కొన్ని ఫిర్యాదులను ఎస్పీ అక్కడిక్కడే పరిష్కరించారు. అయితే మిగిలిన అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆయా ప్రాంతాల డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలను ఆదేశించారు. జిల్లా ఎస్పీ కార్యాలయ ప్రజా సమస్యల పరిష్కార వేదిక పర్యవేక్షణ ఎస్సై డి.శశాంక పాల్గొన్నారు. తైక్వాండోలో క్రీడాకారుల ప్రతిభ అంబాజీపేట: స్థానిక శ్రీనివాస తైక్వాండో క్లబ్ విద్యార్థినులు పలు విభాగాల్లో మూడు గోల్డ్ మెడల్స్, సిల్వర్, రెండు బ్రాంజ్ మెడల్స్ సాధించినట్లు కోచ్ పితాని త్రిమూర్తులు తెలిపారు. సోమవారం అంబాజీపేట జెడ్పీ హైస్కూల్లో విజేతలను అభినందించారు. ఈ నెల 11న కాకినాడ జిల్లా స్టేడియంలో 30వ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూనియర్స్, సీనియర్స్ తైక్వాండో చాంపియన్ షిప్ పోటీలు జరిగాయని త్రిమూర్తులు తెలిపారు. సీనియర్ విభాగంలో పితాని భార్గవి శ్రీకళ, కె.లక్ష్మీప్రసన్న గోల్డ్ మెడల్స్, కె.వినూత్న సిల్వర్ మెడల్, డి.రాఘవేంద్ర బ్రాంజ్ మెడల్ సాధించారన్నారు. జూనియర్ విభాగంలో ఎ.ఆదిత్య గోల్డ్, ఏబీ చైతన్య బ్రాంజ్ మెడల్ కై వసం చేసుకున్నారన్నారు. క్రీడాకారులను ఎస్సై కె.చిరంజీవి, హెచ్ఎం కె.సాయిరామ్, ఎస్ఎంసీ చైర్మన్ పితాని త్రిమూర్తులు, పీడీ కె.ఆదిలక్ష్మి, పీఈటీ అందె సూర్యకుమారి అభినందించారు. వరలక్ష్మీ కానుక విజయవంతంగోకవరం: హిందూ ధర్మ పరిరక్షణకు చేపట్టిన బంగారు వరలక్ష్మీ కానుక విజయవంతం అయ్యిందని విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన వ్యవస్థాపక అధ్యక్షుడు కంబాల శ్రీనివాస్‌రావు వెల్లడించారు. గోకవరం సూర్యఫంక్షన్ హాలులో సోమవారం బంగారు వరలక్ష్మీ కానుక కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని మహిళలకు లక్కీడ్రా నిర్వహించి 133 మందికి బంగారు రూపులను అందజేశారు. ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో 17 వేల మంది పేర్లు నమోదు చేశామన్నారు. వీరిలో లక్కీ డ్రా ద్వారా 440 మందికి గ్రాము బంగారు రూపుని అందించామన్నారు. -
మాజీ సీఎం జగన్ చిత్రం తొలగింపు
కరప: పాలనలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ 2019లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వార్డు, గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు. ఇందులో భాగంగా ఆ ఏడాది అక్టోబర్ నెల 2 గాంధీ జయంతి రోజున రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ వ్యవస్థను కరప నుంచి ఆయన లాంఛనంగా ప్రారంభించి, పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కరప గ్రామసచివాలయం–1 వద్ద ఏర్పాటు చేసిన పైలాన్‌కు నీలం, తెలపు, ఆకుపచ్చ రంగులు వేసి, పైభాగంలో నాలుగుపక్కలా నవరత్నాల చక్రం లోగోలో జగన్ ముఖచిత్రం ఉండేలా విద్యుద్దీపాలతో గ్రామసర్పంచ్ సాదే ఆశాజ్యోతి ఏర్పాటు చేశారు. కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కాకినాడ రూరల్ నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున పోటీచేసిన పంతం నానాజీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పటి నుంచి ఆ పార్టీ మండల నాయకులు పైలాన్‌ను తొలగించాలని చూడగా గ్రామ కార్యదర్శి ఎస్కే నాగేంద్రకుమార్ జీఓ లేకుండా పైలాన్ తొలగించడానికి వీలులేదని చెప్పారు. తర్వాత నాగేంద్రకుమార్‌కు గ్రేడ్–1 