ఈ–క్రాప్ నమోదు తప్పనిసరి
అల్లవరం: రైతులు తాము పండించే పంట వివరాలను ఈ–క్రాప్‌లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి వి.బోసుబాబు సూచించారు. బెండమూర్లంక గ్రామంలో జరుగుతున్న ఈ–క్రాప్ నమోదు కార్యక్రమాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 1.52 లక్షల ఎకరాల్లో వరినాట్లు పూర్తయ్యాయన్నారు. 64 వేల ఎకరాల్లో ఈ–క్రాప్ నమోదు జరిగిందని, ఈ నెల 31 లోపు వంద శాతం పూర్తి చేయాలన్నారు. సెప్టెంబర్ 15లోగా ఈ–క్రాప్ నమోదు చేసిన పంటకు రైతుల ఈ–కేవైసీని నమోదు చేయాలన్నారు. అనంతరం ప్రతి గ్రామ సచివాలయంలో డ్రాఫ్ట్ జాబితాను ప్రదర్శించి, రైతులకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరించాలన్నారు. అల్లవరం మండలంలో 2,380 ఎకరాల్లో వరినాట్లు పూర్తి కాగా, 1,650 ఎకరాల్లో పంట వివరాలు నమోదు జరిగినట్టు తెలిపారు. వరిని కుళ్లు తెగులు ఆశించకుండా హెక్సాకోనోజోల్ మందును పిచికారీ చేయాలని సూచించారు. ఆయన వెంట ఏడీ షంషీ, వ్యవసాయాధికారి ఎన్‌వీవీ సత్యనారాయణ, ప్రకృతి వ్యవసాయాధికారి శ్రీనివాసరావు, విస్తరణాధికారి శివమోహన్, సర్పంచ్ బర్రే సీతారత్నం, రైతులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment