Top Stories
ప్రధాన వార్తలు

మహానాడు ‘ఆత్మ’కథ!
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌ను ఉపయోగించుకొని చనిపోయిన వారి ఆత్మలను ఆవాహన చేయొచ్చన్న మాట. తెలుగుదేశం పార్టీ మహానాడును చూసిన తరువాత ఈ సంగతి తెలిసి వచ్చింది. ఆవాహన చేసుకున్న ఆత్మలతో మన పుర్రెకు తోచిన విధంగా మాట్లాడించవచ్చు. చరిత్రను చెరిపేయవచ్చు. వక్రీక రించవచ్చు. నిజాలపై నీళ్లు చల్లవచ్చు. అసత్యాలకు ఆజ్యం పోయవచ్చు. మన మేధోజనిత స్క్రిప్టును చనిపోయిన వారి ఆత్మలతో చదివించవచ్చు. కొత్త పుంతలు తొక్కిన ఈ టెక్నాలజీ వాడకాన్ని చూసిన తర్వాత వింత వింత అనుమానాలు కలుగు తున్నాయి. ముందు ముందు మహాత్ముడి ఆత్మను ఆవాహన చేయించి గాడ్సేకు కితాబునిప్పించే రోజులు కూడా వస్తాయేమో! గాడ్సే భక్తులు పుట్టుకొస్తున్న కాలం కదా ఇది.మహానాడు వేదికపై స్క్రీన్ మీద కనిపించిన ఎన్టీఆర్ బొమ్మ విచిత్రంగా మాట్లాడుతుంది. తెలుగుదేశం పార్టీ ఆశయాలను తన తర్వాత చంద్రబాబు గొప్పగా కొనసాగిస్తున్నారట! హైదరా బాదుకు తాను సాంస్కృతిక వారథిగా నిలబడితే, చంద్రబాబు సాంకేతిక వారథిగా నిలిచిపోయారట! రెండు రూపాయలకు కిలో బియ్యంతో తాను పేదవారి కడుపు నింపితే, ‘పి–4’ పథకం తెచ్చి పేదరికాన్ని పారద్రోలేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారట! ఎన్టీఆర్ బొమ్మలోని కృత్రిమ ఆత్మ పలికిన పలుకులే ఇవి. ఎన్టీఆర్‌కు వారసుడు ఎవరో కూడా ఆత్మ తేల్చే సింది. తన వారసత్వానికి వన్నె తెస్తున్న లోకేష్‌ను ‘భళా మన వడా’ అని కూడా ఏఐ ఆత్మ ఆశీర్వదించింది.ఎన్టీఆర్ జీవించి ఉన్న రోజుల్లో ఒకసారి తన వారసునిగా బాలకృష్ణ పేరును ఆయన ప్రకటించిన సంగతి అప్పటి వారికి గుర్తుండే ఉంటుంది. మహానాడులో ఎన్టీఆర్ ఆత్మ ప్లేట్ మారు స్తుందని బాలయ్యకు ముందే తెలుసా? అందుకే ఈ కార్య క్రమానికి డుమ్మా కొట్టారా? మహానాడు కంటే అతి ముఖ్యమైన మరో కార్యంలో లగ్నమై ఉన్నందువల్ల కూడా రాకపోయి ఉండవచ్చు. ఒక్క బాలయ్యే కాదు... నందమూరి వంశాంకురాలేవీ ఈ జాతరలో కనిపించలేదని మీడియా రిపోర్టులు వెల్లడి స్తున్నాయి. ఈ మహానాడులో నారా వారసుడే చక్రం తిప్పు తారని అందరూ ఊహించిందే. కాకపోతే పార్టీని శాసించే స్థాయి తనదేనని ఆయనే స్వయంగా ప్రకటించుకుంటారని ఎవరూ ఊహించలేదు.పార్టీ కోసం లోకేష్ ఆరు శాసనాలను ప్రకటించారు. శాసనమంటే అందరూ శిరసా వహించవలసిందే కదా! ఆరు శాసనాల పేర్లు కూడా విచిత్రంగా ఉన్నాయి. సామాన్య కార్యకర్తలు ఆ పేర్ల భావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రత్యేకంగా ఒక ఎల్లో బుక్కును అచ్చేయవలసిన అవసరం రావచ్చు. సరిగ్గా 30 ఏళ్ళ కింద ఎన్టీఆర్‌కు చంద్రబాబు బృందం వెన్నుపోటు పొడిచి పార్టీని, ప్రభుత్వాన్ని లాగేసుకున్న సంగతి జగమెరిగిన చరిత్ర. మూడు దశాబ్దాల తర్వాత ఇప్పుడు ఆయన ఆత్మకు సైతం బాబు పార్టీ వెన్నుపోటు పొడవడం విస్మయానికి గురి చేస్తు న్నది. మరణానికి ముందు వివిధ ఇంటర్వ్యూలలో, ప్రెస్ మీట్ లలో చంద్రబాబు గురించి ఎన్టీఆర్ ఏమని మాట్లాడారో తెలి యని వారెవరు?తండ్రిని కారాగారంలో బంధించి, సోదరులను హతమార్చి సింహాసనాన్ని హస్తగతం చేసుకున్న ఔరంగజేబుతో చంద్ర బాబును ఎన్టీఆర్ పోల్చారు. తన దగ్గర వినయం నటిస్తూనే పథకం ప్రకారం గోతులు తవ్విన నమ్మకద్రోహిగా నిందించారు. చరిత్ర హీనుడు అతగాడని ధ్వజమెత్తారు. చంద్రబాబుపై ఎన్టీఆర్ చేసిన విమర్శలకు సంబంధించిన వీడియోలు ఇప్పటికీ అందుబాటులోనే ఉన్నాయి. అంతలోనే ఆయన ఆత్మ (అటువంటివి ఉంటాయని నమ్మితే) యూ–టర్న్ తీసుకున్నట్టు ఎలా చిత్రించగలిగారు? జాతీయస్థాయిలో ఎన్డీఏ కూటమికి పెద్దన్నగా ఉన్న పార్టీ వెయ్యేళ్ల భారత చరిత్రను తిరగరాసే పనిలో ఉన్నది. అదే స్ఫూర్తితో ఈ ముప్ఫయ్యేళ్ల ఆంధ్ర చరిత్రను బాబు కూటమి తిరగరాయాలని భావిస్తున్నదా? గూగుల్‌లో వెన్నుపోటు అనే అక్షరాలు టైప్ చేస్తే చంద్రబాబు బొమ్మ కనిపించని రోజు రావాలని ప్రయత్నిస్తున్నదా? ఒక అబద్ధాన్ని వందసార్లు చెబితే అది నిజమైపోతుందనే గోబెల్స్ సూత్రాన్ని గడచిన 30 ఏళ్లుగా చంద్రబాబు పార్టీ, ఎల్లో మీడియా బాగా ఒంట పట్టించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటినుంచే ప్రయత్నం చేస్తే ఇంకో పదేళ్లకో, ఇరవై ఏళ్లకో వెన్నుపోటు కథను బుట్టదాఖలు చేయవచ్చనే విశ్వాసంతో ఉన్నట్టు కనిపిస్తున్నది. అటువంటిదేమీ జరగలేదని, ఎన్టీఆర్ ప్రోద్బలంతోనే, ఆయన ఆశీర్వాదంతోనే చంద్రబాబు ఈ పవిత్ర కార్యాన్ని నెరవేర్చారని చెప్పే కొత్త పరిశోధనలు కూడా ఎల్లో మీడియా వెలువరించవచ్చు. అందుకు ఈ మహానాడులో నాంది పలికారనుకోవాలి.ఒక పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంలో జరుగుతున్న పార్టీ మహాసభల మీద ప్రజలకు కొంత ఆసక్తి ఉంటుంది. ఎన్నికల హామీల అమలుపై సమీక్ష ఉంటుందని, అమలు చేయలేకపోయిన అంశాలపై వివరణ ఉంటుందని, పరిపాలనా తీరుతెన్నులపై ఆడిట్ ఉంటుందని ఆశిస్తారు. విచిత్రంగా ఈ మహానాడులో ఇవేమీ జరగలేదు. ప్రతిపక్ష నాయకుడైన జగన్ మోహన్ రెడ్డిని తిట్టిపోయడమనేది ప్రతి వక్త ప్రసంగంలోనూ తప్పనిసరి అంశంగా నిర్ధారించినట్టున్నారు. అధి నేతల దగ్గర మార్కులు కొట్టేయడానికి వక్తలందరూ దాన్ని తూచా తప్పకుండా పాటించారు.మహానాడు తేదీలకు ముందే తెనాలిలో జరిగిన దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. దళిత యువకులను బహిరంగంగా నడిరోడ్డుపై పడుకోబెట్టి వారి కాళ్లు కదలకుండా ఒక పోలీసు తొక్కిపట్టి మరో పోలీసు అధికారి వారి అరికాళ్ళ మీద లాఠీతో బాదుతున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. బాధతో ఆ యువకులు చేస్తున్న ఆర్తనాదాలు హృదయ విదారకంగా ఉన్నాయి. ఈ అమానుష ఘటన మహానాడులో చర్చకు వచ్చి ఉండాలి. హోం మంత్రి సంజాయిషీ ఇచ్చి ఉండాలి. అటువంటి దేమీ లేకపోగా జరిగిన సంఘటనను పోలీసు ఉన్నతాధికారులు నిస్సిగ్గుగా సమర్థించుకుంటున్నారు.మహానాడు సమయంలోనే టెన్త్ క్లాస్ పరీక్ష పత్రాల రీవాల్యుయేషన్ బాగోతం బయటపడింది. పరీక్ష పత్రాల మూల్యాంకనం ఒక ప్రణాళిక, పద్ధతి లేకుండా ఇష్టారాజ్యంగా జరిగి, ఆరు లక్షల కుటుంబాల్లో ఆవేదన నింపింది. ఫలితంగా ఎన్నడూ లేనంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు రీవాల్యుయేషన్‌కు దరఖాస్తులు పెట్టుకున్నారు. పదకొండు వేల పరీక్షా పత్రాల మార్కుల లెక్కింపులో పొరపాట్లు జరిగినట్టు వెల్లడైంది. ఆ పొరపాటు ఒకటి రెండు మార్కులు కాదు. కొన్ని పేపర్లలో యాభై మార్కుల వరకు తేడాలొచ్చాయి. కొన్ని సమాధానాలకు మార్కులే వేయని వైనం కూడా బయటపడింది. ఇది అసా ధారణం. రికార్డు సమయంలో ఫలితాలు వెల్లడించాలన్న దుగ్ధతో టీచర్ల మెడ మీద కత్తి పెట్టినందువల్లనే ఇలా జరిగిందని అనుభవజ్ఞులు చెబుతున్నారు.జగన్ మోహన్ రెడ్డి అపురూపంగా చూసుకున్న విద్యా వ్యవస్థను ఒక్క ఏడాదిలోనే నేలకేసి కొట్టిన ఈ నిర్లక్ష్యంపై సర్వత్రా అసహనం వ్యక్తమవుతున్నది. దీనిపై మహానాడులో చర్చ జరిగి ఉండాలని జనం కోరుకుంటారు. విద్యామంత్రి వివరణ ఇస్తారని ఆశిస్తారు. కానీ ఆయన వివరణ ఇవ్వలేదు. హాజరైన ప్రతినిధులు అడిగే సాహసం చేయలేదు. ఈ రెండు అంశాలే కాదు, పాలనాపరమైన ఏ అంశం పైనా చర్చ జరగ లేదు. నిర్వాహకులు రాసిచ్చిన తీర్మానం కాపీని చదవటమే నాయకులు చేసిన పని. ఎన్నికలకు ముందు ఇబ్బడిముబ్బడిగా చేసిన వాగ్దానాల గురించి గానీ, అందులో ముఖ్యమైన ‘సూపర్ సిక్స్’ గురించి గానీ ఏ చర్చా లేదు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పి నట్టున్నారు. 15 నెలల అధికారం కరిగిపోయిన తర్వాత అమలు చేస్తారట! త్వరలో ‘తల్లికి వందనం’ ఇస్తామని చెబుతున్నారు. 80 లక్షల మంది విద్యార్థులకు ఇవ్వాల్సిన గత సంవత్సరపు బకాయి గురించి మాత్రం మాట్లాడటం లేదు. ‘అన్నదాతా సుఖీభవ’, ‘నిరుద్యోగ భృతి’, ‘ఆడబిడ్డ నిధి’ వంటి కీలకమైన హామీల సంగతి మాట మాత్రంగానైనా మహానాడులో ప్రస్తావనకు రాలేదు.మరి మహానాడులో ఏం మాట్లాడారు? తండ్రి–కొడుకుల భజన, ప్రతిపక్ష నేతపై దూషణ... ఈ రెండూ కంపల్సరీ సబ్జెక్టులుగా కనిపించాయి. వీటితో పాటు అసత్య వాణి, మోసపూరిత వైఖరి, వంచనా శిల్పం, అధికార దాహం అనే నాలుగు అంశాలు మహానాడులో అంతర్లీనంగా ప్రవహించాయి. చరిత్రను వక్రీకరించే విధంగా కృత్రిమ మేధ సాయంతో ఎన్టీఆర్ ’ఆత్మ’ పేరుతో చెప్పించిన మాటల దగ్గర నుంచి మూడు రోజులపాటు జరిగిన అన్ని ఉపన్యాసాల్లో అసత్యాలు, అర్ధసత్యాలు కోకొల్లలుగా కనిపిస్తాయి. ఎన్టీఆర్ పట్ల ప్రకటించిన భక్తి, వినయం అన్నీ బూటకమేనని, మోసపూరితమైనవని సభ జరిగిన తీరే తేటతెల్లం చేసింది.ఎన్టీ రామారావుకు భారతరత్న పురస్కారం దక్కాలన్న కోరిక తెలుగుదేశం శ్రేణులతో పాటు తెలుగు ప్రజల్లో చాలామందికి ఎప్పటినుంచో ఉన్నది. ఆ కోరిక మేరకు కనీసం కంటి తుడుపుగా ఒక తీర్మానాన్ని కూడా మహానాడు ఆమోదించలేదు. నిజానికి ఆ పురస్కారం కోసం కేంద్రంపై ఒత్తిడి తేగల స్థితిలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉన్నది. ఆ పార్టీ మద్దతుపైనే కేంద్ర సర్కార్ ఆధారపడి ఉన్నది. అయినా చంద్రబాబు ఆ డిమాండ్ చేయరు. గతంలో వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు తాను చక్రం తిప్పానని చంద్రబాబు పలుమార్లు చెప్పుకున్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న కావాలనే డిమాండ్ మాత్రం ఆయన ఎప్పుడూ చేయలేదు. ఇప్పుడు కూడా చేయబోరని మహానాడు మరోసారి నిరూపించింది. ఈ మహానాడులో నందమూరి వంశస్థులు ఎవరూ కనిపించలేదని చెబుతున్నారు. బహుశా వచ్చే మహానాడులో నందమూరి తారక రామారావు బొమ్మ కూడా అదృశ్యం కావచ్చు.వంచనా శిల్పం కూడా అడుగడుగునా కనిపించింది. ఎన్నికలకు ముందు చేసిన ‘సూపర్ సిక్స్’ను పక్కన పెట్టి యువనేత శాసన ‘సిక్స్’ను ప్రవేశపెట్టారు. ఈ శాసనాలకు రూపకర్తలు ఎవరో చెప్పలేదు గనుక వాటి గురించి ప్రసంగించిన ఆయననే ఏకసభ్య శాసనసభగా పరిగణించాలి. అందులో 1) తెలుగు జాతి విశ్వఖ్యాతి, 2) యువగళం, 3) స్త్రీ శక్తి,4) పేదల సేవలో సోషల్ రీ ఇంజనీరింగ్, 5) అన్నదాతకు అండగా, 6) కార్యకర్తే అధినేత. ఈ పదబంధాల అర్థతాత్పర్యాలను ఏలినవారు ప్రత్యేకంగా విడుదల చేసిన తర్వాతే వీటి గుణ దోషాల గురించి మాట్లాడగలుగుతాము. మహానాడులో కనిపించిన మరో అంశం అంతులేని అధికార దాహం. స్వయంగా పార్టీ అధ్యక్షుడైన ముఖ్యమంత్రి తరతరాలు తమ కుటుంబమే పరిపాలించాలన్న కోరికను ఎటువంటి శషభిషలు లేకుండా కుండబద్దలు కొట్టి చెప్పారు. ఒకసారి గెలిపించటం మరోసారి ఓడించడం వంటి వైకుంఠపాళీ వద్దని, ఎప్పటికీ తమనే గెలిపించినట్లయితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, లేదంటే లేదని ఆయన మనోగతాన్ని బయటపెట్టారు. ఇదీ తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్య స్ఫూర్తి!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com

ఫోన్ ట్యాపింగ్ కేసు.. భారత్‌కు వస్తున్నా అంటూ ప్రభాకర్ రావు లేఖ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ కేసులో కీలక నిందితుడు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్ఐబీ) మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు అమెరికా నుంచి భారత్‌కు తిరిగి వస్తున్నారు. ఈ మేరకు జూన్ ఐదో తేదీన విచారణకు హాజరు అవుతానని దర్యాప్తు బృందానికి సమాచారం ఇచ్చారు.వివరాల ప్రకారం.. తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ1గా ఉన్న ప్రభాకర్ రావు ఎట్టకేలకు అమెరికా నుంచి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో విచారణకు హాజరవుతానని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పూర్తిగా సహకరిస్తానంటూ సుప్రీంకోర్టుకు అండర్ టేకింగ్ లెటర్ రాసిచ్చారు. వన్ టైమ్ ఎంట్రీ పాస్‌పోర్టు తనకు అందిన వెంటనే భారత్ వస్తానని చెప్పుకొచ్చారు. దీంతో, పాస్‌పోర్టు అందిన మూడు రోజుల్లో ఆయన భారత్‌కు రావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.ఇదిలా ఉండగా.. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రభాకర్ రావు దేశాన్ని వీడిన విషయం తెలిసిందే. గత 14 నెలలుగా ప్రభాకర్ రావు అమెరికాలోనే తల దాచుకున్నారు. ప్రభాకర్ భారత్‌కు వస్తున్న పనేపథ్యంలో ఆయనను విచారించేందుకు దర్యాప్తు బృందం సిద్ధమవుతోంది. ప్రభాకర్ ఉరావును విచారిస్తేనే ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఇక, అంతకుముందు.. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో (Supreme Court) విచారణ జరిగింది. మూడు రోజుల్లో స్వదేశానికి రావాలని.. విచారణకు పూర్తిగా సహకరించాలని ఆదేశించింది. ఈమేరకు అండర్ టేకింగ్ ఇవ్వాలని జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీశ్ చంద్రశర్మ ధర్మాసనం స్పష్టం చేసింది. ఇప్పటికిప్పుడు కఠిన చర్యలు తీసుకోవద్దని రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. ముందస్తు బెయిల్ అంశంపై తదుపరి విచారణ చేపడతామని ధర్మాసనం పేర్కొంది

ఈశాన్య రాష్ట్రాల్లో వరద బీభత్సం.. కొండచరియలు విరిగిపడి 30 మంది మృతి
గౌహతి: దేశంలోని ఈశాన్య రాష్ట్రాలను ఆకస్మిక వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. ఇదే తరుణంలో గత రెండు రోజుల్లో కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో 30 మంది మృతి చెందారు. అస్సాం, అరుణాచల్, మేఘాలయ, మణిపూర్, మిజోరం(Assam, Arunachal, Meghalaya, Manipur, Mizoram) రాష్ట్రాలు ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడుతున్న ఘటనలతో అతలాకుతలమవుతున్నాయి. అస్సాంలోని 12 జిల్లాల్లోని 60 వేల మంది ప్రజలు వరదలకు ప్రభావితమయ్యారు.అరుణాచల్ ప్రదేశ్‌లో సంభవించిన ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో తొమ్మిది మంది మృతిచెందారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని తూర్పు కామెంగ్ జిల్లాలో ఒక కారులపై కొండచరియలు విరిగిపడటంతో రెండు కుటుంబాలకు చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. అస్సాంలో గత 24 గంటల్లో కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో ఐదుగురు మృతిచెందారు. ఆరు జిల్లాల్లో వరదలు సంభవించాయి. 10 వేలకుపైగా జనం వరదలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.గౌహతి శివార్లలోని బోండా ప్రాంతంలో కొండచరియలు(Landslides) విరిగిపడి, ముగ్గురు మహిళలు మరణించారని పట్టణ వ్యవహారాల మంత్రి జయంత మల్లా బారువా తెలిపారు. గౌహతిలో 111 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇది 67 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టింది. బ్రహ్మపుత్రతో సహా ఈశాన్యంలోని పలు నదులలోని నీటి మట్టం పెరిగింది. శనివారం రాత్రి జిరోలోని పైన్ గ్రోవ్ సమీపంలోని ఒక రెస్టారెంట్‌పై కొండచరియలు విరిగిపడటంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్డీఆర్ఎఫ్), ఇండో-టిబెటన్ సరిహద్దు పోలీసులు (ఐటీబీపీ) సహాయక చర్యలు చేపడుతున్నారు.ఇది కూడా చదవండి: మావోయిజం అంతం? గణాంకాలివే..

IPL 2025 Qualifier 2: పంజాబ్‌కు గుడ్ న్యూస్.. ముంబైకి బ్యాడ్ న్యూస్?
ఐపీఎల్-2025లో క్వాలిఫయర్-2కు సమయం అసన్నమైంది. ఆదివారం సెకెండ్ క్వాలిఫయర్‌లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తాడోపేడో తెల్చుకోనున్నాయి. ఈ కీలక మ్యాచ్‌కు పంజాబ్ కింగ్స్‌కు గుడ్ న్యూస్ అందింది. గాయం కారణంగా గత కొన్ని మ్యాచ్‌లకు దూరమైన యుజ్వేంద్ర చాహల్.. ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించినట్లు తెలుస్తోంది. దీంతో క్వాలిఫయర్-2కు చాహల్ అందుబాటులో ఉండనున్నాడని రేవ్‌స్పోర్ట్స్ తమ రిపోర్ట్‌లో పేర్కొంది. కాగా చాహల్ గాయం నుంచి కోలుకుపోవడం పంజాబ్‌కు కలిసొచ్చే ఆంశంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సీజన్లో చాహల్ పంజాబ్ జట్టుకు ప్రధాన స్పిన్నర్‌గా ఉన్నాడు. ఓ హ్యాటిక్ కూడా అతడి ఖాతాలో ఉంది. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన చాహల్.. 9.56 ఏకానమితో 14 వికెట్లు పడగొట్టాడు.చాహర్ డౌటే..మరోవైపు ఈ మ్యాచ్‌కు కూడా ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ దీపక్ చాహర్ అందుబాటులో ఉండేది అనుమానమే. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న చాహర్.. ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించనట్లు తెలుస్తోంది. ఈ రైట్ ఆర్మ్ పేసర్ కోచింగ్ స్టాప్, కోచ్ మహేల జయవర్ధనేతో కలిసి ఫిట్నెస్ కసరత్తులు చేస్తున్నట్లు రేవ్‌స్పోర్ట్స్ తమ కథనంలో రాసుకొచ్చింది. కానీ అతడు ఇంకా కుంటుతున్నట్లు సదరు వెబ్సైట్ రాసుకొచ్చింది. ఒకవేళ ఈ మ్యాచ్‌కు చాహర్ దూరమైతే.. యువ పేసర్ అశ్వినీ కుమార్‌కు మరోసారి అవకాశం లభించనుంది.తుది జట్లు(అంచనా)పంజాబ్ కింగ్స్ప్రభ్సిమ్రాన్ సింగ్, ప్రియాంష్ ఆర్య, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్, హర్‌ప్రీత్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్, కైల్ జామీసన్, చాహల్ముంబై ఇండియన్స్రోహిత్ శర్మ, జానీ బెయిర్‌స్టో (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, రాజ్ బావా, మిచెల్ సాంట్నర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, రిచర్డ్ గ్లీసన్

రష్యాలో ఘోర రైలు ప్రమాదం.. పలువురు మృతి, గాయాలు
మాస్కో: రష్యాలో ఘోర రైలు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. శనివారం రాత్రి రైల్వే బ్రిడ్జి కూలిపోవడంతో ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందగా.. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. పలువురు ప్రయాణికులు ప్రాణ భయంతో పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.వివరాల ప్రకారం.. రష్యాలోని బ్రయాన్స్క్ ప్రాంతంలో శనివారం రాత్రి వంతెన కూలిపోయింది. అదే సమయంలో ప్యాసింజర్ రైలు వెళ్తున్న కారణంగా సదరు రైలు ప్రమాదానికి గురైంది. ఉక్రెయిన్ సరిహద్దుకు సమీపంలోని రష్యాలోని బ్రయాన్స్క్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని రష్యా అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించగా, దాదాపు 30 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.⚡ BREAKING Russian Emergency crews are cutting through metal train cars to rescue trapped passengers. The Klimov–Moscow train was crushed after the blast, caused by the detonation of a bridge support in the Vygonichsky district of Russia’s Bryansk region.#Russia #Bryansk https://t.co/X6oD1mZJUk pic.twitter.com/RZoahsb4wC— ⚡𝙉𝙊𝙄𝙎𝙀 𝘼𝙇𝙀𝙍𝙏𝙎 (@NoiseAlerts) May 31, 2025ఈ సందర్భంగా బ్రయాన్స్క్ ప్రాంతీయ గవర్నర్ అలెగ్జాండర్ బొగోమాజ్ మాట్లాడుతూ.. రైలు ప్రమాదం నేపథ్యంలో అత్యవసర సేవలు, ప్రభుత్వ అధికారులు సంఘటన స్థలంలో సహాయక చర్యలు చేపట్టారని తెలిపారు. మృతిచెందిన వారిలో రైలు లోకో పైలట్ కూడా ఉన్నారు. ప్యాసింజర్ రైలు మాస్కో నుండి క్లిమోవ్‌కు వెళుతోందని అన్నారు.BREAKING: Multiple dead and wounded after bridge collapses onto passenger train in Russia's Bryansk region, according to BazaSabotage is suspected pic.twitter.com/S4v4c0aXfJ— Faytuks News (@Faytuks) May 31, 2025అయితే, గత మూడేళ్లుగా రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. బ్రయాన్స్క్ ప్రాంతం రష్యా, ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉండటంతో డ్రోన్ దాడులు, బాంబు దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలోనే దాడుల ప్రభావంతో వంతెన కూలిపోయినట్టు స్థానికులు చెబుతున్నారు.

పొత్తుపై పవన్ పునరాలోచన!.. వైరాగ్యమా.. వికారమా!!
పవన్ కళ్యాణ్‌కు అధికారం సంపాదించడంలో ఉన్నంత ఆరాటం.. నేడు ప్రజల కోసం చేస్తున్న పోరాటంలో కనిపించడంలేదు.. ఏదో చేసేద్దాం అనుకుని వచ్చాను.. ఏమీ చేయలేకపోతున్నానంటున్నారు. తనకు జ్ఞనోదయం అయిందా?. విషయం అవగతమైందా?. చంద్రబాబు నీడలో తన ఉనికి తనకే కనిపించక కళ్లు మసకలు.. బైర్లు కుమ్ముతున్నాయా తెలియని పరిస్థితుల్లో పవన్ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన తనలోని నైరాశ్యాన్ని నిర్వేదాన్ని వెళ్లగక్కారు..వాస్తవానికి ఆయన ప్రభుత్వ పరంగా డిప్యూటీ సీఎం అయినప్పటికీ ఆయనకు ప్రభుత్వ నిర్ణయాలు.. పాలసీలతో సంబంధం లేకుండా పోతోంది. ఎంతసేపు లోకేష్‌ను ఎలివేట్ చేసి రేపు ఆయన్ను సీఎంగా తీర్చిదిద్దే పనిలో ఉన్న చంద్రబాబు పవన్‌ను జస్ట్ పెయిడ్ రౌడీ మాదిరిగా మాత్రమే వాడుకుంటూ పక్కన పెట్టేస్తున్నారు. అంటే పాత సినిమాల్లో సత్యనారాయణ జస్ట్ ఇలా చప్పట్లు కొట్టి జగ్గూ అనగానే పెద్ద కండలతో ఒక రౌడీ వచ్చి హీరో మీద దాడి చేస్తాడు కదా.. ఆ టైప్ పాత్రకు తనను వాడుకుంటున్నట్లు పవన్ గ్రహించారు.ప్రభుత్వానికి ఇబ్బంది కలిగే పరిణామాలు ఎదురైనప్పుడు మాత్రమే తనను వాడుకుని ఆ తర్వాత పక్కన పెట్టేస్తున్న విషయం పవన్ గ్రహించారు.. అందుకే తన అసంతృప్తిని తాజాగా వెళ్లగక్కారు. తన 15 ఏళ్ల పాటు పొత్తులో ఉందామని అనుకున్నాను కానీ పరిస్థితులు చూస్తుంటే మాట మార్చాల్సి వచ్చేలా ఉందని చెప్పేశారు. రాష్ట్రంలో క్రైమ్ పెరిగిపోతుందని అంటూ అధికారులు ఇంకా ప్రభుత్వానికి సహకరించడం లేదని పవన్ నిందారోపణ చేశారు. వాస్తవానికి రాష్ట్రంలో అధికారం మొత్తం చంద్రబాబు.. లోకేష్ చేతిలో మాత్రమే ఉంది వారు చెప్తే తప్ప పూచిక పుల్ల కూడా కదలని పరిస్థితి.ఆఖరికి తన పంచాయతీరాజ్ అటవీ శాఖల్లో కూడా పవన్ కళ్యాణ్ ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉంది. లోకేష్ చెబితే తప్ప పవన్ శాఖలో కూడా ఏమీ జరగడం లేదు. అంటే కేవలం తన ఇమేజ్ ద్వారా ఓట్లు కొల్లగొట్టిన చంద్రబాబు ఇప్పుడు తన కొడుకు లోకేష్ రాజకీయ భవిష్యత్తుకు పాటలు వేస్తున్నారు తప్ప తనకు ఏ రకమైన గౌరవ మర్యాదలు రాజకీయ ప్రాధాన్యం దక్కనివ్వడం లేదని పవన్ కళ్యాణ్ ఎప్పటికీ తన అంతరంగికుల వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తుంది. తనను కేవలం ఓట్ల తెచ్చే యంత్రంగా వాడుకొని ఇప్పుడునట్లు లూజ్ చేసి పక్కన పడేస్తున్నారు అని పవన్ గ్రహించారు. అందుకే పొత్తుల విషయమై ఆయన బరస్ట్ అయినట్లుగా తెలుస్తుంది.దీంతోపాటు రాష్ట్రంలో ఎక్కడ చూసినా తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఆగడాలు రౌడీయిజం కూడా పవన్‌లో ఆగ్రహానికి కారణమైంది. రాజకీయ హత్యలు. అత్యాచారాలు సాధారణమైనాయి.. ఉద్యోగుల పట్ల కూడా తెలుగుదేశం నాయకులు అమర్యాదగా ప్రవర్తిస్తూ ప్రభుత్వాన్ని డిఫెన్స్‌లో పడేస్తున్నారు. వాస్తవానికి అధికరణకు వచ్చిన కొత్తల్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తాను కక్ష పూర్తి రాజకీయాలు చేయబోనని.. వైఎస్ఆర్సిపి కార్యకర్తలపై దాడులకు తాను వ్యతిరేకం అని చెప్పారు. కానీ నేడు జరుగుతున్నది దానికి విరుద్ధంగా ఉన్నది. పల్లెలు పట్టణాలు గ్రామాల్లో తెలుగుదేశం నాయకులు పూర్తిగా ఆధిపత్యం సాధించే దిశగా వెళుతూ ఎక్కడికక్కడ వైఎస్సార్సీపీ కార్యకర్తల మీద దాడులు హత్యలకు పాల్పడుతున్నారు.ఇదంతా పవన్ కళ్యాణ్ గమనించి తన అసంతృప్తిని ఇలా వెళ్లగక్కారని అంటున్నారు. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ సభలో మాట్లాడుతూ 30 వేల మంది మహిళలు అదృశ్యం అయ్యారని ఆరోపించారు. నేడు అంతకుమించి దారుణాల జరుగుతున్నాయి దీనికి పవన్ సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉంది. అందుకే తాను 15 ఏళ్ల పాటు పొత్తులో ఉందామని అనుకున్న పరిస్థితులు అలా లేవంటూ ఇప్పుడు తాను పునర్ ఆలోచిస్తున్నట్లుగా ఆయన మాటలు చెబుతున్నాయి.వచ్చే నాలుగేళ్లలో పవన్ పరిస్థితి ప్రభుత్వంలో మరింత దిగజారితే.. లోకేష్ ప్రాబల్యం ప్రాధాన్యం పెరిగితే అప్పుడు జనసేన ని ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ప్రస్తుతం తనను డిప్యూటీ సీఎం హోదాలో ప్రోటోకాల్.. బుగ్గ కారు.. ఓ ఆఫీసు ఓ పదిమంది స్టాఫ్ మినహా ప్రభుత్వంలో ఎలాంటి ప్రాధాన్యం పాలసీల విషయంలో తన సంప్రదించకపోవడం వంటి అంశాలు పవన్‌ను ఇబ్బంది పెడుతున్నాయి. తనకు రాజకీయంగా జీరో నాలెడ్జ్ అని భావించడం వల్లనే చంద్రబాబు కూడా తనను చిన్నచూపు చూస్తున్నారని పవన్ లోలోన మదన పడుతున్నట్లుగా తెలుస్తోంది. అందుకే ఆయన మనసులోని ఆవేదనను ఈ విధంగా వెళ్లగక్కి చంద్రబాబుకు ఇండికేషన్ పంపించినట్లుగా జన సైనికులు భావిస్తున్నారు.-సిమ్మాదిరప్పన్న

ఈ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు!
ఒకటో తేదీ వచ్చిందంటే.. దాదాపు చాలా రూల్స్ మారిపోతాయి. క్రెడిట్ కార్డుల దగ్గర నుంచి గ్యాస్ ధరల వరకు.. చాలా మార్పులు వస్తుంటాయి. ఇప్పుడు తాజాగా ఈ రోజు (జూన్ 1) నుంచి కొన్ని ఐఫోన్లు & ఆండ్రాయిడ్ పరికరాల్లో వాట్సాప్ పనిచేయడం ఆగిపోతుంది. ఈ చర్య 2025 మే 1వ తేదీ నుంచే అమల్లోకి రావాల్సి ఉంది. కానీ కొంచెం ఆలస్యం కావడంతో.. వినియోగదారులు తమ ఫోన్లను మార్చుకోవడానికి సమయం దొరికింది.వాట్సప్‌కు సపోర్ట్ చేయని మొబైల్స్..➤ఐఫోన్ 5ఎస్➤ఐఫోన్ 6➤ఐఫోన్ 6 ప్లస్➤ఐఫోన్ 6ఎస్➤ఐఫోన్ 6s ప్లస్➤ఐఫోన్ ఎస్ఈ (ఫస్ట్ జనరేషన్)➤శామ్సంగ్ గెలాక్సీ ఎస్4➤శామ్సంగ్ గెలాక్సీ నోట్ 3➤సోనీ జెడ్పీరియా జెడ్1➤ఎల్జీ జీ2➤హువావే అసెండ్ పీ6➤మోటో జీ (ఫస్ట్ జనరేషన్)➤మోటరోలా రేజర్ హెచ్డీ➤మోటో ఈ 2014జాబితాలోని అన్ని ఫోన్లు చాలా పాత వెర్షన్లు. అయితే కొన్ని ఫోన్లలో సాఫ్ట్వేర్ అప్డేట్ సాధ్యమైతే.. వాట్సప్ పనిచేసే అవకాశం ఉంది.ఫోన్లలో వాట్సాప్ పనిచేయకపోవడానికి ప్రధాన కారణం.. భద్రతా ప్రమాణాలే అని తెలుస్తోంది. యాపిల్ ఇకపై పాత iOS వెర్షన్లకు సాఫ్ట్వేర్ అప్డేట్లను అందించదు. కాబట్టి ఈ పరికరాల్లో భద్రత లోపిస్తుంది. భద్రతా లోపం సమస్యలను తీసుకొచ్చే ప్రమాదం ఉంది.గత కొన్ని నెలలుగా, వాట్సాప్ వినియోగదారుల గోప్యతను బలోపేతం చేయడం.. వ్యక్తిగత డేటాను రక్షించడం లక్ష్యంగా అనేక అప్డేట్స్ చేస్తూనే ఉంది. చాట్లు, సమూహ సంభాషణల నుంచి ఇతరులు టెక్స్ట్, ఫోటోలు లేదా వీడియోలను కాపీ చేయకుండా నిరోధిచడమే లక్ష్యంగా సంస్థ ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ తీసుకొస్తోంది. అంతే కాకుండా.. వాట్సాప్ చాట్ లాక్ వంటి మెరుగైన ఫీచర్స్ కూడా ప్రవేశపెట్టింది. ఇది వినియోగదారులు పాస్వర్డ్, వేలిముద్ర లేదా ఫేస్ ఐడితో వ్యక్తిగత చాట్లను సురక్షితంగా ఉంచడానికి అనుమతిస్తుంది.

ఓటీటీలో అదరగొడుతున్న చిన్న సినిమా
చిన్న చిత్రాలకు ఓటీటీలు వరంగా మారుతున్నాయి. థియేటర్స్‌లో ఆడని కొన్ని చిత్రాలు ఓటీటీలో మంచి విజయం సాధిస్తున్నాయి. బడా సినిమాలను పక్కకునెట్టి టాప్‌లో దూసుకెళ్తున్నాయి. అలా ఓటీటీలో అదరగొడుతున్న మరో చిన్న చిత్రమే ‘టుక్ టుక్’.తెలుగమ్మాయి శాన్వి మేఘన, ‘కోర్ట్’ఫేం హర్ష్ రోషన్, సలార్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ కార్తికేయ దేవ్, సోషల్ మీడియా ఫేమ్ స్టీవెన్ మధు, నిహాల్ కోదాటి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఈ ఏడాది మార్చిలో థియేటర్లో విడుదలై మంచి టాక్ని సంపాదించుకుంది. ఇక ఇటీవల అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చిన ఈ చిత్రం..అక్కడ టాప్ వ్యూస్‌తో దూసుకెళ్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండ్ అవుతున్న టాప్ 10 చిత్రాల్లో టుక్ టుక్ మూడో స్థానంలో ఉంది. ఇప్పటి వరకు ఈ చిత్రానికి 100 మిలియన్ల వ్యూస్ వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు. ఒక్క చిన్న చిత్రానికి ఈ స్థాయిలో వ్యూస్ రావడం గొప్ప విషయమే. వీక్షకులు ఈ సినిమాను అంతగా ఆదరించడమే కాకుండా, ప్రతి క్యారెక్టర్‌ను, ప్రతి నటుడి నటనను ప్రశంసిచడం సంతోషంగా ఉందని చిత్రబృందం పేర్కొంది. మంచి కంటెంట్‌తో వస్తే ఆదరణ ఉంటుందనే ఈ చిత్రం మరోసారి నిరూపించిందని అన్నారు.టుక్ టుక్ కథేంటి?ముగ్గురు టీనేజ్ కుర్రాళ్ళు(హర్ష్ రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు) డబ్బుల కోసం వినాయకుడి విగ్రహం పెట్టి వినాయకచవితి చేస్తారు. ఆ ఊళ్ళో ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ ఉండటం, నిమజ్జనానికి బండి దొరకకపోవడంతో ఈ ముగ్గురు కలిసి ఒక పాత స్కూటర్ ని ముగ్గురు కూర్చునే టుక్ టుక్ బండిలా తయారుచేస్తారు. ఆ బండిలోనే వినాయకుడి నిమజ్జనం ఊరేగింపు చేస్తారు. ఆ తెల్లారి నుంచి ఆ బండి దానంతట అదే ఆపరేట్ అవుతుండటంతో అందులో దేవుడు వచ్చాడు అనుకుంటారు. దీంతో స్కూటర్ లో దేవుడు ఉన్నాడు, ఏం అడిగినా హ్యాండిల్ అటు ఇటు ఊపి అవునా, కదా అని సమాధానాలు చెప్తాడు అని ఊళ్ళో ప్రమోట్ చేసి డబ్బులు సంపాదించుకుంటారు.ఈ క్రమంలో ఆ స్కూటర్ లో ఉంది దేవుడు కాదు ఆత్మ అని తెలుస్తుంది. ఈ ముగ్గురు కుర్రాళ్ళని కాస్త భయపెడుతుంది కూడా. మరి ఆ స్కూటర్ లో ఉన్న ఆత్మ ఎవరిది? ఆ స్కూటర్ లో ఎందుకు ఉంది? ఈ ముగ్గురు కుర్రాళ్ళు అందులో ఆత్మ ఉందని తెలిసాక ఏం చేసారు? నవీన్(నిహాల్ కోదాటి) - శిల్ప(శాన్వి మేఘన)ల ప్రేమ కథేంటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

NIAT: విద్యతో పాటు.. ఉద్యోగానికి కూడా
నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (NEP) 2020 మార్గదర్శకంలో భారతదేశ విద్యావ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ మార్పుల్లో UGC, AICTE సంస్థలు విద్యను నైపుణ్యానికి పెద్దపీట వేయాలని ఎంతో కృషి చేసి అనేక చర్యలు తీసుకుంటున్నాయి. ఈ ఆశయాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లడానికి నెక్ట్స్‌వేవ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ (NIAT) ప్రారంభించిన యూనివర్సిటీ భాగస్వామ్య మోడల్‌ను భారతదేశంలోని పలు UGC ఆమోదం పొందిన యూనివర్సిటీలలో అమలు చేస్తున్నారు. నైపుణ్య ఆధారిత విద్యను దేశవ్యాప్తంగా అనుకరించదగినదిగా ఈ మోడల్ దృఢంగా నిలిచింది.“విద్యార్థులకు స్థిరమైన కెరీర్ ఫలితాలు తీసుకువచ్చేలా యూనివర్సిటీలను బలపరచడమే ఈ భాగస్వామ్యం లక్ష్యం” అని నెక్ట్స్‌వేవ్ & NIAT వ్యవస్థాపకుడు మరియు సీఈవో రాహుల్ అట్లూరి తెలిపారు. “ఒకవైపు యూనివర్సిటీ అకడమిక్ ప్రోగ్రామ్‌ను తమదైన విధంగా కొనసాగిస్తుంది. మరోవైపు విద్యార్థులు ఇండస్ట్రీకి సిద్ధమవడానికి అవసరమైన ప్రతిదీ - హ్యాండ్-ఆన్ స్కిల్ ట్రైనింగ్, ఇండస్ట్రీ ప్రాక్టికల్ సెషన్లు, కౌన్సెలింగ్, ఇంటర్న్‌షిప్, పే మెంట్స్ ఇలా కావలసిన అన్ని విషయాల్లో NIAT తోడ్పాటు అందిస్తోంది” అన్నారు.ఈ భాగస్వామ్యంలో యూనివర్సిటీ కరికులంను మెరుగుపరచడానికి NIAT ఇన్సైట్స్ ఇస్తుంది. ఈ ఇన్సైట్స్ను 3,000కు పైగా కార్పొరేట్ కంపెనీలు, 10,000కి పైగా టెక్ ప్రొఫెషనల్ కమ్యూనిటీ, తమ అంతర్గత R&D, ప్రొడక్ట్ డెవలప్మెంట్ వంటి అనేక మూలాల నుంచి NIAT సేకరిస్తోంది. ఈ ఇన్సైట్స్ను NIAT యూనివర్సిటీలకు సక్రియ రిపోర్ట్, వైట్ పేపర్ రూపంలో సమరిస్తుంది. వీటిలో తాజా ఇండస్ట్రీ ట్రెండ్స్, జాబ్ రోల్స్, స్కిల్స్ వంటి అంశాలు స్పష్టంగా ఉంటాయి. ముఖ్యంగా AI/ML, సైబర్ సెక్యూరిటీ వంటి 4.0 టెక్నాలజీలకు సంబంధించిన విషయాలు ఉంటాయి. ఈ రిపోర్ట్ ఆధారంగా యూనివర్సిటీలు UGC, AICTE నిబంధనలకు అనుగుణంగా తమ అకడమిక్ కౌన్సిల్, బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఆమోదంతో తమ కరికులంను ఆధునీకరించుకుంటాయి.అధునాతన టెక్నాలజీలలో ప్రాక్టికల్ స్కిల్ పెంపొందించేందుకు కౌశల్య శిక్షణ కూడా NIAT మోడల్లో మరో ముఖ్య అంశం. విద్యార్థులకు ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉండే టెక్నాలజీలపై పట్టు సాధించే విధంగా ప్రాక్టికల్ ట్రైనింగ్, ల్యాబ్, హ్యాండ్-ఆన్ కోడింగ్ సెషన్స్ ఉంటాయి.అలాగే, NIAT 10,000+ టెక్ ప్రొఫెషనల్స్ నెట్‌వర్క్‌ను ఉపయోగించి అందులోని ఒకరు ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్‌గా నియమించి, వారు మెంటర్ చేయడం వలన విద్యార్థులు ఇండస్ట్రీలో వాడే తాజా టూల్స్ మరియు టెక్నాలజీలపై పట్టు సాధిస్తారు.“ప్రపంచ స్థాయి నిపుణులుగా తయారవాలంటే డిగ్రీతో పాటు స్కిల్, అప్టిట్యూడ్ అవసరం. NIAT సహకారంతో మా విద్యార్థులు బ్లూస్కిల్కు అనుగుణంగా శిక్షణ పొందుతున్నారు” అని పూణేలోని అజీంక్య డీవై పాటిల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఆర్.కె. జైన్ అన్నారుఅనుభవపూరితంగా నేర్చుకోవాలంటే ఒక అధునాతన టెక్నాలజీ వ్యవస్థ అవసరం అవుతుంది. అందుకే NIAT ఆరంభించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత లెర్నింగ్ పాత్‌ను యూనివర్సిటీల్లో అమలు చేస్తున్నారు. ఈ వ్యవస్థ విద్యార్థులు రియల్ వరల్డ్ ప్రాజెక్టులు చేయగలుగుతారు, చేసిన పనిపై వెంటనే లైవ్ ఫీడ్‌బ్యాక్ పొందగలుగుతారు, మరియు ఏ అంశంలో బలహీనత ఉందో చూపించి ఎలా మెరుగుపరుకోవాలో సూచిస్తుంది. ఇవి ఇప్పటివరకు టాప్ కంపెనీల బూట్క్యాంపుల్లో మాత్రమే ఉండేవి, కాని ఇప్పుడు విద్యార్థులకు యూనివర్సిటీ లెవెల్లో ఈ సదుపాయాలు NIAT అందిస్తోంది.యెనెపోయా డీమ్డ్ యూనివర్సిటీ ప్రో-ఛాన్సలర్ ఫర్హాద్ యనపోయా మాట్లాడుతూ.. “ఇండస్ట్రీకి సంబంధించిన టెక్నికల్ స్కిల్స్ నేర్చుకోవడం ప్రతి విద్యార్థికి అవసరం. NIAT సపోర్ట్ తో మా డిగ్రీ ప్రోగ్రాం మరింత శక్తివంతంగా మారింది. విద్యార్థులను టెక్నాలజీ రంగంలో స్థిరమైన కెరీర్‌కు సిద్ధం చేస్తుంది” అని అన్నారు.ఈ తరానికి కావలసింది కేవలం తరగతి గదులు కాకుండా, టెక్ తో కూడిన ఆధునాతన క్లాసులు. దృష్టిని పెంచుకుని NIAT యూనివర్సిటీలకు ఒక ప్రామాణిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిజైన్ పేబుక్ అందిస్తోంది. ఇది Stanford, MIT, Harvard వంటి టాప్ యూనివర్సిటీలను బెంచ్‌మార్క్ చేసి, భారతీయ విద్యా పరిసరాలకు తగినట్లు రూపకల్పన చేయబడింది. హై-స్పీడ్ Wi-Fi, టెక్ టూల్స్‌కు సపోర్ట్ చేసే సౌండ్ AV సిస్టమ్, సౌండ్-ప్రూఫ్ గదులు, కమ్ఫర్టబుల్ మరియు ఎరోనామిక్ సీటింగ్, టీమ్‌వర్క్‌కు తగిన కోలాబరేటివ్ లేఅవుట్ వంటి ప్రాజెక్టు బేస్ లెర్నింగ్‌కు అవసరమైన సదుపాయాలు ఉంటాయి. అంతేకాకుండా, పేబుక్లోకి ఎర్గబుల్ బిల్ ఆఫ్ క్వాంటిటీస్, వెండర్ టెంప్లేట్లు, రోలౌట్ మైల్‌స్టోన్స్ కూడా ఉంటాయి. దీనివల్ల యూనివర్సిటీలు AICTE నిబంధనలతో పాటు ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా మెయింటైన్ చేసుకోగలుగుతాయి.NIATతో భాగస్వామ్యంలో యూనివర్సిటీలకు లభించే మరో గొప్ప విషయం ఇండస్ట్రీతో ఉండే డైరెక్ట్ కనెక్షన్. 3,000కి పైగా టెక్ కంపెనీలలోని అవకాశాలకు విద్యార్థులను కనెక్ట్ చేస్తుంది. యూనివర్సిటీ డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు స్థిరమైన కెరీర్ కోసం సరైన ఇంటర్న్షిప్స్, మాక్ అసెస్మెంట్లు, ఇండస్ట్రీ పే మెంట్ సెషన్లు ఉంటాయి. అంతేకాకుండా, ప్రతి విద్యార్థి ప్రగతిని ట్రాక్ చేసేందుకు డేటా డ్యాష్‌బోర్డులు కూడా అందుబాటులో ఉంటాయి. దీనివల్ల యూనివర్సిటీలు ఒక్కో విద్యార్థి ఎంతగా ప్రిపేర్ అయ్యాడో, ఏం అవసరమో స్పష్టంగా తెలియగలుగుతాయి.చైతన్య డీమ్డ్ యూనివర్సిటీ వ్యవస్థాపకులు & ఛాన్సలర్ డాక్టర్ పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ.. “ప్రస్తుత ప్రపంచంలో స్థిరమైన కెరీర్ కోసం డిగ్రీతోపాటు స్కిల్స్ కూడా అవసరం. మా యూనివర్సిటీ నుంచి డిగ్రీ, NIAT నుంచి ఇండస్ట్రీ-రెడీ సర్టిఫికేట్ అందుతాయి. ఇది విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించడానికి ఎంతో కీలకం” అని అన్నారు.విద్యార్థులకు ఒకవైపు యూనివర్సిటీ నుంచి UGC అప్రూవ్ బీటెక్ డిగ్రీ, మరొకవైపు NIAT నుంచి ఇండస్ట్రీ రెడీ సర్టిఫికేట్ (IRC) కూడా లభిస్తుంది. ఈ IRC అనేది విద్యార్థులు చేసిన స్కిల్ ట్రైనింగ్, ప్రాజెక్టులు, అసెస్మెంట్ల బేస్‌పై ఇచ్చే సర్టిఫికేట్. డిగ్రీతో పాటు స్కిల్ సర్టిఫికేట్ రావడం వలన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు బాగా పెరుగుతాయి. దీనితో పాటు, మల్టిడిసిప్లినరీ, స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ అనే UGC/AICTE లక్ష్యాలకు కూడా సరిపోతుంది.అరోరా డీమ్డ్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ శ్రీలత చెపురే మాట్లాడుతూ, “2025-26 నుంచి NIATతో కలిసి, మా కాంపస్‌లో డిగ్రీకు తోడుగా అప్స్కిలింగ్ ట్రైనింగ్ ద్వారా విద్యార్థులకు పూర్తి సెట్ అందించనాం. వారి కెరీర్ బలంగా ప్రారంభమవుతుందని మా నమ్మకం,” అన్నారు.మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఫీజు పూర్తిగా క్వియర్గా ఉంటుంది. విద్యార్థులు అకాడమిక్ ఫీజు యూనివర్సిటీకి నేరుగా చెల్లించాలి. ఇంకా, NIAT అందించే ఇండస్ట్రీ రెడినెస్ ప్రోగ్రామ్ కోసం వేరుగా (ఐచ్చికంగా) ఫీజు ఉంటుంది. ఫీజులు వేరుగా ఉండడం వలన UGC, AICTE నిబంధనలకు పూర్తి గా అనుగుణంగా ఉంటుంది.నెక్ట్స్‌వేవ్ & ఎన్ఐఏటీ సహ వ్యవస్థాపకులు & సీఈఓ రాహుల్ అట్లూరి.. ఇదే ప్రభుత్వం కోరుకునే నైపుణ్యాధారిత విద్య అని అన్నారు. “UGC, AICTE ఈ మార్పులకు కీలకమైన సంస్కరణలు తీసుకొస్తున్నాయి. వాటికి అనుగుణంగా మేము ఒక పకా మోడల్ రూపొందించాం. ఇది ఇప్పుడు యూనివర్సిటీలలో, విద్యార్థుల భవిష్యత్తులో నిజంగా మార్పు తీసుకొస్తుంది. డిగ్రీతో పాటు, ఒక భరోసా కలిగిన భవిష్యత్తును కూడా ఇస్తుంది ఈ భాగస్వామ్యం,” అన్నారు.

బొద్దింక పాలు: మీరు ఎప్పుడూ చూడని సూపర్‌ఫుడ్!
ఒక పూట పాలు లేకపోతే, ఆ రోజు ఎంత కష్టంగా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఉదయాన్నే టీ, కాఫీలు పెట్టుకోవడం దగ్గర నుంచి, రాత్రిపూట మజ్జిగ తాగే వరకు ఇంట్లో ఏదోరకంగా పాల అవసరం కనిపిస్తూనే ఉంటుంది. పెరుగు, వెన్న, నెయ్యి ఇలా ప్రతి పాల ఉత్పత్తితోనూ రోజువారీ అవసరాలు, అలవాట్లు ముడిపడే ఉంటాయి. అందుకే, కుదిరితే పాడినయినా పెంచుకుంటాం, లేదా పాలకేంద్రంలో ఖాతానైనా పెట్టుకుంటాం. ఏదేమైనా రోజుకు లీటరో అరలీటరో పాలు స్టవ్ మీద కాగాల్సిందే! ప్రతి ఇంట్లోనూ పాలకున్న డిమాండ్ అలాంటిది.నిజానికి పాలు ఒక సంపూర్ణ ఆహారం. పాలు మన శరీరానికి కావలసిన కాల్షియం, ప్రొటీన్, విటమిన్లు, ఖనిజాలు ఇలా చాలా పోషకాలనే అందిస్తాయి. ఎముకలు, దంతాల ఆరోగ్యానికి కాల్షియం చాలా ఉపయోగపడుతుంది. అలాగే కండరాలు, కణజాలాల నిర్మాణానికి ప్రొటీన్ ఎంతగానో సహాయపడుతుంది. పాలలో విటమిన్–డి, విటమిన్–బి12తో పాటు పొటాషియం వంటి ఖనిజాలు కూడా ఉన్నాయి. పాలు తాగటంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. పాలు ఎముకలను బలపరుస్తాయి, కండరాలను అభివృద్ధి చేస్తాయి. ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అన్ని వయసుల వారికి పాలు ఒక ముఖ్యమైన పోషకం. పిల్లలు ఎదగడానికి, పెద్దలు ఆరోగ్యంగా ఉండటానికి పాలు చాలా అవసరమని డాక్టర్లు ఎప్పుడూ చెబుతుంటారు.మనిషి స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్న నాటి నుంచి పాడిని పెంచి, పాలను వినియోగించుకోవడం మొదలుపెట్టాడని చరిత్ర చెబుతోంది. అంటే దాదాపు పదివేల సంవత్సరాల క్రితం నుంచే, పశువుల పాలతో ప్రయోజనాలను అందుకుంటున్నాం.ఏ జంతువుల పాలు.. ఏమేమి ఫలితాలు?పాలల్లో ఆవు పాలు శ్రేష్ఠమైనవి. ఇక గేదె పాలు, మేక పాలు, ఒంటె పాలు కూడా అనేక సంస్కృతులలో ప్రత్యేకంగా వినియోగిస్తారు. ప్రత్యేక రుచి, పోషక విలువలు, ప్రత్యేక లక్షణాల కారణంగా వాటి పాలను వివిధ రకాలుగా ఉపయోగిస్తున్నారు.బొద్దింక పాలుకీటకమైన ఈ బొద్దింకల నుంచి పాలను తియ్యడం చాలా అసాధారణమైన పని. పసిఫిక్ బీటిల్ బొద్దింకలు ‘బొద్దింక పాలు’ అని పిలవబడే ఒక పోషకసమృద్ధ స్ఫటికాకార పదార్థాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఇవి బొద్దింకల గర్భధారణ సమయంలో వాటి పిల్లలకు పోషణను అందించడానికి ఉపయోగపడతాయి. ఇవి అధిక ప్రొటీన్ కంటెంట్‌ను కలిగి ఉంటాయి. వీటిని మనుషులు వినియోగించుకోవడానికి విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి వాణిజ్యపరంగా బొద్దింకల పాలను ఉత్పత్తి చేయడం లేదు. దీనిని ఒక ‘సూపర్ ఫుడ్’గా మార్కెట్ చేసే ప్రయత్నాలను కొన్ని పరిశోధనా సంస్థలు సాగిస్తున్నాయి. కానీ ఇది కేవలం ప్రయోగాత్మక దశలోనే ఉంది. భారీ స్థాయిలో ఉత్పత్తి చేయడానికి సాంకేతిక, ఆర్థిక, సామాజిక అడ్డంకులు చాలా ఉన్నాయి.ఆవు పాలుఇవి ప్రపంచంలో అత్యధికంగా వినియోగించే పాలు. ఇవి కాల్షియం, ప్రొటీన్, విటమిన్–డిలతో నిండి ఉంటాయి. ఈ పాలను నేరుగా తాగడానికి, పెరుగు, వెన్న, చీజ్ వంటి ఇతర పాల ఉత్పత్తుల తయారీకి ఉపయోగిస్తారు.గొర్రె పాలు ఇవి చాలా పోషకమైనవి, వీటిలో కొవ్వు, ప్రొటీన్, ఖనిజాలు అధికంగా ఉంటాయి. గొర్రె పాలను ఎక్కువగా చీజ్ తయారీకి వినియోగిస్తారు. ముఖ్యంగా ఫెటా, రోక్ఫోర్ట్ వంటి చీజ్‌లు వీటితోనే తయారు చేస్తారు.గేదె పాలుఆవు పాల కంటే ఈ పాలల్లో కొవ్వు, మినరల్స్, ప్రొటీన్లు కొంత ఎక్కువగా కలిగి ఉంటాయి. ఇవి ముఖ్యంగా భారతదేశం, పాకిస్తాన్, ఇటలీ వంటి దేశాలలో ఎక్కువగా దొరుకుతాయి. పెరుగు, మొజారెల్లా చీజ్, ఇతర పాల ఉత్పత్తుల తయారీకి ఈ పాలనే వినియోగిస్తారు. గేదె పాలు చాలా క్రీమీగా ఉంటాయి. ఇందులో లాక్టోస్ కూడా ఎక్కువ.గాడిద పాలుఇవి చాలా అరుదుగా లభిస్తాయి, కానీ వాటి పోషక విలువలు చర్మ సంరక్షణకు, ఉబ్బసం నయం చేయడానికి ప్రసిద్ధి చెందాయి. అందుకే వీటిని చర్మ సౌందర్య ఉత్పత్తులలో ఉపయోగిస్తారు. శిశువులకిచ్చే ఆవు పాలకు ప్రత్యామ్నాయంగా కూడా సూచిస్తారు.మేక పాలు ఆవు పాల కంటే తేలికగా జీర్ణమవుతాయి. కొంత భిన్నమైన రుచిని కలిగి ఉంటాయి. వీటిలో కాల్షియం, విటమిన్–ఎ అధికంగా ఉంటాయి. మేక పాల నుంచి చీజ్, పెరుగులతో పాటు సబ్బులు కూడా తయారు చేస్తారు. ఈ మేక పాలు ప్రపంచ పాల ఉత్పత్తిలో సుమారు 2% వాటాను కలిగి ఉన్నాయి. పోషక విలువలు ఎక్కువగా ఉండటంతో గత 20 సంవత్సరాలలో దీని ఉత్పత్తి దాదాపు 60% పెరిగింది. మేకపాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అవయవాల పనితీరుకు సహాయపడతాయి. గుండె ఆరోగ్యానికి మంచివి.ఒంటె పాలుపశ్చిమాసియా, ఆఫ్రికాలోని ఎడారి ప్రాంతాలలో ఒంటె పాలు శతాబ్దాలుగా ఒక ముఖ్యమైన ఆహారం. ఈ పాలలో విటమిన్–సి, ఐరన్, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. ఒంటె పాలు తేలికగా జీర్ణమవుతాయి. కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలకు ఈ పాలు మంచి ఔషధం. ఈ పాలు కొన్ని వైద్యపరమైన ప్రయోజనాలను కూడా కలిగి ఉన్నాయని నమ్ముతారు. ఈ పాలను ఐస్‌క్రీమ్, చీజ్ వంటి ఉత్పత్తులను తయారు చేయడానికి ఉపయోగిస్తారు.గుర్రపు పాలుఖజక్స్తాన్, మంగోలియా, తూర్పు ఐరోపాలో గుర్రపు పాలను కూమిస్, అయిరాగ్ వంటి సంప్రదాయకంగా పులియబెట్టే పానీయాలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఈ పానీయాలు ప్రత్యేకమైన రుచిని కలిగి ఉండటమే కాకుండా, ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. గుర్రపు పాలు తల్లి పాలను పోలి ఉంటాయి. అమైనో ఆమ్లాలు, కొవ్వు శాతం ఈ పాలలో ఎక్కువగా ఉండటంతో చీజ్ తయారీకి ఇవి చక్కగా పనికొస్తాయి.మూస్ పాలుఇవి చాలా అరుదుగా లభిస్తాయి. వీటిని స్వీడన్, రష్యా, కెనడాలో వాణిజ్యపరంగా ఉపయోగిస్తాయి. మూస్ పాలను చీజ్, పెరుగు, ఐస్ క్రీమ్ తయారీకి ఉపయోగిస్తారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చీజ్‌లలో మూస్ చీజ్ ఒకటి.రెయిన్ డీర్ పాలుసైబీరియా, ఉత్తర స్కాండినేవియా వంటి చల్లని ప్రాంతాలలో నివసించే ప్రజలు రెయిన్ డీర్ పాలను వినియోగిస్తారు. ఆవు పాల కంటే వీటిలో కొవ్వు, ప్రొటీన్ ఎక్కువగా ఉంటాయి, ఇవి చాలా శక్తిమంతమైన ఆహారం.జిరాఫీ పాలు జిరాఫీ పాలు అసాధారణమైనవి. మానవ వినియోగానికి సాధారణంగా లభ్యం కావు. వీటి పాలలో కొవ్వు, ప్రొటీన్ అధికంగా ఉంటాయి. ఇవి జిరాఫీ పిల్లల వేగవంతమైన పెరుగుదలకు చాలా ఉపయోగపడతాయి. అయితే, జిరాఫీల నుంచి పాలు తీయడం చాలా కష్టం. అది పెద్ద సవాలుతో కూడుకున్న పని.యాక్ పాలుహిమాలయ ప్రాంతంలో ఈ యాక్ పాలు చాలా ప్రత్యేకం. ఇవి ప్రొటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులతో నిండి ఉంటాయి, టిబెటన్లు, ఇతర పర్వత నివాసుల ఆహారంలో ఈ పాలను తప్పనిసరి తీసుకుంటారు. ఈ పాలు చిక్కగా, ఎక్కువ కొవ్వులతో ఉండటంతో వెన్న, చీజ్ తయారీకి అనుకూలంగా ఉంటాయి.అపోహలు నిజాలుపాలు తాగితే బరువు పెరుగుతారు!ఇది నిజం కాదు. పాలలో ఉండే పోషకాలు ఆరోగ్యానికి చాలా అవసరం. పాలు బరువును పెంచుతాయా లేదా అనేది మీరు తీసుకునే పాల రకం (ఫుల్ క్రీమ్, స్కిమ్డ్ మిల్క్), తీసుకునే పరిమాణం మీద ఆధారపడి ఉంటుంది. క్రీమ్ తొలగించిన పాలను తీసుకుంటే క్యాలరీ కంటెంట్ తగ్గుతుంది, ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.పాలను ఎక్కువగా కాగబెడితే పోషకాలు తగ్గుతాయి!ఇది పూర్తిగా తప్పు. పాలను కాగబెట్టడంతో అందులో ఉండే బ్యాక్టీరియా నశిస్తుంది, పాలు తాగడానికి సురక్షితంగా మారతాయి. పదేపదే మరిగించడంతో పోషకాలకు ఎటువంటి హాని జరగదు.పాలు ఎముకల నుంచి కాల్షియంను బయటకు తీస్తాయి!ఈ అపోహకు శాస్త్రీయ ఆధారాలు లేవు. వాస్తవానికి, పాలు కాల్షియంకు అద్భుతమైన వనరు. ఎముకల ఆరోగ్యానికి ఉపయోగపడతాయి.పాలు తాగితే కఫం ఉత్పత్తి అవుతుంది!ఈ వాదన పూర్తిగా సరైనది కాదు. దగ్గు సమయంలో స్కిమ్డ్ మిల్క్ తీసుకోవడంతో కఫం పెరుగుతుందని కొందరు నమ్ముతారు, కానీ పాలు తాగడానికి, కఫం ఉత్పత్తికి ప్రత్యక్ష సంబంధం లేదు.పాలు మొటిమలు రావడానికి కారణమవుతాయి!పాల వినియోగం, మొటిమల మధ్య ప్రత్యక్ష సంబంధానికి శాస్త్రీయ ఆధారాలు లేవు. జన్యుశాస్త్రం, హార్మోన్లు, మనం తీసుకునే ఆహారం వంటి ఎన్నో అంశాలు చర్మ ఆరోగ్యంలో కీలకంగా మారతాయి.తల్లిపాలు పట్టిస్తున్నప్పుడు తల్లి అనారోగ్యంతో ఉంటే బిడ్డకు పాలు ఇవ్వకూడదు!అనారోగ్యంతో ఉన్న తల్లి, తన పిల్లలకు పాలు ఇవ్వడంలో ఎటువంటి సమస్య ఉండదు. తల్లికి అనారోగ్యంగా ఉంటే, ఆమె శరీరంలో యాంటీబాడీలు తయారవుతాయి. అవి శిశువులకు రక్షణనిస్తాయి. తల్లి నుంచి పిల్లలకు వ్యాధి వ్యాపించడం చాలా అరుదుగా జరుగుతుంది.ముర్రుపాలు బిడ్డకు పట్టించకూడదు!ప్రసవానంతరం లేత పసుపు రంగులో వచ్చే ముర్రుపాలు బిడ్డకు చాలా ముఖ్యమైనవి. అవి రోగనిరోధక శక్తిని పెంచే యాంటీబాడీలు, పోషకాలను నిండి ఉంటాయి.పాలు లాభాలుపాలు కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, అవి పోషకాల మిశ్రమం. కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లతో పాటు కీలకమైన విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటుంది. మన రోజువారీ ఆరోగ్యానికి పాలు ఎంతగానో దోహదపడతాయి. పాలలో ఉండే ప్రధాన పోషకాలు, అవి మన శరీరానికి చేసే మేలు గురించి ఇక్కడ తెలుసుకుందాం.విటమిన్–ఎఇది కంటిచూపుకు ఎంతో అవసరం. కణాల పెరుగుదలను ప్రోత్సహించి, రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.విటమిన్–డిఎముకల ఆరోగ్యానికి ఇది చాలా ముఖ్యం. శరీరం క్యాల్షియంను సమర్థంగా గ్రహించేలా చేస్తుంది. దాంతో ఎముకలకు పటుత్వం లభిస్తుంది.విటమిన్–బి3 (నియాసిన్) మనం తీసుకున్న ఆహారాన్ని శక్తిగా మార్చడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.విటమిన్–బి5 (పాంటోథెనిక్ ఆమ్లం)శరీరంలోని జీవక్రియలు సజావుగా సాగేందుకు ఈ విటమిన్ తోడ్పడుతుంది.విటమిన్–బి12నాడీవ్యవస్థ పనితీరుకు, డీఎన్ఏ నిర్మాణానికి ఇది అత్యవసరం.విటమిన్–ఈఇవి పాలలో తక్కువ శాతం ఉంటాయి. అయితే పాలిచ్చే జంతువులను బట్టి, అవి తీసుకునే ఆహారాన్ని బట్టి కూడా వ్యత్యాసం ఉంటుంది. మనిషి పాలలో విటమిన్ ఈ ఎక్కువగా లభిస్తుంది.క్యాల్షియం ఎముకలు, దంతాల ఆరోగ్యానికి, వాటి దారుఢ్యాన్ని కాపాడటానికి ఇది ప్రధాన పోషకం.ఫాస్ఫరస్క్యాల్షియంతో కలిసి ఎముకలు, దంతాల నిర్మాణానికి ఫాస్ఫరస్ దోహదపడుతుంది.అయోడిన్థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తికి అయోడిన్ కీలకమైనది, ఇది శరీర విధులను నియంత్రిస్తుంది.సెలీనియంఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. కణాలను ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించి, వాటికి రక్షణ కల్పిస్తుంది.జింక్రోగనిరోధక శక్తిని కాపాడటంలో జింక్ ముఖ్యపాత్ర పోషిస్తుంది. గాయాలు త్వరగా మానేలా కూడా చేస్తుంది.ప్రొటీన్కండరాల పెరుగుదలకు ప్రొటీన్ అత్యవసరం. కణజాలం నిర్మాణానికి, దెబ్బతిన్న కణజాలం కోలుకోవడానికి కూడా ఇది దోహదపడుతుంది.కార్బోహైడ్రేట్స్పాలలోని లాక్టోస్ ఒక కీలకమైన కార్బోహైడ్రేట్. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది.కొవ్వులుకొవ్వులు శరీరానికి శక్తినిస్తాయి. అలాగే విటమిన్లు(ఎ, డి, ఈ వంటివి), శరీరంలో ఇముడ్చుకోవడానికి ఈ కొవ్వులు ఎంతగానో తోడ్పడతాయి.నిజానికి లాక్టోస్ అలర్జీ ఉన్నవారు పాలు, పాల పదార్థాలను తీసుకోకూడదు. వాటికి బదులుగా, కాల్షియం ఎక్కువగా ఉండే ఆకుకూరలు, మొక్కల ఆధారిత పాలు (సోయా మిల్క్, బాదం మిల్క్) వంటివి తీసుకోవచ్చు. పాలు అలవాటు ఉన్నవారు, పాలు తాగడంతో ఎలాంటి సమస్య లేనివారు ఏదో ఒక రూపంలో, తగిన మోతాదులో తీసుకోవడం ఉత్తమం అంటున్నారు నిపుణులు.
ఓటీటీలో అదరగొడుతున్న చిన్న సినిమా
ఇదో టైపు ఇంటరాగేషన్ !
ఎనిమిది రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు.. పాక్‌తో సంబంధాలపై ఆరా
కాలకల్పుని కథ
కరుణ్ డబుల్ సెంచరీ.. తొలి ఇన్నింగ్స్‌లో భారత్-ఎ భారీ స్కోర్
వజ్రాలు ఉచితం
ఈ వారం కథ: ప్రేమించేందుకు వీలులేదా?
ఇంగ్లండ్ టూర్.. టీమిండియా మేనేజర్‌గా యుధ్వీర్
ఈశాన్య రాష్ట్రాల్లో వరద బీభత్సం.. కొండచరియలు విరిగిపడి 30 మంది మృతి
రష్యాలో ఘోర రైలు ప్రమాదం.. పలువురు మృతి, గాయాలు
ఉత్తమ హాస్యనటుడు.. కామారెడ్డి కిశోరుడు
శ్రీలీల నిశ్చితార్థం..? 'బిగ్ డే' అంటూ ఫోటోలు విడుదల.. అసలు విషయం ఇదేనా?
డ్రైవర్‌తో వివాహేతర సంబంధం.. చివరికి..!
కాంగ్రెస్ లో శశిథరూర్ ముసలం
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత
నటి బ్రిగిడా సాగా..కిక్ ఇచ్చే ఫోటోలు చూశారా..?
మా ఊరికి రోడ్లు, కరెంటు, స్కూలు, ఆసుపత్రులు లేవని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోనిది నువ్వే కదా!
IPL 2025, Eliminator Match: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ
'చాలా ఏళ్లుగా ఆ అలవాటు ఉంది'! వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌పై జైశంకర్ మాట
నెత్తి మీద మంట పెట్టి వెళ్లిపోతున్నాడు సార్!
ఇంగ్లండ్ పర్యటనలో తొలి ఇన్నింగ్స్‌లోనే సత్తా చాటిన కరుణ్ నాయర్
అడిగింది ఇస్తావా?.. మన వీడియో లీక్ చేయమంటావా..
భైరవం మూవీ రివ్యూ
మన ఫైటర్ జెట్స్‌ను కోల్పోయాం: సీడీఎస్
ఈ రాశి వారు పనులు సజావుగా పూర్తి చేస్తారు.. ఆర్థిక లావాదేవీలు.
‘మా నీరు మాకు కావాల్సిందే’.. సింధూ నదీ జలాల ఒప్పందంపై పాక్ ఆర్మీ చీఫ్
కొడుకు బారసాల జ్ఞాపకాలతో హీరోయిన్ ప్రణీత (ఫొటోలు)
అది మూడు సెకన్ల సీన్.. ఇంత గోల ఏంటి: నటి
ఈ సినిమాను సెన్సార్ కట్ లేకుండా చూస్తేనే!: రాధికా ఆప్టే
ఓటీటీలో అదరగొడుతున్న చిన్న సినిమా
ఇదో టైపు ఇంటరాగేషన్ !
ఎనిమిది రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు.. పాక్‌తో సంబంధాలపై ఆరా
కాలకల్పుని కథ
కరుణ్ డబుల్ సెంచరీ.. తొలి ఇన్నింగ్స్‌లో భారత్-ఎ భారీ స్కోర్
వజ్రాలు ఉచితం
ఈ వారం కథ: ప్రేమించేందుకు వీలులేదా?
ఇంగ్లండ్ టూర్.. టీమిండియా మేనేజర్‌గా యుధ్వీర్
ఈశాన్య రాష్ట్రాల్లో వరద బీభత్సం.. కొండచరియలు విరిగిపడి 30 మంది మృతి
రష్యాలో ఘోర రైలు ప్రమాదం.. పలువురు మృతి, గాయాలు
ఉత్తమ హాస్యనటుడు.. కామారెడ్డి కిశోరుడు
శ్రీలీల నిశ్చితార్థం..? 'బిగ్ డే' అంటూ ఫోటోలు విడుదల.. అసలు విషయం ఇదేనా?
డ్రైవర్‌తో వివాహేతర సంబంధం.. చివరికి..!
కాంగ్రెస్ లో శశిథరూర్ ముసలం
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత
మా ఊరికి రోడ్లు, కరెంటు, స్కూలు, ఆసుపత్రులు లేవని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోనిది నువ్వే కదా!
IPL 2025, Eliminator Match: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ
'చాలా ఏళ్లుగా ఆ అలవాటు ఉంది'! వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌పై జైశంకర్ మాట
నెత్తి మీద మంట పెట్టి వెళ్లిపోతున్నాడు సార్!
అడిగింది ఇస్తావా?.. మన వీడియో లీక్ చేయమంటావా..
ఇంగ్లండ్ పర్యటనలో తొలి ఇన్నింగ్స్‌లోనే సత్తా చాటిన కరుణ్ నాయర్
మన ఫైటర్ జెట్స్‌ను కోల్పోయాం: సీడీఎస్
భైరవం మూవీ రివ్యూ
ఈ రాశి వారు పనులు సజావుగా పూర్తి చేస్తారు.. ఆర్థిక లావాదేవీలు.
‘మా నీరు మాకు కావాల్సిందే’.. సింధూ నదీ జలాల ఒప్పందంపై పాక్ ఆర్మీ చీఫ్
ఈ సినిమాను సెన్సార్ కట్ లేకుండా చూస్తేనే!: రాధికా ఆప్టే
అది మూడు సెకన్ల సీన్.. ఇంత గోల ఏంటి: నటి
ప్రతీ పనికి నిన్ను ఇబ్బంది పెడుతున్నా.. ఈ జీవితం నాకొద్దు!
రిలాక్స్.. నా పని నాకు బాగా తెలుసు: కోచ్ మాట వినని బుమ్రా
సినిమా

బ్యాచిలర్ కష్టాలు
నటుడిగా, హాస్యనటుడిగా ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న ప్రవీణ్ హీరోగా నటించిన మొదటి చిత్రం ‘బకాసుర రెస్టారెంట్’. ఎస్జే శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వైవా హర్ష టైటిల్ రోల్లో నటించారు. ఎస్జే మూవీస్‌పై లక్ష్మయ్య ఆచారి, జనార్ధన్ ఆచారి నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.వికాస బడిస సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘నా అంగీ జాతీయం... నీ లుంగీ జాతీయం...’ అంటూ సాగే లిరికల్ వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్జే శివ మాట్లాడుతూ– ‘‘హంగర్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రంలో ఎన్నో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. బ్యాచిలర్ కష్టాలు, బ్యాచిలర్ లైఫ్‌లో ఉండే ఆనందాలను తెలియజేస్తూ విష్ణువర్థన్ రాసిన ‘నా అంగీ జాతీయం..’పాటని అనురాగ్ కులకర్ణిపాడారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది.

కథా చర్చల్లో..?
‘‘కొన్ని క్షణాలు మీ హృదయంలో శాశ్వతంగా నిలిచిపోతాయి. లెజెండరీ విజయేంద్ర ప్రసాద్‌గారితో సమయం గడపడం అలాంటిదే. ఆయన జ్ఞానం, వినయం, ఆలోచనల్లోని స్పష్టత నిజంగా స్ఫూర్తిదాయకం’’ అంటూ పూరి కనెక్ట్స్ ‘ఎక్స్’ ఖాతాలో విజయేంద్ర ప్రసాద్, పూరి జగన్నాథ్ కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేశారు ఈ సంస్థ ప్రతినిధులు. దాంతో రచయిత విజయేంద్ర ప్రసాద్–దర్శకుడు పూరి జగన్నాథ్ ఎందుకు కలిశారు? అనేది హాట్ టాపిక్‌గా మారింది. విజయ్ సేతుపతి హీరోగా తాను తెరకెక్కించనున్న సినిమా కథా చర్చల కోసమే విజయేంద్ర ప్రసాద్‌ని పూరి కలిశారనే ఊహాగానాలు నెలకొన్నాయి.ప్రస్తుతం ఈ సినిమాకు చెందిన ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. పూరి కనెక్ట్స్ పతాకంపై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ ఈ సినిమాను నిర్మించనున్నారు. జూన్ చివర్లో చిత్రీకరణను ప్రారంభించేందుకు హైదరాబాద్, చెన్నై లొకేషన్స్‌ను రెక్కీ చేస్తున్నారు. మరి.. వార్తల్లో ఉన్నట్లు ఈ సినిమా స్క్రిప్ట్ పనుల్లో భాగంగానే విజయేంద్ర ప్రసాద్‌ను పూరి జగన్నాథ్ కలిసి ఉంటారా? అనే విషయం తెలియాల్సి ఉంది.

ఖలేజా రీ రిలీజ్.. మంచు మనోజ్ ఆసక్తికర కామెంట్స్!
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ భైరవం మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. చాలా రోజుల తర్వాత ఆయన అభిమానులను అలరించారు. ఈ మూవీలో బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ కూడా నటించారు. ఇటీవలే థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ బ్లాక్‌బస్టర్ భైరవం పేరుతో సెలబ్రేషన్స్ చేసుకుంది. ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన హీరో మంచు మనోజ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. రీ రిలీజ్ సినిమాలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.రీ రిలీజ్ సినిమాలు వీకెండ్స్‌లో కాకుండా వీక్ డేస్‌లో పెట్టుకుంటే బాగుంటుందని మనోజ్ సూచించారు. అలా చేయడం వల్ల కొత్త సినిమాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అన్నారు. వీకెండ్స్‌లో విడుదల చేస్తే మన సినిమాను ఇంకో సినిమాతో చంపేసినట్లు ఉంటుందన్నారు. ఎలాగైనా ఏ సినిమాకు ఉండే బలం.. ఆ సినిమాలకు ఉంటుంది.. ఎందుకంటే వీకెండ్స్‌లోనే అందరికీ టైమ్ దొరుకుతుందని తెలిపారు. ఈ విషయంపై సినీ పెద్దలు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు మంచు మనోజ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.ఇదే ఈవెంట్లో కన్నప్ప మూవీ హార్డ్ డిస్క్‌పై ప్రశ్న ఎదురవడంతో మనోజ్ స్పందించారు. ఇది సినిమా ఈవెంట్.. ఇక్కడ కేవలం సినిమా గురించే మాట్లాడుకుందాం.. ఎందుకంటే ఒక సినిమా వెనుక ఎంత కష్టం ఉంటుందో నాకు తెలుసని అన్నారు. మనోజ్ గతంలో కన్నప్ప సినిమాపై తాను చేసిన సరదాగా మాట్లాడానని తెలిపారు. ఆ సినిమా వెనుక ఉండే కష్టం నాకు తెలుసు.. కన్నప్ప ఘన విజయం సాధించాలని విష్ణు అన్నకు కోసం ఆల్ ది బెస్ట్ అంటూ మంచు మనోజ్ మాట్లాడారు.కాగా.. భైరవం రిలీజ్ అయినరోజే మహేశ్ బాబు నటించిన ఖలేజా విడుదలైంది. ఈ సినిమాకు సైతం మహేశ్ బాబు ఫ్యాన్స్ నుంచి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ఓవర్సీస్లోనూ ఖలేజాను రీ రిలీజ్ చేశారు. మొదటి రోజే థియేటర్లలో మహేశ్ బాబు అభిమానులు డ్యాన్సులు వేస్తూ సందడి చేశారు.

'సినీ ఇండస్ట్రీలో మహిళలను అలానే చూస్తారు'.. మాజీ మిస్ వరల్డ్ పోస్ట్ వైరల్!
మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. మనదేశంలో మిస్ వరల్డ్ పోటీలు జరుతుగున్న వేళ.. ఏ రంగంలోనైనా మహిళలను చిన్నచూపు చూస్తున్నారని విమర్శించింది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో మహిళలకు ఎలాంటి గౌరవం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలను కేవలం గ్లామర్ వస్తువుగానే చూస్తున్నారని మానుషి చిల్లర్ అభిప్రాయపడింది. తాజాగా ట్విటర్ వేదికగా ఆమె చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.మానుషి తన ట్వీట్లో రాస్తూ.. 'స్త్రీల పట్ల ద్వేషపూరిత మనస్తత్వం ఉన్నవారు.. స్త్రీ సాధించిన విజయం కంటే ఆమె వెనుక పురుషుడి ఉన్నాడని ఆపాదించడం సులభంగా భావిస్తారు. వాస్తవ ప్రపంచంలో ఎటువంటి ప్రభావం చూపని ఇలాంటి తెలివితక్కువ వ్యాఖ్యలను పట్టించుకోవడం నేను ఎప్పుడో మానేశా. కానీ ముఖ్యంగా సినీ పరిశ్రమలో పనిచేసే మహిళలను అగౌరవంగా చూడడం.. నేను నిరంతరం గమనిస్తూనే ఉన్నా. లింగ భేదం లేకుండా మనమందరం సమాన విలువ, సాధికారత, విద్యావంతులైన వాతావరణంలో పెరిగాం. కానీ పురుషులు విజయం సాధిస్తే కష్టపడి పనిచేసేవారు, ప్రతిభావంతులని పొగుడుతారు. అదే మహిళలు సాధిస్తే అవకాశవాదులని ముద్రవేస్తారు. ఇలాంటి అనుభవాన్ని నేను కూడా ఎదుర్కొన్నా. ఒక స్త్రీ గురించి ఎలాంటి సంబంధం లేని వ్యక్తులు చెడుగా మాట్లాడడం అంత సులభమా? లేదా ఏళ్లుగా పాతుకుపోయిన పక్షపాతమా' అని ప్రశ్నించింది. ముఖ్యంగా మహిళల విజయాన్ని పురుషులకు అపాదించడాన్ని మానుషి చిల్లర్ విమర్శిస్తోంది.ఇక సినిమాల విషయానికొస్తే మానుషి చిల్లర్.. అక్షయ్ కుమార్ నటించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా 'సామ్రాట్ పృథ్వీరాజ్'తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. విక్కీ కౌశల్ సరసన'ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ'లో నటించింది. టాలీవుడ్లో వరుణ్ తేజ్ సరసన 'ఆపరేషన్ వాలెంటైన్'లో ఎయిర్ ఫోర్స్ పైలట్‌గా కనిపించింది. మానుషి చివరిసారిగా 'బడే మియాన్ చోటే మియాన్' చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం ఈ మాజీ మిస్ వరల్డ్ జాన్ అబ్రహం థ్రిల్లర్ మూవీ'టెహ్రాన్'లో కనిపించనుంది. ఈ బాలీవుడ్ భామ 017లో మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్న సంగతి తెలిసిందే.A misogynistic mindset finds it easier to attribute a woman’s success to a man’s patronage than her own merit.I’ve always really ignored silly comments which have no consequence in the real world, but I constantly see working women, specially in the entertainment industry being…— Manushi Chhillar (@ManushiChhillar) May 31, 2025
న్యూస్ పాడ్‌కాస్ట్

మిస్ వరల్డ్‌గా సుచాత ఓపల్ చువాంగ్ శ్రీ.. కిరీటం దక్కించుకున్న థాయ్‌లాండ్ సుందరి

ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగుల బదిలీల్లో విచ్చలవిడిగా వసూళ్ల దందా... నిబంధనలు, అర్హతలు పక్కనపెట్టి అంతా ఇష్టారాజ్యం

ఆంధ్రప్రదేశ్‌లో దేవుడి భూములకు దేవుడే దిక్కు... ఖరీదైన ఆలయ భూములను అస్మదీయులకు కట్టబెడుతున్న చంద్రబాబు కూటమి ప్రభుత్వం

మహానాడు నాటకం, చంద్రబాబు పాలన పచ్చిబూటకం... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం

ఆంధ్రప్రదేశ్‌లో ఎకరం వంద రూపాయలకే మెడికల్ కాలేజీ లీజు... నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలను బేరం పెట్టిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌లో దళిత, మైనారిటీ యువకులపై పోలీసుల బహిరంగ దాడి

ఆంధ్రప్రదేశ్‌లో సోలార్ విద్యుత్తు ప్లాంట్ పేరుతో రైతుల భూములు స్వాహా.... బ్యాంకులో తనఖా పెట్టి రుణాలు తీసుకోవడానికి ప్రైవేట్ కంపెనీ ఎత్తుగడలు

అమరావతి నిర్మాణ పనుల్లో ముడుపుల దందా... భారీగా పెంచేసిన అంచనా వ్యయంపై ఇంజినీరింగ్ నిపుణుల విస్మయం.. ముఖ్య నేత జేబుల్లోకి కమీషన్ల సొమ్ము చేరుతున్నట్లు ఆరోపణలు

ఈశాన్య రాష్ట్రాల్లో అసాధారణ అభివృద్ధి జరుగుతోంది... అక్కడ పెట్టుబడులకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి... ‘రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్స్ సమ్మిట్’లో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు

చంద్రబాబుదే మద్యం కుంభకోణం... గత ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై అబద్ధపు వాంగ్మూలాలతో తప్పుడు కేసులు బనాయిస్తున్నారు.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం
క్రీడలు

24 పతకాలతో భారత్‌కు రెండో స్థానం
గుమి (దక్షిణ కొరియా): ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఆఖరి రోజు కూడా భారత్ పతకాల వేట కొనసాగింది. శనివారం జరిగిన చివరి రోజు పోటీల్లో అథ్లెట్లు మరో అర డజను (6) పతకాలు సాధించారు. జావెలిన్ త్రోయర్ సచిన్ యాదవ్, మహిళల 5000 మీ. పరుగులో పారుల్ చౌదరి రజతం గెలుపొందగా. మరో రజత పతకం మహిళల 4్ఠ100 మీ. రిలేలో లభించింది. పురుషుల 200 మీ. స్ప్రింట్‌లో అనిమేశ్ కుజూర్, మహిళల 800 మీ. పరుగులో పూజ సింగ్, మహిళల 400 మీ. హర్డిల్స్‌లో విత్య రామ్రాజ్ కాంస్య పతకాలు సాధించారు. ఈ పోటీల్లో రెండో పతకం గెలవాలని గంపెడాశలు పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ మేటి రన్నర్ జ్యోతి యర్రాజీకి 200 మీటర్ల పరుగులో నిరాశ ఎదురైంది. 100 మీ. హర్డిల్స్‌లో పసిడి పతకాన్ని నిలబెట్టుకున్న ఆమె... స్ప్రింట్‌లో మాత్రం 23.47 సెకన్ల టైమింగ్‌తో ఐదో స్థానానికి పరిమితమైంది. భారత్‌కు రెండో స్థానం ఓవరాల్‌గా భారత్ 24 పతకాలతో పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. గత బ్యాంకాక్ (2023లో 27 పతకాలు) ఈవెంట్‌తో పోల్చితే 3 పతకాలు తగ్గినా... బంగారంలో భారత్ మెరుగైంది. నాటి క్రీడల్లో 6 స్వర్ణాలు సాధిస్తే... తాజా ఈవెంట్లో 8 పసిడి పతకాలు సహా 10 రజతాలు, 6 కాంస్య పతకాలను భారత బృందం గెలిచింది. చైనా 32 పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది. బీజింగ్ బృందం 19 స్వర్ణాలు, 9 రజతాలు, 4 కాంస్య పతకాలు సాధించింది.28 పతకాలు గెలుచుకున్న జపాన్ మూడో స్థానంలో ఉంది. జపనీస్ అథ్లెట్లు రజతాలు (11), కాంస్యాలు (12) ఎక్కువగా సాధించినప్పటికీ స్వర్ణాల్లో (5) వెనుకబడటంతో మూడో స్థానం దక్కింది. ఈ ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్íÙప్ చరిత్రలో భారత్ 2017లో 29 పతకాలతో అగ్ర స్థానంలో నిలిచిన ఘనతను సొంతం చేసుకుంది. సొంతగడ్డ (భువనేశ్వర్)పై జరిగిన ఆ ఈవెంట్లో 10 స్వర్ణాలు, 6 రజతాలు, 13 కాంస్య పతకాలను భారత్ చేజిక్కించుకుంది. పారుల్కు రెండో రజతం ఈ పోటీల్లో ఇదివరకే మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో రజత పతకం సాధించిన పారుల్ చౌదరి డబుల్ ధమాకా సాధించింది. తాజాగా ఆమె మహిళల 5000 మీటర్ల పరుగు పందెంలో రెండో స్థానంతో పోడియంలో నిలిచింది. సుదీర్ఘ పరుగు పోటీని ఆమె 15 నిమిషాల 15.33 సెకన్లలో ముగించి రెండో రజత పతకాన్ని చేజిక్కించుకుంది. పురుషుల జావెలిన్ త్రోలో రైజింగ్ స్టార్ సచిన్ యాదవ్ ఈటెను 85.16 మీటర్ల దూరంలో విసిరి రజతం అందుకున్నాడు. ఈ క్రమంలో తన వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన (84.39 మీ.)ను అధిగమించాడు. సచిన్ సహచరుడు... ఫైనల్ బరిలో నిలిచిన యశ్వీర్ సింగ్ కూడా అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శన (82. 57 మీటర్లు) నమోదు చేసినప్పటికీ ఐదో స్థానంలో నిలిచాడు. మహిళల 4x100 మీటర్ల రిలే ఈవెంట్లో తెలంగాణ అథ్లెట్ నిత్య గంధె, అభినయ, స్నేహ, శ్రావణి నందతో కూడిన భారత బృందం సీజన్ బెస్ట్ ప్రదర్శన 43.86 సెకన్లతో రెండో స్థానంతో రజత పతకాన్ని గెలుచుకుంది. విత్య, పూజలకు కాంస్యాలు ఆసియా క్రీడల కాంస్య పతక విజేత విత్య రామ్రాజ్ కాంస్య పతకం గెలిచింది. మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో తమిళనాడుకు చెందిన 26 ఏళ్ల అథ్లెట్ పోటీని 56.46 సెకన్లలో పూర్తిచేసి మూడో స్థానంతో ‘పోడియం’లో నిలిచింది. శనివారం ఈ ఫైనల్స్ బరిలో నిలిచిన మరో భారత అథ్లెట్ అను రాఘవన్‌కు ఏడో స్థానం దక్కింది. ఆమె పోటీని 57.46 సెకన్లలో పూర్తి చేసింది. మహిళల ఈవెంట్లో మరో కాంస్యాన్ని పూజ సింగ్ సాధించింది. మహిళల 800 మీటర్ల పరుగులో పోటీపడిన ఆమె రేస్‌ను 2 నిమిషాల 01.89 సెకన్లలో పూర్తిచేసి మూడో స్థానంలో నిలిచింది.స్ప్రింట్‌లో దశాబ్దం తర్వాత...కొరియన్ గడ్డపై స్పింట్లో పతకానికి పదేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. పురుషుల 200 మీటర్ల పరుగులో అనిమేశ్ కుజూర్ కాంస్య పతకం సాధించాడు. శనివారం జరిగిన పోటీలో 21 ఏళ్ల ఒడిశా స్ప్రింటర్ పరుగును 20.32 సెకన్లలో పూర్తిచేసి జాతీయ రికార్డు నెలకొల్పాడు. కానీ వెంట్రుక వాసిలో 00.01 సెకన్ తేడాతో రజతం గెలిచే అవకాశాన్ని కోల్పోయాడు. అయితే అతని వ్యక్తిగత అత్యుత్తమ వేగాన్ని (20.40 సెకన్లు) మెరుగుపర్చుకున్నాడు. ఈ ఏడాది సీనియర్ అథ్లెటిక్స్‌లో ఆ టైమింగ్‌ను నమోదు చేశాడు. అబ్దుల్ అజీజ్ (సౌదీ అరేబియా; 20.31 సె.) రజతం నెగ్గారు. సరిగ్గా పదేళ్ల క్రితం (2015లో) 200 మీ. పరుగులో ధరమ్వీర్ సింగ్ కాంస్యంతో స్ప్రింట్‌లో భారత్ తొలి పతకం అందించాడు. ఆ తర్వాత నాలుగుసార్లు 2017, 2019, 2021, 2023 ఆసియా ఈవెంట్ జరిగినా... ఎవరూ స్ప్రింట్‌లో పతకం నెగ్గలేకపోయారు.

పది మందికి రూ. 1 కోటికి పైగా...
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ సీజన్–12 కోసం జరిగిన వేలంలో ఆటగాళ్ల పంట పండింది. లీగ్ వేలం చరిత్రలో ఒకే సీజన్లో తొలిసారి 10 మందికి పైగా ఆటగాళ్లు రూ. 1 కోటికి మించి విలువ పలకడం విశేషం. గత సీజన్లో ‘అత్యంత విలువైన ఆటగాడి’ అవార్డు పొందిన ఇరాన్ ప్లేయర్ మొహమ్మద్ రెజా షాద్లుయికి రికార్డు స్థాయిలో రూ. 2.23 కోట్లు దక్కడం విశేషం. ఈ భారీ మొత్తానికి గుజరాత్ జెయింట్స్ రెజాను సొంతం చేసుకుంది. వరుసగా మూడు సీజన్లోనూ రూ. 2 కోట్లకు మించిన ధర పలికిన ఆటగాడిగా రెజా నిలవడం అతని స్థాయిని చూపిస్తోంది. భారత ఆటగాళ్లలో దేవాంక్ దలాల్ టాపర్‌గా నిలిచాడు. అతడిని వేలంలో బెంగాల్ వారియర్స్ రూ. 2.20 కోట్లకు గెలుచుకుంది. గత సీజన్లో దేవాంక్ బెస్ట్ రైడర్‌గా నిలిచి పట్నా పైరేట్స్ ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. తెలుగు టైటాన్స్ జట్టు వేలంలో భరత్ (రూ.81.50 లక్షలు), విజయ్ మలిక్ (రూ.51.50 లక్షలు), శుభమ్ షిండే (రూ. 80 లక్షలు)లను ఎంచుకుంది.

సెమీస్‌లో సాత్విక్–చిరాగ్ జోడీ ఓటమి
సింగపూర్: భారత స్టార్ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ సెమీ ఫైనల్లో పరాజయం పాలైంది. వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీ పురుషుల డబుల్స్ సెమీస్‌లో శనివారం సాత్విక్–చిరాగ్ జంట 21–19, 10–21, 18–21తో ఆరోన్ చియా–సోహ్ యిక్ (మలేసియా) ద్వయం చేతిలో ఓడింది. 64 నిమిషాల పాటు సాగిన పోరులో తొలి గేమ్ గెలిచిన భారత జోడీ... ఆ తర్వాత రెండో గేమ్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో చక్కటి ప్రదర్శన కనబర్చినప్పటకీ... కీలక సమయాల్లో పాయింట్లు కోల్పోయి పరాజయం వైపు నిలిచింది. ఈ ఏడాది సాత్విక్–చిరాగ్ జోడీకి ఇది మూడో సెమీఫైనల్ ఓటమి. అంతకుముందు ఇండియా ఓపెన్, మలేసియా ఓపెన్‌లోనూ ఈ జంట సెమీస్‌లోనే పరాజయం పాలైంది. పారిస్ ఒలింపిక్స్‌లో మలేసియా ప్లేయర్ల చేతిలోనే ఓడి ఇంటి బాటప్టటిన భారత షట్లర్లు ఈ సారి కూడా వారిపై విజయం సాధించలేకపోయారు.

ఫైనల్ చేరేదెవరో!
అహ్మదాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 టోర్నమెంట్ 18వ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఇప్పటికే ఫైనల్ చేరగా... రెండో ఫైనలిస్ట్‌ను తేల్చే సమరానికి సమయం ఆసన్నమైంది. ఆదివారం క్వాలిఫయర్–2లో ముంబై ఇండియన్స్‌తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. క్వాలిఫయర్–1లో బెంగళూరు చేతిలో ఘోర పరాజయం ఎదుర్కొన్న పంజాబ్... ఈ పోరులో సత్తా చాటి ఫైనల్లో మరోసారి బెంగళూరును ఎదుర్కోవాలని భావిస్తోంది. మరో వైపు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచి... ఎలిమినేటర్‌లో గుజరాత్ టైటాన్స్‌ను చిత్తుచేసిన ముంబై ఇదే జోరులో పంజాబ్‌పై గెలిచి ఫైనల్ చేరాలని పట్టుదలగా ఉంది. క్వాలిఫయర్–1లో టాపార్డర్ విఫలమవడంతో పంజాబ్ 101 పరుగులకే పరిమితమై ఘోర ఓటమి మూటగట్టుకోగా... ఎలిమినేటర్‌లో గుజరాత్ బౌలింగ్‌ను ఓ ఆటాడుకుంటూ ముంబై భారీ స్కోరు చేసింది. ఈ సీజన్లో ఇరు జట్ల మధ్య జరిగిన పోరులో పంజాబ్ విజయం సాధించింది. ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ సమష్టి ప్రదర్శన ముందు... ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయిన పంజాబ్ కింగ్స్ ఏమాత్రం నిలుస్తుందో చూడాలి! టాపార్డర్ రాణిస్తేనే... ఈ సీజన్లో ఆడిన 15 మ్యాచ్‌ల్లో ఏడింట రెండొందల పైచిలుకు స్కోర్లు చేసిన పంజాబ్ జట్టు... టాపార్డర్ ప్రదర్శనపై అతిగా ఆధారపడుతోంది. అన్క్యాప్డ్ ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య నిలకడకు ఇన్‌గ్లిస్, శ్రేయస్ మెరుపులు తోడవడంతో పంజాబ్ వరస విజయాలు సాధించగలిగింది. అయితే సొంతగడ్డపై జరిగిన క్వాలిఫయర్–1లో మాత్రం ఈ నలుగురు మూకుమ్మడిగా విఫలమవడంతో... జట్టు మూల్యం చెల్లించుకోక తప్పలేదు. ఐపీఎల్లో మూడు వేర్వేరు జట్లను ‘ప్లే ఆఫ్స్’కు చేర్చిన శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీకి... రికీ పాంటింగ్ వ్యూహాలు తోడవడంతో ఈ సీజన్లో పంజాబ్ పట్టికలో అగ్ర స్థానం దక్కించుకోగలిగింది. దీంతోనే క్వాలిఫయర్–1లో ఓడినా... ఫైనల్ చేరేందుకు మరో అవకాశం దక్కింది. ఈ సీజన్లో ప్రభ్‌సిమ్రన్ 517 పరుగులతో పంజాబ్ తరఫున అత్యధిక పరుగులు సాధించగా... శ్రేయస్ 516, ప్రియాన్ష్ 431 పరుగులు చేశారు. ఈ ముగ్గురితో పాటు ఇన్‌గ్లిస్, నేహల్, శశాంక్, స్టొయినిస్ సత్తాచాటాలని జట్టు యాజమాన్యం ఆశిస్తోంది. గాయం కారణంగా గత మూడు మ్యాచ్‌ల్లో బరిలోకి దిగని స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ ఈ మ్యాచ్ ఆడటం ఖాయమే. బౌలింగ్‌లో అర్ష్ దీప్ సింగ్, అజ్మతుల్లా, జెమీసన్, హర్‌ప్రీత్ బ్రార్ కీలకం కానున్నారు. గత మ్యాచ్ తప్పిదాలను సరిదిద్దుకోకపోతే... 11 ఏళ్ల తర్వాత ‘ప్లే ఆఫ్స్’కు చేరిన పంజాబ్ ఇక్కడితోనే ప్రయాణాన్ని ముగించాల్సి ఉంటుంది. బుమ్రానే ప్రధాన తేడా! ఐపీఎల్ నాకౌట్స్‌లో అపార అనుభవం ఉన్న ముంబై ఇండియన్స్ జట్టు మరోసారి కలిసికట్టుగా కదంతొక్కి ఆరో టైటిల్ వేటకు చేరాలని చూస్తోంది. పలువురు ఆటగాళ్ల సేవలు కోల్పోయినా... వారి స్థానాలను భర్తిచేసే ఆటగాళ్లు ఉండటం ముంబైకి కలిసి రానుంది. లీగ్ దశ ముగిసిన తర్వాత రికెల్టన్, విల్ జాక్స్ జట్టును వీడినా... గత మ్యాచ్‌లో తొలిసారి ముంబై జట్టుకు ప్రాతనిధ్యం వహించిన జానీ బెయిర్‌స్టో తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు.హైదరాబాద్ ఆటగాడు తిలక్ వర్మ కూడా టచ్‌లోకి రావడం ముంబై బ్యాటింగ్ బలాన్ని మరింత పెంచింది. రోహిత్, బెయిర్‌స్టో జట్టుకు శుభారంభం అందిస్తుంటే... సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్‌కు వెన్నెముకలా నిలుస్తున్నాడు. ఈ సీజన్లో 673 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్నాడు. ఆలస్యంగా వేగం పుంజుకున్న రోహిత్ 410 పరుగులు చేయగా... హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్ ఫినిషర్ల పాత్ర పోషిస్తున్నారు. గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు కూడా దీపక్ చహర్ అందుబాటులో ఉండటం కష్టమే కాగా... గత మ్యాచ్ చివర్లో కండరాలు పట్టేసిన గ్లీసన్ బరిలోకి దిగుతాడా లేదా చూడాలి. ఇరు జట్ల మధ్య ప్రధాన తేడా బుమ్రా కానున్నాడు. ఆశలే లేని స్థితిలో సైతం తన అద్భుత బౌలింగ్‌తో మ్యాచ్‌ను మలుపుతిప్పగల సామర్థ్యం ఉన్న బుమ్రాను... పంజాబ్ బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరం. తుది జట్లు (అంచనా) పంజాబ్ కింగ్స్: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), ప్రభ్‌సిమ్రన్, ప్రియాన్ష్ ఆర్య, జోస్ ఇన్‌గ్లిస్, నేహల్, శశాంక్, స్టొయినిస్, అజ్మతుల్లా, హర్‌ప్రీత్ బ్రార్, జెమీసన్, చాహల్, అర్ష్ దీప్. ముంబై ఇండియన్స్: హార్దిక్ (కెప్టెన్), రోహిత్ శర్మ, బెయిర్‌స్టో, సూర్యకుమార్, తిలక్ వర్మ, నమన్, సాంట్నర్, రాజ్ బావా, గ్లీసన్, బుమ్రా, బౌల్ట్, అశ్వని కుమార్. పిచ్, వాతావరణం ఈ సీజన్లో అహ్మదాబాద్‌లో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఆరింట మొదట బ్యాటింగ్ చేసిన జట్లు విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో టాస్ కీలక పాత్ర పోషించవచ్చు. మ్యాచ్‌కు వర్షం ముప్పులేదు. ఐపీఎల్లో నేడు (క్వాలిఫయర్–2)పంజాబ్ X ముంబైవేదిక: అహ్మదాబాద్‌రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో
బిజినెస్

డేటా సెంటర్ల బూమ్..
న్యూఢిల్లీ: దేశీ డేటా సెంటర్ (డీసీ) పరిశ్రమ భారీగా విస్తరిస్తోంది. వచ్చే అయిదారేళ్లలో కొత్తగా 20–25 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులను ఆకర్షించనుంది. దీనితో సెంటర్ల ఏర్పాటు కోసం వినియోగించే రియల్ ఎస్టేట్ కూడా మూడు రెట్లు పెరగనుంది. ప్రస్తుతం 15.9 మిలియన్ చ.అ.లుగా ఉన్న స్పేస్ 2030 నాటికి 55 మిలియన్ చ.అ.లకు చేరనుంది. రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సంస్థ కొలియర్స్ ఇండియా ఒక నివేదికలో ఈ విషయాలు వెల్లడించింది. క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐ, ఐవోటీ వినియోగం పెరుగుతుండటం, వివిధ రంగాల వ్యాప్తంగా డిజిటలీకరణ వేగవంతం అవుతుండటం తదితర అంశాల దన్నుతో డేటా సెంటర్ల మొత్తం సామర్థ్యాలు మూడు రెట్లు పెరిగి 2030 నాటికి 4.5 గిగావాట్లకు చేరనున్నాయి. 2018లో 307మెగావాట్లుగా ఉన్న డీసీల సామర్థ్యం ఈ ఏడాది ఏప్రిల్ నాటికి, అంటే కేవలం ఏడేళ్ల వ్యవధిలో సుమారు నాలుగు రెట్లు పెరిగి 1.26 గిగావాట్లకు చేరింది. పరివర్తన దశలో పరిశ్రమ.. ప్రస్తుతం పరిశ్రమ పరివర్తన దశలో ఉందని నిపుణులు తెలిపారు. మెట్రో నగరాల్లోనే కాకుండా ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు కూడా విస్తరిస్తోందని వివరించారు. డీసీల విషయంలో ముంబై, చెన్నైల ఆధిపత్యం ఉంటోంది. మొత్తం సామర్థ్యాల్లో మూడింట రెండొంతుల వాటా వీటిదే ఉంటోంది. అత్యధికంగా 41 శాతం వాటాతో ముంబై అగ్రస్థానంలో, 23 శాతంతో చెన్నై రెండో స్థానంలో, 14 శాతం వాటాతో ఢిల్లీ ఎన్సీఆర్ మూడో స్థానంలో ఉన్నాయి. ఈ మూడు మార్కెట్లు కలిసి గత 6–7 ఏళ్లలో డేటా సెంటర్ రియల్ ఎస్టేట్ మూడు రెట్లు పెరిగేందుకు దోహదపడ్డాయి. ‘‘తక్కువ లేటెన్సీ, రియల్ టైమ్ అనాలిసిస్, మెరుగైన యాప్‌ల పనితీరు, వివిధ పరిస్థితులకు అనుగుణంగా వ్యాపారాలు తమను తాము మల్చుకోవాల్సి వస్తుండటం తదితర అవసరాలరీత్యా డేటా సెంటర్లు భారీగా విస్తరిస్తున్నాయి’’ అని కొలియర్స్ ఇండియా వెల్లడించింది. 2030 నాటికి డీసీల కెపాసిటీ 4.5 గిగావాట్లకు ఎగియడానికి కూడా ఇదే దోహదపడుతుందని పేర్కొంది. పునరుత్పాదక విద్యుత్, 3 గిగావాట్ల విద్యుత్ మిగులులాంటివి చౌకగా హోస్టింగ్ సేవలు అందించడంలో భారత్‌కు సానుకూలాంశాలని క్యాపిటలాండ్ ఇన్వెస్ట్మెంట్ వర్గాలు తెలిపాయి. అతి కొద్ది దేశాలకు మాత్రమే ఈ ప్రయోజనం ఉంటుందని వివరించాయి. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబైలో తలో డేటా సెంటర్ ఏర్పాటు కోసం క్యాపిటలాండ్ మొత్తం మీద 1.15 బిలియన్ సింగపూర్ డాలర్లను ఇన్వెస్ట్ చేస్తోంది. 2020 నుంచి పెట్టుబడుల ప్రవాహం.. భారత డిజిటల్ మౌలిక సదుపాయాలపై ఇన్వెస్టర్లకు పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనంగా భారీగా పెట్టుబడులు తరలి వస్తున్నాయి. 2020 నుంచి 14.7 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రాగా 2030 నాటికి మరో 20–25 బిలియన్ డాలర్లు రావచ్చనే అంచనాలు నెలకొన్నాయి. తక్కువ లేటెన్సీ, అత్యుత్తమ పనితీరు కోసం ఓటీటీ ప్లాట్‌ఫాంలు, కంటెంట్ డెలివరీ నెట్వర్క్ (సీడీఎన్) సేవల సంస్థల నుంచి డిమాండ్ నెలకొన్నట్లు నె్రక్ట్‌సా బై ఎయిర్టెల్ సీఈవో ఆశీశ్ ఆరోరా తెలిపారు. ఈ సంస్థ 65 పైగా నగరాల్లో 120 ఎడ్జ్ డేటా సెంటర్లు, 14 హైపర్‌స్కేల్ డేటా సెంటర్లను నిర్వహిస్తోంది. తాము ప్రాంతీయంగా చిన్న పట్టణాల్లోకి కూడా విస్తరించడంపై దృష్టి పెడుతున్నామని ఆరోరా వివరించారు. విజయవాడ, అగర్తలా, పాటా్న, గువాహటి, సంబల్పూర్, గంగాగంజ్‌లాంటి కీలక నగరాల్లో తమ ఎడ్జ్ సెంటర్లను విస్తరించినట్లు వివరించారు. వీటితో మెట్రోల వెలుపల తృతీయ శ్రేణి నగరాల్లోని యూజర్లకు కూడా డిజిటల్ మౌలిక సదుపాయాలు మరింతగా అందుబాటులోకి వస్తున్నాయని, లైవ్.. హై–డెఫినిషన్ స్ట్రీమింగ్కి సంబంధించి లేటెన్సీ.. బ్యాండ్‌విడ్త్ వ్యయాలు తగ్గుతున్నాయని పేర్కొన్నారు. డీసీల విభాగంలో కొత్త పరిణామాలు చూస్తే అదానీకనెక్స్ సంస్థ చెన్నైలో 100 మెగావాట్ల క్యాంపస్‌ను, నోయిడాలో 50 మెగావాట్ల సెంటర్‌ను ఏర్పాటు చేస్తోంది. మరిన్ని ద్వితీయ శ్రేణి పట్టణాల్లోనూ ఏర్పాటు చేసే ప్రణాళికల్లో ఉంది. ఇప్పటికే గ్రేటర్ నోయిడాలో ఉన్న యోటా డీ1తో పాటు హైపర్‌స్కేల్ క్యాంపస్‌ల విస్తరణపై యోటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూ. 39,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. క్యాపిటల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ తమ నవీ ముంబై సెంటర్‌పై రూ. 1,940 కోట్ల పెట్టుబడులు ప్రకటించింది. ఎస్టీటీ జీడీసీ ఇండియా, ఎన్టీటీ గ్లోబల్ తదితర సంస్థలు హైదరాబాద్, చెన్నై, పుణె, బెంగళూరు నగరాల్లో కొత్త హైపర్‌స్కేల్ సెంటర్స్‌తో కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి.హైదరాబాద్, ముంబై సారథ్యం.. 2020 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ మధ్యకాలంలో భారత్‌లో కొత్తగా 859 మెగావాట్ల డీసీ సామర్థ్యాలు జతయ్యాయి. ఇందులో ముంబై వాటా 44 శాతంగా, చైన్నై, ఢిల్లీ ఎన్సీఆర్ వాటా సంయుక్తంగా 42 శాతంగా ఉంది. 2023 నుంచి అయిదేళ్ల వ్యవధిలో కొత్తగా 3 – 3.7 గిగావాట్ల కొత్త సామర్థ్యాలు జత కానున్నాయి. చెరి 1–1.2 గిగావాట్ల సామర్థ్యాలతో హైదరాబాద్, ముంబై ఇందుకు సారథ్యం వహించనున్నాయి. హైదరాబాద్ వర్ధమాన హైపర్‌స్కేల్ హబ్‌గా ఎదుగుతోంది. పుణె 300–450 మెగావాట్లు, చెన్నై 400–450 మెగావాట్ల కొత్తగా సామర్థ్యాలను జతపర్చుకోనున్నాయి.

జీవితాన్ని నాశనం చేసే పదం ఇదే: రాబర్ట్ కియోసాకి హెచ్చరిక
ప్రముఖ ఆర్థిక విద్యావేత్త రాబర్ట్ కియోసాకి పేరు చెప్పగానే.. ముందుగా గుర్తొచ్చేది ఆయన రాసిన 'రిచ్ డాడ్ పూర్ డాడ్' పుస్తకమే. ఈ మధ్యకాలంలో బంగారం ధరలు భారీగా పెరిగిపోతాయి, ఆర్ధిక సంక్షోభం రానుంది అని సంచనల ప్రకటనలు చేసిన.. ఈయన మరో గొప్ప మాట సెప్పరూ. జీవితాన్ని నాశనం చేసే పదం, అన్నినీటికంటే ప్రమాదమైంది ఏదనే విషయాన్ని స్పష్టం చేశారు.జీవితాన్ని అన్నింటికంటే ఎక్కువ నాశనం చేసేది 'రేపు' అని వాయిదా వేయడం. వాయిదా వేయడం వల్ల కలిగే నష్టాల గురించి చెబుతూ.. పెట్టుబడి పెట్టడానికి, రుణాలను పరిష్కరించడానికి లేదా ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడానికి వేచి ఉండటం ఒక వ్యక్తి ఆర్థిక భవిష్యత్తును గణనీయంగా దెబ్బతీస్తుందని, ఆలస్యం చిన్న సమస్యలను సైతం అధిగమించలేని అడ్డంకులను తీసుకొస్తుందని పేర్కొన్నారు.రిచ్ డాడ్ పూర్ డాడ్ ద్వారా అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన కియోసాకి.. దశాబ్దాలుగా ఆర్థిక అక్షరాస్యత, సాధికారత & తక్షణ చర్య వంటి వాటి గురించి చెబుతూనే ఉన్నారు. పెట్టుబడులు లేదా ఆర్థిక విద్యను ఆలస్యం చేయడం వల్ల అవకాశాలు కోల్పోయే అవకాశం ఉందని, ఇది కాలక్రమేణా గణనీయమైన నష్టాలకు దారితీస్తుందని అతని బోధనలు నిరంతరం హైలైట్ చేస్తాయి.రేపు అన్న పదం కేవలం అప్పటికి ఉపశమనం కలిగించవచ్చు. కానీ ఇది బరువును పెంచేస్తుంది. వాయిదా లేదా ఆలస్యం అనేది కేవలం ఒక తాత్విక అంశం కాదు. ఇది మారుతున్న ఆర్థిక వాతావరణంలో లోతుగా ప్రతిధ్వనించే ఆచరణాత్మక హెచ్చరిక. 'రేపు' అనే పదం చిన్నదే కావచ్చు, కానీ పెద్ద ప్రమాదాన్ని తీసుకొస్తుంది. ఇది ఒకరి ఆర్థిక భవిష్యత్తును నిశ్శబ్దంగా దెబ్బతీస్తుంది.ఇదీ చదవండి: 'ధనవంతులవ్వడం చాలా సులభం': రాబర్ట్ కియోసాకి 2024 - 2025 అంతటా, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, మార్కెట్ అనూహ్యత ప్రపంచవ్యాప్తంగా చాలా కుటుంబాలపై విపరీతమైన ఒత్తిడిని కలిగించాయి. కియోసాకి సలహాను పాటించిన వ్యక్తులు, రుణాన్ని నిర్వహించడం, అత్యవసర పొదుపులను సృష్టించడం లేదా వ్యూహాత్మకంగా పెట్టుబడి పెట్టడం ద్వారా వారి ఆర్థిక పరిస్థితులను ముందుగానే పరిష్కరించుకున్న వ్యక్తులు, సాధారణంగా చర్యను వాయిదా వేసిన వారి కంటే ఈ తుఫానులను మరింత విజయవంతంగా ఎదుర్కొన్నారు. ఆర్థిక సమస్యలను పరిష్కరించడానికి "రేపు"పై ఆధారపడిన వారు ఇప్పుడు చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు. అప్పుల్లో కూరుకుపోయారు.. ఆర్థిక స్వాతంత్ర్యానికి దూరంగా ఉన్నారని పలువురు చెబుతున్నారు.

సుజుకి ఈ-యాక్సెస్ vs హోండా యాక్టివా ఈ: రేంజ్ & ధరలు
సుజుకి మోటార్‌సైకిల్ కంపెనీ ఇండియన్ మార్కెట్లో తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ 'ఈ-యాక్సెస్'ను త్వరలోనే లాంచ్ చేయనుంది. ఇది దేశీయ విఫణిలో లాంచ్ అయిన తరువాత హోండా యాక్టివా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. ఈ కథనంలో ఈ రెండు స్కూటర్లకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తెలుసుకుందాం.స్పెసిఫికేషన్స్రెండు స్కూటర్లు ఫ్యామిలీ ఓరియెంటెడ్ స్కూటర్లు. కాబట్టి ఇవి చాలా సింపుల్ డిజైన్ పొందుతాయి. యాక్టివా ఈ స్కూటర్ 6 కిలోవాట్ మోటార్ మోటారుతో శక్తినిస్తుంది. ఇందులో 1.5 కిలోవాట్ బ్యాటరీలు రెండు ఉంటాయి. ఇవి ఒక సింగిల్ ఛార్జితో 102 కిమీ రేంజ్ అందిస్తాయి. దీని టాప్ స్పీడ్ 80 కిమీ/గం.సుజుకి ఈ యాక్సెస్ విషయానికి వస్తే.. ఇందులో 3.072 కిలోవాట్ లిథియం ఫాస్పెట్ బ్యాటరీ ఉంటుంది. ఇది 95 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ స్కూటర్ 4.1 కిలోవాట్ బ్యాటరీ ద్వారా 15 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. దీని టాప్ స్పీడ్ 71 కిమీ/గం.ఫీచర్స్సుజుకి ఈ యాక్సెస్ స్కూటర్.. ఎల్ఈడీ లైటింగ్, రెండు చివర్లలో 12 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, 765 మిమీ ఎత్తైన సీటు, 122 కేజీల బరువు ఉంటుంది. ఈ స్కూటర్ ముందు డిస్క్ బ్రేక్, వెనుక డ్రమ్ బ్రేక్ ఉన్నాయి. బ్లూటూత్/యాప్ కనెక్టివిటీతో పాటు 4.2 ఇంచెస్ TFT LCD కన్సోల్, మూడు రైడింగ్ మోడ్లు, USB ఛార్జింగ్ పోర్ట్ మొదలైనవి కూడా ఇందులో ఉన్నాయి.హోండా యాక్టివా ఈ స్కూటర్ విషయానికి వస్తే.. ఇందులో 7 ఇంచెస్ TFT స్క్రీన్‌తో పాటు ఆప్షనల్ హోండా రోడ్ సింక్ యాప్ కనెక్టివిటీ, మూడు రైడింగ్ మోడ్లు, రివర్స్ మోడ్, ఫుల్ ఎల్ఈడీ లైటింగ్ మొదలైనవి ఉన్నాయి.ఛార్జింగ్ డీటైల్స్ఛార్జింగ్ విషయంలో మాత్రం రెండు స్కూటర్లు భిన్నంగా ఉంటాయి. పోర్టబుల్ ఛార్జర్‌ని ఉపయోగించి, సుజుకి ఇ-యాక్సెస్‌ను 4 గంటల 30 నిమిషాల్లో 80 శాతం, 6 గంటల 42 నిమిషాల్లో 100 శాతానికి ఛార్జ్ చేయవచ్చు. DC ఫాస్ట్ ఛార్జర్ ద్వారా 1 గంట 12 నిమిషాల్లో 80 శాతం & 2 గంటల 12 నిమిషాల్లో పూర్తి ఛార్జ్ అవుతుంది. ఇదీ చదవండి: జర్మన్ బ్రాండ్‌తో చేతులు కలిపిన నీరజ్ చోప్రా'హోండా యాక్టివా ఈ'లో బ్యాటరీని సబ్‌స్క్రిప్షన్‌గా అందిస్తుంది. దీనికి ఛార్జ్ చేయదగిన బ్యాటరీలు లేవు కాబట్టి, మార్చుకోగల బ్యాటరీలు మాత్రమే ఉంటాయి. ప్రాథమిక ప్లాన్ నెలవారీ అద్దె రూ. 1,999 + GSTతో వస్తుంది, దీని ద్వారా 35 kWh ఎనర్జీ లభిస్తుంది. ఈ స్కూటర్ రోజుకు 40 కిలోమీటర్లు లేదా అంతకంటే తక్కువ దూరం ప్రయాణించే రైడర్లకు ఉపయోగకరంగా ఉంటుంది.ధరలుహోండా యాక్టివా ఈ స్కూటర్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. అవి స్టాండర్డ్, రోడ్ సింక్. వీటి ధరలు వరుసగా రూ. 1.17 లక్షలు, రూ. 1.52 లక్షలు (ఎక్స్-షోరూమ్). అయితే కంపెనీ.. సుజుకి ఈ-యాక్సెస్ ధరలు ఇంకా వెల్లడించలేదు.అయితే దీని ధర రూ. 1.0 నుంచి రూ. 1.20 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంటుంది.

విద్యార్థులకు రూ.కోటి ఉపకార వేతనాలు: రిలయన్స్
ముంబై: రిలయన్స్ డిజిటల్ ఇండియా ‘బూట్ అప్ ఇండియా’ పేరుతో అతిపెద్ద ల్యాప్‌టాప్ సేల్స్ ప్రకటించింది. వ్యాపారపరంగా మాత్రమే కాకుండా ‘నేటి విద్యార్థులను రేపటి అవకాశాలకు సన్నద్ధం చేయడం’ అనే గొప్ప సంకల్పంతో క్యాంపెన్ నిర్వహించనుంది.సేల్స్‌లో భాగంగా ల్యాప్‌ట్యాప్‌లు, ఎల్రక్టానిక్స్, కంప్యూటర్స్ ఉపకరణాలు తక్కువ ధరకే లభిస్తాయి. దేశవ్యాప్తంగా విద్యార్థులకు ఒక కోటి రూపాయల ఉపకార వేతనాలు ఇవ్వనుంది. అలాగే 25 కార్లు, 40 బైకులు, 450 పైగా ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు గెలుచుకునే అవకాశం కలి్పస్తుంది.
ఫ్యామిలీ

జోగ్ అందాలు అదరహో..కళకళలాడుతున్న జలపాతాలు
బనశంకరి: వర్షాకాలంలో ప్రకృతి అందాలు పర్యాటకులను మంత్రముగ్దులను చేస్తున్నాయి. పర్వతాలు, అడవులు పచ్చదనంతో అలరారుతున్నాయి. భారీ వర్షాలతో జలపాతాలు పాలనురగలా పర్యాటకులను పరవశింపజేస్తున్నాయి. ప్రకృతి అందాలను వర్షాకాలంలో వీక్షించేందుకు రాష్ట్రంలో అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ఆగుంబె.... భారతదేశంలో అత్యధిక వర్షం లేదా తేమతో కూడిన ప్రదేశాల్లో ఒకటి మలెనాడులోని ఆగుంబె. దట్టమైన అడవితో కూడిన పర్వతప్రాంతంలో ఆగుంబె అందాలను వర్షకాలంలో వీక్షిస్తే అ అనుభూతే వేరు. ఈ కారణంతో ఆగుంబెను దక్షిణభారతదేశ చిరపుంజీ అని పిలుస్తారు. సొగసైన జలపాతాలు, సూర్యాస్తమయ నయన మనోహరదృశ్యాలు వీక్షించవచ్చు. జోగ్జలపాతం... వర్షాకాలంలో పర్యాటకులు భారీ ఎత్తున సందర్శించే స్థలాల్లో జోగ్జలపాతం ఒకటి. వర్షాకాలంలో జోగ్జలపాతం నయమనోహర దృశ్యాలు చూపరులను కనువిందుచేస్తాయి. 830 అడుగులు ఎత్తునుంచి నీరు జాలువారుతుండగా ఏర్పడే పొగ మంచులో జోగ్ అందాలను వీక్షించడం మధురానుభూతిని మిగుల్చుతుంది. జోగ్జలపాతం నాలుగు విభిన్నభాగాలుగా జాలువారుతుంది. కర్ణాటక వాసులే కాకుండా దేశంలోని పలు రాష్ట్రాల నుంచి పర్యాటకులు తరలివస్తుంటారు. కొడగు... భారత్ స్కాట్ల్యాండగ్గా పిలిచే కొడగు లేదా కూర్గ్ కర్ణాటక ప్రకృతిరమణీయ ప్రదేశాల్లో ఒకటి. ఇది హనీమూన్, కుటుంబపర్యటన, ట్రెక్కింగ్‌కు సరైన పర్యాటక స్థలం. కూర్గ్ వర్షాకాలం సమయంలో ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటుంది. ఫొటోగ్రఫీపై ఇష్టం ఉండేవారు అందమైన ఫొటోలు తీసుకోవచ్చు. ఇక్కడ ఇరుప్పుజలపాతం, కాపీ తోటలు పర్యాటకులను మంత్రముగ్దులను చేస్తాయి. సకలేశపుర... కర్ణాటకలో అత్యంత సొగసైన పర్వతప్రాంతాల్లో సకలేశపుర ఒకటి. సకలేశపుర హిల్‌స్టేషన్‌గా గుర్తింపుపొందింది. వర్షాకాలం సమయంలో అధికంగా పర్యాటకులు సందర్శిస్తారు. ఇక్కడ పురాతన సకలేశ్వరస్వామి ఆలయం ఉంది. ట్రెక్కింగ్‌కు అనుకూలం, మంజేహళ్లిజలపాతం, బిస్లే ఘాట్పాయింట్, మంజరాబాద్ కోట ఆకట్టుకుంటాయి. చదవండి: నటి భర్త, టైగర్ మ్యాన్ వాల్మీక్ థాపర్ ఇకలేరు.. ఎవరీ థాపర్?ఉత్తరకన్నడ జిల్లా పశ్చిమమకనుమల్లో ఒకటైన దాండేలి ప్రకృతి ప్రేమికులను, సాహసికులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక్కడ సాహసక్రీడలైన ర్యాప్టింగ్, వన్యజీవులు వీక్షణ, వైట్ రివర్రాప్టింగ్ లాంటి జలక్రీడలతో సందడిచే యవచ్చు. దాండేలి వన్యజీవి అభయారణ్యం, కవలేగుహలు, సిందేరిరాక్, సాతోడి జలపాతం తదితర పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. కుదురేముఖ్... చిక్‌మగళూరు జిల్లాలో కుదురేముఖ్ పశ్చిమకనుమల్లో ఒక సుందరమైన పట్టణం. ఇక్కడ ప్రకృతి అందాలతో పాటు పచ్చని లోయలు, ట్రెక్కింగ్ ప్రదేశాలను వీక్షించవచ్చు. కుదురేముఖ్లో కాపీ ఎస్టేట్లు వర్షాకాలంలో అద్భుతంగా ఉంటాయి. కుదురేముఖ్ నేషనల్ పార్కు, మాన్సున్ ట్రెక్కింగ్‌తో పాటు అనేక పర్యాటకప్రాంతాలను వీక్షిస్తూ సందడిచేయవచ్చు. ఇదీ చదవండి: బొక్కలిరుగుతాయ్.. అమెరికా టూరిస్ట్‌కు చేదు అనుభవం, వీడియో వైరల్

వీకెండ్ స్పెషల్ : శాకాహారులు మెచ్చేలా మష్రూమ్ పిజ్జా, కట్లెట్ బజ్జీ
ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పుట్టగొడుగులతో కేవలం కూరలే కాకుండా, రుచికరమైన చిరుతిళ్లు కూడా చేసుకోవచ్చు. నిజానికి మాంసాహారం తినని వారికి ఇవి చక్కటి ప్రత్యామ్నాయం అంటుంటారు చాలామంది. అలాంటి మష్రూమ్‌తో ఈ టేస్టీ స్నాక్స్ మీకోసం.మష్రూమ్ పిజ్జాలు కావలసినవి: పెద్ద పోర్టబెల్లా పుట్టగొడుగులు– 4 (లోపలి భాగం తొలగించి గుంతలా చేసుకోవాలి); టమాటో సాస్ – 3 టేబుల్ స్పూన్లుమొజారెల్లా చీజ్ తురుము – అర కప్పు; ఆలివ్ ఆయిల్ – ఒక టేబుల్ స్పూన్; వెల్లుల్లి రెబ్బలు – 2 రెబ్బలు (సన్నగా తరిగినవి); ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, మొక్కజొన్న గింజలు, చిల్లీ ఫ్లేక్స్, పుదీనా తురుము, టమాటో ముక్కలు– కొద్దికొద్దిగా (అభిరుచిని బట్టి); ఉప్పు – సరిపడా; మిరియాల పొడి – చిటికెడు.తయారీ: ముందుగా ఓవెన్‌ను 200 డిగ్రీల సెల్సియస్‌లో ప్రీహీట్ చేసి పెట్టుకోవాలి. పుట్టగొడుగులకు అన్నివైపులా కొద్దిగా ఆలివ్ ఆయిల్ రాసి, బేకింగ్ ట్రేలో ఉంచి, 5 లేదా 7 నిమిషాలు బేక్ చేసి, బయటికి తీసుకోవాలి. ఇప్పుడు ఆ పుట్టగొడుగుల లోపల పిజ్జా సాస్ రాసి, వాటిలో మొజారెల్లా చీజ్‌తో పాటు ఉల్లి΄ాయ ముక్కలు, టమాటో ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, స్వీట్ కార్న్ (వీటితోపాటు అదనంగా నచ్చినవి జోడించుకోవచ్చు) వంటివి వేసుకోవాలి. మళ్ళీ ఓవన్లో, చీజ్ కరిగే వరకూ బేక్ చేసుకుని, వేడి వేడిగా సర్వ్ చేసుకోవచ్చు...మష్రూమ్ బజ్జీకావలసినవి: మష్రూమ్స్ – ఒక కప్పు (శుభ్రం చేసుకుని పెట్టుకోవాలి); శనగపిండి – ఒక కప్పు; బియ్యప్పిండి – 2 టేబుల్ స్పూన్లు; మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్ చొప్పున; కారం, పసుపు, వాము పొడి, ఉప్పు – కొద్దికొద్దిగా; నీరు, నూనె – సరిపడా; వంట సోడా – కొద్దిగా.తయారీ: ముందుగా శనగపిండి, బియ్యప్పిండి, అల్లం –వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, వాము ΄÷డి, ఉప్పు, వంట సోడా వేసుకుని, తగినంత నీళ్లు ΄ోసుకుంటూ బజ్జీల పిండిలా చిక్కగా కలుపుకోవాలి. అనంతరం ఒక్కో పుట్టగొడుగును శనగపిండి మిశ్రమంలో ముంచి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. వేడివేడిగా తింటే భలే రుచిగా ఉంటాయి ఇవి.మష్రూమ్ కట్లెట్స్ కావలసినవి: పుట్టగొడుగులు – 200 గ్రాములు; బంగాళాదుంపలు – 4 చిన్నవి (ఉడికించి, తొక్క తీసి మెత్తగా గుజ్జులా చేసుకోవాలి); ఉల్లిపాయ – ఒకటి (చిన్నగా తరగాలి); నూనె – సరిపడా; పచ్చిమిర్చి – ఒకటి (సన్నగా తరగాలి); కొత్తిమీర పొడి ఒక టేబుల్ స్పూన్; ఇంగువ, పసుపు – అర టీస్పూన్ చొప్పున; జీలకర్ర పొడి – ఒక టేబుల్ స్పూన్; గరం మసాలా పొడి– అర టేబుల్ స్పూన్; కొత్తిమీర తరుగు – అర కప్పు; శనగ పిండి – 3 టేబుల్ స్పూన్లు; పాలు – 2 టేబుల్ స్పూన్లు; గుడ్డు – ఒకటి; బ్రెడ్ పౌడర్ – కొద్దిగా; ఉప్పు – తగినంత.తయారీ: ముందుగా పుట్టగొడుగులను శుభ్రం చేసి, తడిలేకుండా తుడిచి, చిన్న ముక్కలుగా కట్ చేసుకుని నూనెలో డీప్ ఫ్రై చేసుకుని పక్కనపెట్టుకోవాలి. అనంతరం పాన్‌లో నూనె వేడి చేసుకుని ఉల్లి΄ాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేయించుకోవాలి. తర్వాత ఇంగువ, పుట్టగొడుగు ముక్కలు, పసుపు, కొత్తిమీర తరుగు, గరం మసాలా, జీలకర్ర పొడి వేసి 2–3 నిమిషాలు ఉడికించి, చల్లారనివ్వాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో బంగాళదుంప గుజ్జు, శనగపిండి, ఉప్పు, కొత్తిమీర తరుగు వేసి బాగా కలపాలి. ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేసుకుని నచ్చిన షేప్‌లో కట్లెట్స్లా ఒత్తుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న ΄ాత్రలో గుడ్డు,పాలు వేసి బాగా కలిపి, దానిలో ఈ కట్లెట్స్ ముంచి, బ్రెడ్ పౌడర్ పట్టించి, వాటిని నూనెలో దోరగా వేయించుకుంటే సరి΄ోతుంది. వీటిని టమాటో సాస్‌లో ముంచి తింటే భలే రుచిగా ఉంటాయి

Social Media లైక్.. కామెంట్.. షేర్.. ప్రాణాలు పోతున్నా లెక్క చేయట్లే!
‘కరీంనగర్‌కు చెందిన పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి ఖరీదైన ఫోన్ కావాలంటూ ఇంట్లో మారాం చేశాడు. కళాశాలకు వెళ్లేటప్పుడు కొనిస్తామంటే వినకుండా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. పారిపోయిన కొడుకు హైదరాబాద్‌లో ఉన్నట్టు గుర్తించిన తల్లిదండ్రులు అతడిని తెచ్చి ఫోన్ఇచ్చారు. చాలా కుటుంబాల్లో పిల్లలతో తల్లిదండ్రులు ఇదే సమస్య ఎదుర్కొంటున్నారని మానసిక నిపుణులు, విశ్లేషకులు పేర్కొంటున్నారు. సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించాలనే తాపత్రయంతో విద్యార్థులు వాటిపై దృష్టి సారిస్తున్నారు. దీంతో చదువుపై ఏకాగ్రత తప్పుతోందని చెబుతున్నారు’రీల్స్‌పై తాపత్రయం.. ప్రాణాపాయం‘జిల్లాలోని ఓ పట్టణప్రాంతానికి చెందిన తొమిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి ఇటీవల క్లాస్‌రూమ్‌లో పరీక్ష రాస్తూ నిద్ర పోయాడు. ఉపాధ్యాయుడు గమనించి అతడి ముఖంపై నీళ్లు చల్లినా.. స్పందన కరువైంది. సమీప ఆస్పత్రికి తీసుకెళ్తే డీహైడ్రేషన్ కారణంగా అనారోగ్య సమస్య తలెత్తినట్టు డాక్టర్లు తెలిపారు. రెండురోజులు మిత్రులతో కలిసి రీల్స్ చేసేందుకు ఇతర ప్రాంతానికెళ్లడమే కారణమని తేలింది. చదువుకునే వయసులో ఎందుకీ పనులని టీచర్లు ప్రశ్నించగా.. తనకు నెలకు రూ.10 వేలు వస్తాయని బదులివ్వడంతో ఆశ్చర్యానికి గురయ్యారు.’ప్రస్తుత ప్రపంచమంతా ‘లైక్’, ‘కామెంట్’, ‘షేర్’ రూపంలో మారిపోయింది. ఈ వర్చువల్ ప్రపంచపు చిరునవ్వుల కోసం యువత, విద్యార్థులు అనర్థాల బాట పడుతున్నారు. ఒక్క చిన్న రీల్, కొద్ది సెకన్ల వీడియో, ఒక్క ఫేమ్ కోసం ప్రాణాన్ని కూడా పణంగా పెడుతున్నారు. స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి సోషల్ మీడియా మన జీవితాల్లో భాగమైంది. ముఖ్యంగా కరోనా సమయంలో విద్యార్థుల కో సం అందించిన ఫోన్లు, ఇప్పుడు వారి జీవితాన్ని ని యంత్రించే ఆయుధాలుగా మారాయి. ఇంటర్నెట్, సోషల్ మీడియా, రీల్స్ యువతకు ఆత్మలుగా మారిపోయాయి. ఇటీవల కరీంనగర్ మానేరు వాగులో ఓ యువకుడు రీల్స్ కోసం వెళ్లి మునిగిపోయాడు. మరో యువకుడు రైలుపై రీల్ తీయడానికి వెళ్లి మృత్యువాతపడ్డాడు. ఇలా రోజురోజుకు రీల్స్ పిచ్చి అనార్థాలకు దారీతీస్తోంది.యువత మారాలి..రీల్స్‌ను కట్టడి చేయాలంటే యువత ముందుగా పద్ధతి మార్చుకోవాలని, ప్రాణాంతక రీల్స్‌తో జీవితాలే కోల్పోతామని గుర్తుంచుకోవాలని సైక్రియాటిస్టులు పేర్కొంటున్నారు. అలాగే రీల్స్ వెనక దాగి ఉన్న ప్రమాదాలు ఊహించకుండా వీడియోలు చూస్తున్నవారు అనేక రకాల యాడ్స్ రూపంలో మోసాలకు గురువుతున్నారు. ఆన్లైన్ రమ్మీ, ట్రేడింగ్, ఫేక్ ఇన్వెస్ట్మెంట్ యాడ్స్ ద్వారా ప్రజలు కోట్లాది రూపాయలు పోగొట్టుకుంటున్నారు. ఇదీ చదవండి: బొక్కలిరుగుతాయ్.. అమెరికా టూరిస్ట్‌కు చేదు అనుభవం, వీడియో వైరల్వయోభేదం లేకుండా..సామాజిక మాధ్యమాలు బాల్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వయోభేదం లేకుండా పావులారిటీ కోసం ఫొటోలు, వీడియోలు, ప్రదర్శనలకు వాటిని వేదికగా మలచుకుంటున్నారు. వారించాల్సిన కొంతమంది తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారు. సృజనాత్మకతను వెలికితీసేందుకు ఉపకరిస్తున్నా, చదువుపై నిర్లక్ష్యం పెరుగుతోందని కన్నవారు గుర్తించలేకపోతున్నారు.రీల్స్‌తో అనర్థాలురీల్స్ కోసం చేసే బైక్ విన్యాసాలతో చాలా మంది యువతకు అనర్థాలు జరిగాయి. కరీంనగర్ మానేరు, బైపాస్, మల్కాపూర్, బొమ్మకల్, చింతకుంట తదితర ప్రాంతాల్లో యువత బైకులు తిప్పుతూ, రోడ్లపై హుషారుగా రీల్స్ తీసే ప్రయత్నాల్లో బలవుతున్నారు. డివైడర్లకు తగిలి, ఎదురుగా వస్తున్న వాహనాలకు ఢీకొని ఆసుపత్రుల పాలవుతున్నారు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. రీల్స్ వెనక నిజజీవితంలో జరుగుతున్న విషాదాలు ఎవరిదృష్టిలో పడడం లేదు. కరీంనగర్ జిల్లాలో రీల్స్ తీసే యత్నంలో యువత ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉండగా తాజాగా అర్బాజ్ అనే యువకుడు మానేరువాగులో రీల్ తీసేక్రమంలో నీటమునిగి మృతిచెందాడు. అతడితో ఉన్న ఇద్దరు స్నేహితులు కూడా కాపాడలేకపోయారు. ఇదే జిల్లాకు చెందిన మరో యువకుడు రైలుపై రీల్ తీయబోతూ కరెంట్‌షాక్‌కు గురై మృత్యువాతపడ్డాడు.చదవండి: నటి భర్త, టైగర్ మ్యాన్ వాల్మీక్ థాపర్ ఇకలేరు.. ఎవరీ థాపర్? ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దురీల్స్కు యువత ఆకర్షితులవడంతో అది వ్యసనంగా మారడం జరుగుతుంది. వ్యక్తిత్వ వికాస లోపంతోనే సామాజిక మాధ్యమాలకు బానిసలుగా మారుతున్నారు. కాగ్నటివ్ బిహేవియర్ థెరపీ, కౌన్సెలింగ్ ద్వారా వీటి నుంచి బయటపడే అవకాశాలున్నాయి. యువత భవిష్యత్తు మీద దృష్టి పెట్టి సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలి.– డాక్టర్ అట్ల శ్రీనివాస్‌రెడ్డి, సైక్రియాటిస్టు

Covid-19 ‘హ్రస్వ దృష్టి’ సంక్షోభంలో ప్రపంచం
2020లో లక్షలాది మంది ప్రాణాలను బలిగొన్న కోవిడ్-19 వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వ అధికారులు లాక్డౌన్ ప్రకటించారు. కార్యాలయాలను, పాఠశాలలను మూసివేశారు. వినియోగదారు అనుకూల ఇంట ర్ఫేస్ జూమ్, ఇదే విధమైన వీడియో–కాన్ఫరెన్సింగ్ ప్లాట్‌ఫా మ్ల కారణంగా, ఇంటి నుండి పని చేసే కొత్త సంస్కృతి పుట్టింది. లాక్డౌన్ అనిశ్చితి, విద్యా కార్యకలాపాలను కోల్పోతామనే భయంతో చిన్నపిల్లలు, పసిపిల్లలు రోజుకు చాలా గంటలు తమ ఇళ్లలోనే ఉండి ఆన్లైన్ తరగతులకు హాజరయ్యారు. ఫలితంగా పిల్లలు హ్రస్వ దృష్టి (మయోపియా, Myopia) బారినపడ్డారు.మొదట్లో చైనా, ఆ తరువాత ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలోని నేత్ర వైద్య నిపుణులు 2020 నాటికి, చిన్న పిల్లల్లో ఆందోళన కలిగించే స్థాయి వేగంతో హ్రస్వ దృష్టి వ్యాపిస్తోందని కనుగొన్నారు. దీంతో ప్రమాద హెచ్చరికలు మోగాయి. చైనాలో ఆరేళ్ల వయస్సు పిల్ల లలో మయోపియా వ్యాప్తిలో 400 శాతం పెరుగుదలను గుర్తించారు. ముఖం నుండి 30 సెం.మీ. కంటే తక్కువ దూరంలో పుస్తకాలను ఉంచుకోవడం, 30 నిమిషాల కంటే ఎక్కువసేపు నిరంతరం చదవడం అనేవి చిన్న పిల్లలలో హ్రస్వ దృష్టి పెరగడానికి ప్రధాన ప్రమాద కారకాలు. చదవడం, రాయడం ప్రభావితం కానప్ప టికీ, ఉపాధ్యాయుడు బ్లాక్‌బోర్డ్‌పై రాసిన అక్షరాలను, సుదూర వస్తువులను చూడలేకపోవడమే హ్రస్వదృష్టిగా సాధారణంగా వ్యవహరిస్తుంటారు. 1960లలో పట్టణ, గ్రామీణ జనాభా రెండింటినీ విస్తృతంగా సర్వే చేసిన చీఫ్ డాక్టర్ ఐఎస్ జైన్ ముఖ్య మైన విషయాన్ని వెల్లడించారు. గ్రామీణ జనాభాలో (2.77 శాతం), పాఠశాల పిల్లల్లో (4.79 శాతం), చండీ గఢ్ పట్టణ జనాభాలో (6.9 శాతం), పీజీఐ వైద్యులలో (33 శాతం) మందిలో హ్రస్వ దృష్టి వ్యాప్తి క్రమంగా పెరగడానికి కంటికి దగ్గరలో పని చేయడం, అధిక అక్ష రాస్యత రేట్లు, ఆదాయ స్థాయులు కారణమని ఆయన అన్నారు. ఇటీవల, ఉత్తర భారతదేశంలో పాఠశాలకు వెళ్లే పట్టణ పిల్లలలో 21 శాతం మందికి హ్రస్వ దృష్టి ఉన్నట్లు గుర్తించారు. ఇది 50 ఏళ్లలో 4 రెట్లు ఎక్కువ.పెరుగుతున్న హ్రస్వ దృష్టిపై కోవిడ్-19 క్వారంటైన్ ప్రభావం తూర్పు, ఆగ్నేయాసియాలో ముందుగా ఎక్కువగా కనిపించినప్పటికీ, తక్కిన ప్రపంచంలో ఎవరూ దానినుంచి తప్పించుకోలేదు. ఒక అధ్యయనం ప్రకారం, డిజిటల్ పరికరాల్లో రోజుకు సగటున ఒక గంట గడిపిన పిల్లలలో 46 శాతం మంది హ్రస్వదృష్టితో ఉన్నారు. నాలుగు గంటలు గడిపిన వారిలో 76 శాతం మంది ఉన్నారు. తక్కువ బహిరంగ కార్యకలాపాలు, మసక గది వెలుతురు, అధిక పని దీనికి కారణం.గత 10 సంవత్సరాలలో, డిజిటల్ పరికరాల వాడకం నాలుగు రెట్లు పెరిగింది. ఇటీవల ప్రతిష్ఠాత్మక మైన ‘జామా’ జర్నల్‌లో ‘3 లక్షల కంటే ఎక్కువ మంది పాఠశాల పిల్లలు పాల్గొన్న శాస్త్రీయ అధ్యయనాల ఆధా రంగా, రోజుకు కనీసం నాలుగు గంటల వరకు డిజిటల్ స్క్రీ¯Œ లపై గడిపే వారిలో, ప్రతి గంటకూ హ్రస్వ దృష్టి అభివృద్ధి చెందే అవకాశాలు 21 శాతం పెరిగాయని’ ఓ విశ్లేషణ ప్రచురితమయ్యింది. హ్రస్వదృష్టి బారిన పడిన అన్ని రకాల రోగుల్లో దాదాపు 8 శాతం మంది జీవితంలో తరువాత అంధత్వాన్ని ఎదుర్కొంటున్నారు. 2050 నాటికి ప్రపంచ జనాభాలో సగం మంది మయో పిక్ రోగులే అవుతారని డాక్టర్ హోల్డెన్, ఆయన సహ చరులు చేసిన అంచనాలు నిజమైతే ఈ వ్యవహారం ఒక పెద్ద ప్రజారోగ్య సమస్యగా మారవచ్చు. కంటి కండరాలను సడలించే అట్రోపిన్ కంటి చుక్కలను ఉపయోగిస్తే అవి చిన్న పిల్లలలో కనుగుడ్డు వ్యాప్తి చెందటాన్ని నిరోధిస్తాయని, అంతే కాకుండా హ్రస్వదృష్టి పెరగడాన్ని కూడా అవి తగ్గిస్తాయని సింగపూర్‌కు చెందిన డాక్టర్ చువా, ఆయన సహచరులు ఇరవై సంవత్సరాల క్రితమే నిరూపించారు. డాక్టర్ రోహిత్ సక్సేనా నేతృత్వంలో జరిగిన దేశవ్యాప్త అధ్య యనం ప్రకారం, రెండేళ్ల కాలంలోనే భారతీయ పిల్ల లలో కరిగిపోయే అట్రోపిన్ చుక్కలు (0.01 శాతం) ఉపయోగించినప్పుడు అవి హ్రస్వదృష్టి పెరుగుదలను తగ్గించాయని తేలింది. సూర్యరశ్మికి గురికావడం వల్ల రెటీనాలో డోపమైన్ స్థాయులు పెరుగుతాయి. ఇది హ్రస్వ దృష్టి బారిన పడ కుండా కాపాడుతుంది. కోవిడ్–19 సమయంలో ప్రతి రోజూ రెండు గంటలు బయట గడపడం అనేది పిల్ల లలో హ్రస్వ దృష్టి వ్యాప్తిని అరికడుతుందని టర్కీకిచెందిన డాక్టర్లు ధ్రువీకరించారు. బహిరంగ కార్యకలా పాలు రోజుకు 2 గంటలు మించి ఉంటే అట్రోపిన్ (బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నిరోధకం) మరింత ప్రభావవంతంగా ఉంటుందని చండీగఢ్‌లోని డాక్టర్లు కనుగొన్నారు. అనుభవపూర్వకమైన, సమగ్ర అభ్యాసంపై దృష్టి సారించిన ‘జాతీయ విద్యా విధానం–2020’, పట్టణ భారతదేశంలో స్థల పరిమితుల సాకును చూపి, 2008 విద్యా హక్కు చట్టంలో తప్పనిసరి చేసిన ముఖ్యమైన ఆట స్థలం అవసరాన్ని తొలగించింది. అయితే ఉపా ధ్యాయులు పిల్లలను రోజుకు రెండుసార్లు కనీసం ఒక గంట బయట నడవడానికి అనుమతించాలి.-అమోద్ గుప్తాఎమెరిటస్ ప్రొఫెసర్,పీజీఐఎమ్ఈఆర్, చండీగఢ్
ఫొటోలు


మిస్ వరల్డ్-2025 ఫైనల్స్ సందడి.. ర్యాంప్ వాక్‌తో మెరిసిన అందగత్తెలు (ఫొటోలు)


ట్రెడిషనల్ లుక్‌లో ముద్దుగుమ్మలా వర్ష (ఫొటోలు)


నాగచైతన్య కౌగిలిలో శోభిత.. పుట్టినరోజు స్పెషల్ (ఫొటోలు)


ఉత్తమ నటిగా గద్దర్ అవార్డ్.. ఫ్యామిలీతో నివేదా సెలబ్రేషన్స్ (ఫొటోలు)


విశాఖ, విజయవాడలో దంచికొట్టిన వర్షం (ఫొటోలు)


‘భైరవం’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)


GT Vs MI: కీలక మ్యాచ్‌లో రఫ్ఫాడించిన ముంబై.. గుజరాత్‌కు ఝలక్ (ఫొటోలు)


'ప్రేమమ్' జ్ఞాపకాలు.. సాయిపల్లవి అప్పట్లో ఇలా (ఫొటోలు)


బిగ్‌బాస్ ప్రియాంక బ్లాక్ బస్టర్ పోజులు (ఫొటోలు)


చాహల్‌తో విడాకులు.. లండన్‌లో చిల్ అవుతోన్న ధనశ్రీ వర్మ (ఫొటోలు)
అంతర్జాతీయం

శశిథరూర్ దౌత్య విజయం.. వైఖరి మార్చుకున్న కొలంబియా
న్యూఢిల్లీ: భారత్ మే 7న ‘ఆపరేషన్ సిందూర్’ను చేపట్టిన సమయంలో పాకిస్తాన్లో చోటుచేసుకున్న మరణాలపై దక్షిణ అమెరికాలోని కొలంబియా సంతాపం ప్రకటించింది. అయితే దీనిపై ఎంపీ శశిథరూర్(MP Shashi Tharoor) కొలంబియాకు అవగాహన కల్పించడంతో, తాను గతంలో చేసిన ప్రకటనను ఆ దేశం ఉపసంహరించుకుంది. అలాగే ఉగ్రవాదంపై పోరు సాగిస్తున్న భారత్‌కు మద్దతిస్తున్నట్లు స్పష్టం చేసింది.కొలంబియా పర్యటనలో ఉన్న అఖిలపక్ష ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మీడియాతో మాట్లాడుతూ కొలంబియా(Colombia) ఇటీవల పాక్ మరణాలపై చేసిన ప్రకటనను ఉపసంహరించుకున్నదని, త్వరలోనే భారత్ వైఖరికి మద్దతు పలుకుతూ, మరో ప్రకటన చేయనున్నదని తెలిపారు. ఈ సందర్భంగా యునైటెడ్ స్టేట్స్‌లోని మాజీ భారత రాయబారి, బీజేపీ నేత తరంజిత్ సింగ్ సంధు మాట్లాడుతూ తమ ప్రతినిధి బృందం భారత్-పాక్ యుద్ధంపై సరైన వివరణ ఇవ్వడంతో, అది కొలంబియా వైఖరిలో మార్పు వచ్చేందుకు సహాయపడిందని అన్నారు.దీనిపై కొలంబియా ఉప విదేశాంగ మంత్రి రోసా యోలాండా విల్లావిసెన్సియో మాట్లాడుతూ తమకు భారత్- పాక్‌ల మధ్యనున్న వాస్తవ పరిస్థితులు తెలిశాయని, కశ్మీర్లో ఏమి జరిగిందనే దానిపై అవగాహన ఏర్పడిందన్నారు. ఇకపై తాము స్పష్టమైన ప్రకటన చేయగలమన్నారు. కాగా ‘ఆపరేషన్ సింధూర్’ సమయంలో పాక్‌లో చోటుచేసుకున్న మరణాలపై కొలంబియా సంతాపం ప్రకటించడాన్ని ఎంపీ శశిథరూర్ ఖండించారు. ఇది కూడా చదవండి: అణు విపత్తును ఆపేశా: ట్రంప్ నోట అదే పాట

వీడ్కోలు వేళ ఎలాన్ మస్క్ ముఖంపై గాయం.. ఏం జరిగింది?
వాషింగ్టన్: బిలియనీర్ ఎలాన్ మస్క్ వీడ్కోల వేళ ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది. మస్క్ నుదుటి, కంటి వద్ద ఉన్న గాయంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా మస్క్ ఇచ్చిన సమాధానానికి అందరూ ఒక్కసారిగా నవ్వుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు.అమెరికా అధ్యక్ష సలహాదారుగా వైదొలుగుతున్నట్లు ప్రకటించిన ఎలాన్ మస్క్‌కు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీడ్కోలు పలికారు. ‘డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ’ (DOGE) సారథిగా ఎలాన్ మస్క్ సేవలు అందించారు. మే 30న తన పదవికి చివరి రోజు కావడంతో అధ్యక్షుడు ట్రంప్ కార్యాలయానికి ఎలాన్ మస్క్ వెళ్లారు. ఈ సందర్భంగా ఘనంగా వీడ్కోలు పలికారు. అయితే, ఈ కార్యక్రమంలో మస్క్ ముఖంపై ఉన్న గాయం చర్చకు వచ్చింది. దీనిపై అక్కడున్న వారు మస్క్‌ను ప్రశ్నించారు.But what happened to Elon Musk’s eyes? Black eye? Or am I seeing something else….pic.twitter.com/Dc5SgG1IjH— Chewy Veetton (@bebem00m00) May 31, 2025ఎలాన్ మస్క్ స్పందిస్తూ.. ఈ గాయం నా కుమారుడు చేసింది. నేను, నా ఐదేళ్ల కుమారుడు X Æ A-Xii బీచ్‌లో గుర్రపు స్వారీ చేస్తున్నాం. ఈ క్రమంలో అతడు నా ముఖంపై ఒక పంచ్ ఇచ్చాడు. దీంతో, అక్కడ గాయం ఏర్పడింది. ఆ సమయంలో దీన్ని నేను పెద్దగా పట్టించుకోకపోవడంతో ఇలా మారిపోయింది’ అని చెప్పుకొచ్చారు. ఐదేళ్ల కుమారుడు కొడితే ఇంతలా గాయమైందా? అని అక్కడున్న వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ట్రంప్ సైతం స్పందిస్తూ.. ఇన్ని రోజులు తాను కూడా గాయాన్ని చూడలేదని చెప్పుకొచ్చారు. కానీ, మస్క్ కుమారుడు అలా చేయగలడు అని అన్నారు. ఇక, ట్రంప్, టెక్ మాగ్నెట్ కుమారుడే X Æ A-Xii.Elon Musk was seen with a noticeable black eye, showing visible bruising and discoloration around the area while at the White House with President Trump.President Trump presented him with the White House Key, calling it a gift from the nation.Musk will continue to serve as an… pic.twitter.com/CjcR1g9aK6— Shadow of Ezra (@ShadowofEzra) May 30, 2025అయితే, ఎలాన్ మస్క్ కొన్ని రకాల డ్రగ్స్ వినియోగిస్తున్నారంటూ ఓ అంతర్జాతీయ మీడియాలో కథనం వెల్లడించింది. ఈ నేపథ్యంలో వైట్‌హౌస్‌లో ఉన్నప్పుడు కూడా వాటిని వినియోగించారా? అని మస్క్‌ను విలేకరి ప్రశ్నించారు. ఈ సందర్బంగా మాస్క్ స్పందిస్తూ.. అది తప్పుడు కథనం అంటూ సమాధానం ఇచ్చారు. అయినప్పటికీ, మస్క్ ముఖంపై గాయం పలు అనుమానాలకు తావిస్తోంది. ఏం జరిగిందనే చర్చ నడుస్తోంది.Elon Musk's 5-year-old son, X, punched him so hard he got a black eye😂Reporter: "Mr. Musk, is your eye okay?"Elon: "Well, I wasn't anywhere near France... I was just walking around with Lil X, and I said, 'Go ahead,' punch me in the face, and he did. Turns out even a… pic.twitter.com/m7u2PSTluy— George (@BehizyTweets) May 30, 2025ఇదిలా ఉండగా.. వీడ్కోలు సందర్బంగా ట్రంప్.. మస్క్‌కు బంగారు రంగుతో కూడిన తాళం చెవిని అందించారు. ప్రత్యేకమైన వ్యక్తులకే ఈ బహుమతి అందిస్తానని ట్రంప్ తెలిపారు. ఇది దేశం తరఫున అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్లో మస్క్ సేవలను ట్రంప్ అభినందించారు. తనకు అప్పగించిన బాధ్యతలను మస్క్ అవిశ్రాంతంగా నిర్వహించారన్నారు. ప్రపంచంలోనే మస్క్ ఒక గొప్ప వ్యాపారవేత్త, ఆవిష్కర్త అని కొనియాడారు. తన ప్రతిభను దేశ అభివృద్ధికి వినియోగించేందుకు ముందుకు వచ్చినట్లు పేర్కొన్నారు.స్నేహితుడిగా, సలహాదారుగా ఉంటా..డోజ్‌కు వీడ్కోలు సందర్భంగా ఎలాన్ మస్క్ మాట్లాడారు. ఇక నుంచి తరచుగా అధ్యక్ష కార్యాలయాన్ని సందర్శిస్తానని మస్క్ తెలిపారు. అధ్యక్షుడు ట్రంప్ కోరితే అవసరమైన సమయంలో తన సహాయం అందిస్తానన్నారు. ఇక మీదట సైతం ట్రంప్‌నకు స్నేహితుడిగా, సలహాదారుగా ఉంటానని పేర్కొన్నారు. ‘డోజ్’ పదవి కాలం పరిమితితో కూడుకున్నదని మస్క్ తెలిపారు. ఇప్పటినుంచి తన వ్యాపారాలపై మరింత దృష్టి సారిస్తానన్నారు. ‘డోజ్’కు ఇది ముగింపు కాదని, ప్రాజెక్ట్ ఇప్పుడే ప్రారంభమైందన్నారు. ట్రిలియన్ డాలర్ల వృథాను ఇది అరికడుతుందన్నారు.

అణు విపత్తును ఆపేశా: ట్రంప్ నోట అదే పాట
వాషింగ్టన్: భారత్- పాక్ పోరుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్(US President Trump) మరోమారు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారతదేశం-పాకిస్తాన్‌లు పరస్పరం యుద్ధం కొనసాగించకుండా నియంత్రించానని, అణు విపత్తుకు దారి తీయగలిగే పోరును ఆపానని ట్రంప్ పేర్కొన్నారు. తాము పరస్పరం కాల్పులు జరుపుకునే దేశాలతో వాణిజ్యం కొనసాగించలేమని గతంలో ఇరు దేశాలకు స్పష్టం చేశానని ట్రంప్ తెలిపారు.భారత్- పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధం అణు విపత్తుగా మారే అవకాశం ఉందని భావించానని అధ్యక్షుడు ట్రంప్ ఓవల్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ఇరు దేశాలు యుద్ధాన్ని ముగించినందుకు ఆ దేశాధినేతలు, ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. ఇరు దేశాలతో తాము సాగిస్తున్న వాణిజ్య వ్యవహారాలపై మాట్లాడుకున్నామని, పరస్పరం కాల్పులు జరుపుకుంటూ, అణ్వాయుధాలు(Nuclear weapons) ఉపయోగించే సత్తా కలిగిన వారితో వ్యాపారం చేయలేమని తేల్చి చెప్పామని ట్రంప్ పేర్కొన్నారు.భారత్, పాక్‌లకు చెందిన నేతలు తమను అర్థం చేసుకున్నారని, తమ వినతిని అంగీకరించి, యుద్ధాన్ని ముగించారని ట్రంప్ అన్నారు. కాగా జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది పౌరులు మృతి చెందారు. ఆ తరువాత భారత్ ‘ఆపరేషన్ సింధూర్’ చేపట్టింది. నాలుగు రోజుల పాటు సాగిన డ్రోన్, క్షిపణి దాడుల తర్వాత మే 10న భారత్- పాకిస్తాన్ మధ్య యుద్ధం ముగింపుపై ఒక ఒప్పందం కుదిరింది. ఈ విషయంలో మూడవ పక్షం ప్రమేయం లేదని భారత ప్రభుత్వం వర్గాలు స్పష్టం చేశాయి. కాగా భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలను పరిష్కరించడానికి తాను సహాయం చేయగలనని ట్రంప్ ప్రకటించారు.ఇది కూడా చదవండి: పాక్‌లో ఉద్రిక్తత.. ‘సురబ్’పై బీఎల్ఏ జెండా?

పాక్‌లో ఉద్రిక్తత.. ‘సురబ్’పై బీఎల్ఏ జెండా?
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. బలూచ్ లిబరేషన్ ఆర్మీ(Baloch Liberation Army)(బీఎల్ఏ) తాజాగా తాము సురబ్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది. అక్కడి బ్యాంక్, లెవీ స్టేషన్, పోలీస్ స్టేషన్ తదితర ప్రధాన ప్రభుత్వ స్థావరాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. క్వెట్టా-కరాచీ, సురబ్-గిడ్డర్ రహదారులపై రాపిడ్ చెకింగ్,పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొంది.గత కొన్నాళ్లుగా బీఎల్ఏ తిరుగుబాటుదారులు పాకిస్తాన్లో అలజడి సృష్టిస్తున్నారు. ఈ నేపధ్యంలో బలూచిస్తాన్(Balochistan)పై పాకిస్తాన్ పూర్తిగా నియంత్రణను కోల్పోయింది. పాక్‌తో జరిగిన తీవ్ర ఘర్షణల తర్వాత పాకిస్తాన్ సైన్యాన్ని, పోలీసు దళాలను విజయవంతంగా వెనక్కి నెట్టగలిగామని బలూచ్ సాయుధ బృందం కమాండర్లు తెలిపారు.దీనిపై పాకిస్తాన్ అధికార వర్గాలు స్పందిస్తూ, కొందరు సాయుధ వ్యక్తులు సురబ్ నగరంలోకి ప్రవేశించారని తెలిపారు. వారు ముగ్గురు ప్రభుత్వ అధికారుల ఇళ్లపై కాల్పులు జరిపారని, ఆ అధికారులను కిడ్నాప్ చేసి ఉండవచ్చని పేర్కొన్నారు. అలాగే ఒక బ్యాంకును స్వాధీనం చేసుకున్నారని, కొన్ని దుకాణాలను తగలబెట్టారని తెలిపారు. అయితే వారు సురబ్ నగరంపై నియంత్రణ సాధించలేదన్నారు. కాగా శుక్రవారం బలూచిస్తాన్‌లోని సురబ్ నగరంలో ఉగ్రవాదులు ఒక అధికారి ఇంటిపై దాడి చేయడంతో ఆయన మృతి చెందినట్లు ప్రావిన్షియల్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.ఇది కూడా చదవండి: పూంచ్ బాధితులకు హోం మంత్రి పరామర్శ
జాతీయం

మావోయిస్టు కేంద్ర కమిటీ కీలక ప్రకటన
చత్తీస్ఘడ్: జూన్ 10వ తేదీన భారత్ బంద్‌కు పిలుపునిస్తున్నట్లు మావోయిస్టు కేంద్ర కమిటీ స్పష్టం చేసింది. 27 మంది మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌కు నిరసనగా బంద్‌కు పిలుపునిచ్చింది. అదే సమయంలో జూలై 11 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకూ అమరుల స్మారక సభలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు మావోయిస్టు కేంద్ర కమిటీ అభయ్ పేరుతో లేఖ విడుదల చేసింది.వచ్చే ఏడాది మార్చి నాటికి మావోయిస్టుల లేకుండా చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అనేక ఆపరేషన్లు నిర్వహిస్తోంది. ఇందులో ఆపరేషన్ కగార్ ఒకటి. ఇది గతేడాది నుంచి ఊపందుకోగా, ఈ ఆపరేషన్ అనేక మంది మావోయిస్టుల కీలక నేతలు హతమయ్యారు. దేశ వ్యాప్తంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కేంద్రం తన చర్యలను ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం తమతో చర్చలు జ.రపాలని కూడా మావోయిస్టు కేంద్ర కమిటీ ఇదివరకే విన్నవించింది. అయితే మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా పని చేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై నిరసన భారత్ బంద్ కు పిలుపునిచ్చింది మావోయిస్టు కేంద్ర కమిటీ.

దేశంలో కోవిడ్ కలకలం.. 3,395కు చేరిన యాక్టివ్ కేసులు
ఢిల్లీ: దేశంలో మళ్లీ కోవిడ్ కలకలం సృష్టిస్తోంది. క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతోంది. 3,395కు యాక్టివ్ కేసులు చేరాయి. గత 24 గంటల్లో కోవిడ్‌తో నలుగురు మృతి చెందారు. యూపీ, ఢిల్లీ, కర్ణాటక కేరళలో ఒక్కొక్కరు మృతి చెందారు. కోవిడ్ నుంచి కోలుకుని 1435 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.8 రాష్ట్రాలలో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఢిల్లీలో 375, గుజరాత్లో 265, కర్ణాటకలో 254, కేరళలో 1336, మహారాష్ట్రలో 467, తమిళనాడులో 185, వెస్ట్ బెంగాల్లో 205, ఉత్తరప్రదేశ్‌లో 117 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. రద్దీ ప్రదేశాల్లో తిరిగేటప్పుడు మాస్కులు ధరించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో కరోనా కలకలం రేపింది. పాల్వంచ కేటీపీఎస్ కర్మాగారంలో విధులు నిర్వహించే వెంకట్ అనే వ్యక్తి కరోనా వచ్చినట్లు కేటీపీఎస్ హాస్పిటల్ వైద్యులు నిర్థారించారు. కాగా, ఏపీలో కోవిడ్ కేసులు పెరుగుతున్నా కానీ.. ప్రజలను అప్రమత్తం చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనే విమర్శలు వస్తున్నాయి. ఏలూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కలెక్టరేట్లోని ముగ్గురు ఉద్యోగులకు వైరస్ సోకింది. జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్న ముగ్గురికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా పాజిటిట్‌గా నిర్ధారణ అయినట్లు సమాచారం. అయితే.. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు.. వైద్యుల సూచన మేరకు ఆ ముగ్గురు ఉద్యోగుల్ని ఐసోలేషన్‌కి పంపించారు.వాట్సాప్ గ్రూపుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఆందోళనకు గురయ్యారు. తమను అప్రమత్తం చేయకుండా అధికారులు ఇలా వ్యవహరించడం ఏంటని మండిపడుతున్నారు. ఏపీలో విశాఖపట్నం, కోనసీమ, పశ్చిమగోదావరి, గుంటూరు.. ఇలా కేసులు వెలుగు చూశాయి. కడపలో కరోనా కేసు వెలుగు చూస్తే.. దానిని అధికారులు దాచిపెట్టే ప్రయత్నం చేయడం తెలిసిందే.

అద్భుతమైన ‘ఆపరేషన్’ నిర్వహించారు: ఉత్తమ్‌కుమార్ రెడ్డి
ఢిల్లీ: పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో రాఫెల్ యుద్ధ విమానాలు ఏమైనా కూలిపోయాయా? అని తాము అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ మంత్రి సరైన సమాధానం చెప్పలేదని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఆపరేషన్ సిందూర్ రాపెల్ యుద్ధ విమానం కూలిపోయిందని సిడిఎస్ అనిల్ చౌహన్ మాత్రం స్పష్టం చేశారని, దీనిపై కేంద్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు ఉత్తమ్‌కుమార్ రెడ్డి. ఇకనైనా భారత్ ప్రభుత్వం దీన్ని నిరాకరించడం మానుకోవాలననారు. ‘ఇదే విషయాన్ని రాహుల్ గాంధీ మొదటి నుంచి అడుగుతున్నారని ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ఇక కాల్పుల విరమణ అంశానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎలా ట్వీట్ చేస్తారని ప్రశ్నించారు. ఆపరేషన్ సిందూర్‌తో భారత ఎయిర్‌ఫోర్స్ విజయం పట్ల మేము గర్విస్తున్నామని, ఇదొక అద్భుతమైన ఆపరేషన్ అని ఉత్తమ్ కొనియాడారు. ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడం భారత్ ఎయిర్‌ఫోర్స్ సాధించిన విజయమన్నారు.ఫైటర్ విమానాలు, ఆయుధాల సప్లయ్ ఆలస్యం అవుతున్నాయని ఎయిర్ చీఫ్ మార్షల్ చెప్పడం ఆందోళన కల్గిస్తోందన్నారు. చైనా, పాకిస్తాన్లతో ముప్పు నేపథ్యంలో భారత భద్రతను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. తేలికపాటి యుద్ధ విమానాల సప్లై ఆంశం కూడా ఆలస్యం అవుతుందని, అత్యవసరంగా ఈ సమస్యను పరిష్కరించాలని కేంద్రానికి సూచించారు. ఆపరేషన్ , ఆర్ అండ్ డి(రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్) విభాగాలలోకి బెస్ట్ బ్రెయిన్స్ రావడం లేదని ఉత్తమ్ పేర్కొన్నారు.