కార్యదర్శిగా పదోన్నతి రాగా, బదిలీపై వెళ్లారు. తర్వాత మళ్లీ జేఎస్పీ నాయకులు పైలాన్‌పై ఉండే జగన్ చిత్రాన్ని తొలగించాలని పట్టుబట్టి తొలగించారు. పైలాన్ పైభాగంలో నాలుగుసింహాల బొమ్మను ఏర్పాటు చేసేందుకు పనులు చేపట్టారు. వైఎస్సార్ సీపీ జెండా రంగులు తొలగించి టీడీపీ, జనసేన రంగులు వేస్తే ఊరుకోబోమని, జాతీయజెండా రంగులు వేస్తే అభ్యంతరం లేదని, మాజీ ముఖ్యమంత్రి జగన్ పేరుతో ఉన్న శిలాఫలకం తొలగించినా అంగీకరించమని సర్పంచ్ ఆశాజ్యోతి తెలిపారు. పనులు పూర్తయ్యాక, రంగులు ఏమి వేస్తారో వేచి చూస్తామని వైఎస్సార్ సీపీ నాయకులు తెలిపారు. సచివాలయ వ్యవస్థ పైలాన్‌పై లోగో కూడా మాయం జనసేన నాయకుల నిర్వాకం -
చురుగ్గా సత్యగిరికి మెట్ల నిర్మాణం
రూ.10.50 లక్షలతో చేపట్టిన దేవస్థానంఅన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో సత్యగిరి పై గల హరిహరసదన్, శివసదన్ సత్రాలలో బస చేసే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేందుకు దేవస్థానం అధికారులు మెట్లదారి నిర్మాణం చేపట్టారు. సత్యగిరి దిగువన గల విద్యుత్ సబ్‌స్టేషన్ పక్క నుంచి సత్యగిరి ఘాట్‌రోడ్డు మూడో మలుపు వరకు రూ.10.50 లక్షల వ్యయంతో చేపట్టిన మెట్ల దారి నిర్మాణం ముగింపు దశకు చేరుకుంది. సత్యగిరిపై వంద గదుల హరిహరసదన్ సత్రం, 135 గదుల శివసదన్ సత్రం, రెండు ఉచిత కల్యాణ మంటపాలు, విష్ణుసదన్‌లోని 46 మ్యారేజ్ హాల్స్ ఉన్నాయి. సత్రాలలోని గదులలో భక్తులు బస చేస్తారు. బస చేసే భక్తులలో సొంత వాహనాలు లేనివారే అధికంగా ఉంటారు. స్వామివారి ఆలయానికి రావాలన్నా, మళ్లీ తిరిగి వెళ్లాలన్నా ఘాట్‌రోడ్ ద్వారా నడిచి లేదా వాహనాలలో వెళ్లాల్సి వచ్చేది. దేవస్థానం సత్యగిరి– రత్నగిరి మధ్య ఉచిత బస్సు నడుపుతున్నా అది అన్ని వేళలా అందుబాటులో ఉండదు. దాంతో ఆటోలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఆటోలకు ఎక్కువ మొత్తంలో ఛార్జి చేస్తుండడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. మెట్ల దారి వల్ల ఎంతో మేలు సత్యగిరికి నిర్మిస్తున్న మెట్లదారి వలన భక్తులకు కొంతమేర ఇబ్బంది తొలగనుంది. సత్యగిరి ఘాట్‌రోడ్ ప్రారంభంలో గల విద్యుత్ సబ్‌స్టేషన్ నుంచి ఘాట్‌రోడ్ మొదటి మలుపు వరకు గల వంద మెట్లు, అక్కడ నుంచి రెండో మలుపు వరకు మరో 30 మెట్ల నిర్మాణం చేపట్టి దాదాపుగా పూర్తి చేశారు. ఈ మెట్ల నుంచి హరిహరసదన్, శివసదన్ సత్రాలు వంద మీటర్లు దూరం మాత్రమే ఉంటాయి. దీంతో ఆ సత్రాలలో బస చేసే భక్తులు ఆటోలు, బస్‌లు అందుబాటులో లేకపోయినా సులభంగా చేరుకోవచ్చు. ఈ మెట్లకు ప్రస్తుతం ప్లాస్టింగ్లు జరుగుతున్నాయని మరో వారం రోజుల్లో అవు పూర్తవుతాయని అధికారులు తెలిపారు. -
సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదు
అధికారులతో కలెక్టర్ మహేష్ కుమార్ అమలాపురం రూరల్: ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదని అధికారులకు కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ సూచించారు. సోమవారం అమలాపురంలోని కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు సుమారు 181 అర్జీలు ఇవ్వగా, వాటిని కలెక్టర్‌తో పాటు జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఫిర్యాదులను నిశితంగా పరిశీలించి గడువులోగా పరిష్కరించాలని సూచించారు. జిల్లా కేంద్రం వరకూ అర్జీదారులు రావాల్సిన అవసరం లేకుండా మండల స్థాయిలోనే అధికారులు అర్జీలకు పరిష్కారం చూపాలన్నారు. డీఆర్డీఏ పీడీ వి.శివశంకర్ ప్రసాద్, జిల్లా నీటి యాజమాన్య సంస్థ పీడీ ఎస్.మధుసూదన్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఎం.దుర్గారావు దొర పాల్గొన్నారు. అనంతరం 21న రావులపాలెం శ్రీసత్యసాయి విద్యా సంస్థల్లో వికాస ఆధ్వర్యంలో 25 కంపెనీల ప్రతినిధులతో నిర్వహించనున్న జాబ్ మేళా వాల్ పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. 200 గ్రామాల్లో ప్రచార సదస్సులు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాల మేరకు నీకు తెలుసా అనే ఇంటెన్సివ్ ఫైడ్ ప్రచార అవగాహన సదస్సులను జిల్లాలోని 200 గ్రామాల్లో నిర్వహించడానికి కార్యాచరణ సిద్ధం చేసినట్లు కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. దీనికి సంబంధించిన వాల్ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. హెచ్ఐవీ ఎయిడ్స్‌పై సమాజంలో ఉన్న అపోహలను తొలగించేందుకు సదస్సులు నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు ఏఆర్టీ మందులను ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా అందిస్తున్నారన్నారు. దీనిపట్ల సమగ్ర సమాచారాన్ని తెలుసుకునేందుకు నేషనల్ టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ 1097 ఏర్పాటు చేశారని అన్నారు. డీసీహెచ్ ఎస్.కార్తీక్‌రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఎం.దుర్గారావు దొర, జిల్లా కుష్ఠు, ఎయిడ్స్, టీబీ నియంత్రణ అధికారి సీహెచ్ వి.భరతలక్ష్మి, హెచ్ఐవీ ఎయిడ్స్ నియంత్రణ సూపర్వైజర్ బుజ్జిబాబు తదితరులు పాల్గొన్నారు. పారిశుధ్యంపై దృష్టి సారించండి గ్రామాల్లో పారిశుధ్య పనులపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి ఆయన ఎంపీడీఓలు, గ్రామ పంచాయతీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పారిశుధ్య నిర్వహణ, 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగం, చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాల నిర్వహణ అంశాలపై దిశానిర్దేశం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు పారిశుధ్య సమస్య తలెత్తకుండా, వ్యాధులు ప్రబలకుండా సమగ్ర చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లు, ఆర్డీఓలు జి.కేశవవర్ధన్రెడ్డి, ఎస్.సుధాసాగర్ పాల్గొన్నారు. -
జల తాండవం
● జలాశయంలో గరిష్ట స్థాయికి నీటి నిల్వలు ● రోజుకు 300 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కోటనందూరు: తాండవ జలాశయంలో నీటి నిల్వలు క్రమంగా పెరుగుతూ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 380 అడుగులు కాగా సోమవారం సాయంత్రానికి 375.5 అడుగులకు చేరింది. క్యాచ్మెంట్ ఏరియా నుంచి రోజూ 300 క్యూసెక్కుల వరకూ ఇన్‌ఫ్లో వస్తుండడంతో నీటి నిల్వలు క్రమంగా పెరుగుతున్నాయని డీఈఈ అనురాధ తెలిపారు. ప్రాజెక్టు భద్రత దృష్ట్యా నీటి నిల్వలు 378 అడుగులకు చేరిన తరువాత అదనపు జలాలను స్పిల్‌వే ద్వారా సముద్రానికి విడిచిపెడతామని వివరించారు. సముద్రానికి నీటిని విడిచిపెట్టాల్సి వస్తే రెవెన్యూ, పోలీసు శాఖలతో పాటు ఆయకట్టు రైతులకు సమాచారం ఇస్తామని తెలిపారు. 19న నీటి విడుదల తాండవ జలాశయం నుంచి ఆయకట్టుకు ఈ నెల 19న ఉదయం 8 గంటలకు నీటిని విడుదల చేయుటకు నిర్ణయం తీసుకున్నామని ప్రాజెక్టు డీఈఈ పి.