
రాఖీ కట్టి.. రక్షణ కోరి..
పిఠాపురం: రాఖీ పౌర్ణమి సందర్భంగా దత్తాత్రేయుని జన్మస్థలమైన పిఠాపురంలోని ఆలయాలకు భక్తులు క్యూ కట్టారు. తెల్లవారుజాము నుంచి వేలాది మంది భక్తుల తరలిరావడంతో దత్తాత్రేయుని ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఏటా రాఖీ పౌర్ణమికి దేశ విదేశాల నుంచి భక్తులు ఇక్కడకు వచ్చి దత్తాత్రేయునికి రాఖీలు కడతారు. ఈ ఏడాది సుమారు 20 వేల మంది మహారాష్ట్ర భక్తులు తరలివచ్చి స్వామివారికి రాఖీలు కట్టి పూజలు చేశారు. పిఠాపురంలో ప్రముఖ పుణ్య క్షేత్రమైన పాదగయ కుక్కుటేశ్వరస్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

రాఖీ కట్టి.. రక్షణ కోరి..
Comments
Please login to add a commentAdd a comment