టెర్రరిజంపై సిందూర్ సక్సెస్ఫుల్ ఆపరేషన్: ప్రధాని మోదీ
భోపాల్: మధ్యప్రదేశ్ భోపాల్‌లో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం పర్యటించారు. లోకమాత దేవీ అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం జంబోరి గ్రౌండ్లో మహిళా సాధికారత మహా సదస్సుకు హాజరయ్యారు. అక్కడ బహిరంగసభలో ఆయన ప్రసంగించారు.‘‘టెర్రరిజంపై సిందూర్ సక్సెస్ ఫుల్ ఆపరేషన్. పాకిస్తాన్ సైన్యం కూడా ఊహించని ప్రదేశాలలో మన దళాలు ఉగ్రవాద స్థావరాలను నాశనం చేశాయి. ఉగ్రవాదం ద్వారా పరోక్ష యుద్ధాలను ఇకపై సహించబోమని ఈ ఆపరేషన్ స్పష్టంగా చెప్పింది. ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చేవారు కూడా భారీ మూల్యం చెల్లించుకుంటారు’’ అని మోదీ హెచ్చరించారు.పహల్గామ్ దాడి.. భారత సాంప్రదాయాలపై దాడి.. సిందూరం అనేది భారత సాంప్రదాయంలో ఒక భాగంగా మోదీ పేర్కొన్నారు. ‘‘పహల్గాంలో ఉగ్రవాదులు భారతీయుల రక్తాన్ని చిందించడమే కాకుండా, మన సంస్కృతిపై కూడా దాడి చేశారు. మన సమాజాన్ని విభజించడానికి ప్రయత్నించారు’’ అని మోదీ అన్నారు.కాగా, లోకమాత దేవీ అహల్యాబాయి పోస్టల్ స్టాంపును, రూ.300 ప్రత్యేక నాణెం ప్రధాని మోదీ విడుదల చేశారు. ఈ పర్యటనలో భాగంగా ఇండోర్ మెట్రో, దాతియా-సత్నా ఎయిర్ పోర్టును ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. ఉజ్జయినిలో 29 కిలోమీటర్ల పొడవైన ఘాట్‌కు కూడా ప్రధాని.. వర్చువల్ భూమిపూజ నిర్వహించారు.
ఎన్ఆర్ఐ

హెచ్ 1 బీ వీసాలకు డిమాండ్ తగ్గిందా? నాలుగేళ్ల కనిష్టానికి అప్లికేషన్లు
అమెరికాలో హెచ్ 1 బీ వీసా సాధించాలనేది ఐటీ ఉద్యోగుల కల. భారతీయ IT నిపుణులు, టెక్ సంస్థల నిపుణులైన విదేశీ ఉద్యోగులకు అమెరికా ఇచ్చే హెచ్1 బీ వీసాలకు డిమాండ్ అధికంగా ఉంటుంది. తాజాగా హెచ్ 1 బీ వీసాలకు డిమాండ్ దారుణంగా పడిపోయినట్టు కనిపిస్తోంది. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తరువాత వీసా దరఖస్తులు నాలుగేళ్ల కనిష్టానికి పడిపోయింది.యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) డేటా ప్రకారం, 2026 ఆర్థిక సంవత్సరానికి H-1B వీసా దరఖాస్తుల సంఖ్య నాలుగేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. 2025 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2026 ఆర్థిక సంవత్సరంలో అర్హత కలిగిన రిజిస్ట్రేషన్ల సంఖ్య 26.9 శాతం తగ్గిందని యూఎస్సీఐఎస్ తెలిపింది. ఈ సంవత్సరం కేవలం 358,737 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి - ఇది 2025 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన 480,000లతో పోలిస్తే భారీగా క్షీణించింది. 2025 లో 470,342 అర్హత గల రిజిస్ట్రేషన్లు 343,981 చేరాయి. 2022 ఆర్థిక సంవత్సరంలో ఈ దరఖాస్తుల 308,613గా ఉంది.ప్రత్యేక లబ్ధిదారులు 442,000 నుండి 339,000 కు తగ్గారు ఒక్కో దరఖాస్తుదారుని సగటు రిజిస్ట్రేషన్లు 1.06 నుండి 1.01 కి తగ్గాయి. బహుళ రిజిస్ట్రేషన్లు కలిగిన లబ్ధిదారుల తరపున కేవలం 7,828 దరఖాస్తులు మాత్రమే దాఖలు కాగా గత ఏడాది ఈ సంఖ్య 47,314గా ఉంది. అయితే, పాల్గొనే కంపెనీల సంఖ్య 57,600 వద్ద సాపేక్షంగా స్థిరంగా ఉంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇమ్మిగ్రేషన్ విధానంలో మార్పులు, అనిశ్చితులే దీనికి కారణమని నిపుణులు భావిస్తున్నారు. అయితే ఈ వాదనలను కొట్టిపారేసిన యూఎస్సీఐఎస్ రిజిస్ట్రేషన్ శాతం తగ్గడానికి కారణం ట్రంప్ విధానాలు, వీసా నిబంధనలు కాదని వెల్లడించింది.. మోసాలు, అన్యాయమైన రిజిస్ట్రేషన్లను అరికట్టేందుకు తాము తీసుకుంటున్న చర్యలే కారణమని పేర్కొంది.ఇదీ చదవండి: 138 కిలోల నుంచి 75 కిలోలకు : మూడంటే మూడు టిప్స్‌తో ట్రంప్ పరిపాలనలో విధానాలు, యుఎస్ చట్టాన్ని ఒక్కసారి ఉల్లంఘించిన వ్యక్తుల వీసాలను రద్దు చేసే "క్యాచ్-అండ్-రివోక్" నియమాన్ని తిరిగి ప్రవేశపెట్టడం. వీసా సంబంధిత రుసుము పెంపు, ప్రక్రియను మరింత క్లిష్టంగా మార్చిందంటున్నారు టెక్ సంస్థ యజమానులు. జనవరిలో, H-1B రిజిస్ట్రేషన్ రుసుమును 10 డాలర్ల నుంచి 215 కు పెంచిన సంగతి తెలిసిందే. ఈ చర్య ముఖ్యంగా స్టార్టప్‌లు. చిన్న సంస్థలకు చాలాఎక్కువగా ప్రభావితం చేసిందని గ్రాడింగ్.కామ్ వ్యవస్థాపకురాలు మమతా షెఖావత్ అన్నారు. అయితే హెచ్ 1-బి వీసాల డిమాండ్ గత సంవత్సరంతో పోలిస్తే స్వల్పంగా తగ్గినా, 2026లో అందుబాటులో ఉన్న 85,000 వీసాల కోసంరిజిస్ట్రేషన్ల సుమారు 3.5 లక్షలకు చేరుకోవడం గమనార్హం.చదవండి: అల్జీమర్స్‌ను గుర్తించే రక్తపరీక్ష : వచ్చే నెలనుంచి అందుబాటులోకి

అమెరికాలో భారత సంతతి వ్యాపారవేత్త దారుణహత్య, షాకింగ్ రీజన్!
అమెరికాలోని టెక్సాస్‌లోని ఆస్టిన్‌లో ఒక పబ్లిక్ బస్సులో హెల్త్ స్టార్టప్ సహ వ్యవస్థాపకుడు దారుణ హత్య విషాదాన్ని నింపింది. భారత సంతతి కి వ్యాపారవేత్త అక్షయ్ గుప్తా (30)ని తోటి భారతీయుడే పొడిచి చంపాడు. బస్సులో ప్రయాణిస్తున్న ఆయనపై అనూహ్యంతా కత్తితో విరుచుకు పడ్డాడు. దీంతో అక్షయ్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.అక్షయ్ గుప్తా మే 14వ తేదీన ఆస్టిన్లోని ఒక బస్సులో ప్రయాణిస్తుండగా, బస్సు వెనుక సీట్లో కూర్చుని ఉన్నట్టుండి ఎటాక్ చేశాడు. వేట కొడవలి లాంటి కత్తాడో పొడిచి పారిపోయాడు. నిందితుడిని 31 ఏళ్ల దీపక్ కండేల్గా గురించారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అక్షయ్ గుప్తాను వెంటనే ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది..గుప్తా సంఘటన స్థలంలోనే మరణించినట్లు ఆస్టిన్ పోలీస్ డిపార్ట్మెంట్ తెలిపింది.అక్షయ్ గుప్తాకు, నిందితుడు దీపక్ కండేల్‌కు మధ్య ఎలాంటి ఘర్షణ కానీ, వాగ్వాదం కానీ జరగలేదనేది సీసీటీవీ దృశ్యాల ద్వారా తెలుస్తోందని పోలీసులు తెలిపారు. అప్పటివరకు కామ్‌గా కూర్చున్న నిందుతుడు వేటకత్తితో బాధితుపై దాడి చేశాడన్నారు. ఫుటేజీ ఆధారంగా నిందితుడు కండేల్‌ను గుర్తించి అరెస్టు చేశారు. అతనిపై హత్యా నేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు.దీపక్ నేర చరిత్రస్థానిక మీడికా కథనం ప్రకారం, కాండెల్కు 2016 నుండి నేర చరిత్ర ఉంది. తీవ్రమైన నేరాలు సహా విస్తృతమైన అరెస్టు చరిత్ర ఉందని, కానీ ఎప్పుడూ విచారణ జరగలేదు. ప్రాసిక్యూటర్లు అతనిపై అనేకసార్లు కేసు నమోదు చేయడానికి నిరాకరించారని కోర్టు రికార్డుల ద్వారా తెలుస్తోంది. గతంలో 12 సార్లు అరెస్ట్ అయినట్టు సమాచారం. హత్యకు షాకింగ్ రీజన్అక్షయ్పై ఎటాక్ చేసిన కాండెల్ ఇతర ప్రయాణీకులతో కలిసి వాహనం నుండి దిగి వెళ్ళిపోయాడు. వెంటనే పెట్రోల్ అధికారులు కాండెల్ను పట్టుకుని అతన్ని అదుపులోకి తీసుకున్నారు. తన మామను పోలి ఉండటం వల్ల గుప్తాను పొడిచి చంపినట్లు నిందితుడు అంగీకరించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

వైఎస్సార్సీపీ గ్లోబల్ కనెక్ట్ సమావేశంలో ఆలూరు సాంబశివారెడ్డి
వైఎస్సార్సీపీపై అసత్య ప్రచారం చేస్తున్న ఎల్లో మీడియాను అడ్డుకుంటూ.. సోషల్ మీడియా ద్వారా వాస్తవాలను ప్రజలకు తెలియజేద్దామని ఆ పార్టీ ఎన్నారై గ్లోబల్ వింగ్ కో–ఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో సోమవారం ఆక్లాండ్ (న్యూజిలాండ్)లోని మౌంట్ రోస్కిల్ వార్ మెమోరియల్ హాల్లో గ్లోబల్ కనెక్ట్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో ప్రవాసాంధ్రులు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆలూరు సాంబశివారెడ్డి మాట్లాడుతూ.. ఎన్నారై సోషల్ మీడియా పోస్టింగ్‌లు.. ఇప్పుడు ప్రజలకు నిజం చెప్పే ఆయుధాలన్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రజలకు వాస్తవాలు చెప్పడంతో పాటు.. వైఎస్ జగన్ అందించిన సుపరిపాలన, నాయకత్వాన్ని ప్రపంచానికి తెలియజేయాలని సూచించారు. నిజం మాట్లాడే గొంతులుగా, అభివృద్ధిని ప్రదర్శించే వేదికలుగా ఎన్నారైలు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆనంద్ యెద్దుల, బుజ్జె బాబు నెల్లూరి, సమంత్ డేగపూడి, విజయ్ అల్లా, బాల శౌర్య, రాజా రెడ్డి, గీతారెడ్డి, సంకీర్త్ రెడ్డి, రమేశ్ పానాటి, జిమ్మీ, బాలవేణు బీరం, కృష్ణారెడ్డి, జగదీశ్వరరెడ్డి, రఘునాథరెడ్డి, గోవర్ధన్ మల్లెల తదితరులు పాల్గొన్నారు.మరిన్ని NRI వార్తల కోం ఇక్కడ క్లిక్ చేయండిచదవండి: మెట్రోలో ఇన్ఫ్లూయెన్సర్ సందడి మాములుగా లేదు! వీడియో వైరల్

యూకేలో ప్రపంచ సాంస్కృతిక వైవిధ్య దినోత్సవ వేడుకలు
లండన్: ప్రపంచ సాంస్కృతిక వైవిధ్య దినోత్సవ వేడుకల్లో భాగంగా బ్రిటన్ పార్లమెంట్ హాలులో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.. హౌస్ ఆఫ్ లార్డ్స్ గా పిలువబడే యూకే పార్లమెంట్ ఎగువ సభలో రోహాంప్టన్ విశ్వవిద్యాలయ చాన్సలర్, యూకే మాజీ మంత్రి బారోనెస్ వర్మ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిపారు.. ఈ కార్యక్రమానికి చిలీ, బెలిజ్ జపాన్ తదితర దేశాలకు చెందిన పలువురు ప్రముఖులు, రాయబారులు, దౌత్యవేత్తలు హాజరయ్యారు.ఈ సందర్బంగా వివిధ దేశాలకు చెందిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. ఈ అంతర్జాతీయ వేదికపై భారతీయ కళారూపాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా భారత్‌కు చెందిన కళాకారులు ప్రార్థన నృత్యం, మోహినీ అట్టం, కరగట్టం, మిథిలా, జిజియా నృత్యం, గోవా సాంగ్స్ తో అలరించారు. దీనిలో భాగంగా భారత మాజీ రాయభారి అభయకుమార్ రాసిన ఆన్ ఎర్త్ గీతానికి హైదరాబాద్‌కు చెందిన రాగసుధ వింజమూరి భరతనాట్యం ప్రదర్శించారు. ఇక చిలీ సంప్రదాయ నృత్యాన్ని డేనియల్ పెరెజ్ మున్స్టర్ ఆధ్వర్యంలో ఆ దేశ రాయబార కార్యాలయం అధికారులు ప్రదర్శించారు. దీనిలోభాగంగా బారోనెస్ వర్మ ప్రసంగిస్తూ.. సాంస్కృతిక వైవిధ్యాన్ని అర్థం చేసుకోవడంతో పాటు, అందులో శాంతిని పెంపొందించడానికి దోహద పడే అంశాల గురించి ప్రస్తావించారు. ఇందుకు వివిధ దేశాలకు చెందిన భిన్న సంస్కృతులను ఏకతాటిపై తీసుకురావడానికి చేస్తున్న కృషిని ఆమె ప్రశంసించారు. ఇది ప్రస్తుత సమాజంలో ఆహ్వానించదగ్గ పరిణామమని ఆమె స్పష్టం చేశారు.
క్రైమ్

గొంతు కోసిన కత్తి ఏమైంది?
నాయుడుపేట టౌన్(తిరుపతి): నాయుడుపేట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండు సమీపంలో ఉన్న లాడ్జీలో జంట ఆత్మహత్య ఘటన మిస్టరీగా మారింది. లాడ్జీలో కొన్ని గంటల పాటు సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, మృతుడి గొంతు కోసిన కత్తి కనిపించకపోవడం.. మృతుల సెల్ ఫోన్లు ఎక్కడున్నాయో తెలియక పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. వారి కథనం మేరకు.. దొరవారిసత్రం మండలం, ఏకొల్లు పంచాయతీ, కుప్పారెడ్డిపాళెం గ్రామానికి చెందిన జమ్మల సుబ్రహ్మణ్యం, అలీయాస్ మణి, అదే గ్రామానికి చెందిన బొడిపెద్ద శీరిష వివాహేతర సంబంధం పెట్టుకుని ఇద్దరూ నాయుడుపేట పట్టణంలోని ఓలాడ్జీలో గురువారం అనుమానాస్పదంగా మృతి చెందారు. ఈ ఘటనపై మణి తల్లి జమ్మల లక్ష్మమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ బాబి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మణి గొంతుపై కత్తితో కోసిన గాట్లు ఉండడం, అతని మృతదేహంపై నుంచే కుర్చీ వేసుకుని చున్నీతో శీరిష ఉరేసుకుని మృతి చెంది ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా గొంతు కొసుకునేందుకు వినియోగించిన కత్తి లాడ్జీ గదిలో ఎక్కడా లభించలేదు. మృతు లు మణి, శీరిష సెల్ ఫోన్లు సైతం లేకపోవడం మిస్టరీగా మారింది. మణి, శీరిష మధ్య ఏదైనా గొడవ జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. శీరిష పథకం ప్రకారమే మణికి అతిగా మద్యం తాగించి కత్తితో గొంతు కొసి హతమార్చి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. తర్వాత ఆమె కూడా గదిలో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. అంతేకాకుండా లాడ్జీ సిబ్బంది వ్యవహర శైలిపై కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తు న్నారు. లాడ్జీలో సీసీ కెమెరాలు కొన్ని గంటల పాటు పనిచేయకపోవడంపై విచారిస్తున్నారు. మృతులు ఇద్దరూ నాయుడుపేట లాడ్జీలో బుధవారం సాయంత్రం నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు పలుమార్లు రిసెప్షన్ వద్దకు రావడం గుర్తించారు. శిరీష లాడ్జీ కిందకు వచ్చి పలువురితో మాట్లాడినట్టు తెలుస్తోంది. ఈ మేరకు అన్ని కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ మేరకు మణి, శిరీష మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేసి బంధువులకు అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉంది.ప్రేమ జంట ఆత్మహత్య

గచ్చిబౌలి: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి.. 13 మందికి తీవ్ర గాయాలు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలి పీఎస్ పరిధిలో రోడ్డు ప్రమాదం సంభవించింది. గోపనపల్లి(Gopanpally) సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను ఓ లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం(Road Accident) సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు స్థానికుల సాయంతో క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన అదనపు సమాచారం అందాల్సి ఉంది.ఇదీ చదవండి: భర్తకు మెసేజ్ పెట్టి బలవన్మరణం

మినీ సిలిండర్‌తో కొట్టి యువకుడి హత్య
రాజేంద్రనగర్(హైదరాబాద్): తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో పాటు తన భార్య తన నుంచి దూరమయ్యేందుకు కారణమని భావించిన ఓ యువకుడు మరో యువకుడిని మినీ సిలిండర్‌తో తలపై మోది హత్య చేసిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై మామిడి కిశోర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రాజేంద్రనగర్ బుద్వేల్ ప్రాంతానికి చెందిన సాయి కార్తీక్ (31), నవీన్ స్నేహితులు. ఇద్దరూ ఓ నెట్వర్క్ కంపెనీలో పని చేస్తూ అద్దె గదిలో ఉంటున్నారు. అదే ప్రాంతంలో సిద్ధార్థ్ రెడ్డి తన భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. సిద్ధార్థ్ రెడ్డి ర్యాపిడో డ్రైవర్‌గా పని చేస్తూ జీవనం సాగించేవాడు. సిద్ధార్థ్ రెడ్డి, సాయి కార్తీక్, నవీన్‌లకు స్నేహం కుదిరింది. ఈ నేపథ్యంలో వ్యక్తిగత అవసరాల నిమిత్తం సాయి కార్తీక్ సిద్ధార్థ్ రెడ్డి నుంచి రూ. 8 లక్షలు అప్పు తీసుకున్నాడు. డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా కాలయాపన చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో సిద్ధార్థ్ రెడ్డి భార్య గత నెలలో అతడితో గొడవ పడి వెళ్లిపోయింది. సాయి కార్తీక్ ఇందుకు కారణమని సిద్ధార్థ్ రెడ్డి భావించాడు. గురువారం రాత్రి ముగ్గురు కలిసి సాయి కార్తీక్ రూమ్‌లో మద్యం తాగారు. ఈ సందర్భంగా సాయి కార్తీక్, సిద్ధార్థ్ రెడ్డి మధ్య మాట మాట పెరిగింది. దీంతో నవీన్ జోక్యం చేసుకుని వారికి నచ్చజెప్పాడు. ఆ తర్వాత ముగ్గురూ కలిసి మళ్లీ వైన్స్ షాప్ వద్దకు వెళ్లి మద్యం కొనుగోలు చేసి గదికి వచ్చి మద్యం తాగారు. అనంతరం మరోసారి సాయి కార్తీక్, సిద్ధార్థ్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నవీన్ సముదాయించేందుకు ప్రయతి్నంచగా సిద్ధార్థ్ రెడ్డి అతడిని బయటికి పంపించాడు. అర గంట తర్వాత నవీన్ రూమ్ గదికి వెళ్లి చూడగా సాయి కార్తీక్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. పక్కనే కూర్చుని ఉన్న సిద్ధార్థ్ రెడ్డిని ఏం జరిగిందని ప్రశ్నించగా మినీ సిలిండర్‌తో కొట్టి చంపేశానని... నిన్ను కూడా చంపుతానని దాడి చేసేందుకు ప్రయతి్నంచగా నవీన్ బయటికి పరుగులు తీశాడు. బుద్వేల్ ప్రధాన రహదారిపైకి వచ్చి స్థానికులకు ఈ విషయం చెప్పాడు. దీంతో వారు అక్కడికి వెళ్లి సిద్దార్థ్ రెడ్డిని పట్టుకుని రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహన్ని మార్చురీకి తరలించారు. సిద్ధార్థ్ రెడ్డిని అరెస్ట్ చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

స్టాక్ మార్కెట్ పేరుతో ఘరానా మోసం..150 కోట్లతో పరార్
జీడిమెట్ల(హైదరాబాద్): పెట్టుబడి పెట్టిన సొమ్ముకు రెట్టింపు డబ్బులు ఇస్తామని ఆశచూపి ది పెంగ్విన్ సెక్యూరిటీస్ సంస్థ టోకరా వేసింది. మూడు నెలలుగా రిటర్న్స్ ఇవ్వకపోవడంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితులు శుక్రవారం జీడిమెట్ల పీఎస్‌లో ఫిర్యాదు చేసేందుకు క్యూ కట్టారు. సదరు సంస్థ చేతిలో మోసపోయిన బాధితులు ఇప్పటికే 13 మంది ఫిర్యాదు చేయగా రూ.6.5కోట్ల మోసం జరిగినట్లు తెలిసింది.బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. బాధితులు, జీడిమెట్ల ఇన్స్పెక్టర్ గడ్డం మల్లేష్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. గిరినగర్‌కు చెందిన బాలాజీ, మెదక్ జిల్లా, అల్లాదుర్గ్ ప్రాంతానికి చెందిన స్వాతి మూడేళ్ల క్రితం చింతల్ గణేష్ నగర్‌లోని ఓ కాంప్లెక్స్‌లో ది పెంగ్విన్ సెక్యూరిటీస్ పేరుతో కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. తమ సంస్థలో పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలిస్తామంటూ ప్రచారం చేసుకున్నారు. పెట్టుబడి పెట్టిన వారికి రూ.100 స్టాంప్ పెపర్లపై నోట్ రాసి ఇవ్వడంతో చాలా మంది వారిని నమ్మారు. కొందరు వీరి వద్ద పెట్టుబడి పెట్టగా వారు ఇచి్చన మొత్తానికి 20నెలల్లో రెట్టింపు డబ్బులు చెల్లించారు. చిన్న మొత్తాలు పెట్టుబడిగా పెట్టిన ఇన్వెస్టర్లు లాభం ఇస్తున్నారని నమ్మి డబ్బు పెద్ద మొత్తంలో పెట్టడమే గాక ఇతరులతో పెట్టించారు. సదరు సంస్థవారు ఇతరులతో పెట్టుబడులు పెట్టిస్తే వారికి 5శాతం కమీషన్ సైతం ఇచ్చేవారు. దీంతో వారు తమ వ్యాపారాన్ని విస్తరించి మూడే బ్రాచీలను ఏర్పాటు చేశారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచే గాక రాష్ట్ర వ్యాప్తంగా ఇతర జిల్లాలకు చెందిన ప్రజలు సైతం పెట్టుబడులు పెట్టారు. అయితే గత మూడు నెలలుగా సదరు సంస్థ ఇన్వెస్టర్లకు చెల్లింపులు ఆపేసింది. ఈ విషయమై పలువురు సంస్థ కార్యాలయానికి వచ్చి ప్రశ్నించగా ఈనెల షేర్ మార్కెట్ బాగాలేదు త్వరలోనే చెల్లిస్తామని చెప్పారు. శుక్రవారం డబ్బులు చెల్లిస్తామని చెప్పడంతో కొందరు ఇన్వెస్టర్లు కార్యాలయానికి వచ్చారు. అప్పటికే ఆఫీసుకు తాళం వేసి ఉండటంతో నిర్వాహకులను ఫోన్ చేయగా ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో తాము మోసపోయినట్లు గుర్తించిన బాధితులు జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీంతో పోలీసులు డిపాజిట్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. బాధితులు సంఖ్య పెరిగితే కేసును ఈవోడబ్ల్యూఎస్కు బదిలీ చేస్తామని పోలీసులు తెలిపారు. కాగా 1500 మందికి పైగా సదరు సంస్థలో రూ.100 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. నిందితుల్లో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలుసాక్షి,సిటీబ్యూరో: లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి హెచ్చరించారు. స్కానింగ్ సెంటర్లలో అర్హులైన డాక్టర్లు , అనుమతి పొందిన స్కానింగ్ మిషన్లు మాత్రమే ఉండాలన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. అల్ట్రా సౌండ్ స్కానింగ్ కేంద్రాలపై డేకాయ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నామని, ఇందుకోసం 15 ప్రత్యేక బందాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.సికింద్రాబాద్ లోని న్యూ లైఫ్ ఆసుపత్రిలో అనుమతి లేని స్కానింగ్ మిషన్ ను గుర్తించి సీజ్ చేసి యాజమాన్యంపై సు నమోదు చేయాలని, సైదాబాద్‌లోని వివేకాసుపత్రిలో అనుమతి లేకుండా రెండు స్కానింగ్ మిషన్లు ఏర్పాటు చేసినందుకు రూ.2లక్షలు జరిమానా విధించాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించిన 26 స్కానింగ్ సెంటర్లకు రూ.50 వేల చొప్పున జరిమానా విధించాలన్నారు. నిబంధనలు అతిక్రమించిన స్కానింగ్ సెంటర్ల రిజిస్ట్రేషన్ రద్దు చేయాలన్నారు. సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్లు జిల్లా ప్రోగ్రాం అధికారులు అన్ని స్కానింగ్ సెంటర్లను తనిఖీ చేసి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టరీత్యా కేసులు నమోదు చేయాలన్నారు. లింగ నిర్ధారణ పరీక్షల సమాచారంపై టోల్ ఫ్రీ నెంబర్ 1800 599 3366 ద్వారా ఫిర్యాదు చేయాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్ఓ వెంకటి, ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి వందన, సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్లు, జిల్లా మీడియా అధికారి జక్కుల రాములు, టి నరసింహ, అంజయ్య గౌడ్ పాల్గొన్నారు.
వీడియోలు


షర్మిలకు జగన్ 200 కోట్లు ఇచ్చాడు.. మీ నాన్న మీ అత్తకి కనీసం మజ్జిక ప్యాకెట్ అయినా ఇచ్చాడా


కాకాణి కుటుంబానికి సజ్జల పరామర్శ


ప్రభాస్ హీరోయిన్ కు మంచి రోజులు


మూడు రోజుల కస్టడీలో నందిగం సురేష్ ని ఎంత ఇబ్బంది పెట్టారంటే..


బీజేపీతో కలిసేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది : బండి


సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా వైఎస్ జగన్ నివాళులు


కవిత రగడ.. సీజ్ ఫైర్ రచ్చ..


అఖిల్ వివాహానికి సీఎం రేవంత్ ను ఆహ్వానించిన నాగార్జున దంపతులు


ఇదేం పద్దతి పవన్.. నారాయణమూర్తి కౌంటర్


కొలంబియాలో ఫలించిన భారత దౌత్యం