అనురాధ తెలిపారు. ఆ రోజు గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసి ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా నీటిని విడుదల చేస్తామన్నారు. ప్రస్తుతం ఇంజినీరింగ్ విభాగం ముమ్మరంగా కాలువలపై పర్యటించి కాలువల స్థితిగతులను పరిశీలిస్తున్నామన్నారు. సాగునీరు వృథా పోకుండా శిథిలమైన కాలువ గట్ల మరమ్మతులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. రైతులంతా సమన్వయంతో సాగునీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. -
కాలేజీ నిర్మాణం
ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వెళ్లాం మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు నిలిచిపోయిన విషయాన్ని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు దృష్టికి తీసుకు వెళ్లాం. ఆయన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రితో మాట్లాడతానని చెప్పారు. నిర్మాణ పనులు నిలిచిపోవడంపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. – పందిరి శ్రీహరి, జెడ్పీటీసీ సభ్యుడు, అమలాపురం ● జిల్లాలో వైద్య కళాశాల పనులకు గ్రహణం ● గత ప్రభుత్వంలో రూ.500 కోట్లు మంజూరు ● కొత్త ప్రభుత్వం రాకతో ఆగిన అభివృద్ధి ● గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసిన స్థానికులు సాక్షి, అమలాపురం: కోనసీమ వాసుల చిరకాల స్వప్నం తీరే దారి కనబడడం లేదు.. అమలాపురం సమీపంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణం ఇంచు కూడా కదలడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా మూడో దశలో ప్రారంభమైన ఈ కాలేజీల నిర్మాణాలకు నిధుల కొరత ఉండడంతో నిలిపివేయాలని సీఎం చంద్రబాబు సూచించడంతో పనులకు బ్రేక్ పడ్డాయని స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు చెబుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ వారంతా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్‌కు సోమవారం మొరపెట్టుకున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజీ మంజూరు చేసింది. ఇందుకు రూ.500 కోట్లు కేటాయించింది. అమలాపురం రూరల్ సమనస, చిందాడగరువు పరిధిలో దీని నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా తొలి, రెండో దశలో నిర్మాణ పనులు మొదలు పెట్టిన పలు మెడికల్ కాలేజీలు పూర్తి కావడం, అక్కడ తరగతులు ప్రారంభం కావడం తెలిసిందే. మూడో దశలో అమలాపురంలో మెడికల్ కాలేజీ నిర్మాణం మొదలు పెట్టారు. దీనికి అనుబంధంగా అమలాపురం ఏరియా ఆసుపత్రిని బోధనాసుపత్రిగా గుర్తించారు. ఇది ప్రస్తుతం 100 పడకల ఆసుపత్రి కాగా, దీనిని వెయ్యి పడకల ఆసుపత్రిగా విస్తరించాలని నిర్ణయించారు. తొలి దశలో 650 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయడంతోపాటు రెండో దశలో 350 పడకలు చేయాలని నిర్ణయించారు. దీనివల్ల అమలాపురం నడిబొడ్డున అన్ని వసతులతో కూడిన ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి అందుబాటులోకి వస్తోందని ప్రజలు ఆనందపడ్డారు. అప్పుడు వేగం.. ఇప్పుడు జాప్యం గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఆసుపత్రి నిర్మాణ పనులు వేగంగా జరిగాయి. పలు నిర్మాణాలు చురుగ్గా సాగాయి. కొన్ని భవనాలకు రెండు, నాలుగు అంతస్తులు నిర్మించారు. అయితే ఎన్నికల నాటి నుంచి నెమ్మదించిన పనులు కొత్త ప్రభుత్వంలో దాదాపు నిలిచిపోయే పరిస్థితికి వచ్చాయి. నిధుల కొరతతో మూడో దశ ఆసుపత్రి నిర్మాణ పనులు నిలిపివేయాలని కూటమి ప్రభుత్వం నుంచి సూచనలు అందడంతో నిర్మాణ సంస్థ మేఘా ఇంజినీరింగ్ ఇక్కడ పనులు ఆపేసినట్లు తెలిసింది. ఇందులో భాగంగా పనుల్లో వినియోగించే కీలక సామగ్రి తరలిస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు. దీనిపై స్పందించేందుకు ఆ సంస్థ ప్రతినిధులు నిరాకరించారు. పనులు కొనసాగించండి మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు నిలిచిపోయాయని స్థానిక ప్రజాప్రతినిధులు, స్థానికులు సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై వారు వినతిపత్రంతో పాటు మెడికల్ కాలేజీ నిర్మాణ పనులకు వినియోగించిన సామగ్రి తరలిపోతున్న ఫొటోలను సైతం జత చేశారు. మెడికల్ కళాశాలకు గత ప్రభుత్వం 47 ఎకరాల భూమి కొనుగోలు చేసి నిర్మాణ పనులు మొదలు పెట్టింది. ఇప్పటి వరకూ 40 శాతం పనులు జరిగాయని వివరించారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత మూడో దశలో మెడికల్ కళాశాలల పనులు నిలిపివేయాలని ఆదేశాలు వచ్చినట్లు గుత్తేదారు సంస్థ చెబుతోందని, నిర్మాణ సామగ్రితోపాటు ఐరన్, ఇసుక, సిమెంట్‌ను మెగా సంస్థ తరలించుకుపోతోందని చెప్పారు. కళాశాలను పూర్తి చేయాలని వారు కోరారు. అమలాపురం జెడ్పీటీసీ సభ్యుడు పందిరి శ్రీహరి రామ్‌గోపాల్, సర్పంచ్ పొనకల గణేష్, ఉప సర్పంచ్ రాజులపూడి భాస్కరరావు, మాజీ సర్పంచ్ జలదాని కాశీ విశ్వేశ్వరరావు, కరెళ్ల సూరిబాబు, వై.ఏసుబాబు, సీహెచ్‌వీ రావు పాల్గొన్నారు. ఆశలపై నీళ్లు గత ప్రభుత్వం మెడికల్ కాలేజీకి అనుమతి ఇవ్వడంతో పాటు 47 ఎకరాలు కొనుగోలు చేసి పనులు మొదలు పెట్టింది. ఈ పనులు వేగంగా జరగడం చూసి కొత్తగా ఏర్పడిన కోనసీమ జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ, బోధనాసుపత్రి లేని లోటు తీరుతోందని జిల్లా వాసులు సంబరపడ్డారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ, రాజమహేంద్రవరాల్లో మాత్రమే ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులు (జీజీహెచ్)లు ఉన్నాయి. కోనసీమలో కిమ్స్ ప్రైవేట్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రి ఉన్నా రోగుల అవసరాలు పూర్తిగా తీర్చడం లేదు. అమలాపురం, రామచంద్రపురం మున్సిపాలిటీల్లో ఏరియా ఆసుపత్రులు ఉన్నాయి. జనరల్ ఆసుపత్రి లేని లోటు పట్టిపీడిస్తోంది. రామచంద్రపురం, మండపేటలకు కాకినాడ, రాజమహేంద్రవరం కొంత దగ్గర. కానీ అమలాపురం, కొత్తపేట, ముమ్మిడివరం, పి.గన్నవరం, రాజోలు నియోజకవర్గాలకు దూరం అవుతోంది. ఇక్కడ జీజీహెచ్ నిర్మించాలని స్థానికులు దశాబ్దాలుగా కోరుతున్నా ఫలితం లేకుండా పోయింది. రూ.కోట్ల విలువైన చమురు, సహజ వాయువులను కొల్లగొట్టుకుపోతున్న చమురు సంస్థలు సీఎస్ఆర్ నిధులతో మెడికల్ కాలేజీ, జీజీహెచ్ నిర్మించాలని కోరినా ఫలితం లేకుండా పోయింది. నగరం గ్యాస్ లీకేజీ వంటి భారీ ప్రమాదాలలో తక్షణం మెరుగైన వైద్యం అందించలేకపోయారు. గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మెడికల్ కాలేజీ మంజూరు చేయడంతో ఆ లోటు తీరుతోందని, మెరుగైన వైద్యం అందుబాటులోకి వస్తోందని ఆశించినా ఇప్పుడు పనులు ఆగిపోవడం బాధాకరం. ప్రభుత్వం స్పందించి నిర్మాణం పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.