విశ్వజన మోహితం సంస్కృతం | - | Sakshi
Sakshi News home page

విశ్వజన మోహితం సంస్కృతం

Published Sun, Aug 18 2024 11:44 PM | Last Updated on Sun, Aug 18 2024 11:44 PM

విశ్వ

కంప్యూటర్‌కు వాడుకోగలిగే భాషల్లో మొదటి స్థానం సంస్కృతానిదే.

ఆ భాష అతి గొప్ప లక్షణం ఎన్ని వేల లక్షల కొత్త పదాలనైనా తయారు చేయవచ్చు. వాటికి వ్యత్పత్తి కలిగి ఉండడం మరో ప్రత్యేకత. అందుకనే లిథునియా, రష్యా, స్లొవేకియా మొదలైన యూరోపియన్‌ దేశాల వారు వారి మూలాలను సంస్కృతంలో వెతుక్కుంటున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం రెండు రకాల స్టాంపులను ఉజుపిస్‌ విడుదల చేస్తోంది. వాటి ధర ఇండియన్‌ కరెన్సీలో రూ.ఒక్కొటి రూ.120 ఉంటుంది.

ప్రపంచంలో 877 భాషలపై

ఎంతో ప్రభావం

భారత సంస్కృతి, సంస్కృతం ప్రతిష్టమైనవి

నేడు విశ్వ సంస్కృత భాషా దినోత్సవం

సంస్కత భాషపై అభిమానంతో

నేడు ఉజుపిస్‌ దేశం స్టాంప్‌ విడుదల

సీటీఆర్‌ఐ(రాజమహేంద్రవరం): భాషలకు సంస్కృతం తల్లివంటిది అని తొలి తెలుగు వ్యాకరణకర్త, ఆంధ్రభాషాభూషణము రచయత మూలఘటిక కేతన అన్నట్లుగా ప్రపంచం అంతా ఇప్పుడు సంస్కృతం గురించి గొప్పగా చెప్పుకుంటోంది. కాని భారతదేశంలో పుట్టిన సంస్కృతం ఒక్క వర్గం వారికి తప్ప మరే ఇతర వర్గాల వారు అభ్యసించకపోవడంతో ఆ భాష నేడు కనుమరుగవుతోంది. పాశ్చాత్య దేశాల వారు ఈ భాష ఔన్నత్యాన్ని గుర్తించి నేర్చుకోవడం హర్షణీయం. నిజానికి సంస్కృతం అంటే భాష కాదు. కృతము అంటే చెయటము లేదా చేసినదని, సంస్కరిపబడిన పని, భాష అని అర్థము.

జనని ఎల్ల భాషలకు సంస్కృతంబు అనడానికి కారణమిదే. ప్రపంచంలో అతి పురాతన భాషల్లో సంస్కృతం ఒకటి. మన దేశ అధికారిక భాషగా గుర్తించబడి గౌరవించబడుతోంది. సంస్కృతాన్ని దేవ భాష, అమరవాణి, గీర్వాణిగా పిలుస్తారు. సంస్కృతం దేశ భాషలపైనే కాదు, ప్రపంచంలోని 877 భాషలపై తన ప్రభావాన్ని కలిగి ఉందని పరిశోధనలు తేల్చారంటే ఆ భాష ప్రభావం అర్థం చేసుకోవచ్చు. సంస్కృతం ఔన్నత్యాన్ని నిలబెట్టేలా ఏటా శ్రావణ పౌర్ణమి రోజున విశ్వ సంస్కృత భాషా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

సంస్కృత భాష గొప్పదనం

సంస్కృతాన్ని ఉన్నతమైనదిగా గుర్తించారు కాబట్టే ఈ భాషలోని గ్రంథాలను వివిధ భాషల్లోకి పాశ్చాత్య పండితులు అనువదించుకున్నారు. అలాగే ఆధునిక విజ్ఞాన విషయాలకు సంస్కృత సాహిత్యం భాండాగారం. ఇవే మన ప్రస్తుత సంస్కృతికి నిలువుటద్దాలై మనల్ని ముందుకు నడిపిస్తున్నాయనడంలో అతిశయోక్తి లేదు. పంచతంత్రం, హితోపదేశం, ఇతిహాసాలు రామాయణ, భారతం, భర్తృహరి సుభాషితాలు ప్రపంచ సాహిత్యానికి అద్భుతమైన ఎన్సైక్లోపీడియాలు.

సంస్కృతంపై ఉజుపిస్‌ దేశం స్టాంప్‌ విడుదల..

మన సంస్కృతానికి మనం గౌరవం ఇవ్వకపోయినా పాశ్చాత్య దేశాల వారు ఎంతో గౌరవం ఇస్తున్నారు. ఏకంగా రిపబ్లిక్‌ ఆఫ్‌ ఉజుపిస్‌ దేశం వారు ప్రపంచ సంస్కృత దినోత్సవం సందర్భంగా లిధునియా రాజధాని ఇండియన్‌ ఎంబసీలో సోమవారం గౌరవ సూచకంగా కమోరెటివ్‌ స్టాంపును విడుదల చేస్తోంది. అసలు యూరోపియన్‌ దేశమైన ఉజుపిస్‌ సంస్కృత పై ఇంత గౌరవాన్ని ఉంచి స్టాంపును ఎందుకు విడుదల చేస్తోందన్న అనుమానం రావటం సహజం. ఉజుపిస్‌ అధికారిక భాష లిధునియా. ఈ భాష సంస్కృతానికి చాల దగ్గరగా ఉంటుంది.

పేరుకే యూరోపియన్‌ భాష లిథునియా కాని అనుసరించేది పూర్తిగా సంస్కృతమే. అతిపురాతమైన విల్నియస్‌ యూనివర్సిటీలో ఏషియన్‌ ట్రాన్సిడెంటల్‌ స్టడీస్‌ కేంద్రంలో సంస్కృత శాఖ ఉంది. ఈ కేంద్రంలో పనిచేసే ఆచార్య వితస్‌ బిధునస్‌ 2016లో సంస్కృత లిథునియామాల అనే పుస్తకాన్ని ప్రచురించారు. ఇందులో సంస్కతానికి లిథునియాకి వున్న సంబంధం గురించి వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
విశ్వజన మోహితం సంస్కృతం1
1/1

విశ్వజన మోహితం సంస్కృతం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement