యూనివర్సిటీ ఖ్యాతి పెంచాలి
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): యూనివర్సిటీ స్థాయి మరింత పెంచాలని, రాబోయే తరాలకు విద్యావృక్షంలా తయారు చేయాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ కె.రామ్మోహనరావు పేర్కొన్నారు. జేఎన్‌టీయూ కాకినాడ వర్సిటీ 16 వ్యవస్థాపక దినోత్సవం మంగళవారం నిర్వహించగా ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. రామ్మోహనరావు మాట్లాడుతూ రీసెర్చ్ సెంటర్లు మరిన్ని ఏర్పాటుచేసి విద్యార్థులను పరిశోధన వైపు ప్రోత్సహించాలన్నారు. జేఎన్‌టీయూకే వీసీ మురళీకృష్ణ మాట్లాడుతూ ఉన్నత విద్యలో పరీక్షా విధానం, మెఽథడాలజీ, బోధన పద్ధతులు, పాఠ్య ప్రణాళికలో తీసుకురావలసిన మార్పులపై దృష్టి సారిస్తున్నామన్నారు. కాకినాడ సీపోర్టు సీఈఓ మురళీధర్ మాట్లాడుతూ వర్సిటీ ద్వారా సమాజానికి ఉపయోగపడే ప్రాజెక్టులు చేపట్టాలన్నారు. వర్సిటీ అనుబంధ కళాశాలలకు ఉత్తమ ఫెర్మార్మెన్స్ అవార్డులతో పాటు ఐపీఎస్ అధికారి ఎంవీఆర్ కృష్ణతేజకు యంగ్ అచీవర్ అవార్డు అందజేశారు. రెక్టార్ కేవీరమణ, రిజిస్ట్రార్ రవీంద్ర, డైరెక్టర్లు, అధ్యాపకులు పాల్గొన్నారు.
బస్‌షెల్టర్ కూల్చివేసిన
కూటమి నాయకులు
పెదపూడి: అనపర్తి మండలం పొలమూరు గ్రామంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి తండ్రి గంగిరెడ్డి, తల్లిపేరు మీద ఉన్న బస్‌షెల్టర్‌ను కూటమి నాయకులు మంగళవారం జేసీబీతో దౌర్జన్యంగా కూల్చివేశారు. దీంతో బస్‌షెల్టర్ లేకపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. కూటమి నాయకులు దౌర్జన్యంగా బస్‌షెల్టర్ కూల్చివేయడంపై ప్రజల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పొలమూరు గ్రామంలో తూర్పు పేటలో 20 ఏళ్ల క్రితం టీడీపీ హయాంలో జన్మభూమి గ్రామ సభల్లో నిర్ణయం మేరకు 30శాతం ప్రజావిరాళం (కాంట్రిబ్యూషన్)తో మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి తన తండ్రి గంగిరెడ్డి పేరుమీద ఈ నిర్మాణం చేపట్టారు. అప్పట్లో సూర్యనారాయణనరెడ్డి మూడు బస్‌షెల్టర్లు నిర్మాణాకి సుమారు రూ.లక్ష విరాళం ఇచ్చి వాటిని నిర్మించారు. అప్పటి నిబంధనల ప్రకారం ప్రజా విరాళం ఇచ్చినవారి పేర్లతో బస్‌షెల్టర్ నిర్మించుకోవచ్చు. అప్పటి టీడీపీ ఎమ్మెల్యే దివంగత నల్లమిల్లి మూలారెడ్డి హయాంలో నిర్మాణాలు చేపట్టారు. పొలమూరులో రెండు, చిన్న పొలమూరులో ఒకటి నిర్మించారు. ఈ బస్‌షెల్టర్లను ప్రయాణికులు వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పొలమూరు తూర్పు పేట వద్ద బస్‌షెల్టర్‌ను దౌర్జన్యంగా కూటమి నాయకులు కూల్చివేశారు. మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి ఆయన తండ్రి పేరు మీద ఉన్న కట్టడాన్ని కూల్చివేయడమే లక్ష్యంగా పరిపాలన సాగుతోందా అంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment