మంగళవారం శ్రీ 20 శ్రీ ఆగస్టు శ్రీ 2024
ఇది మే 17న తీసిన చిత్రం. కూనవరం మేజర్ డ్రెయిన్ మొగ ద్వారా సముద్రంలో కలిసే (స్ట్రైట్‌కట్) ప్రాంతం. ఇలా ఇసుక మేటలు వేసింది. ఏటా డ్రెయిన్‌లో నీరు లేని సమయంలో మేటలు వేయడం సహజమే అయినా ఈసారి ఏకంగా ఐదు నుంచి ఆరు అడుగుల ఎత్తున ఇసుక మేట వేసింది. దీనివల్ల ఖరీఫ్ సాగుకు తీవ్ర ఇబ్బంది ఏర్పడుతోందని, వరి చేలు మంపుబారిన పడతాయని అప్పుడే శ్రీసాక్షిశ్రీ హెచ్చరించింది. కొత్త ప్రభుత్వం ఏర్పడినా దీని వంక కన్నెత్తి చూడకపోవడంతో అనుకున్నంత పని అయ్యింది. గత నెలలో కురిసిన భారీ వర్షాలతో జరగాల్సిన నష్టం జరిగింది.
ఇది ఆగస్టు 14న మొగ తెరిచిన నాటి సమయంలో ముంపునీరు డ్రెయిన్ ద్వారా సముద్రంలో కలుస్తున్న దృశ్యం. కూనవరం మొగ మూసుకుపోవడంతో వరి చేలు నీట మునగడంపై శ్రీసాక్షిశ్రీలో వచ్చిన కథనాలకు తోడు ఆయకట్టు రైతులు పలు దఫాలుగా జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. కొంతమంది ఆక్వా రైతుల మాటలు నమ్మి మొగ తెరవకపోతే సాగు వదిలేస్తామని హెచ్చరించడంతో ఎట్టకేలకు స్పందించి మొగ తవ్వకాలు చేశారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
ఇది ఆగస్టు 19న కూనవరం మొగ వద్ద పరిస్థితి. సముద్ర కెరటాలకు మొగ మూసుకుపోయింది. వారం పది రోజులుగా సరైన వర్షాలు లేకపోవడంతో డ్రెయిన్‌లో నీరు పెద్దగా లేదు. డ్రెయిన్ నుంచి బలమైన ఒత్తిడితో నీరు సముద్రంలోకి దిగకపోవడం, కెరటాలతో మేటలు వేసేశాయి. ఇప్పుడు మూడు, నాలుగు అడుగుల ఎత్తున మేటలు వేయడంతో అధికారులు కంగుతిన్నారు. డ్రెయిన్ ఆనుకుని ఉన్న సాంప్ (పర్ర భూములు)ల్లోకి నీరు వెళ్లకుండా అడ్డుకట్టు వేసి డ్రెయిన్ ద్వారా సముద్రంలోకి నీరు బలమైన ఒత్తిడితో దిగేలా చేసినా ఫలితం ఇవ్వలేదు. దీనితో మొగ మరోసారి పూడుకుపోయింది.
Comments
Please login to add a commentAdd a comment