
16 నుంచి రెవెన్యూ సదస్సులు
సాక్షి అమలాపురం: భూ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 16 నుంచి సెప్టెంబర్ 30 వరకూ జిల్లాలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ మహేష్‌కుమార్ తెలిపారు. వీటి నిర్వహణకు సంబంధించి జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిషాంతితో కలిసి మంగళవారం తహసీల్దార్లతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఆదేశాల మేరకు 45 రోజుల పాటు జిల్లాలో అన్ని గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామన్నారు. గ్రామాల వారీగా సదస్సులు నిర్వహించే తేదీలపై ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. మ్యూటేషన్, వెబ్ ల్యాండ్‌లో మార్పులు, 1బి, దారి సమస్య, భూ తగాదాలు ఎక్కువగా ఉంటాయని, ఇలాంటి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సదస్సులను నిర్వహిస్తోందన్నారు.
ఉపాధి హామీ పనులకు ప్రణాళికలు
అమలాపురం రూరల్: ఉపాధి హామీ పనులకు ఆయా శాఖల అధికారులు ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. 2025 మార్చి 31 వరకు అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఉపాధి పథకం కింద 56 లక్షల పని దినాలకు అనుమతి మంజూరైందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి జిల్లాలో మెటీరియల్ కాంపోనెంట్ కింద సుమారు రూ.100 కోట్లు వచ్చే అవకాశం ఉందన్నారు. అన్ని శాఖల అధికారులు సంబంధిత శాఖలోని పనులను గుర్తించి వారం రోజుల లోపు ప్రతిపాదనలు పంపాలన్నారు.
సహకార అభివృద్ధి కమిటీ సమావేశం
జిల్లాలోని 166 ప్రైమరీ అగ్రికల్చర్ సొసైటీలలో ఆగస్టు 31వ తేదీ లోపు కంప్యూటరైజేషన్ పూర్తిచేయాలని కలెక్టర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఆయన చాంబర్‌లో మంగళవారం జిల్లా సహకార అభివృద్ధి కమిటీ 3వ సమావేశం నిర్వహించారు. జిల్లాలోని సహకార సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని నాలుగు పీఎసీఎస్‌లు పెట్రోల్ బంకులు నడపడానికి అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment