
కొత్తపేట: వైఎస్సార్ సీపీ తరఫున పోటీ చేస్తున్న తనతో పాటు ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు ఘన విజయం సాధించడం ఖాయ మని రాజోలు సిట్టింగ్ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థి రాపాక వరప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం కొత్తపేటలో ఎమ్మెల్యే అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న రాపాక విలేకరులతో మాట్లాడారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలతో ఎక్కడికి వెళ్లినా మంచి ప్రజాదరణ లభిస్తోందన్నారు. జనం మళ్లీ జగన్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. పార్లమెంటు నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఎదురొచ్చి సాదరంగా స్వాగతిస్తున్నారని తెలిపా రు. గత టీడీపీ ప్రభుత్వంలో ఏవిధమైన లబ్ధి పొందని ప్రజానీకం, ప్రస్తుత ప్రభుత్వంలో తాము రూ.లక్షల్లో పొందిన లబ్ధిని వారే వివరిస్తున్నారన్నారు. 2014 ఎన్నికల్లో నోటికొచ్చిన హామీలిచ్చి తీరా అధికారం చేపట్టాక వాటిని గాలికొదిలేశారని, దానితో ఇప్పుడు ఎన్ని హామీ లిచ్చినా నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు. సీఎం జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాల ప్రభావంతో రాష్ట్రంలో 175 ఎమ్మెల్యే స్థానాలు, 25 ఎంపీ స్థానాలు వైఎస్సార్ సీపీ గెలుస్తుందన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే జగ్గిరెడ్డి పాల్గొన్నారు.
టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనందరావుపై మూడు పోలీసు కేసులు
అమలాపురం టౌన్: అమలాపురం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి అయితాబత్తుల ఆనందరావు నామినేషన్ దాఖలు సమయంలో సమర్పించిన అఫిడవిట్‌లో తనపై మూడు పోలీసు కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. రోడ్లపై రాస్తారోకోలు చేసి ప్రజా జీవనానికి ఇబ్బంది పెట్టారన్న అభియోగంపై ఆయనపై బిక్కవోలు పోలీసు స్టేషన్‌లో ఒక కేసు, అమలాపురం పట్టణ పోలీసు స్టేషన్‌లో రెండు కేసులు నమోదయ్యాయి. 2022, 2023 సంవత్సరాల్లో ఈ కేసులు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. స్థిరాస్థులు తన పేరున 3.32 ఎకరాలు, తన భార్య పేరున 24 సెంట్ల భూములు ఉన్నట్టు పేర్కొన్నారు. తన సొంతూరు ఉప్పలగుప్తం మండలం ఎస్.యానాంలో 217 చదరపు అడుగుల సొంత ఇల్లు ఉన్నట్లు తెలిపారు. అయితే ఆనందరావు కుటుంబం అమలాపురంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఓ ఖరీదైన వసతి గృహంలో జీవిస్తోంది.
టీడీపీ అభ్యర్థి సుభాష్‌పై 13 కేసులు
రామచంద్రపురం: రామచంద్రపురం అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన వాసంశెట్టి సుభాష్‌పై 13 కేసులు ఉన్నాయి. హత్యాయత్నం, నిర్భంధం వంటి కేసులు ఉన్నట్లు తాను సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ ద్వారా ఆయన తెలియజేశారు. తన మీద మొత్తం13 కేసులు అమలాపురం కోర్టులో పెండింగ్‌లో ఉన్నట్లు తాను సమర్పించిన నామినేషన్ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అమలాపురం టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన వివిధ కేసులు ప్రస్తుతం అమలాపురం మేజిస్ట్రేట్ కోర్టులో ఉన్నట్లు వెల్లడించారు. సూసైడ్ కేసుతో పాటుగా హత్యాయత్నం, నిర్భంధం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ వంటి కేసులు ఆయనపై ఉన్నాయి.
ఘనంగా సత్యదేవుని
ధ్వజస్తంభ ప్రతిష్ఠ
అన్నవరం: సత్యదేవుని ఆలయ చరిత్రలో మరో చరి త్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. సత్యదేవుని ఆలయం ముందు స్వర్ణ ధ్వజస్తంభం, జాతీయ రహదారిపై విశాఖపట్నం–విజయవాడ మార్గంలో డిగ్రీ కళాశాల సమీపంలో నిర్మించిన నమూనా ఆలయంలో సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్ల విగ్రహ ప్రతిష్ఠ, ఆలయ శిఖరంపై కలశ ప్రతిష్ఠా మహోత్సవాలు సోమవా రం ఉదయం 10.48 గంటల సుమూహూర్తంలో అత్యంత వైభవంగా నిర్వహించారు.
22ఆర్‌సీపీ02: సుభాష్

విలేకరులతో మాట్లాడుతున్న ఎంపీ అభ్యర్థి రాపాక