
రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి
దెందులూరు: ఆగి ఉన్న లారీని వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ఓ కారు ఢీకొట్టిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. వివరాలిలా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లికి చెందిన దొమ్మేటి నాగార్జున (35), యాగంటి సుబ్రహ్మణ్యం (50), దొమ్మేటి మనోజ్ (21) అన్నదమ్ముల పిల్లలు. వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నారు. ఇదిలా ఉండగా, విజయవాడలో ఆస్పత్రికి వెళ్లిన వీరు మంగళవారం తిరిగి దేవరపల్లికి కారులో బయలుదేరారు. సత్యనారాయణపురం వద్ద రోడ్డు పక్కన ఆగి ఉన్న ఓ లారీని వీరి కారు అతివేగంగా వస్తూ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దొమ్మేటి నాగార్జున, యాగంటి సుబ్రహ్మణ్యం ఘటనా స్థలంలోనే మృతి చెందగా, తీవ్ర గాయాలపాలై అపస్మారక స్థితిలో ఉన్న దొమ్మేటి మనోజ్‌ను హైవే పోలీసులు అంబులెన్స్‌లో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కారు నంబర్ ఆధారంగా మృతుల వివరాలు సేకరించి కుటుంబ సభ్యులకు ఎస్‌ఐ కే.స్వామి సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి
Comments
Please login to add a commentAdd a comment